కోరిక – భయం

తన ఇంట సిరి తోట పూయాలని, తన దారి విరి బాట అవ్వాలని, లోకాలన్నింటిని ఒకే సారి గెలవాలని ముచ్చట పడుతుంది మనసు. అవును, మనిషి మనసు కోరికలకు పుట్టునిల్లు. ప్రతి మనిషి మనసులో కలిగే తపన, ఆరాటమే కోరిక. అది అశగా ఉండొచ్చు. అత్యాశగా రూపాంతరం చెందవచ్చు.

తన ఇంట సిరి తోట పూయాలని, తన దారి విరి బాట అవ్వాలని, లోకాలన్నింటిని ఒకే సారి గెలవాలని ముచ్చట పడుతుంది మనసు. అవును, మనిషి మనసు కోరికలకు పుట్టునిల్లు. ప్రతి మనిషి మనసులో కలిగే తపన, ఆరాటమే కోరిక. అది అశగా ఉండొచ్చు. అత్యాశగా రూపాంతరం చెందవచ్చు.

సహజంగా ప్రతి మనిషిలో కొన్ని కోరికలు ఉంటాయి.తన ఇంట సిరి తోట పూయాలని, తన దారి విరి బాట అవ్వాలని, లోకాలన్నింటిని ఒకే సారి గెలవాలని ముచ్చట పడుతుంది మనసు. అవును, మనిషి మనసు కోరికలకు పుట్టునిల్లు. ప్రతి మనిషి మనసులో కలిగే తపన, ఆరాటమే కోరిక. అది అశగా ఉండొచ్చు. అత్యాశగా రూపాంతరం చెందవచ్చు. ఆశ మనిషి కీర్తి పెంచితే, అత్యాశ అన్నింటిని నట్టేటా ముంచుతుంది. చెలమను తోడినకొద్దీ నీరు ఊరినట్టు కోరికలు తీరిన కొద్దీ కొంగ్రొత్తవి ఊరుతూనే ఉంటాయి, ఊరిస్తూనే ఉంటాయి. అందుకే ”ఒకవేళ ఆదం పుత్రుని వద్ద బంగారం నిండిన ఒక లోయ ఉంటే, రెండు ఉంటే బాగుండు అని కోరుకుంటాడు. ఒకవేళ అతని వద్ద రెండు బంగారు లోయలుంటే ఇంకొకటి ఉంటే ఇంకా ఎంత బాగుండు అని ఆశ పడతాడు. వాస్తవంగా ఆదమ్‌ పత్రుని కడుపును ఒక్క కాటి మట్టి తప్ప మరేది నింప జాలదు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (ముస్లిం)

‘ఆస్తి మూరేడు – ఆశ బారేడు’ అన్నట్టు కోరికల్ని పెంచుకోవడం అంటే ఆగ్నికి ఆజ్యం పోసినట్టే. పెరగడమే కానీ, తరగడం ఉండదు. తృప్తి ఉండదు, శాంతి ఉండదు. మనుషుల్లో కరుణ ఉండదు. కరుణా మయుని పట్ల భయముండదు. కోరికలే గుర్రాలయితే, ఆ కోరికలే అసంఖ్యాకమయితే, అవే ‘కామా తరాణాం న భయం న లజ్జ’ స్థాయి కి చేరుకుంటే మనిషిని కబళిస్తాయి, శాంతిని మింగేస్తాయి. జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేస్తాయి.

కోరికలు తప్పుడు కోరికలు కానంత వరకు కోరికలుండటం తప్పు కాదు. పచ్చని సంసారాన్ని, చక్కని సంతానాన్ని కోరుకోని వారు ఎవ రుంటారు చెప్పండి. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత హోదాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా మనిషి కోరుకునే వాటిలో జర్‌-ధనం, జన్‌-స్త్రీ, జమీన్‌-భూమి తోపాటు కీర్తికండూతి కూడా ఉంది. ”స్త్రీలూ, కుమారులూ, పోగు చేయబడిన బంగారు రాసులూ, అచ్చు వేయబడిన మేలు జాతి అశ్వాలూ, పశువులూ, పంట పొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ జనులకు మనోజ్ఞంగా చేయబడింది” అని సెలవియ్యడంతో పాటు – ”ఇది ప్రాపంచిక సామగ్రి మాత్రమే. అత్యుత్తమ నివాసమయితే అల్లాహ్‌ా వద్దనే ఉంది” అన్న యదార్థాన్ని సయితం ఖుర్‌ఆన్‌ తెలియ జేస్తుంది. ఇలా అంటుంది: ”ఓ ప్రవక్తా! వారికి చెప్పు, వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభీతి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉం టాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రమయిన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నింటితోపాటు అల్లాహ్‌ా ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది”. (దివ్య ఖుర్‌ఆన్‌-3;14,15)
భయం – సహజమయిన గుణం భయం. నేల పగిలితే నింగికి భయం, నింగి ఉరిమితే నేలకు భయం. తప్పు చేెస్తే తప్పుటోళ్ళకు భయం. భయ పడితే పెడుతుంది భయం. ఒక్క మాటలో చెప్పా లంటే, మనిషికి తెలిసిన నిజం భయం.

మనిషి కష్టానికి భయ పడతాడు, నష్టానికి భయ పడతాడు. శత్రు వులకు భయ పడాతడు, మిత్రులకు భయ పడతాడు. సంతానానికి భయ పడతాడు, సహధర్మచారిణికి భయ పడతాడు. కొందరికి బతుకంటే భయం. కొందరికి చావంటే భయం. అసలు సంతాపం, దుఃఖం, భయం లేని ప్రపంచాన్ని మనం ఊహించ లేము. అది సాధ్యం కాదు కూడా. కానీ ఓ లోకం ఉంది. సత్కర్మల సామగ్రితో అక్కడికి చేరుకున్న వారికి ఎలాంటి దుఃఖముగానీ, బాధగాని, భయ ముగానీ కలుగదు. అదే స్వర్గలోకం! మహోన్నతుడయిన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”మరి ఎవరయితే ఆచరణలో అత్యుత్తమ రీతిని అవలంబించి తనను తాను అల్లాహ్‌ా సన్నిధిలో సమర్పించు కుంటాడో అతనికి తన ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. అలాంటి వారికి ఎలాంటి భయముగానీ, దుఃఖముగానీ ఉండదు”. (దివ్య ఖుర్‌ఆన్‌-2;112)
ఇక విశ్వాసి లక్షణం విషయానికొస్తే, ”అటు (అల్లాహ్‌ శిక్షిస్తాడన్న) భయం, ఇటు (అల్లాహ్‌ మనిస్తాడన్న)ఆశకి మధ్య అవస్థలో జీవించే వాడే విశ్వాసి” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స).

ప్రియ పాఠకుల్లారా! రమజాన్‌ మనందరి పాలిట దైవం ప్రసాదిం చిన మహదావకాశం. మన కోరికలుకు కళ్ళె వేసి సరయిన దిశలో నడిపించే మహత్తర సమయం. మనలో దైవభక్తిని, నైతిక రీతిని, పరలోక భీతిని, స్వర్గ ప్రీతిని పెంపొందించే పూర్ణ మాసం రమజాన్‌. ఈ మాసపు కరుణానుగ్రహాలకు అర్హులయినవారే సౌభాగ్యవంతులు. ఈ మాసపు మేలుని జార విడుచుకున్న వారే పరమ దౌర్భాగ్య జీవులు. రమజాను మాసాన్ని వ్యర్థ కార్యకలాపాల్లో వృధా పరచిన వారిని దైవదూతల నాయకులు జిబ్రయీల్‌ (అ) వారు అభిశపించ గా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారు ఆమీన్‌ అన్నారు. కాబట్టి చినుకు చనుకే వరదవుతుంది. కడవ కడవే కడలవుతుంది. మనం చేసే మంచికయినా, మనం చేసే చెడుకయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. అది మనల్ని గట్టునయినా పడేస్తుంది.లేదా నట్టేటయినా ముంచుతుంది. కాబట్టి అల్లాహ్‌ మన కర్మల లెక్కలు మనతో తీసు కోక ముందే మనం మన లెక్కలను సరి చూసుకోవాలి. సరి చేసుకో వాలి. సరిగ్గా సన్మార్గాన స్థిరంగా సాగి పోవాలి.
పరమ దయాళువు అయిన అల్లాహ్‌ మనందరికి ఇస్తున్న ప్రేమైక పిలుపు: ”మీరు మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, భుమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గ సీమ వైపునకు పరుగెత్తండి”. (అల్‌ హదీద్‌;21)

Related Post