Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

కారుణ్య ప్రవక్త ముహమ్మద్‌ (స)

అనాథల ఆలనాపాలనా చూసే ఇల్లు దేదీప్య మానమయి శుభాల హరివిల్లుని తలిపిస్తుంది అన్నారు. అలాగే 'అనాథల పోషణా భారాన్ని భరించే వ్యక్తి మరియు నేను రేపు ప్రళయ దినాన స్వర్గంలో ఇలా కలిసి పక్కపక్కనే ఉంాము' అని చూపుడు వ్రేలును మధ్య వేలు కాస్త ఎడంగా ఉంచి చూపేవారు'' (బుఖారీ)

అనాథల ఆలనాపాలనా చూసే ఇల్లు దేదీప్య మానమయి శుభాల హరివిల్లుని తలిపిస్తుంది అన్నారు. అలాగే ‘అనాథల పోషణా భారాన్ని భరించే వ్యక్తి మరియు నేను రేపు ప్రళయ దినాన స్వర్గంలో ఇలా కలిసి పక్కపక్కనే ఉంాము’ అని చూపుడు వ్రేలును మధ్య వేలు కాస్త ఎడంగా ఉంచి చూపేవారు” (బుఖారీ)

”ఓ ముహమ్మద్‌! (స) మేము నిన్ను సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాము”. (అన్బియా: 107)
”నిశ్చయంగా నేను కానుకగా పంపబడిన కారుణ్యాన్ని” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (హాకిమ్‌)
తప్పు చేసిన వారి యెడల  ప్రవక్త (స) వారి కరుణ:
  తప్పు జరగడం మానవ సహజం. ఎవరూ దీనికి మినహాయింపు కారు. ”ఆదం సంతతికి చెందిన ప్రతి వ్యక్తితోనూ తప్పు జరుగుతుంది. వారిలో ఉత్త ములు తమ తప్పును దిద్దుకున్న వారు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ) ఒక విషయం గురించిన అవగాహన లోపించినప్పు ఆ విషయంలో పొరపాటు జరగడం సహజం. అలా పొరపాటు చేసిన ఓ సహాబీ ముఆవియా బిన్‌ హకమ్‌ సులమీ (ర) పట్ల ప్రవక్త (స) ప్రవర్తించిన తీరును ఆయనే స్వయం గా పేర్కొంటున్నారు: ”నేను ప్రవక్త (స) వారితో కలిసి నమాజు చేస్తుడగా ఓ వ్యక్తి తుమ్మాడు. నేను ‘యర్‌హముకల్లాహ్‌ా’ అన్నాను. అది విన్న అక్కడున్న వారు నా వైపు ఉరిమి ఉరిమి చూడసాగారు. అది అర్థం కాక నేను ‘మీ తల్లులు మిమ్మల్ని పోగొట్టుకోగాక!’ నా వైపు ఎందుకు అలా ఉరిమి ఉరిమి చూస్తారు మీరు? అని అన్నాను.వారు తమ చేతులతో తొడల మీద కొడుతూ నన్ను ఊరుకోవాల్సిందిగా సైగ చేయనారంభించారు. నేనూ ఊరుకున్నాను. నమాజు పూర్తయ్యాక ప్రవక్త చూపించిన వాత్సల్యాన్ని నేను మరువ లేను. నా తల్లిదండ్రుల్ని ఆయనకు అర్పింతుగాక! ఆయన లాిం శిక్షకుణ్ణి నేను ఆయనకు ముందూ చూడలేదు. ఆయన తర్వాత కూడా చూడ లేదు. అల్లాహ్‌ సాక్షి! ఆయన నన్ను గద్దించ లేదు. కొట్టలేదు. తిట్ట లేదు. ఎంతో ప్రేమగా ఇలా అన్నారు: ”నిశ్చయంగా ఈ నమాజు ఉంది చూశావు ఇందు లో ప్రజల మాటలకు ఆస్కారం లేదు. అందులో తస్బీహ్‌ా, తక్బీర్‌, ఖుర్‌ఆన్‌ పారాయణానికి మాత్రమే అనుమతి ఉంది”. (ముస్లిం)
 అలాగే మస్జిద్‌లో ఎవరో  ఓ మూలన ఖిబ్లా వైపు ఉమ్మేసి ఉండటం చూసి ఆయన ఖర్జూరపు మట్టతో దాన్ని శుభ్ర పరిచారు. ఆ తర్వాత అలా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు అని హితవు పలికారు. (ముస్లిం) వేరొక సందర్భంలో ఓ పల్లెటూరి వ్యక్తి వచ్చి మస్జిద్‌ ఓ మూలన మూత్రం పోస్తే అక్కడున్న సహచరులు అగ్రహోదగ్రులవగా ఆయన మాత్రం అతన్ని ఎంతో మృదువగా నచ్చజెప్పారే తప్ప కఠినంగా వ్యవహరించ లేదు.(బుఖారీ) వేరోక ఉల్లేఖనం ప్రకారం ఆయన (స) సత్ప్రవర్తనకు ముగ్దుడయిన ఆ పల్లెవాసి – ‘ఓ అల్లాహ్‌ నన్ను మరియు ముహమ్మద్‌ (స) వారిని మాత్రమే కరుణించు. మాతోపాటు ఇంకెవరినీ కరుణించకు’ అని దుఆ చేశాడు. అది విన్న ప్రవక్త ”అపారమయిన అల్లాహ్‌ా కరుణను పరిమితం చేస్తున్నావు ఎందుకు?” అని ఎంతో సౌమ్యంగా నచ్చజెప్పారు.
పాపం చేసిన వారి యెడల ప్రవక్త (స) వారి కరుణ: 
 తెలియనితనం వల్ల జరిగేది తప్పు, తెలిసి చేసేది పాపం. అలాింది రాజ ద్రోహానికి పాల్పడటం ఎంత నేరమో ఎవరికీ తెలియనిది కాదు. అలాిం నేరమే హాతిమ్‌ బిన్‌ అబీ బల్తఆ (ర) గారితో జరిగింది. ప్రవక్త (స) మక్కా అవిశ్వాసులతో యుద్దం కోసం సైన్యం తీసకొని బయలు   దేరబోతున్నారన్న
రహస్య సమాచారంతో కూడిన ఉత్తరాన్ని, మక్కా వెళుతున్న ఓ స్త్రీకి ఇచ్చి పంపారు. అది తెలుసుకున్న ప్రవక్త (స) ఆయన్ను పిలిపించి – ”ఓ హాతిబ్‌! ఏమిీ నిర్వాకం?” అని అడిగారు. అందుకాయన ఇలా సంజాయిషీ ఇచ్చుకు న్నారు: ”ఓ దైవ ప్రవక్తా! (స) నా విషయంలో తొందర పడి ఓ నిర్ణయానికి రాకండి. నేను ఖురైషు తెగకు చెందిన వాడను కాను. వారి సంరక్షణలో అక్కడ ఉంటున్నవాడను. మీతోపాటున్న ముహాజిర్లకు అక్కడ ఎవరో ఒకరు బంధువులున్నారు. వారు వారికి చెందిన వారిని కాపాడుకుాంరు. నా విష యం అలా కాదు గనక ఈ విధంగా మక్కా అవిశ్వాసులకు సహాయం చేసి నా బంధువుల్ని కాపాడుకోవాలనుకున్నాను. నేను ధర్మభ్రష్టుడనయి ఈ పని చెయ్య లేదు. మిమ్మల్ని వ్యతిరేకించాలన్నదీ నా ఉదేశ్యం కాదు. ఇస్లాం స్వీక రించిన తర్వాత పూర్వాశ్రమం (అవిశ్వాసం) యెడల వాత్సల్యంతో చేసిన పని కూడా కాదు’. అది  విన్న ప్రవక్త (స) ”అతను మీతో నిజం చెప్పాడు”. అన్నారు. అక్కడే ఉన్న హజ్రత్‌ ఉమర్‌ (ర) – ‘ఓ దైవప్రవక్తా! నన్నొదలండి నేనీ కపి తల నరికేస్తా’ అన్నారు కోపంతో ఊగిపోతూ. అందుకు ప్రవక్త (స)- ‘అతను బద్ర్‌ సంగ్రామంలో పాల్గొన్నాడన్నది నిర్వివాదాంశం.ఓ ఉమర్‌! నీకేం తెలుసు?  బద్ర్‌ సంగ్రామంలో పాల్గొన్న  వారి గురించి ముందే తెలిసి అల్లాహ్‌ ఇలా అన్నాడేమో: ”మీకు నచ్చింది చెయ్యండి. నేను మీ సకల పాపాలను మన్నించేశాను”. (బుఖారీ)
 న్యాయ పరంగా చూసుకుంటే హాతిమ్‌ (ర) ముస్లిం అయినా చేసిన నిర్వా కానికి శిక్ష పడి తీరాలి. కాని కారుణ్యమూర్తి (స) వారి కారుణ్యం వల్ల ఆయన బతికి పోయారు. ఇక్కడో విషయం తెలుసుకోవాలి-న్యాయం గొప్పదే, సందేహం లేదు. కానీ కారుణ్యం మహిమాన్వితమయినది.
ఖుర్‌ఆన్‌ పారాయణకర్తల యెడల కరుణ:
 అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌ ఇబ్నుల్‌ ఆస్‌ (ర) గొప్ప దైవభీతిపరులు. రాత్రిళ్ళు మేల్కొని సుదీర్ఘ నమాజులు, పారాయణాలు చేసేవారు. ఓ సారి ఆయన ప్రవక్త (స) వారితో – ‘నేను ఖుర్‌ఆన్‌ను ఎన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు?’ అని అడిగారు. అందుకు ప్రవక్త (స) – ”ఒక నెల లో దాన్ని పూర్తి చెయ్యి” అని సమాధానమిచ్చారు. దానికన్నా తక్కువ సమయంలో నేను పూర్తి చేయ గలను అని ఆయన విన్నవించుకోగా, ’20 రోజుల్లో పూర్తి చెయ్యి’ అన్నారు. ఆయన మళ్ళీ మళ్ళీ అడగ్గా-’15 రోజుల్లో, 10 రోజుల్లో, 5 రోజుల్లో’ అని బదులివ్వగా,’నేను దానికన్నా తక్కువ రోజుల్లో పూర్తి చేయగలను’అని ఆయన విన్న వించుకోగా – ప్రవక్త (స) ఆయనకు అనుమతినివ్వ లేదు”. (ముస్లిం)
నమాజీల విషయంలో కరుణ:
”ప్రవక్త (స) రమజాను మాసంలో రెండు రోజులు తరావీహ్‌ నమాజును జమాఅత్‌తో చేయిపించారు.సహాబా పెద్దఎత్తున ఆ నమాజులో   పాల్గొనడం   చూసి మూడవ రోజు సహబా (ర) ఆయన కోసం ఎదురు చూస్తున్నా ఫజ్ర్‌ వేళ అయ్యేంత వరకూ అయన బయికి రాలేదు. పజ్ర్‌ అజాన్‌ తర్వాత బయికి వచ్చి తాను ఆ రాత్రి ఎందుకు రాలేదో వివరించారు: ”మీ ఆసక్తి చూసి అల్లాహ్‌ ఎక్కడ ఈ నమాజుని కూడా మీపై విధిగావించేస్తాడేమోనన్న భయమే నన్ను రాకుండా ఆపింది” అన్నారు కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స). (బుఖారీ)
తల్లుల యెడల కరుణ: 
 ”కొన్ని సందర్భాలలో నేనూ నమాజును సుదీర్ఘంగా చేసి చదవాలనుకుం ాను. అంతలోనే శిశువు ఏడుపును వింను.అంతలా ఏడుస్తున్న ఆ శిశువు కోసం తల్లి ఎంతలా తల్లడిల్లుతుందో పాపం! అన్న ఆలోచనతో నా నమాజు ను ముఖ్తసరిగా ముగించేస్తాను” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (బుఖారీ)
అనాథల యెడల కరుణ: 
 ప్రవక్త (స) అమ్మానాన్న లేని అనాథల్ని చేరదీసి అనుఁగు సంతానంగా చూసుకునేవారు. అంతే కాదు, అనాథల ఆలనాపాలనా చూసే ఇల్లు దేదీప్య మానమయి శుభాల హరివిల్లుని తలిపిస్తుంది అన్నారు. అలాగే ‘అనాథల పోషణా భారాన్ని భరించే వ్యక్తి మరియు నేను రేపు ప్రళయ దినాన స్వర్గంలో ఇలా కలిసి పక్కపక్కనే ఉంాము’ అని చూపుడు వ్రేలును మధ్య వేలు కాస్త ఎడంగా ఉంచి చూపేవారు” (బుఖారీ)
నిరుపేదల యెడల కరుణ: 
 ‘అప్పుడే మదీనా చేరుకున్న ఓ బృందం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారు భోంచేసి ఎన్ని రోజులయ్యిందో తెలీదుగానీ, వారి కడుపులు వీపులకు కరచుకు పోయి ఉన్నాయి. వారిని ఆ స్థితిలో చూసిన ప్రవక్త (స) తల్లడిల్లి పోయారు. విపరీతంగా బాధ పడుతూ మస్జిద్‌ ఇటూ అటూ తిరుగు తున్నారు. నమాజు అనంతరం దానధర్మాలు చేయాల్సిందిగా ప్రేరేపించారు. చాలా సేపయింది. ఎవరూ రావడం లేదు. ఆయన ఎదురు చూస్తున్నారు. అంతలో ఓ కార్మిక సోదరుడు ధాన్యపు బస్తాను భారంగా మోస్తూ తీసుకు వచ్చి ప్రవక్త (స) వారికి అందజేశారు. అతన్ని చూసి ఒకరూ ఇద్దరంటూ దానం చేయనారంభించారు, అలా చూస్తుండంగానే రెండు రాసులు ఒకి ధాన్యపు రాసి, ఒకి బట్టల రాసి ప్రోగయ్యాయి. ఎవరి ఏం కావాలో తీసు కోండి అని ఆజ్ఞాపించిన మీదట, వారు వారికి కావాల్సింది ఆత్రంగా వెళ్ళి తీసుకుంటూ ఉంటే ప్రవక్త (స) వదనం సంతోషంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. అప్రయత్నమగానే ఆయన అధరాల మీద చిరునవ్వు కదలాడింది’. (ముస్లిం)
కార్మికుల యెడల కరుణ:
 మఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కాస్త సుదీర్గంగా నమాజు చదివించేవారు. ఓపిక పట్టక ఓ కార్మిక సోదరుడు జమాతు నమాజును మధ్యలోనే వదిలేసి సొంతంగా (ఒంటరిగా) నమాజు చేసుకొని వెళ్ళి పోయాడు. నమాజీలందరూ ఆ కార్మిక సోదరుణ్ని తప్పు పట్టడమే కాక తను కపి అని మాటల తూాలు కూడా పేల్చారు. అది తెలిసి ఆ కార్మిక సోదరుడి నేరుగా వెళ్ళి ప్రవక్త (స) వారతో షికాయతు చేశాడు. అది విన్న ప్రవక్త (స) ఆగ్రహిస్తూ – మఅజ్‌ (ర) హాజరు కావాల్సిందిగా ఆజ్ఞాపించారు. అలా వచ్చిన మఆజ్‌ (ర) గారినుద్దే శించి: ”ఓ మఆజ్‌! ఏమి నువ్వు ప్రజలు నమాజంటే అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నావా? నువ్వు నమాజు చేయిపిస్తున్నప్పుడు నీ వెనకాల వృద్ధులు, స్త్రీలు, అవసరార్థులు, అర్జంటు పని మీద వెళ్ళాల్సిన వారు కూడా ఉంారన్న స్పృహ కలిగి మసలుకో” అని మందిలించారు. (బుఖారీ)
సేవకుల యెడల కరుణ: 
 నేడు ఆయుధాలు, మాదకద్రవ్యాయ విక్రయం తర్వాత చెప్పుకోదగ్గ విక్రయం మనుషుల్ని అమ్మే కొనేదే. మరి వారి హక్కుల్ని ఎవరు ఎంత వరకూ పాటిస్తున్నారు అన్న విషయాని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలకు అప్పగించి, అసలు మానవ హక్కుల చాప్టరే లేని నాి కాలంలో,    బానిసల్ని మనుషుల
క్రింద జమా చేయడం కాదు కదా; జంతువులకన్నా హీనంగా చూడబడే ఆ కాలంలో  ప్రవక్త (స) ఎలాిం కరుణ కనబర్చారో, వారికి ఎదురయి ఉన్న సమస్యను ఎంత చక్కగా పరిష్కరించారో దానికి మానవచరిత్రే సాక్షి! ఆయన అలనాి యజమానుల్ని ఉద్దేశించి ఇలా అన్నారు: ”వారు మీ సోదరులు, అల్లాహ్‌ వారిని మీ పోషణలో (అధీనంలో) ఇచ్చాడు. ఎవరి సోదరుడయితే ఒకరికి కైవసం అయి ఉంాడో అతను తప్పనిసరిగా పాటించాల్సి కనీస బాధ్యత-తాను తిన్నదే అతనికి తినిపించాలి. తాను తొడిగినదే అతనికీ తొడి గించాలి. అతను చేయగలిగిన పనినే అతనికి అప్పగించాలి. ఒకవేళ శక్తికి మించిన పని అప్పగిస్తే ఆ పని పూర్తి చేయడంలో అతనికి తోడ్పాటునందిం చాలి”. (బుఖారీ)
వేరోక ఉల్లేఖనంలో – ”మీలో ఎవరూ ఎవరినీ ఇతను నా బానిస, ఈమె నా బానిసరాలు అనకూడదు. మీరందరూ అల్లాహ్‌ దాసులే. దానికి బదులు నా సేవకుడు, నా సేవకురాలు అనండి” అని అప్పి చెడు వాడుక పదాలను సయితం నిర్మూలించారు. (బుఖారీ) అంతే కాదు, ”మీలో ఎవరయినా తన అధీనంలో ఉన్న సేవకుల్ని చెంప మీద కొట్టినా, కాస్త గట్టిగా కొట్టినా దాని పరిహారంగా వారిని విడుదల చెయ్యాలి” అన్నారు. (ముస్లిం)
వితంతువుల, వికలాంగుల యెడల కరుణ: 
”వితంతువు, వికలాంగుల బాగు కోసం పాటు పడే వ్యక్తి అల్లాహ్‌ మార్గంలో నిరతం పోరాడే యోధునితో, రాత్రంతా ప్రార్థనలో గడిపే సుభక్తునితో, దిన మంతా ఉపవాసం ఉండే ధర్మపరాయణుడితో సమానం” అన్నారు కారుణ్య మూర్తి (స). (బుఖారీ)
రోగుల యెడల కరుణ:
 కుష్టు రోగులతో ప్రవక్త (స) కలిసి భోంచేశారు. రోగుల్ని వెళ్ళి ఆయన తరచూ సందర్శించి వచ్చేవారు. సందర్శనా సందర్భంలో వారికి సంతోషం కలిగించే విషయాల్ని ప్రస్తావించేవారు. ఉమ్మె అలా అనే ఓ మహిళను ఉద్దే శించి- ”ఓ ఉమ్మె అలా! శుభవార్త! నిశ్చయంగా ముస్లిం రోగ బారిన పడితే అల్లాహ్‌ా దానికి బదులు ఆ వ్యక్తి పాపాలను ప్రక్షాళిస్తాడు. ఎలాగయితే వెండి బంగారాల తుప్పును నిప్పు వదలగొడుతుందో అలా”. (అబూ దావూద్‌)
మరణ ఘడియల్లో కరుణ: 
”మీరు మరణించబోయే మీ ఆప్తులను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ గురించి తాకీదు చేయండి”. (ముస్లిం) ”ఎవరి చివరి పలుకు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ అయి ఉంటుందో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు”. (అబూ దావూద్‌)
మృతుని యెడల కరుణ: 
 మృతుని జనాజా నమాజు చదివే వ్యక్తికి ఒక ఖీరాత్‌ పుణ్యం, ఖనన సంస్కారాల వరకూ తోడుండే వ్యక్తి రెండు ఖీరాత్‌ల పుణ్యం లభిస్తుంది అన్నారు ప్రవక్త (స). ఖీరాత్‌ అంటే ఏమీ? అని అడగ్గా – ”ఉహద్‌ అంతి పుణ్యం’ అన్నారు. (బుఖారీ)
”మీరు మీ మృతుల గురించి మ్లాడితే వారి మంచి లక్షణాలను మాత్రమే పేర్కొనండి. ఒకవేళ వారిలో చెడు ఉన్నా దాని వైపునకు వారు మరలింప బడ్డారు”. అని తాకీదు చేశారు. (అబూ దావూద్‌)
మృతుని ఇంటి  వారి యెడల కరుణ: 
 మృతుని ఇంటి  వారి విషయంలో ప్రజలకు తాకీదు చేస్తూ ఆయన ఇలా అన్నారు: ”జాఫర్‌ (ర) వారి కుటుంబీకుల కోసం ఆహార పదార్థాలను సిద్దం చేయండి. వారిని తీవ్ర బాధకు లోను  చేసే పరిస్థితి ఎదురయి ఉంది” అన్నారు. (అబూ దావూద్‌)
యూదుల యెడల కరుణ: 
 యూదులు ప్రవక్త (స) వారిని చూసి ఉడుక్కునేవారు. నమస్కరించాల్సి న విధానాన్ని కాస్త మార్చి చెబుతూ-‘అస్సాము అలైకుమ్‌’-మీకు చావు మూడు గాక! అనే వారు. అది విన్న సతీమణి తీవ్రంగా స్పందించి అదే విధమయి నటువిం అభివాదం చేస్తే, ప్రవక్త (స) ఆమెను మందలించి అలా అనకు అని చెప్పడమే కాక, ఒకవేళ తప్పని సరిగా చెప్పాల్సి వస్తే ‘వ అలైకుమ్‌’ మాత్రమే చెప్పు అన్నారు. (బుఖారీ)
క్రైస్తవుల యెడల కరుణ: 
మదీనా వచ్చి ఓ క్రైస్తవ బృందాన్ని ప్రవక్త (స) మస్జిద్‌ నబవీలో వసింప జేయడమే కాక, వారి పద్ధతిలో వారిని ప్రార్థన చేసుకునే వెసులుబాటును సయితం ఆయన కల్పించారు. (జాదుల్‌ మఆద్‌)
కపటుల యెడల కరుణ: 
కపటుల నాయకునిగా పేరు పొందిన, ప్రవక్త (స) వారి సతీమణి మీద లేని పోని నిందలు మోపిన అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉబై మరణించిబప్పుడు ఆయన కొడుకు దరఖాస్తు మీద ఆయన దుప్పికి అతనిపై కప్పడానికి ఇవ్వడమే కాక, స్వయంగా వెళ్లి అతని జనాజా నమాజు కూడా చేయిపించారు. ఆ సందర్భలో ఆయన అన్న మాట: ”నేను నమాజు చేయడం వల్ల ఇతనికి క్షమాబిక్ష దక్కుతుందని నాకు తెలిస్తే నేను అతని కోసం 70 సార్లయినా ప్రార్థించడానికి తయారే” అన్నారు. (బుఖారీ)
విగ్రహారాధకుల యెడల కరుణ: 
విగ్రహారాధకులయిన, తనను తన జన్మస్థలి నుండి వెలివేసిన మక్కా వాసులు కరువు స్థితి ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆయన దాదాపు 15 వందల దిర్హమ్‌లు వారి కోసం పంపించారు. అలాగే ఓ సందర్భంలో – మక్కా అవిశ్వాసులు విశ్వాసుల్ని వేధిస్తున్నారు గనక వారి అందాల్సిన బత్తాను ఆపి వేస్తాము అని ఓ జాతి నాయకుడంటే, అలా చేయడం సబబు కాదు అని మందలించారు. అందరి యెడల కరుణ:
”నేను వారందరి నుండి కోరుతున్న ఒకే ఒక్క వాక్యం. దాన్ని గనక వారు నమ్మినట్లయితే అరబ్బు, అరబ్బేతర ప్రాతాలన్నీ వారి పాదాక్రాతం అవు తాయి. ఆ మహత్తర వాక్యమే -‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ – అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు.   (తిర్మిజీ)
మూగ జీవాల యెడల కరుణ: 
 ఆయన పక్షులను లక్ష్యంగా పెట్టి  భాణాలు విసరడాన్ని నిరసించారు. జంతు వులకు వాతలు పెటగటడాన్ని ఖండించారు. పని చేయింపిచు కుని మేత పెట్టని యజమానుల్ని ”ఈ మూగ జీవాల విషయంలో అల్లాహ్‌కు భయ పడండి” అని మందలించారు. దాహంతో ఉన్న ఓ కుక్క దాహాన్ని తీర్చిన ఓ వ్యభిచారిణిని అల్లాహ్‌ా మన్నించి స్వర్గాన్ని ప్రసాదించాడని, పిల్లిని చిత్రహిం సలు ప్టిె చంపిన ఓ స్త్రీని అల్లాహ్‌ నరకం పాలు చేశాడు అని జంతువుల హక్కుల్ని ఎవరూ తెలియజేయనంత కరుణామయ పద్ధతిలో తెలియజేశారు కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స).
యుద్ధంలో కరుణ: 
నాటి, నేటి  యుద్ధాల్ని మనం పరిశీలించినట్లయితే యుద్ధంలో కరుణకి చోటుండదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది.దానికి రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే సాక్షి! ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న వారితోపాటు మరణించిన వారి సంఖ్య చూసినట్లయితే 351/ శాతం మంది మరణించినట్లు తెలుస్తుంది.అంటే పాల్గొన్న వారికంటే మూడున్నర రెట్లు అధికం. పై యుద్ధాలలో సైనుకులకంటే ఎక్కువగా సామాన్య ప్రజలే బల య్యారు, బలవుతున్నారు. దీనికి భిన్నంగా – ఎలాిం చట్టం అమల్లో లేని ఆ కాలంలోనే ఆయన అన్న మాట తర్వాత శాసనం అయ్యింది; అదేమంటే, ”స్త్రీలను, వృద్ధులను, పిల్లలను, యుద్ధంలో పాల్గొనని వారిని, ప్రార్థన మందిరాలలో జీవించే వారిని చంప కూడదు. అలాగే శత్రువు భూమికి చెందిన ఏ చెట్టును నరక కూడదు ఏ పొలాన్ని నాశనం చేయకూడదు”.
 అంతా బాగుంది, యుద్ధంలో అయితే పాల్గొన్నారు కదా? అని కొందరు అనొచ్చు, అంారు కూడా. వారికి మా సమాధానం – కారుణ్యమూర్తి (స) ప్రతక్ష్యంగా పాల్గొన్న యుద్ధాల సంఖ్య 27. రక్షణార్థం జరిపిన సైనిక చర్యలు 38, ఆయన లేకుండా జరిగిన యుద్ధాలు 68. ఈ మొత్తం యుద్ధాల్లో ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 1284 మాత్రమే. పాల్గొన్న వారి రీత్యా శాతాన్ని లెక్కిస్తే-ముస్లింలలో అమరగతులయినవారు 1.0/ అయితే ముస్లిమే తరులు 1.5/. ఫలితంగా కేవలం అరబ్బు ప్రాంతంలోనే కాదు చుట్టూ ప్రక్క ప్రాంతాల్లో సయితం ప్రశాంతత నెలకొంది. అంటే ఆయన వీరిని గెలిచింది కరుణతోనేగానీ, కత్తితో ఎంత మాత్రం కాదు. చెలిమితోనేగానీ, బలిమితో ఎంత మాత్రం కాదు అనడానికి దీనికి మించిన ఉపమానాన్ని ఎవ్వరూ తీసుకు రాలేదు అన్నది స్పష్టం.
ప్రళయ దినాన కరుణ: 
 ఆయన ఓ సందర్భంలో ఇలా అన్నారు: ”ప్రవక్తలు ఇవ్వబడిన దుఆ వెసులు బాటు వారు ఈ లోకంలోనే వినియోగించుకున్నారు. కానీ, నేను మాత్రం నా దుఆను పరలోకంలో నా ఉమ్మత్‌ సిఫారసు కోసం ఎత్తి ఉంచాను”. (ముస్లిం) వేరొక ఉల్లేఖనంలో – ”నా సిఫారసు నా సముదాయానికి చెందిన మహా పాపుల కోసం అయి ఉంటుంది” అన్నారు. (అబూ దావూద్‌)
చివరి మాట:  
ఈ ప్రపంచానికి ముహమ్మద్‌ (స) ఒక సాధారణ వ్యక్తే కావచ్చు గాక. కానీ ఆయన్ను అభిమానించే 170 కోట్ల మంది ముస్లింలకు మాత్రం ఆయనే ప్రపంచం. జీవిత కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య కాలం. కానీ ఒక ముస్లింకు మాత్రం కారుణ్య ప్రవక్త ముహమ్మద్‌ (స) ఆదర్శాల నీడలో జీవించిన కాలం.

Related Post