మనమంతా ఒక్కటే మనందరి దేవుడు ఒక్కడే

Originally posted 2016-05-15 12:57:47.

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా పరికిస్తున్నాడని (కనిపెట్టుకొని) తెలుసుకోండి

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా పరికిస్తున్నాడని (కనిపెట్టుకొని) తెలుసుకోండి

సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా, వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని, అదేవిదంగా సర్వమానవాళిని సృష్టించిన ఆ సృష్టికర్త కూడా ఒక్కడే అని, మానవుల అంతిమ దైవ గ్రంధం “ఖుర్ఆన్” గ్రంధం ద్వారా నిజ దైవం తెలియజేస్తున్నాడు

1). మానవులంతా ఒకే జంట సంతానం, మానవులందరూ పరస్పర సహోదరులు.!

సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా, వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని, సర్వమానవాళి సృష్టికర్త “ఖుర్ఆన్” గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు

ఉదాహరణకు దివ్యఖుర్ఆన్(4:1) వాఖ్యాన్ని పరిశీలించండి

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా పరికిస్తున్నాడని (కనిపెట్టుకొని) తెలుసుకోండి
ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా సమస్త మానవులు ఒకే జంట ద్వారా పుట్టించబడ్డారు అని భూమిపై నివసించే మానవులందరు ఇకే కుటుంబమని సర్వమానవాళికి సృష్టికర్త ప్రకటిస్తున్నాడు

వాస్తవానికి కులాలు,మతాలు మానవులు సృష్టించు కున్నవే.

1. కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణం ఏమిటంటే ఒక ఊరిలో ఉన్నవారందరు ఒకే విధమైన పని చేస్తే ఆ ఊరి అవసరాలు తీరవు కాబట్టి వారు పని విభజన సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క కుటుంబం వారు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకున్నారు. ఆ విధంగా కుండలు తయారు చేసే వారిని కుమ్మరి అని, బట్టలు ఉతికే వారిని చాకలివారని, చెక్క పని చేసే వారిని వడ్రంగి అని, బంగారాన్ని మలిచే వారిని కంసాలి అని పిలిచేవారు. ఇలా కొన్ని తరాల తర్వాత ఇవి కులవ్యవస్థలుగా పాతుకుపోయీ ఎక్కువ జాతి అనే అసమానతలకు గురి చేసాయి. మానవులంతా ఒకే జంట సంతానమైనప్పుడు మనషులందరూ వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా ఒకే కుటుంబం అవుతారు. కులాల పేర్లతో వేరు చేసుకోవడం అర్ధం లేని పని.
2. సృష్టికర్త ప్రతి యుగంలో ప్రవక్తల ద్వారా గ్రంధాలను అవతరింపజేసి ధర్మాన్ని సంస్థాపించాడు. ప్రవక్తలు గతించిన తర్వాత ఆయా అనుసరులు వారి గ్రంధాలను, ధర్మాన్నిమనోవాంఛలకను గుణంగా మార్చుకున్నారు. సృష్టికర్త ప్రజలను సంస్కరించడానికి మరొక ప్రవక్తను, గ్రంధాన్ని పంపేవాడు. ప్రజలలో కొందరు విశ్వసించి సన్మార్గలుగా (ముస్లిం) మారేవారు. మిగిలిన వారు మతావలంబీకులు (కాఫిర్) గా స్థిరపడిపోయేవారు.

వాస్తవానికి ప్రళయదినాన అల్లాహ్ ముందు రెండే రెండు వర్గాలుంటాయి.

విశ్వాసులు (స్వర్గవాసులు) మరియు అవిశ్వాసులు (నరకవాసులు)
విశ్వాసులు (స్వర్గవాసులు) అవిశ్వాసులు (నరకవాసులు)
1 నిజదైవాన్ని ఆరాధించేవారు కల్పిత దైవాలను ఆరాధించేవారు
2 ప్రవక్తల్ని అనుసరించేవారు మనోవాంఛలను అనుసరించేవారు
3 సన్మార్గులు, మంచి నడవడిక, దైవ భీతి గలవారు, దుర్మార్గులు, చెడ్డ నడవడిక
గలవారు. దైవభీతి లేనివారు
4 వీరినే దైవ విధేయులు లేక ముస్లింలు అని అంటారు. అని పిలుస్తారు. వీరినే దైవ అవిధేయులు లేక ముష్రిక్ లు, కాఫిర్ లు అని పిలుస్తారు.

NOTE: సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా, వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని, సర్వమానవాళి సృష్టికర్త “ఖుర్ఆన్” గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు

ఇస్లాం ధర్మం ప్రతి మానవుడి ధన, మాన ప్రాణాలకు విలువనిస్తుంది. ఇస్లామీయ రాజ్యాలలో ఉండే ముస్లిమేతరుల విషయంలో కూడా వీటి రక్షణకు తగు ఏర్పాట్లు కల్పించబడతాయి. ఇతరులను హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడటం వంటి పనులను ఇస్లాం వారిస్తుంది. ఒకరి ధన, మాన ప్రాణాలకు నష్టం కలిగించడం నిషిద్ధం చేయబడిందని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలియజేశారు.

వర్ణ భేదానికి ఇస్లాంలో తావులేదు:

(ఖుర్’ఆన్ 49:13) “మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను, తెగలుగానూ, చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వ లోక జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసిన వాడూనూ.”

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీ అజ్ఞాన అహంకారాలను, తాత ముత్తాతల మీద గర్వించే తత్వాన్ని అల్లాహ్ అంతమొందించాడు. మనిషి విశ్వాసి, దైవభీతి గలవానిగానో లేదా హీనమైన దురాచారిగానో రూపొండుతాడు. సర్వ మానవులు ఆదమ్ సంతానం. ఆదమ్ మట్టితో సృష్టించ బడ్డారు.” తిర్మిజీ హదీస్ గ్రంధం.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“ఓ జనులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. మీ తండ్రి (ఆదమ్) ఒక్కడే. అరబ్బు వారికి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బువారిపై ఎటువంటి ఆధిక్యత లేదు. అల్లాహ్ దృష్టిలో ఆయన పట్ల భయ భక్తులు కలవాడే అత్త్యుత్తముడు.” (మస్నదే అహ్మద్)
ఇస్లాం కు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు జాతి దురభిమానాలతో కొట్టుమిట్టాడేవారు.
(బుఖారి, మస్నదే అహ్మద్) ఇస్లాం కు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు జాతి దురభిమానాలతో కొట్టుమిట్టాడేవారు. వారి దృష్టిలో వంశం, జాతి ఔన్యత్యమే మానవ శ్రేష్ఠతకు ప్రమాణం. ఇది వారిలో అహంకారం, గర్వం లాంటి భావనల్ని జనింపజేసింది. వారి సంస్కరణలో ఆటంకంగా పరిణమించింది. యూదులు కూడా జాతి దురహంకార రుగ్మతకు గురై ఉన్న వారే. ఫలితంగా వారు కార్య శూన్యులుగా రూపొందారు. ఈ అజ్ఞాన భావనల్ని మిధ్యగా, మహానీచమైనవిగా ఇస్లాం అభివర్ణించింది. మానవులంతా సమానమేనని, మానవుడు తన చెడు ప్రవర్తన వల్ల చెడ్డవాడుగా సత్ప్రవర్తన వల్ల మంచివాడుగా రూపొందుతాడని స్పష్ట పరిచింది. గౌరవానికి ప్రమాణం వంశం, గోత్రం కాదని, అల్లాహ్ పై విశ్వాసం మరియు భాభాక్తులు, శీల సంపత్తి మాత్రమే గౌరవాదరనలకు, శ్రేష్ఠతకు ఆధారాలని తెలిపింది. మనిషి ఏ వంశానికి చెందినవాడైనను అతనిలో అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ పట్ల భాభాక్తులు కల్గి ఉండి, ఆయన ఆదేసించినట్లుగా జీవించే మానవుడే ఉత్తముడని, గౌరవనీయుడనీ ఇస్లాం స్పష్టం చేసింది. దైవ ప్రవక్త ఇలా ఉపదేశించారు. ఓ జనులారా! అన్యాయం చేయడం నుండి దూరంగా ఉండండి. అది మీకు తీర్పుదినం నాడు చీకటిలోనికి నెట్టివేస్తుంది.

(తిర్మిజీ, ఇబ్నె మాజా హదీస్ లో ) : ఎవరికైతే ఇహలోకంలో న్యాయం జరగలేదో వారికి తీర్పు దినం నాడు అల్లాహ్ న్యాయం చేస్తాడు. వారి హక్కులను వారికి ఇప్పిస్తాడు.
(బుఖారి హదీస్ లో ) ఎదుటి మనిషిని గౌరవించడం తన వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రతి ముస్లిం ధర్మం.
(ముస్లిం హదీస్ లో ) దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: అల్లాహ్ మీ రూపురేఖల్ని, ధన సంపత్తుల ను చూడడు. ఆయన మీ సంకల్పాన్ని మరియు మీ ఆచరణలను చూస్తాడు.

2). సర్వమానవాళిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే
images 10
సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా, వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, సర్వమానవాళిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, మరియు ఖుర్ఆన్, అని ఘోషిస్తున్నాయి . అనెకదైవాలు ఉన్నారనేది ఒక అపోహ మాత్రమే , వేదాలలో కాని ,ఉపనిషత్తు లలో కాని, గీత లో కాని, ఖుర్ ఆన్ లో కాని, బైబిల్ లో కాని అనేక మంది ,ముక్కోటి మంది అని ఎక్కడా లేదు. మనం దేవుని విషయంలో మన పెద్దవాళ్ళ పైన, టీచర్ల పైన ,ధార్మిక పండితుల పైన ఆధార పడుతూ మన ధార్మిక గ్రంధాలకు చాలా దూరంగా ఉన్నాము. కానీ ఒక్కసారి మన గ్రందాలు ఎం బోధిస్తున్నాయో గమనించండి
——————————————————-
ఖుర్ ఆన్ ప్రకారం దేవుడు ఒక్కడా ? అనేకమా..?
——————————————————-
దివ్య ఖుర్ఆన్ ( 2 : 163 ) ఓ మానవులారా..! నిశ్ఛయంగా మీ అందరి దేవుడు ఒక్కడే ఆ కరుణా మయుడు , ఆ కృపాకరుడు తప్ప మరో దేవుడు లేడు.
దివ్య ఖుర్ఆన్ (3:2) అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు సర్వ సృష్టికి మూలాధారం.
——————————————————————————–
వేదాల ప్రకారం దేవుళ్ళు ఎంత మంది ? ఒక్కడా లేక ముక్కోటి మందా..?
——————————————————————————-
1) (రిగ్వేదము 6:45:16) य एक इत्तमु शतुही
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు
2) (రిగ్వేదము 8:1:1) “माचिरण्य द्विशम्सतः”
ఓ మిత్రులారా ఆ ఒక్కడినే ద్యానించండి అప్పుడు మిమ్ములను ఎ బాదా బాదించడు
(అధర్వణ వేదము 20:58:3) “Worship only that God. Then you would not be affected by any grief”. ఓ మిత్రులారా ఆ ఒక్కడినే ద్యానించండి అప్పుడు మిమ్ములను ఎ బాదా బాదించడు

3)”देवो महा असि” (దేవుడు ఒక్కడే గొప్పవాడు)(అల్లహు అక్బర్).
“Only God is great”
4) The Brahma sutra of Hindu Vedantha: హైందవ వేదాంత బ్రహ్మ సూత్రము
“एकम ब्रह्ममम द्वितीय नस्तेनेंन न नसते किंचन”
“God (the Creator) is ONE ” and there is none except Him even for a little extent” (In Sanskrit, “Brahma” means “Creator”)
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు, కించిత్తు కూడా లేదు, కించిత్తు కూడా లేదు , కించిత్తు కూడా లేదు
———————————————————————————————-
ఉపనిషత్తుల వెలుగులో:
———————————————————————————————-
(Swetha swatharopanishath 3:2) దావ్య భూమి జనయాన్ దేవ ఏకః
భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు ఒక్కడే
(Chandogya Upanishath 6:2:1) “एकम यवद्वितीयम”
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు
(Swetha swatharopanishath 3:2) “एकोही रुद्रोना न द्वितीतियाया तस्थु”
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు
(కఠోపనిషత్ 6:2) “एको यवनो दयूतो”
“He is one and there is non except Him”.
ఆయన ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు.
——————————————–
గీత ప్రకారం దేవుళ్ళు ఎంతమంది..?
——————————————–
(గీత 18:66) “सर्व धर्म परित्यज्य ममेकम शरणम व्रज अहम् त्वा सर्व पपेभ्योमोक्शैस्तियनि माशुकता”
సర్వ ధర్మములను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు బొందుము. అప్పుడు నేను సమస్త పాపములనుండి నిన్ను విముక్తి చేసెదను.
(గీత 9:22) “अनन्यश्चिन्त मन्थोमान ये जना पर्युपासते तशाम नित्याभि युक्ताराम योगक्षेमं वहाम्यहम ”
అన్య దేవతారాధన చేయక నిత్యము ఎవడైతే నా యందు మనసు నిలిపి ఉంచుతున్నాడో, నాయందే చిత్తము చేర్చిన అట్టి వాని యోగక్షేమములు నేను విచారించుచున్నాను.
———————————————–
బైబిల్ ప్రకారం దేవుళ్ళు ఎంత మంది ..?
———————————————–
(యషయా 45:22) భూదిగంతముల నివాసులరా! నావైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు.
ఏసు అంటున్నాడు :
(మత్తయ 23 :9 ) మీరు ఈలోక మందు ఎవ్వరినీ తండ్రి (దేవుడు)అని పేరు పెట్టి పిలవకండి. మన తండ్రి (దేవుడు)ఒక్కడే . ఆయన పర లోక మందు వున్నాడు.
మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, మరియు ఖుర్ ఆన్, దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నా ప్రజలు ఆ ఒక్క దేవుణ్ణి ఎందుకు ఆరాధించడం లేదు. మనం దేవుని విషయంలో మన పెద్దవాళ్ళ పైన, టీచర్ల పైన ,ధార్మిక పండితుల పైన ఆధార పడుతూ మన ధార్మిక గ్రంధాలకు చాలా దూరంగా ఉన్నాము. దేవుని ఔన్యత్యము, గుణగణాలు, శక్తి మరియు ఆయన హక్కుల విషయంలో అవగాహనా రాహిత్యం నేడు ఎక్కువ కనపడుతుంది. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే దేవునికి భార్యా, పిల్లలు మరియు మానవ రుగ్మతలు ఉన్నాయి అనే భావన నేడు సమాజం లో కనపడుతుంది. ఇటువంటి అపోహలను పారద్రోలటానికి మన ధార్మిక గ్రంధాలు ఆ దేవుని గురించి ఏమి చెబుతున్నాయో చూద్దాం రండి.

అన్ని గ్రంధాల సందేశం దేవుడు ఒక్కడనే కాని అనేక మంది దేవుళ్ళు అని ఎక్కడా రాయబడి లేదు..!

Related Post