సృష్టికి సృష్టికర్త అవసరం ఉంది

Originally posted 2014-04-12 23:14:28.

మనిషి ఎప్పుడు తనకు లాభం చేకూర్చేది చేస్తాడు మరియు తనకు నష్టం కలిగించే దాని నుండి కాపాడుకుంటాడు. ఇలా చేయాలంటే ముందుగా మనిషికి ఏది చెడో తెలిసి ఉండాలి. అతనికి లాభం జరగాలంటే అతనికి ఎవరు కావాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో, ఎవరికి ప్రేమ చూపాలో తెలిసి ఉండాలి. ఈ లక్ష్యానికి చేరుకునే సరిఅయిన మార్గం తెలిసుండాలి.

మనిషి ఎప్పుడు తనకు లాభం చేకూర్చేది చేస్తాడు మరియు తనకు నష్టం కలిగించే దాని నుండి కాపాడుకుంటాడు. ఇలా చేయాలంటే ముందుగా మనిషికి ఏది చెడో తెలిసి ఉండాలి. అతనికి లాభం జరగాలంటే అతనికి ఎవరు కావాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో, ఎవరికి ప్రేమ చూపాలో తెలిసి ఉండాలి. ఈ లక్ష్యానికి చేరుకునే సరిఅయిన మార్గం తెలిసుండాలి.

 

మనిషి ఎప్పుడు తనకు లాభం చేకూర్చేది చేస్తాడు మరియు తనకు నష్టం కలిగించే దాని నుండి కాపాడుకుంటాడు. ఇలా చేయాలంటే ముందుగా మనిషికి ఏది చెడో తెలిసి ఉండాలి. అతనికి లాభం జరగాలంటే అతనికి ఎవరు కావాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో, ఎవరికి ప్రేమ చూపాలో తెలిసి ఉండాలి. ఈ లక్ష్యానికి చేరుకునే సరిఅయిన మార్గం తెలిసుండాలి. మనిషికి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు: చెడు గురించి తెలిసి ఉండాలి. చెడులను దూరం చేసే మార్గం కూడా తెలిసి ఉండాలి.

దీని కోసం మానవునికి మార్గదర్శకుని అవసరం ఉంది. ఈ సృష్టిని ఏ లోపం లేకుండా సృష్టించిన సృష్టికర్త కన్నా మంచి మార్గదర్శకుడు ఎవడుంటాడు. అతనికి చావు రాదు, ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. అతనికి ఏ అవసరమూ లేదు, అందరికీ ఇచ్చేవాడు, మానవుల అత్మలపై అధికారం కలవాడు. అతనే అల్లాహ్, అసలైన ఆరాధ్యుడు. అల్లాహ్ ను తప్ప ఇతరుల శరణు కోరేవానికి కీడే జరుగుతుంది. అల్లాహ్ శరణు కోరినవారికి అల్లాహ్ సహాయం అందుతుంది. అల్లాహ్ సహాయంతో మనిషి కీడులను దూరం చేసుకోగలడు. అల్లాహ్ ఆజ్ఞ, ప్రమేయం లేకుండా మనిషికి ఏ కీడూ జరగదు.
మనిషిని మార్గదర్శకత్వం చేయడానికి అల్లాహ్ దైవగ్రంథాలను, దైవదూతలను పంపాడు:
తన ప్రభువును (పాలనహారున్ని) తెలుసుకోవడం – అతను తెలిపిన విధంగా. అతని ఇష్టానుసారమే జీవితం గడపడం, కేవలం అతన్నే ఆరాధించడం, అర్ధించడం.
అల్లాహ్ పేర్లను, లక్షణాలను తెలుసుకోవడం. వాటిని తెలుసుకున్న మీదట మానవుడు ఎలాంటి సృష్టితాలను పూజించడు. ఎందుకంటే అవి చాలా బలహీనమైనవి. వాటికీ ఓ సృష్టికర్త అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ గురించి తెలుసుకున్న మీదట మానవునికి అర్ధమయ్యే విషయం ఏమిటంటే – దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చూపించిన విధంగా, అల్లాహ్ ఆజ్ఞానుసారం మనిషి జీవితాన్ని గడపాలి.
ఖుర్ఆన్
ఈ దైవగ్రంథంలో (ఖుర్ఆన్ లో) పూర్తీ జీవన విధానం ఉంది. మానవుడు ఈ దైవగ్రంథాన్ని అనుసరించిన మీదట అతనికి ఏది మంచో-ఏది చెడో వివరంగా తెలుస్తుంది. అల్లాహ్ క్షమాశీలి అని తెలిస్తే మానవుడు తప్పు చేసిన పిదప అల్లాహ్ ను, కేవలం అల్లాహ్ నే క్షమాబిక్ష కోరుకుంటాడు.

“కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేదని నువ్వు బాగా తెలుసుకో. ని పోరాపట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు.” ఖుర్ఆన్ సూరా ముహమ్మద్ 47:19
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహు దైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” కాదు, నువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్ నే ఆరాధించు. కృతఙ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. ఖుర్ఆన్ సూరా అజ్ జుమర్ 39: 65,66
అల్లాహ్ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నయినా నిలిపివేస్తే, ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు. ఖుర్ఆన్ సూరా ఫాతిర్ 35:2
ఒకవేళ అల్లాహ్ నికేదైనా బాధకు గురిచేస్తే అయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చేయ్యగోరితే అయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఖుర్ఆన్ సూరా యూనుస్ 10:107
అల్లాహ్ యే గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచి పెట్టేస్తే, తరువాత మీకు సహాయపడ గలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్ నే నమ్ముకోవాలి. ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:160
హదీస్
అల్లాహ్ ను బాగా ఎరిగిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఏమన్నారో చూడండి: “నేను నీ ఆనందం, క్షమ కోరుకుంటున్నాను మరియు నీ ఆగ్రహము, శిక్ష నుండి శరణు వేడుకుంటున్నాను. నిన్ను నీవు ప్రశంసించుకున్నట్లు నేను నిన్ను ప్రశంసించలేను.” ముస్లిం, అబూ దావూద్, అత్ తిర్మిజి, ఇబ్న్ మాజా “నేను నీకు సమర్పించుకున్నాను, నీ వైపుకే తిరిగాను, అన్ని విషయాలలో నీ మీదే భారం వేశాను, ఒత్తిడిలో నీ వైపే మరలుతాను, నీ వైపు మరలే కన్నా వేరే దారి లేదు, నీవు అవతరింపజేసిన దైవగ్రంథం (ఖుర్ఆన్)పై విశ్వాసం ఉంది, నీవు పంపిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను కూడా విశ్వసిస్తున్నాను.” అల్ బుఖారి, ముస్లిం
ఉద్దేశ్యం
మన జీవితం కేవలం ప్రాపంచిక ప్రయోజనాల కోసం కాకుండా అల్లాహ్ ఆరాధన కోసమే ప్రసాదించబడింది. అల్లాహ్ ఆదేశానుసారం జీవితం గడపడం కంటే మేలైనది లేదు. అల్లాహ్ ఆజ్ఞానుసారం చేసే ప్రతి పని ఆరాధనే అవుతుంది. అవసరం అంతా మనిషిదే, అల్లాహ్ ఎలాంటి అవసరం లేనివాడు. “ఓ ప్రజలారా! మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారు. అల్లాహ్ మాత్రం అక్కరలేనివాడు. (సర్వ విధాలా) స్తుతించదగిన వాడు. ఖుర్ఆన్ సూరా ఫాతిర్ 35:15
ముగింపు
ఖుర్ఆన్ మనిషిని తప్పుడు మార్గం నుంచి రక్షించి సరిఅయిన మార్గం చూపుతుంది. మనసుకు శాంతినిస్తుంది. విశ్వాసిని వంచన, మోసము నుండి కాపాడుతుంది. ఉదాహరణకు: ఒక మనిషి పని చేస్తున్న దగ్గర మోసాలు, అన్యాయాలు జరుగుతుంటే అతడు వాటిని సహించలేడు. కనీసం వాటికి జవాబు చెప్పలేకపోయినా, ఉద్యోగం మానుకునే ధైర్యం అతనిలో ఉంటుంది. ఎందుకంటే పోషించేవాడు అల్లాహ్ యే అని అతనికి తెలుసు. ఈ ఉద్యోగం పోతే వేరే దానికన్నామంచి ఉద్యోగం ఇప్పించేవాడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ఇలా అన్నాడు: “ఎవడైతే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించనైనాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. ఖుర్ఆన్ సూరా అత్ తలాఖ్ 65:2,3
దీనివల్ల తెలిసేదేమిటంటే మానవుడు కేవలం అల్లాహ్ పైనే ఆధారపడాలి మరియు కేవలం అతన్నే వేడుకోవాలి. మానవుడు కేవలం అల్లాహ్ నే ప్రేమించాలి మరియు కేవలం అల్లాహ్ నే ఆరాధించాలి. దీనివల్ల అల్లాహ్ సంతోషాన్ని, సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఈ ప్రపంచమే అంతా అనుకుంటారో వారు అనేక దేవుళ్ళను పూజిస్తారు. సమాజంలో ఇతరులతో పోటిపడటానికి బ్యాంకుల నుండి అప్పుల మీద అప్పులు చేసి తమమీదే తామే కష్టం, బాధ కొనితెచ్చుకుంటారు. వారు ఎల్లప్పుడూ అప్పుల ఊబిలోనే పడిఉంటారు. వారికి దాని నుండి ఉపశమనం కలగదు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచించారు: అల్లాహ్ ఇలా అన్నాడు: “మీరు నా ఆరాధనలో మునిగిపొండి, నేను మీ మనసులను సమృద్ధిపరుస్తాను. మీ పేదరికాన్ని దూరం చేస్తాను. కాని ఇలా (అల్లాహ్ ఆరాధనలో గడపడం) చేయని పక్షంలో మిమ్మల్ని ప్రాపంచిక వ్యవహారాలలో ముంచివేస్తాను మరియు మీ పేదరికాన్ని కూడా దూరం చేయను.” అత్ తిర్మిజి

Related Post