భారతావని అనర్ఘ రత్నంగా, భావి తరానికి నిత్య స్ఫూర్తి ప్రదాతగా చిర యశస్వి అయిన డాక్టర్ అబ్దుల్ కలామ్‌కు యావద్దేశం సలామ్ చేస్తోంది. ‘కలలు కనండి.. కలల ఆలంబనతో ఆలోచనలకు రెక్కలు తొడగండి.. ఆలోచనలే వాస్తవిక కార్యాచరణకు పునాదులవుతాయి’ అని భావి భార తాన్ని కార్యోన్ముఖుల్ని చేసిన దీర్ఘదర్శి కలామ్. ‘నిద్ర పోతే వచ్చేది కాదు కల, నువ్వు కనే కల (లక్ష్యం) నిన్ను నిద్ర పోనీయకుండా చేసేది’ అన్న కలామ్ స్ఫూర్తి వచనం లక్షలాది యువ జనానికి కర్తవ్యబోధ చేసింది. అన్ని వ్యవస్థలు, సంస్థలు నిద్రావస్థలో జోగుతున్న ఈ తరుణంలో తన చలనం తో, వచనంతో జాగృత జనచేతన కరదీపికగా నిలిచారు కలామ్. కలికాన్ని క్కూడా కానరాకుండా పోతున్న మానవీయ విలువలకు పట్టం గ్టిన మహా మనీషి కలామ్. ‘పుట్టుక నీది- చావు నీది-బతుకంతా దేశానిది’ అన్న లోకనాయకుడు కలామ్. 2020 నాికల్లా భారత దేశాన్ని అభివృద్ధి చెం దిన దేశంగా చూడాలనుకున్న స్వాప్నికుడు, అందుకు అనువైన కార్యాచరణ ను ప్రతిపాదించిన దార్శనికుడు, ఆ లక్ష్య సాధనకు యువశక్తిని ఉత్తేజ పర చిన అవిశ్రాంత సైనికునిగా ఆవుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ చిరస్మరణీయుడు.
‘మనం సాధించగలం’ అన్న స్థిర సంకల్పంతో ముందడుగేస్తే సాధించ లేనిది, సాధ్యం కానిది ఏది లేదన్నది భారత రత్న ప్రబోధనం. తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని పల్లెల్లో పట్టణ సౌకర్యాల కల్పన (పురా) పథకానికి విరాళమిచ్చేసి తనకంటూ ఏమీ మిగుల్చుకోని కలామ్ చిర స్వప్నం – చిరునవ్వుల భారతం!
ఆయన 1931, అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆసి యమ్మ, జైనుల్ ఆబిదీన్ దంపతులకు జన్మించారు. ఆయన తన పాఠశాల విద్యను రామనాథాపురంలోనూ, కళాశాల విద్యను తిరుచినాపల్లిలోనూ అభ్యసించారు. భౌతిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. మద్రాసులో ఏరో స్పేస్ ఇంజనీరింగును అభ్యసించారు. ఆ తర్వాత డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా ఆయన ప్రస్థానం మొదలయింది. 2002 – 2007 మధ్య కాలంలో భారత దేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. రాష్ట్రపతికన్నా ఆయన క్షిపణి శాస్త్రవేత్త (మిస్సైల్ మ్యాన్)గానే ఎక్కువ ప్రసిద్ధి. 1969లో ఇస్రోకు బదలీ అయ్యారు. ఎస్‌ఎల్‌వీ-3 ప్రాజెక్టు డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరిం చారు. 1990 వరకు ఇస్రోలో వివిధ హోదాల్లో పని చేశారు. 1992-99 మధ్య డీఆర్‌డీఓ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే సమయంలో ప్రధాన మంత్రికి సాంకేతిక సలహదారునిగా పని చేశారు. ఆయన సార థ్యంలో ప్రోక్రాన్-2 అణు పరీక్షలు జరిగాయి. పేపరు బారు నుండి రాష్ట్ర పతిగా అంచెలంచెలుగా ఎదిగిన అబ్దుల్ కలామ్ మొత్తం దేశం గర్వించదగ్గ రత్నంగా ఖ్యాతికెక్కారు. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత మళ్ళి పిల్లలకు అంతగా చేరువ యిన జననేత అబ్దుల్ కలామ్ మాత్రమే. ఆయన నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్ళే క్షిపణుల్ని మాత్రమే తయారు చేయలేదు, హుద్రోగుల కు అవసరమయిన స్టంట్లు, వికలాంగులకు తేలికయిన పరికరాలు రూపొందించి మానవతకు నిలుటద్దంగా నిలిచారు కలామ్.క్షిపణి పితా మహుడిగానే కాకుండా, మానవత్వం ఉన్న మహా మనీషిగా అందరి మన్ననలు పొందిన ఆయన-అగ్ని, పృధ్వి, ఆకాశ్, త్రిశూల్, నాగ్ తదితర క్షిపణుల్ని భారతదేశ అమ్ములపోదిలో సాయుధ సంపత్తిని నింపారు. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో వీిని రూపొందించడం విశేషం. 2002 – 2007 వరకు రాష్ట్రపతిగా కొనసాగిన ఆయన పిల్లలకు ప్రత్యేక సందర్శన సమ యాలు కల్పించి ‘అభినవ చాచా’ అన్పించుకున్నారు. ఆయన రాసిన రచ నల్లో-వింగ్స్ ఆప్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్, ఇండియా మై డ్రీమ్, ఇన్విజి నేషన్ ఏన్ ఎంపవర్డ్ నేషన్, ఇండియా 2020 విం రచనలు ప్రధాన మయినవి.
కొన్ని విషయాల్లో ఆయనపై కొన్ని విమర్శలు ఉన్నప్పికీ ప్రజలకు అత్యంత ఇష్టమయిన రాష్ట్రపతిగా పేరు సంపాదించుకున్న ఆయన అందు కున్న పురస్కారాలు – 1997లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న పురస్కారంతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. 1981లో పద్మ భూషన్, 1990లో పద్మ విభూషన్, 1994 లో గౌరవ ఫెలో ఇనిస్టిట్య్‌ూ ఆఫ్ డైరెక్టర్, 1997లో జాతీయ ఇందిరా మహాత్మా గాంధి పురస్కారం. 2000లో రామానుజన్ పురస్కారం, 2003 -2005 ఎంీవీ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. 2007లో కింగ్ చార్లెస్-2 పతకం-రాయల్ సోసౖీె, యుకె, 2009లో ఇంటర్నేష నల్ వాన్ కార్మాన్ వింగ్స్ అవార్డు, వీితోపాటు ఓక్లాండ్ యూనివర్సి, ఎడిన్‌బర్గ్ విశ్వ విద్యాలయం విం అంతర్జాతీయ జాతీయ పలు యూని వర్సిీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు.
రాష్ట్రపతిగా ఉన్న అయిదేళ్లలో 14 శాసన సభల్ని ఉద్దేశించి ప్రసంగిం చిన కలామ్ – ఏ రాష్ట్రానికా రాష్ట్రం అనుసరించదగ్గ ‘విజన్’ను సాకల్యం గా ఆవిష్కరించారు. 2007లో పదవీ విరమణ వేళ – 2020 నాికి ఇండియాను తాను ఎలా చూడాలని అనుకొంటున్నదీ వివరించి, అయిదు కీలక రంగాలపై సమగ్ర కార్యాచరణ ద్వారా లక్ష్యసాధన సులభతరమని సూచించారు. అంతెందుకు – షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగించబోయే ముందూ కలామ్ మధన పడిందీ పార్లమెంటులో వ్యర్థ రాద్ధాంతాల గురించే. దానికి పరిష్కారానికి విద్యార్థుల సృజనాత్మక సూచనల నుంచే రాబ్టాలనుకొన్న అబ్దుల్ కలామ్ స్వప్నాలకు భరోసా – భావి తరమే!