ఆంథ్రోపోమార్ఫిజం (దేవుడే మనిషి రూపుదాల్చుతాడనే సిద్ధాంతం)
దేవుడు మానవుడిగా ఈ భూమ్మీదకు వచ్చి మానవుడి రూపంలో జీవిస్తాడు, దుష్ట శిక్షణ కోసం అనేక రూపాలలో అవతరిస్తాడు అనే సిద్ధాంతం అనేకమంది లో ఉంది. దీన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు.
దేవుడు అవతరిస్తాడా? మానవుడిగా పుడతాడా..?
ఆంథ్రోపోమార్ఫిజం సిద్ధాంతాన్ని నమ్మేవారు, దీనికొక కారణం కూడా చెబుతారు. అదేమంటే… సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఎంతో పవిత్రుడు. మానవులకు ఎదురయ్యే కష్టాలు… అంటే నొప్పికలిగితే ఎలా ఉంటుంది, సమస్యలెదురైతె ఎంత బాధకలుగుతుంది, మొదలైనవి ఆయనకు తెలీదు.
అందుకే దేవుడు మానవరూపం దాల్చి వాటన్నింటినీ తెలుసుకుని మానవులు ఏం చేయాలో, ఏం చేయకూడదో మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తాడు.
తర్క విరుద్దమైన విశ్వాసం ఈ ఆంథ్రోపోమార్ఫిజం
పైపైన తర్కం సరైనదేననిపిస్తుంది. అంటే దేవుడెంతో పరిశుద్ధుడనీ, మానవుల కష్టాలు తెలుసుకుని, వారికి అవసరమైన మార్గదర్శకాలు ఏర్పరుస్తాడనే తర్కం వినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ పుట్టే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే… నేనొక వీసీఆర్ (వీడియో కేసెట్ రికార్డర్) ని తయారు చేసాననుకోండి, ఆ వీసీఆర్’కు ఏది తగునో, ఏది తగదో తెలుసుకోవాలంటే స్వయంగా నేను ఆ వీసీఆర్ గా మారిపోవాలా? నేను వీసీఆర్ సృష్టికర్త ను అయినందువల్ల దాని మంచి చెడ్డలు నాకు తెలుస్తాయి. కాబట్టి నిబంధనలు నిర్ణయించడానికి నేను దాని రూపంలోకి మారిపోనక్కరలేదు. మరేం చేయాలి?
ఒక సూచనల పుస్తకం రాస్తే సరిపోదా …?
నేనొక సూచనల పుస్తకం రాయాలి. క్యాసెట్ లోని ప్రోగ్రాం చూడాలంటే వీసీఆర్ లో కేసెట్ పెట్టి ప్లే బటన్ నోక్కాలనీ, ఆపాలంటే ‘స్టాప్’ నోక్కాలనీ, ముందుకు పోవాలంటే ఫాస్ట్ ఫార్వార్డ్ నోక్కాలనీ, పైనుంచి కిందికి పడేస్తే అది చెడిపోతుందనీ, పని చేయదనీ చెబుతూ ఒక సూచనల పుస్తకం రాస్తే సరిపోతుంది. అంటే గానీ దాన్ని సృష్టించేవాడే దాని రూపంలోకి మారిపోనక్కర లేదు.
అలాగే సర్వసక్తే సంపన్నుడైన దేవుడు కూడా మానవజాతికి సృష్టికర్త కాబట్టి వారికేది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి మనిషి అవతారం ఎత్తనక్కరలేదు. మరేం చేయాలి? మానవులలో ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎంపిక చేసుకొని ఆయనకు ఉన్నత స్థాయిలో జ్ఞానం ఇచ్చి, ఆయన ద్వారా ప్రజలకు మార్గదర్శకాలు అందించవచ్చు.
దేవుడు మానవుడిగా అవతారమెత్తుతాడన్నభావన ఇస్లాం అస్సలు అంగీకరించదు.
దేవుడు గ్రంధాలూ అవతరింపజేయడానికి ప్రజల కొరకు ప్రవక్తలు, లేక దైవ దూతలను పంపిస్తాడే కాని ఆయన భూమి పైకి రాడు. అందుకే దేవుడు అనేక మంది ప్రవక్రలను ఈ భూమి పైకి పంపించాడు . ఈ పరంపరలో తన చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (స.అ.సం), ఆయన (సత్యమైన ఆత్మ) పై ఖుర్ ఆన్ గ్రంధాన్ని అవతరింప జేయడం జరిగింది.
ఖుర్ ఆన్ ప్రకారం గా కూడా దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి పైకిరాడు. కాని దైవ దూతలను పంపుతాడు
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజెసినది. విశ్వసనీయుడైన దైవ దూత దీన్ని తీసుకు ఫచ్చాడు.
(ఖుర్ ఆన్ 26:192-194) ఓ ముహమ్మద్ (స. అ. సం) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావడానికి ఇది (ఖుర్ ఆన్)నీ హృదయం పై అవతరించింది.
హిందూ గ్రందాల ప్రకారం గా కూడా దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి పైకిరాడు. శరీర ధారణ చేయడు
యజుర్వేదం (40:8) సపరిగాచ్చుక్ష క్రమ కాయః
“सपारिगाछु क्ष क्रम कायः ”
ఆ దేవుడు ఎప్పటికి శరీర ధారణ చేయడు (మానవ అవతారం ధరించడు)
(భగవద్గీత 7:24) నాశరహితమైనట్టియు, సర్వోత్తమ మైనట్టియు,సర్వ శ్రేష్టమైనట్టియు, నా రూపము తెలియని అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడగు నన్ను (చూడడానికి వీలులేని రూపం) మానవ అవతారం దాల్చిన వానిగా భావించుచున్నారు.
“The unintelligent ones, not knowing my unexpressed and immortal form, think I, who am unperceived to have become perceptible recognizable by the senses)”.
బైబిల్ ప్రకారం గా కూడా దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి పైకిరాడు.
(1 వ రాజులు 8:27) నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు.
“But will God indeed dwell on earth? Behold, the heaven and heaven of heavens cannot contain thee”.
(సంఖ్యా కాండము 23:19) దేవుడు నరపుత్రుడు కాడు.
“God is not a man, that he should be; neither the son of man, that he should repent”.