ఆఖరు దాక బీదవానిగానే ఉండాలి!

 

నాయక శిఖామణి అయిన ఈ పవిత్రమూర్తి సర్వ సంగపరిత్యాగం చేయలేదు. గృహ జీవితం గడుపుతూనే, అధికార పీఠం అలంకరించి, సంపన్న జీవితం గడపగల అవకాశం ఉండి కూడా, బీదరికాన్ని వరించి, అతి బీదగా ఆదర్శ వంతంగా నడుచుకున్నారు.   చాప మీద పడుకున్నారు... ఉత్త మట్టి నేలమీద పడుకున్న రోజులూ ఉన్నాయి.   దేహాన్ని నిలబెట్టుకోటానికి, విధి నిర్వహణకి కావలసిన ఆహారం మటుకే అతి క్లుప్తంగా తీసుకునేవారు.   బార్లీ రొట్టెని ఇష్టంగా తినేవారు, వారింట పొయ్యి అంటించని రోజులు కూడా ఉన్నాయి. అటువంటి సమయాల్లో ఖర్జూరపు పళ్ళు తిని మంచి నీళ్ళు తాగి ఊరుకునే వారు.

నాయక శిఖామణి అయిన ఈ పవిత్రమూర్తి సర్వ సంగపరిత్యాగం చేయలేదు. గృహ జీవితం గడుపుతూనే, అధికార పీఠం అలంకరించి, సంపన్న జీవితం గడపగల అవకాశం ఉండి కూడా, బీదరికాన్ని వరించి, అతి బీదగా ఆదర్శ వంతంగా నడుచుకున్నారు.
చాప మీద పడుకున్నారు… ఉత్త మట్టి నేలమీద పడుకున్న రోజులూ ఉన్నాయి.
దేహాన్ని నిలబెట్టుకోటానికి, విధి నిర్వహణకి కావలసిన ఆహారం మటుకే అతి క్లుప్తంగా తీసుకునేవారు.
బార్లీ రొట్టెని ఇష్టంగా తినేవారు, వారింట పొయ్యి అంటించని రోజులు కూడా ఉన్నాయి. అటువంటి సమయాల్లో ఖర్జూరపు పళ్ళు తిని మంచి నీళ్ళు తాగి ఊరుకునే వారు.

నా మనసు, నా ఆలోచనలు ఇస్లామ్‌ ప్రబోధాల్లో సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆ ప్రబోధాలలోని దివ్య మకరందాన్ని నా గుండెల్లో అణుచుకోలేక, ఈ రోజు ఏమయినాసరే నా హృదయం లోనవుతున్న సంచలనాన్ని రాసితీరాలన్న పట్టుదలతో కలం చేతిలోకి తీసుకున్నాను.

హృదయపు లోతుల్లోనించి ఏదో ఒక కొత్త అనుభూతి – కొత్త భావ పరంపర.
నా ఆలోచనా విధానంలో – మెరుపు వంటి మార్పు, ఇప్పటిదాకా నాకు స్ఫురించిన మనో దృశ్యాల్లో కొత్త మార్పు.
ఇస్లామ్‌ అను మందమారుతం, సుగంధ పరిమళంలాగా మెల్లి మెల్లిగా వీచి, నన్ను చుట్టుముట్టి, నాలోని తాపాన్ని పోగొడుతూ సేద దీరుస్తూ ఉన్నది. పూలరథం కట్టి ఆకాశమార్గంలోకి తీసుకెళ్ళి, అక్కడ నుంచి భూమి మీదకు తొంగి చూడ మంటున్నది.
ఏదో ఒకటి చేసి
ఎట్లాగో అట్లా ధనం సంపాయించు
ధనవంతుడిలాగా జీవించు
ఇల్లూ, తోట, కారు గల జీవితం గడుపు
బ్యాంకులో బాగా డబ్బు నిలవజెయ్యి
జరీ అంచు సిల్కు ఉత్తరీయం ధరించు
సంపన్నునిగా బ్రతికి, సంపన్నుడిగానే మరణించి – నీ కథ ముగించుకో.
– ఈ విధంగా భూమి మీద ఉన్న వారి హృదయాలన్నీ రణగొణధ్వని చేస్తున్నాయి.
అర్థం లేనివాడు వ్యర్థుడు. డబ్బులేని వాడికి ఈ ప్రపంచంలో స్థానం లేదు – అని తమ మనో కవాటాలని పూర్తిగా మూసివేసు కుంటున్నారు.
పిల్లవాడు పెరిగి, యవ్వనప్రాయంలోకి అడుగుపెట్టి, అతనిని పైచదువులకు పంపేట ప్పుడు కూడా –
చదువుకో – పట్టభద్రుడవయి, గొప్ప ఉద్యోగం సంపాయించి, రెండు చేతులా సం పాయించరా …. – అని రోజూ బుద్ధులు చెపుతూ ఉంటారు.
పిల్లని ఇచ్చేటప్పుడు, పిల్లని తెచ్చుకునే టప్పుడూ – అందమయినా ఉందో లేదో చూడకుండా డబ్బూ దస్కం ఉంటే చాలు అనుకుంటారు.
పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయారు, పిల్ల పెళ్ళీడుకి వచ్చింది. డబ్బు కూడబెట్టు, ఎలాగో అలా డబ్బు వెనకెయ్యి – అని జోరీ గల్లాగా చెవులో చెబుతుంటారు.
సర్వసంగపరిత్యాగులమని చెప్పుకునే సన్యాసులు, భక్త శిఖామణులు, పరమార్థ చింతనతో భగవంతుని వేడుకునే సాధకులు, గురువులు సంపన్నులైన శిష్యుల ఇంట ఉండి విందులు సేవిస్తూ ఉంటారు.
కార్మికులనీ – కర్షకులనీ ఉద్ధరిస్తాను అని కంకణం కట్టుకున్న బడుగు జనుల నాయకుడు – తన ఏకైక పుత్రికకు మద్రాసులో ఆబట్స్‌బరీ భవంతిలో, చెట్టు చెట్టుకీ, ఆకు ఆకుకీ విద్యుద్దీపాలంకరణ చేసి, రంగరంగ వైభోగంగా వివాహం జరిపి స్తున్నాడు.
కష్టపడి పనిచేసి, లేమి నుంచి బయట పడలేని ఇజాన్నే సోషలిజం అంటున్నారు.
డబ్బూదస్కం వచ్చి, మేడల్లో నివసిస్తున్న ఆధునిక సోషలిజాన్ని చూస్తున్నాము.
ఈ విధంగా, పుడుతూనే ధనవంతుడై పుట్టి, బ్రతుకంతా సంపదలో వెళ్ళదీసి, కన్ను మూసేటప్పుడు కూడా – భాగ్యవంతుడిగానే కన్ను మూయాలన్న ఇచ్ఛతో డబ్బు చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఈ ప్రపంచంలో-
”భగవంతుడా! నన్ను బీదవానిగా వుండేటట్లు అనుగ్రహించు” అని ప్రార్థించి నవారు ఒక్కరే.
ఆయన, బీదవారి ప్రార్థనా సమావేశాలని నిర్వహిస్తున్నప్పుడు … అరేబియా దేశానికి పాలనాధిపతిగా ఉన్నవారు, ఆయనే నా హృదయాధినేత ముహమ్మద్‌ ప్రవక్త.
ఈ భూమండలంలో ఇలా భగవంతుని వేడుకున్నవారు గాని, ఇలా ప్రబోధం చేసిన వారుగాని, చేసిన ప్రబోధాన్ని జీవితంలో అమలు పరచినవారుగాని లేరు.
బీదరికాన్ని ఆహ్వానించి, బీదవారితో కలిసి బ్రతికినవారు ఉన్నారు. శ్రీమంతుల భవనాల్లో పుట్టి, బంగారు తూగుటుయ్యా లలో బాల్యం గడిపివారూ ఉన్నారు.
బీదరికం గురించి ఉపదేశాలు చేసినవారూ ఉన్నారు. చేయూతనిచ్చే వారు లేని నిర్భాగ్య జీవితం గడుపుతున్నవారు తమ పర్యట నలప్పుడు రాజ భవనాల్లో విడిది దిగినవారూ ఉన్నారు.
కాని నాయక శిఖామణి అయిన ఈ పవిత్రమూర్తి సర్వ సంగపరిత్యాగం చేయలేదు. గృహ జీవితం గడుపుతూనే, అధికార పీఠం అలంకరించి, సంపన్న జీవితం గడపగల అవకాశం ఉండి కూడా, బీదరికాన్ని వరించి, అతి బీదగా ఆదర్శ వంతంగా నడుచుకున్నారు.
చాప మీద పడుకున్నారు… ఉత్త మట్టి నేలమీద పడుకున్న రోజులూ ఉన్నాయి.
దేహాన్ని నిలబెట్టుకోటానికి, విధి నిర్వహణకి కావలసిన ఆహారం మటుకే అతి క్లుప్తంగా తీసుకునేవారు.
బార్లీ రొట్టెని ఇష్టంగా తినేవారు, వారింట పొయ్యి అంటించని రోజులు కూడా ఉన్నాయి. అటువంటి సమయాల్లో ఖర్జూరపు పళ్ళు తిని మంచి నీళ్ళు తాగి ఊరుకునే వారు.
కడుపులో ఆకలి దహించుకుపోతున్నా, బట్టలలో ఇటుకలు చుట్టి కడుపుమీద కట్టి, చిరునవ్వుతో ఇతరులకి తన ఆకలి బాధ తెలియకుండా ప్రవర్తించి జీవించేవారు.
బాగా ఆకలిగొన్న ఒక క్షుధార్తుడు, ఈ నాయక శిఖామణి ఇంటికెళ్ళి ఏదైనా తింటా నికి పెట్టమని అడగ్గా, ఈ మాననీయుడు – ”ఇంట్లో ఏమైనా ఉందా” అని భార్యనడిగారు.
”మంచినీళ్ళు మటుకే ఉన్నాయి” అని జవాబొచ్చింది.
ఒక దేశానికి, సువిశాలమయిన భూభాగానికి చక్రవర్తి అయిన వ్యక్తి ఉండవలసిన పరిస్థితా ఇది? వచ్చిన సంపద నంతా ఏం చేసేవారు? వచ్చింది, వచ్చినట్లు దోసెళ్ళతో పంచిపెట్టేవారు, ధర్మం చేసేవారు – చేతికి ఎముకలేని దీన దయాళువయిన ఈ మహావ్యక్తి.
ఈ దీన బాంధవుడు జీవించిన ఇల్లు మట్టితో కట్టబడింది. మట్టిగోడలు – పై కప్పుకి ఖర్జూరపు ఆకులు – అతి సామాన్య మయిన కటీరం.
ఈ మహోదాత్తుని ప్రియపుత్రిక అయిన ఫాతిమా – తమ ఇంటికి కావలసిన పిండి తానే విసిరేది, తమకు కావలసిన నీళ్ళు తానే స్వయంగా తోడి తెచ్చుకునేది.
కడుపున పుట్టిన బిడ్డలకి – మనం ఏం ఇవ్వాలి?
మంచి చదువు,
మంచి ఆహారం,
మంచి శిక్షణ.
– కాని ఈ మూడూ పిల్లలు ఎదగడానికి దోహదం చేస్తాయి – అని మనం అనుకోవటం లేదు.
వారికోసం డబ్బూ దస్కం కూడబెట్టి ఉంచాలని ప్రయత్నం చేస్తుంటాము. డబ్బు కూడబెట్టి చేతికి ఇవ్వటం చేత మన పిల్లలు ఎందుకూ పనికిరాని సోమరిపోతులు అయి పోతున్నారన్నది మర్చిపోతున్నాము……… ”కష్టపడి వాళ్ళ సంపాదన, వాళ్ళకి కావలసి నది, వాళ్ళు సంపాయించుకోవాలి ” అన్న ఆలోచనలేకుండా, ”మీరు కష్టపడకండి- వొళ్ళు కందకుండా జీవతం గడపండి-” అంటూ మనమే వారిని ఆ దార్లో పెడుతు న్నాము.
ఆ పిల్లవాడు డబ్బు తగలేసి, ప్రపంచ జ్ఞానశూన్యుడయి ఏకు మేకై, ముల్లుగా, ముళ్ళకంచెగా పెంచిన మన కళ్ళముందే మారిపోవటం చూస్తున్నాం.
అరేబియాలోని ఒక మహారాజుకి కుమార్తె అయిన ఫాతిమా తండ్రి ఇంట్లోంచి తీసుకెళ్ళిన సామాను ఏమిటి?
చాప ఒకటి.
తోలు దిండు ఒకటి.
మట్టి పాత్రలు రెండు.
పిండి విసిరే రాళ్ళు రెండు.
జాడి ఒకటి.
అధికార పీఠంలో ఇదివరకు కూర్చుని ఉన్నవారు, ఇప్పుడు కూర్చున్నవారు, ఇక ముందు అలంకరించబోయేవారు, వీరంతా – మానవజాతికే భూషణమయిన, మునుపు ఎన్నడూ మానవజాతి చూసివుండని, ఈ మహనీయ వ్యక్తి – నిరాడంబర జీవితం ముందు, చేతులు కట్టుకు, పెదవి కదపకుండా, వారి ఉపదేశాలని ఆలకించి, వాటిని ఆచరణలో పెట్టగలగాలని ప్రార్థిస్తున్నాను.
ఈ వ్యాసపరంపరని చదివినందువల్ల ఏం ప్రయోజనం? మహాప్రవక్త వంటి మహనీయులు ఉంటారా? సుఖసంపదలు, అధికార దాహం ఒదులుకొని – దేశాన్ని పరి పాలించటం సాధ్యం అవుతుందా?
”మహానుభావుడు కాబట్టి ఆయనకి సాధ్యం అయింది – మా వల్ల సాధ్యం అవు తుందా?” అంటూ అసాధ్యమయిన దానికి చప్పట్లు చరచి ప్రశంసించాలా?
లేక ఆయనలాగా, ”పరాత్పరా, నన్ను బీదవానిగానే ఉంచు” అని ప్రార్థించాలా?
అవును! ఆ విధంగానే మనిషి మనోవాచా భగవుంతుని వేడుకోవాలి.
బీదవానిగా పుట్టాను.
బీదవానిగానే జీవితం గడుపుతున్నాను.
బీదవానిగానే ఆఖరిదాకా ఉండేట్లు చెయ్యి.
మధ్యలో బీదరికం పోయి,
పటాటోపం తల ఎత్తుతూంది.
నాకీ ప్రలోభం నుంచి విముక్తి ప్రసాదించు.
– ఈ విధంగా కొందరైనా ప్రార్థించ వలసివుంది. అయితే అలా ప్రార్థిసున్నారా? అందుకు లక్షా తొంభై కారణాలు చెబు తుంటారు. ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు వారిపై కురిసే కాలం ఎంతో దూరంలో లేదు….. దగ్గరపడుతూనే ఉంది.

 

 

Related Post