Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

గివ్మీ సమ్ సన్ షైన్

ఇప్పుడు మనం ఎది గాము. తెలివివంతులం అయ్యాము. ఇప్పుడు మన పిల్లల కళ్లల్లో సునిశితంగా చూసినట్ల యితే, మనం వారిపై వేస్తున్న అధిక భారాని కి, ఒత్తిడికి తట్టుకోలేక – ఇకనయినా వదిలి పెట్టమనే అభ్యర్థన కనబడుతుంది.పిల్లలు మర మనుషులు కారు; చెప్పినవన్నీ చెప్పినట్టు వల్లె వేయ డానికి. బాల్యం అంటే కాంపిటేటివ్‌ స్పిరిట్‌ పేరిట క్లాసు రూముల్లో కుక్కి శ్వాస ఆడని రీతిన నలిపేయడం కాదు. ట్యూషన్ల పేరిట ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా మింగేయ డం కాదు.

ఇప్పుడు మనం ఎది గాము. తెలివివంతులం అయ్యాము. ఇప్పుడు మన పిల్లల కళ్లల్లో సునిశితంగా చూసినట్ల యితే, మనం వారిపై వేస్తున్న అధిక భారాని కి, ఒత్తిడికి తట్టుకోలేక – ఇకనయినా వదిలి పెట్టమనే అభ్యర్థన కనబడుతుంది.పిల్లలు మర మనుషులు కారు; చెప్పినవన్నీ చెప్పినట్టు వల్లె వేయ డానికి. బాల్యం అంటే కాంపిటేటివ్‌ స్పిరిట్‌ పేరిట క్లాసు రూముల్లో కుక్కి శ్వాస ఆడని రీతిన నలిపేయడం కాదు. ట్యూషన్ల పేరిట ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా మింగేయ డం కాదు.

 

బాల్యం – జగం మరచిన నవ్వులు బాల్యం. చెరువుల్లో, చేలల్లో, మేళల్లో, పచ్చని తొట ల్లో, పాతబడ్డ కోటల్లో ఉరుకులు, పరుగులు బాల్యం. అమ్మ పెట్టే ముద్దల్తో, అమ్మమ్మ చెప్పే కథల్తో, నాన్నమ్మ ఇచ్చే ముద్దుల్తో, తాత తెలిపే నీతుల్తో, నాన్న ఇచ్చే గిఫ్టుల్తో సర దాగా, సంతోషంగా సమయం గడపటం బాల్యం. ముఖంపై కల్మషం ఎరుగని మంద హాసం ఉంటుంది. మదిలో ఆటలాడుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. మైలుదూరమ యినా బడికెళ్లడంలో అంతులేని ఆనందం ఉంటుంది. కొబ్బరుండ పంచుకొవడంలో …పిప్పర్‌ మెంట్‌ బిళ్లలు చప్పరించడంలో అనిర్వవచనీయమయిన మధురానుభూతి ఉంటుంది. అందరూ తనవారే, పరాయి వారే లేరన్న సంతృప్తి, సాత్వికత ఉంటుంది. బడి పంతులు గారి ప్రశంసపై మక్కువ ఉంటుంది. బడి వదలగానే మళ్ళీ ఆడుకోవచ్చ నే ఆశ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బాల్యం మన స్తోమతకొద్దీ మనం పరి పూర్ణంగా పొందినది. పరవశంతో మళ్ళీ మళ్లి తలచుకునేది! ఈ కారణంగానే – ‘యే దౌతలత్‌ భీ లేలో, యే షొహ్ రత్‌ భీ లేలో, భలే ఛీన్లో ముఝ్సే మేరీ జవానీ.
మగర్‌ ముఝ్కో లౌటాదో బచ్‌పన్‌కా సావన్‌ , వో కాగజ్‌కి కిష్తీ వో బారిష్‌కా పానీ…..’

అంటూ తన బాల్యాన్నే స్మరించుకున్నాడో కవి.

పిల్లల లోకం మనకు తెలియని లోకమేం కాదు; బాల్య స్మృతులు లేని పెద్దలుండరు. అయితే వయసు మీద పడేకొద్దీ, బరువు బాధ్య తలు పెరిగేకొద్దీ మన బాల్య స్మృతులు మసక బారడం మొదలవుతాయి. చివరికి మమకారా న్ని మరచి గుండెను బండలా మార్చుకుని మన కలల పంటల్నే మనం నిర్లక్ష్యం చేస్తుం టాము, స్వేచ్ఛగా తిరిగే తూనిగని చిన్నతనం లో దారం కట్టి ఆడిన సంఘటన మీకు గుర్తే ఉంటుంది. అప్పుడు మనకు ఆ చిన్న ప్రాణి బాధ అర్థం కాలేదు. అసలు దానికో మనసుం టుందని, దానికీ బాధ కలుగుతుందనిగాని అప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు మనం ఎది గాము. తెలివివంతులం అయ్యాము. ఇప్పుడు మన పిల్లల కళ్లల్లో సునిశితంగా చూసినట్ల యితే, మనం వారిపై వేస్తున్న అధిక భారాని కి, ఒత్తిడికి తట్టుకోలేక – ఇకనయినా వదిలి పెట్టమనే అభ్యర్థన కనబడుతుంది.పిల్లలు మర మనుషులు కారు; చెప్పినవన్నీ చెప్పినట్టు వల్లె వేయ డానికి. బాల్యం అంటే కాంపిటేటివ్‌ స్పిరిట్‌ పేరిట క్లాసు రూముల్లో కుక్కి శ్వాస ఆడని రీతిన నలిపేయడం కాదు. ట్యూషన్ల పేరిట ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా మింగేయ డం కాదు. వారి చిట్టిపొట్టి ఇష్టాలను అదిమేసి, స్వేచ్ఛను చిదిమేసి డాన్సులు, పాటలు నేర్పడం కాదు. మార్కులు…కాదు..కాదు…ర్యాంకులు తెచ్చుకుంటే ముద్దులు…లేదంటే గుద్దులు..ఇది కాదు వాత్సల్యం. భవిష్యత్తు పట్ల భయంతో బాల్యాన్ని తాకట్టు ప్టెడం కాదు ప్రేమంటే. వారి బాల్యాన్ని వారి నుండి బలవంతంగా లాక్కోవడం కాదు. మన ప్రేమ తోడుగా, వాత్సల్య నీడగా వారిని స్వేచ్ఛగా ఎదగనిద్దాం! వారి జీవితం సాఫీగా సాగిపోవడానికి, విజ్ఞాన సముపార్జనకు కావాల్సిన చదువు చాలా అవసరం. కానీ, వేట…వేట..ర్యాంకుల వేట..అంతులేని ఆశల వెంపర్లాట. అందుకోలేని నిరాశలో కుంగుబాట. నిస్పృహ లోనయి మరణ వాత. ఈ పోటీలో జరగరానిది జరిగితే తల్లిదండ్రులకు గుండె కోత! ఎందుకీ రోత! వినండి! పైకి చెప్పలేక మధన పడే ఆ హృదయాల ఘోష!

తొలి అడుగయినా పడలేదే అలిసిందా నా పయనం

ఇంకా మొదలయినా కాలేదే ముగిసిందా పురాతం

లేనే లేదా నా కోసం ఏనాడు ఏ అవకాశం

కన్నెదురుగా ఉన్నా సరే కనరాదుగా నాకే నేను

దారిని చూపే ప్రతి దీపం మంటయి పోతుంటే

చినుకే ఇవ్వని ఆకాశం చిగురించాలనుకుంటే…..

ఒక స్వాతి చినుకు భవితవ్యం అది పడే స్థానంపై ఆధార పడి ఉంటుంది. కాలుతున్న ఇనుము మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరయిపోతుంది. తామరాకు మీద పడితే కొంత కాలం పాటు మెరుస్తుంది. అదే ఒక ఆల్చిప్పలో పడితే ముత్యమయి విలువని సంతరించుకుంటుంది. ఈ ఉదాహరణకీ పిల్ల జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే పిల్లల్లో సయితం మూడు రకాలు. 1) ఆల్చిప్పలో పడిన స్వాతి చినుకులా బాల్యం నుండే గొప్ప విలువలతో

జీవించి, మంచి స్థాయికి చేరుకుని ఇంకా ఆద ర్శంగా బ్రతికేందుకు ప్రయత్నిస్తూ జీవించే వారు. 2) పెద్దలకున్న పలుకుబడితోనో, మరో మార్గాననుసరించో వీరు పైకి వస్తారు. కానీ తామరాకుపై నీటి బొట్టులా వీరి జీవితం మొదట తళతళలాడినా కొంతకాలానికి కళా హీనమయిపోతుంది. 3) ప్రారంభ థలోనే జీవితానికి విలువ ఇవ్వని వీరు పెరిగేకొద్దీ వ్యసనాలు, గొడవలు, అల్లర్లు అలజడులకు పాల్పడుతూ జీవితంలో ఉత్సాహం, ఉల్లాసాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిపోతారు. కాలు తున్న ఇనుము మీద పడిన నీటి చుక్క ఆవిర యిపోయినట్టు వీరి జీవితాల్లోని శాంతి, సం తృప్తి హరించుకుపోతుంది. ఒకవేళ ఇటువంటి వ్యసనపరులు అదృష్టం కలిసొచ్చి హీరోలయి నా చివరికి మాత్రం జీరోలుగా మిగిలిపోతారు.

ఇక్కడ తల్లదండ్రులుగా మనం గమనించాల్సిం దేమిటంటే, ఒక పొలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగి మంచి పైరు నాశనమయిందంటే తప్పు పైరుది కాదు. ఆ తప్పు కలుపు మొక్కలదీ కాదు. ముమ్మాటికి ఆ తప్పు రైతుదే అన్న యదార్థాన్ని మనం అంగీకరిస్తాం కదా! అలాగే మన పిల్లలు గొప్పవారుగా ఎదిగినా, మధ్యములుగా మిగిలిపోయినా, అధములుగా తయారయినా అందుకు కారణం వారొక్కరే కాదు. మనం కూడా కారకులమే, సమాన స్థాయి భాగస్వాములమే. కుటుం బ పెద్దలమయిన మనం పిల్లలు ఎదిగేకొద్దీ తోటి పిల్లల నుంచి, పరిసరాల నుంచి, పాఠశాలల నుంచి వారు సమకూర్చుకున్న జ్ఞానాన్ని సమన్వయంగా ఉపయోగ పడేలా, అది సత్యబద్దంగా ఉండేలా చూడాలి. ఉచితానుచితాల విచక్షణా జ్ఞానాన్ని వారికివ్వాలి. పిల్లలు మన గుమ్మానికి కట్టుకునే ఆకులో, పూలో కారు. కుటుంబం అనే చెట్టు నుంచి జీవన చైతన్యాన్ని ఆస్వాదిస్తూ విచ్చుకునే మొగ్గలు. ఆ చెట్టులోని ఒక్కో రెమ్మ, ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క ఆకు ఉపయోగదాయ కమయినట్టే, పువ్వయి విరబూసి పండుగా మారిన మన సంతానం నుండి సయితం దాని మధురామృతం జాలువారుతుంది, ఆ ఫల విత్తనమే తన నైజం దృష్ట్యా మరో మహావృక్ష సృజన కు కారణమవుతుంది.

కాబట్టి తల్లిందండ్రులుగా మనం మనోహరమయిన ఈ పూదోటను కాపాడుకోవాలంటే అందు కు తగిన శ్రమ పడాలి. తోటమాలిలా కష్టించి పిల్లల్ని పెంచాలి.సారవంతమయిన నేల, పరిశు ద్దమయిన గాలి, నీరు అందమయిన తోటకు ఆలంబన. సూర్యుడు వాటి ఊపిరి. ఈదురు గాలులు, పెనుతుఫానులు, ఈ వృక్షాల పోరాట పటిమను ద్విగుణీకృతం చేసే సాధనాలు. తోట లో ఒక్క చెట్టు ఎదిగి ఫలసాయాన్ని ఇవ్వాలంటే అందుకు ఇన్ని శక్తులు సహకరించాలి మరి. అంటే తోటమాలులమయిన మనం ప్రేక్షక పాత్ర వహిస్తామని కాదు. అసలు పిల్లలు సరిగ్గా ఎదగడానికి మూల కారకులం మనమే. అలా కాక, మన కలల పంటలతో రోజుకో అరగంట యినా గడపడానికి, వారి మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి సమయం లేనంత బిజీలోమనం ఉంటే…రేపు వారికి చెప్పి ప్రయోజనం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుందాములే అనో, రోగం వచ్చాక వైద్యం చేయిద్దాములే అనో నిర్లక్యం చేయకూడదు. ఆకులు పట్టుకునే గత్యంతరం రాకుండా, మహమ్మారి రోగాన్ని భరించే దుస్థితి ఎదురవకుండా ముందే జాగ్రత్త పడాలి.

నేడు ఎంతో మంది గొప్ప ప్రతిభ గల పిల్లలు మన కళ్ల ముందే ఉన్నా కూడా మనం వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించే స్థితిలో లేము. కారణం ఆ పిల్లల్లో ఆ యువకు ల్లో గల అల్లరే. ముఖ్యంగా యువకుల్లో టీజింగ్‌ చేెసే స్వభావం ఉంటుంది. వారికి భవిష్యత్తును భూతద్దంలో చూపించి బెదరగొట్టాలనుకునే ఆలోచనకు స్వస్తి పలికి జీవితాన్ని ప్రేమించడం, జీవిత మకరందాన్ని ఆస్వాదించడం నేర్పాలి. ఒకవేళ పిల్లలు మన వద్దకొచ్చి, కామర్స్‌ గురించి, గ్లామర్స్‌ గురించి, సెక్స్‌ గురించి, సెన్సెక్స్‌ గురించి, ప్రేమ గురించి, పెళ్ళి గురించి, సామాజిక, రాజకీయ, జాతీయ, ఆంతర్జాతీయ అంశా లగురించిగానీ చర్చించినప్పుడు – మనం విసుక్కోక అసలు వాళ్ళు మనల్నే ఎందుకు సంప్రతించారు? మన పట్ల గౌరవం, నమ్మకం లేకపోతే వారు మనతో ఇలా అడిగే వారా? అని పేరెంట్స్‌గా కాక ఫ్రెండ్స్‌గా ఆలోచించాలి. మనల్ని వారు ఫ్రేమిస్తున్నారు, మన మాటకు విలువ ఇస్తున్నారు కాబట్టే వారి సమస్యలను మనతో వచ్చి చెప్పుకుం టున్నారు. కన్నవారమయి మనమే వారి మనోభావాల్ని అర్థం చేసుకోకపొతే పాపం వారెక్కడికెళతారు? వారు పడ్డారు నిజమే; కానీ మనం వారికి చేయందించి లేపాలి. మన సంతానం మా నుండి కోరుతున్నదేమిటి? మీరు కాంతి మూలాలు. శాంతి మూర్తులు. గివ్‌ మీ సమ్‌ సన్‌ షైన్‌ – నాకు కాస్త వెలుగు, కాసిన్ని కిరణాలు కావాలి……నాకు మరో అవకాశం కావాలి నేను మళ్లీ ఎదగాలి!!

Related Post