Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మన ఆరాధ్య దైవం ఎవడు?

 

''ఓ ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువు నే ఆరాధించండి. తద్వారానే మీరు సురక్షితంగా ఉండగలరు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు.  ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లుఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌ాకు భాగస్వాములుగా నిలబెట్టకండి''. (అల్‌ బఖరా: 21,22)

”ఓ ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువు నే ఆరాధించండి. తద్వారానే మీరు సురక్షితంగా ఉండగలరు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లుఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌ాకు భాగస్వాములుగా నిలబెట్టకండి”. (అల్‌ బఖరా: 21,22)

ఒకడే దేవుడు ఒకడే కర్త సృష్టికి ఒకడే యజమాని. ఒకటేమార్గం ఒకటే గమ్యం – ఇదే సత్యం’ అని మనం తెలుసుకున్నాము? ఈ మాట ఏకేశ్వరోపాసకులు మొదలు బహుదైవారాధకుల వరకూ, క్రైస్తవులూ, యూదులు, ఫారసీలు మొదలు సృష్టి పూజారుల వరకూ అందరూ చెబుతున్నప్పుడు ఎవరు ప్రతిపాదించిన దైవాన్ని నిజ దైవం గా ఎంచాలి? ఎవరు అవలం బించే జీవన సంవిధానాన్ని అవ లంబించాలి? ఏ మార్గం మనల్ని స్వర్గానికి చేర్చగలదు. అన్న ప్రశ్న తలెత్తుతుంది. ”ఇక్కడయితే ప్రతి పక్షం తానే సత్య పక్షం” అని బల్ల గుద్ది మరీ చెబుతుందాయే! విశ్వాన్ని, విశ్వంలో ఉన్న అణువ ణువును మనం సునిశితంగా పరిశీలించి నట్లయితే, స్వయంగా మన దేహాన్ని, దాని నిర్మాణ విధానాన్ని గమనించినట్లయితే మూడు విషయాలు బోధ పడతాయి. 1) సృష్టి, 2) స్థితి, 3) లయ.

1) సృష్టి: ”ఆయనే ఆకాశాలనూ భూమిని సత్యబద్ధంగా సృష్టిం చాడు. ఏ రోజు ఆయన ‘అయిపో’ అని ఆజ్ఞాపించాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమయినది, ప్రభావ పూరితమ యినది”. (ఆల్‌ అన్‌ఆమ్‌:73)
”ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాలలో మీ రూపు రేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడా”. (అల్‌ ఇమ్రాన్‌: 6)

2) స్థితి: ”ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చి దిద్దిన వాని సాక్షిగా! మరి ఆయన దానికి చెడును, చెడు నుండి తప్పించుకుని మసలు కునే ప్రేరణను ఇచ్చాడు” (అష్షమ్స్‌: 6,7)
”ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపు ఇచ్చి, తర్వాత దానికి మార్గం చూపేవాడే మా ప్రభువు”. (తాహా: 50)
అంటే మనిషికి శోభనిచ్చే రూపు ను, పశువుకు తగిన ఆకారాన్ని,
విశ్వంలోని వస్తువులన్నింటికీ వాటికి అతికినట్లు సరిపోయే రూపురేఖలను ప్రసాదించిన వాడు. ప్రతి ప్రాణికీ దానిస్వభా వస్వరూపాల రీత్యా బ్రతుకు తెరువును నేర్పినవాడు. మనుగ డకు అవసరమయిన వాటిని సమకూర్చుకునే తెలివీ తెటలను ఇచ్చినవాడు. వాటి ప్రకారమే ఆ ప్రాణులు తమ జీవనపథాన్ని నిర్ణయించుకుంటాయి.

3) లయ: ”ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకూ (ప్రతి) పనిని నడుపుతున్నాడు”. (అస్సజ్దా: 5)
”భూమిలో సంచరించే ప్రాణుల న్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌ాదే. అవి ఆగి ఉండే స్థానాలు, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు”. (హూద్‌:6)

మరి ఆయన పేరేమిటి?
”నిశ్చయంగా మీ ప్రభువుఅల్లాహ్‌ా యే. ఆయన ఆకాశాలను, భూమి నీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత అర్ష్‌ను అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు, ఆయన అను మతి లేకుండా (ఆయన సమక్షం లో) సిఫారసు చేయగలవాడెవడూ లేడు. ఆ మహితాత్ముడయిన అల్లాహ్‌ాయే మీ అందరి ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధిం చండి”. (యూనుస్‌: 3)
ఇక ఆయన గుణగణాలేమిటి? అంటారా…

సకల దౌర్బల్యాలకు అతీతుడు అల్లాహ్‌:
”అల్లాహ్‌, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధా రం. ఆయనకు కునకుగానీ, నిద్ర గాని పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనం లో ఉంది. ఆయన అనుమతి లే కుండా ఆయన సమక్షంలో సిఫా రసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనక ఉన్న దానినీ ఆయన ఎరుగును.ఆయన కోరినది తప్ప ఆయనకున్నజ్ఞానం లోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టు ముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసి పోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు”. (అల్‌ బఖరా: 255) ”భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.ఆయనే మొదటి వాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు”. (అల్‌ హదీద్‌: 2,3) ఆయనే ఆది. ఆయనకంటే ముందు ఏదీ లేదు. ఆయనే అంతం.ఆయన తర్వాత ఏదీ ఉండదు.

(నా దాసులకు ఈ విషయాన్ని) తెలియజెయ్యి: ”ఆయన అల్లాహ్‌ ఒక్కడే. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయనా ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు”. (అల్‌ ఇఖ్లాస్‌: 1-4)
”ఆయన్ను పోలిన వస్తువేదీ లేదు”. (షూరా: 11)

”భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారిపోయినా, ఆపైన మరో ఏడు సముద్రాలను కలుపుకున్నా (అవి పూర్తయిపోతాయేగాని) అల్లాహ్‌ా వచనాలు పూర్తి కావు. నిస్సందేహంగా ఆయన సర్వాధికుడు, వివేకవంతుడు”. (లుఖ్మాన్‌: 27)
ఆయన గుణగణాలను అంతిమ దైవగ్రంథమయిన ఖుర్‌ఆన్‌ వెలుగులో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన తన దాసులనుద్దేశించి ఏమంటు న్నాడో కూడా తెలుసుకుందాం!
”ఓ ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువు నే ఆరాధించండి. తద్వారానే మీరు సురక్షితంగా ఉండగలరు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లుఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌ాకు భాగస్వాములుగా నిలబెట్టకండి”. (అల్‌ బఖరా: 21,22)

మనందరి ఆరాధ్య దైవం అయిన అల్లాహ్‌ాతో కలుసుకోవాలనీ, ఆయన దివ్య దర్శనంతో పునీతులమవ్వాలని మనలో ఎవరు కోరుకోరు చెప్పండి! మరి మన తదుపరి కర్తవ్యం ఏమిటి? అదీ ఆయన మాటల్లో నే వినండి: ”కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్న వాడు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు”. (కహఫ్‌:110)

 

Related Post