మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు

 అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తలమునకలై ఉన్నారన్నది వాస్త వం. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే ఆ మూడు ప్రశ్నలు – 1) మనం ఎక్కడ నుంచి వచ్చాము? 2) మనం ఎందు కోసం వచ్చాము? 3) చివరి మన గమ్యస్థానం ఏది?

అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తలమునకలై ఉన్నారన్నది వాస్త వం. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే ఆ మూడు ప్రశ్నలు –
1) మనం ఎక్కడ నుంచి వచ్చాము?
2) మనం ఎందు కోసం వచ్చాము?
3) చివరి మన గమ్యస్థానం ఏది?

ఈ ప్రపంచం అనేక మతాల. సమాజాల, జాతుల, తెగల కూడలి. ఇక్కడ క్రైస్తవులూ ఉన్నారు, యూదులూ ఉన్నారు, హిందువులూ ఉన్నారు, సాబియీలూ ఉన్నారు, ఫారసీయులూ ఉన్నారు, నాస్తికులూ ఉన్నారు, ఆస్తికులూ ఉన్నారు, లౌకిక వాదులూ ఉన్నారు, ముస్లింలూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అనాది నుండి మనిషి ఎదుర్కొంటున్న ప్రశ్నల్లో ముఖ్యమైనవి మూడు. ఈ ప్రశ్నలు నాటి నుండి నేటి వరకూ మానవ మేధను పరీక్షిస్తూనే వస్తున్నాయి. నేడు సయితం అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తలమునకలై ఉన్నారన్నది వాస్త వం. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే ఆ మూడు ప్రశ్నలు –
1) మనం ఎక్కడ నుంచి వచ్చాము?
2) మనం ఎందు కోసం వచ్చాము?
3) చివరి మన గమ్యస్థానం ఏది?

ఇప్పుడు మీ వంతు. ఈ మూడు ప్రశ్నలకు మీ మేధ ఏం సమాధానం చెబుతుందో కాసేపు చదవడం ఆపి ఆలోచించండి. ఈ మూడు ప్రశ్నలకు ముందు మీరు సమాధానం తెలుసు కునేందుకు ప్రయత్నించండి. ఆ సమాధానం సరైనది-సహేతుకం కావచ్చు, నిర్హేతుకం కావచ్చు. ఎలా ఉన్నా పర్వా లేదు ఆలోచించండి. మీకు కాస్త సమయం ఇవ్వబడుతోంది.
జ)………………………………………………………………………………………………………………………………………………………………………………………
జ)……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………
జ)………………………………………………………………………………………………………………………………………………………………………………………

మానవ సమాజంలోని అనేక మంది పండితా గ్రేసరులకు అంతుబట్టని ఈ మూడు ప్రశ్నల కు ఇస్లాం సంపూర్ణ సమాధానం – సూటిగా, ప్రతి మనిషి మనసులో దిగబడేలా, స్పష్టంగా, ప్రతి వ్యక్తి మేధకు అర్థమయ్యేలా బోధ పరు స్తుంది. అదెలాగా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పూర్తి వ్యాసం చదవాల్సిందే!

1) మనం ఎక్కడ నుంచి వచ్చాము?

జ)”నిశ్చయంగా మేము మనిషిని మట్టి సారం తో సృష్టించాము”.(అల్‌ మోమినూన్‌: 12-14)
మట్టితో సృజించడం అంటే ఆది మానవుడైన ఆదం (అ)ను మట్టితో చేయడం. మనందరికి మూల పురుషుడు హజ్రత్‌ ఆదం(అ) అయితే, ఆయన మూలం మట్టి. తర్వాత ఏం జరిగింది?

‘అలస్తు’ ప్రమాణం
‘నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, ‘నేను మీ ప్రభువుని కానా?’ అని అడిగినప్పుడు- ‘ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం’ అని వారు చెప్పారు.’ (అల్‌ ఆరాఫ్‌: 172)

పై పేర్కొనబడిన సంఘటన ‘అలస్తు ప్రమా ణం’గా సుప్రసిద్ధం. దీని వివరాలు ఒక హదీసులో ఉన్నాయి. ”….ఆదం వీపు నుండి, ఆయనకు పుట్టబోయే సంతానమంతటిని ఒక్క సారిగా వెలికి తీసి, వారిని ‘అలస్తు బిరబ్బి కుమ్‌? – నేను మీ ప్రభువుని కానా?’ అని ప్రశ్నించాడు. ‘బలా షహిద్‌నా’ – నువ్వే మా ప్రభువువి. దీనికి మేమంతా సాక్షులం’ అని వారు బదులిచ్చారు”. (ముస్నదె అహ్మద్‌)
ఇది ఏ లోకంలో జరిగింది? ఇది ‘ఆలమె జర్ర్‌’- పరమాణువుల లోకం అనబడుతుంది. మొత్తం మీద ఈ సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే అన్న భావన ప్రతి మనిషి నైజంలోనూ ఇమిడి ఉంది. ఈ ప్రకృతి సిద్ధ భావాన్నే మహా ప్రవక్త (స) ఈ విధంగా స్పష్ట పర్చారు: ”పుట్టే ప్రతి శిశువు సహజత్వం (ప్రకృతి నైజం) పైనే పుడుతుంది. కాకపోతే దాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదుని గానో, క్రైస్తవునిగానో, మజూసీగానో మార్చి వేస్తారు. జంతువు ఈనినప్పుడు దాని పిల్ల సయితం సురక్షితంగా ఉంటుంది. దాని ముక్కుగానీ, చెవులగానీ కోయబడి ఉండవు”. (సహీహ్‌ బుఖారీ)

ఆది మానవుడైన ఆదం మట్టితో సృజించ బడ్డారు అంటే మనమంతా అదే రీతిన మట్టి తోనే పుడుతున్నామా అంటే కాదు అన్నది సమాధానం. మరి మన పుట్టుక ప్రక్రియ ఎలా జరుగుతుంది? అంటారా. చూడండి: ”మరి మిమ్మల్ని మట్టితో మేమే సృష్టించాము. ఆ తర్వాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటుపిమ్మట మాంసం ముద్దతో చేశాము. అప్పటికీ అది రూపం కలదిగానూ, రూప రహితమైనదిగానూ ఉన్నది. మేము మీకు సృష్టి రహస్యాలు తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృ గర్భాలలో ఉంచుతున్నాము. ఆ తర్వాత మిమ్మల్ని శైశవ థలో బయటికి తీస్తాము. మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవ టానికి మీలో కొందరు (యుక్త వయసుకు చేరుకోక ముందే) మృత్యువుకు గురి చేయ బడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు”. (అల్‌ హజ్జ్‌: 5)
”నిశ్చయంగా మేము మనిషిని మట్టి సారం తో సృష్టించాము. ఆ తర్వాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షితమై చోటులో (లోకం మొత్తంలో శిశువు కోసం మాతృ గర్భంకన్నా సురక్షితమైన చోటు మరొకటి లేనేలేదు) నిలిపి ఉంచాము. మరియు ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు గడ్డను మాంసపు ముద్దగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలు గా చేశాము. పిదమ ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని పూర్తి భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరి కన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్‌ా ఎంతో శుభకరుడు”. (అల్‌ మోమినూన్‌:12-14)
”మేము మానవుణ్ణి అందమైన-అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము” (అత్తీన్‌:4) అన్న దివ్వ సూక్తి దృష్ట్యా- మానవ జన్మ అపురూప మైనది. ఇలాంటి సృజన కేవలం ఒక్క అల్లాహ్‌ాకు మాత్రమే సాధ్యం. ప్రపంచంలోని వస్తు నిర్మాతలెవరూ ఇలాంటి సృష్టి ప్రక్రి యను సాగించలేరు అని తెలుస్తుంది.

మరి ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? అని ఆలోచిస్తున్నారా?! సూరయె సజ్దాలో ఇలా సెలవియ్యబడింది:
”ఆయన ఏ వస్తువు చేెసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలు పెట్టాడు. ఆతర్వాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారం (వీర్యం)తో కొనసాగిం చాడు. ఆ పిదప తగు రీతిలో దానిని మలచి, అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ చెవులను, కళ్ళను, హృద యాలను చేసాడు. (అయినా) మీరు కృతజ్ఞ తలు తెలుపుకునేది చాలా తక్కువే”. (అస్సజ్దహ్‌: 7-9) ”సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండిన సమయం ఒకటి గడవ లేదా? నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షి ంచడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినే వాడుగా, చూసేవాడుగా చేశాము”. (దహర్‌: 1,2)

ఆ వీర్య బిందువు ఎక్కడ తయారవుతుంది అంటే- అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి. అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు. అది (పురుషుని) వెన్ను ముక, (స్త్రీ) ఛాతి భాగం మధ్య నుండి వెలు వడుతుంది”. (తారిఖ్‌: 5,6)
ఇవి, ఇటువంటి అనేక ఆయతుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే, ఒకప్పుడు మనిషిపై ఏమి కాని శూన్య థ కూడా ఒకటి ఉండేది. అల్లాహ్‌ా అతన్ని శూన్య స్థితి నుండి మట్టితో, తర్వాత నీటి సారంతో, తర్వాత పై పేర్కొన్న విధంగా పుట్టించాడు. అంటే మనిషి ఉనికి ఏదో యాదృచ్చిక విస్పోటనం వల్ల జరగలేదు, మనిషిని, సకల సృష్టతాలను పుట్టించినవాడు అల్లాయేనని తెలుస్తుంది. అంటే మనిషి అసలు స్థితి ఏమిటో, అతని ఉనికి ఎలా ప్రారంభమై, ఏ విధంగా పూర్ణ స్థాయికి చేెరు కుందో సమాధానం లభించింది. మరి ఎంతో మహోత్కృష్టమైన మానవ సృష్టి ఎందు నిమిత్తం జరిగింది అంటే ”మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) సృష్టిం చామనీ, మీరు మా దగ్గరకు మరలిరావడ మనేది జరగని పని అని భ్రమపడుతు న్నారా?” (అల్‌మోమినూన్‌:115)
”(ఆ విషయానికొస్తే) మేము భూమ్యాకాశాల ను, వాటి మధ్యనున్న వాటిని-ఏ ఒక్కటిని లక్ష్యరహితంగా పుట్టించ లేదు. (యాదృచ్చికంగా పుట్టాము అంతే) అన్నది అవిశ్వాసుల- నాస్తికుల భ్రాంతి మాత్రమే”. (స్వాద్‌: 27)
ఈ దివ్య సూక్తులలో మనిషిని పుట్టించిన అల్లాహ్‌ ఇతర సృష్టితాల మాదిరిగానే అతని జీవితానికి సయితం ఒక లక్ష్యం పెట్టాడని తెలుస్తోంది.

2) మనం ఎందు నిమిత్తం వచ్చాము? మన జీవిత లక్ష్యమేమిటి?

మనం ఒక కలమును తయారు చేస్తాము. రాయడం దాని లక్ష్యంగా పెడతాము. అంటే కలం ఉత్పత్తిదారులమైన మనం దాని లక్ష్యా న్ని నిర్ధారించినట్లే మనల్ని శూన్యం నుండి ఉనికిలోకి తీసుకు వచ్చిన దేవుడే మన జీవిత లక్ష్యాన్ని ఖరారు చేయాలి. అలా జరిగిందా? అంటే, చూడండి: ”నేను జిన్నాతులను, మానవులను సృష్టిం చింది వారు నన్ను ఆరాధిండానికి మాత్రమే. నేను వారి నుండి జీవనోపాధి (వజ్ర వైఢూ ర్యాలు, బంగారు వెండి ఆభరణాలు, వాహన, నివాస సౌకర్యాల)ని కోరడం లేదు. వారు నాకు అన్నపానీయాలు (నైవేద్యాలు) పెట్టాలని కూడా నేను కోరడం లేదు. నిశ్చయంగా అల్లాహ్‌ాయే సకల జీవరాసులకీ స్వయంగా ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహా శక్తిశాలి, మహాబలుడు”. (జారియాత్‌: 56- 58)

మానవులను, జిన్నాతులను పుట్టించడంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్‌ా ఈ వాక్యాలలో విశద పర్చాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆ విశ్వకర్త అభిమతం. అయితే దాని కోసం ఆయన మనుషులను గానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేయలేదు. వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించలేదు. ఒకవేళ అదే గనక అయి వుంటే- మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా, కష్టం ఉన్నా ఏకదైవారాధనకు చచ్చినట్టు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్‌ా వారికి పరిమిత స్వేచ్ఛ ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టు కలోని పరమార్థాన్ని, వారి జీవిత లక్ష్యాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేెశాడు. అంతే కాకుం డా, తనకు ఎలాంటి ఉపాధి అవసరం గానీ, గుడి, గోపుర ఆవశ్యకతగానీ, నగానట్రా అవ సరంగానీ లేదని, తనకు నైవేద్యాల, ఆహార పానీయాల అవసరం అంత కన్నా లేదని ఉద్ఘాటించాడు. పైగా తానే సకల జీవరాసుల కు ఉపాధిని ప్రసాదిస్తున్నానని కూడా స్పష్ట పర్చాడు. అంటే మనం ‘తిన్నామా, పడుకు న్నామా, తెల్లారిందా’ అన్నట్టు లక్ష్యరహితం గానూ పుట్టలేదు. అలాగే దైవం పేరు చెప్పు కొని గుళ్ళుగోపురాలు కట్టి, వజ్రవైఢూర్యా లు, బంగారు వెండి ఆభరణాలు సమర్పిం చడానికి లేదా కూడ బెట్టుకోవడానికీ పుట్ట లేదు. మన పుట్టుక కేవలం మనందరి సృష్టి కర్త అయిన అల్లాహ్‌ాను మాత్రమే ఆరా ధించే నిమిత్తం జరిగింది.

3) చివరి మనందరి గమ్యస్థానం ఏది?

”ఓ మానవుడా! నువ్వు నీ ప్రభువును చేరుకునే వరకూ ఈ సాధనలో (ఈ కఠోర పరిశ్రమలో) నిమగ్నుడవై ఉండి, తుదకు ఆయన్ను చేరు కుంటావు”. (ఇన్షిఖాఖ్‌: 6)
”సృష్టి (ప్రక్రియ)ని మొదలెట్టేవాడు అల్లాహ్‌ాయే. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. మరి మీరంతా ఆయన వైపున కే మరలించ బడతారు”. (రూమ్‌:11)
”మరి మీరంతా మరలిపోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాల్ని సయితం ఎరిగినవాడు”. (జుమర్‌: 7)
”కడకు అందరూ పోయి చేెరవలసింది నీ ప్రభువు వద్దకే! మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడ్పిస్తున్నాడు. మరి ప్రాణం తీసే వాడు ఆయనే, ప్రాణం పోసేవాడూ ఆయనే. ఇంకా ఆయనే జంటల ను- ఆడ- మగలను సృజించాడు”. (అన నజ్మ్‌: 42-45)
”నిశ్చయంగా (అందరూ) మరలిపోవలసింది నీ ప్రభువు సన్నిధికే”. (అలఖ్‌: 8)
ఇంత చేెసిన దేవుడు మనిషి ఎలా జీవించాలో చెప్పలేదా? అంటారా. చూడండి: ”మేము అతని (మానవుని)కి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృత ఘ్నుడుగా తయారైనా (వాడి ఇష్టానికే వదిలేశాము). అయితే, అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళు, ఇనుప పట్టాలను, జ్యలించే అగ్నిని సిద్ధం చేెసి ఉంచాము. (తత్భిన్నంగా) నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్‌’ కలుపబడిన మధుపాత్రను సేవిస్తారు. అదొక సరోవరం. దైవ దాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు”.
(అల్‌ ఇన్సాన్‌: 3-6)
అభిమాన సోదరులారా! అల్లాహ్‌ మనల్ని అందమైన ఆకృతిలో పుట్టించి, శక్తియుక్తులు అనుగ్రహించి మన మానాన మనల్ని ఇట్టే వదలి పెట్టలేదు. మానవ జీవిత లక్ష్యాన్ని ఎరుకపర్చడమేకాక, ఆ లక్ష్య సాధనకు పని కొచ్చే మనందరి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం గొప్ప ఏర్పాటు కూడా చేశాడు. తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా సన్మార్గమేదో, దుర్మార్గమేదో చక్కగా వివరించాడు. ఆ పరంపరలో వచ్చిన చిట్ట చవరి గ్రంథం పవిత్ర ఖుర్‌ఆన్‌ అయితే కట్ట కడపటి దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). ఇక మనం దైవ విధేయతా మార్గాన్ని అవలంబించి ధన్యజీవులుగా నెగ్గుకొస్తామో లేక అప మార్గాల్ని అనుసరించి అల్లాహ్‌ మనకు చేసిన అనేక మేళ్లను మరచి బ్రతికి ఇహపర జీవితాల్ని మరింత దుర్భరం చేెసుకుంటామో మన ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్నే దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా బోధ పర్చారు: ”ప్రతి వ్యక్తీ తన అంతరాత్మను క్రయ విక్రయాలకై పెడతాడు. ఈ వర్తకంలో అతడు దాన్ని చంపినా చంపేస్తాడు. లేదా దానికి స్వేచ్ఛనయినా ప్రసాదిస్తాడు”. (సహీహ్‌ బుకారీ)
అంటే మనం మన దుష్కర్మల ద్వారా మన అంతరాత్మ గొంతు నులిమివేయటమో లేక దాని గౌరవాన్ని కాపాడటమో చేస్తాం అన్న మాట. మనం ఒకవేళ దురాగతాలకు పాల్పడితే మన అంతరాత్మను చంపుకున్నట్లే. ఒకవేళ మనం సత్కార్యాలు చేెస్తే మన అంతరాత్మకు శాంతిని, ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళమవుతాము. ఓ వర్గం స్వర్గానికి! మరో వర్గం నరకానికి!! ఎటు వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవాలి సుమా!!!

Related Post