సత్య లేఖ

Originally posted 2014-08-24 01:31:12.

”ప్రజలారా! శ్రద్ధగా వినండి! స్తుతించదగిన మనిషి (ముహమ్మద్‌) ప్రజ లలో అవతరింపజేయబడతాడు. ప్రవాసిని మేము మా ఆశ్రమంలో తీసుకొంటాము. ఆయన్ని అరవై వేల తొంభైమంది శత్రు వుల నుంచి మా ఆశ్రమంలో తీసుకొం టాము. వారి వాహనాలు ఇరవై ఆడ మగ ఒంటెలు. ఆయన ప్రతిష్ఠ స్వర్గాన్ని అధిగ మిస్తుంది. ఆయన మహర్షికి వంద బంగారు నాణాలు ఇస్తారు. పది వృత్తాలు ఇస్తాడు. మూడు వందల అరేబియా గుర్రాలు, పది వేల ఆవులు ఇస్తాడు.”

”ప్రజలారా! శ్రద్ధగా వినండి! స్తుతించదగిన మనిషి (ముహమ్మద్‌) ప్రజ లలో అవతరింపజేయబడతాడు. ప్రవాసిని మేము మా ఆశ్రమంలో తీసుకొంటాము. ఆయన్ని అరవై వేల తొంభైమంది శత్రు వుల నుంచి మా ఆశ్రమంలో తీసుకొం టాము. వారి వాహనాలు ఇరవై ఆడ మగ ఒంటెలు. ఆయన ప్రతిష్ఠ స్వర్గాన్ని అధిగ మిస్తుంది.
ఆయన మహర్షికి వంద బంగారు నాణాలు ఇస్తారు. పది వృత్తాలు ఇస్తాడు. మూడు వందల అరేబియా గుర్రాలు, పది వేల ఆవులు ఇస్తాడు.”

శీ కంచి శంకరాచార్యుల వారికి,

గౌరవనీయులైన శంకరాచార్య స్వామిగల్‌! మీకు శాంతి కలుగుగాక.
ఓ సారి మీరు ఆశ్చర్యపడుతూ, హిందూ గ్రంథాలలో ఎక్కడైనా ఇస్లామ్‌ గురించి, ముహమ్మద్‌ ప్రవక్త గురించి ప్రస్తావన ఉందా అని నన్ను ప్రశ్నించారు.హిందూ గ్రంథాల నుంచి కొన్ని కొటేషన్లు మీకీ లేఖలో రాస్తున్నాను.
హిందూ గ్రంథాల్లో భవిష్య సూచనలు హిందూ గ్రంథాల్లో దైవప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి అనేక సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సూచనలు పురాణా ల్లో ఉన్నాయి. భవిష్యపురాణంలో ఉన్న సూచన అన్నింటికన్నా స్పష్టంగా ఉంది. ఇందులో దైవప్రవక్త ముహమ్మద్‌(స) పేరు, దేశం అన్ని వివరాలు ఉన్నాయి-మరుస్థలే నివా సినాం- ఎడారి నివాసి. (అరేబియా). ఈ కారణం వల్లనే ఆర్య సమాజ్‌ ఈ పురా ణంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఈ పురాణంలో ముహమ్మద్‌ ప్రవక్త(స) ప్రస్తా వన ఉంది. కాబట్టి ఈ పురాణం నమ్మ శక్యమా అన్నది వారి వాదన. అయితే సనాతన పండితులు, అనేకమంది హిందు వులు ఈ పురాణం నమ్మశక్యమైనదిగానే భావిస్తున్నారు.

సంస్కృత శ్లోకం1
ఏతన్‌ మిన్నస్తరే మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్విత
మహామద ఇతిఖ్యాత శిష్య శాఖా సమన్విత నృపశ్చైవ మహాదేవం మరుస్థల నివాసి నమ్‌…..
అనువాదం: ఒక మ్లేచ్ఛుడు (అంటే విదేశి యుడు, విదేశీ భాష మాట్లాడువాడు), ఆధ్యాత్మిక గురువు తన శిష్యులతో సహా అవతరిస్తాడు.ఆయన పేరు ముహమ్మద్‌.

రాజా (భోజుడు) దేవదూతలవలే కని పించే అరబ్బు మహా దేవునికి….. గంగా జల స్నానాన్ని చేయించిన పిదప తన భక్తి ప్రపత్తులను సమర్పిస్తూ గౌరవపూర్వకంగా ”నేను మీకు విధేయత చూపుతున్నాను” అన్నాడు. ”మానవ జాతికి గర్వ కారణమైన వాడా, అరేబియా నివాసి, రాక్షసులను సంహరించే అపార శక్తి కలిగినవాడవు. మ్లేచ్ఛ శత్రువుల ప్రమాదం నుంచి రక్షణ పొందినవాడు…..నేను నీకు బానిసను. నన్ను మీ చరణాలలో స్వీకరించండి. మహాప్రవక్త ముహమ్మద్‌ (స) స్తోత్రం ఇది.
ఇందులో మహర్షి వ్యాసుడు క్రింది అంశా లను పేర్కొన్నాడు.
1) మహాప్రవక్త పేరు ముహమ్మద్‌ (మహమద్‌) అని పేర్కొనబడింది.
2) ఆయన అరేబియా దేశానికి చెందిన వాడని చెప్పబడింది. శ్లోకంలో ఉన్న ”మరుస్థల్‌” అన్న సంస్కృత పదానికి అర్థం ఎడారి భూమి అని అర్థం.
3) ప్రవక్త అనుచరుల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. మహాప్రవక్త(స) మాదిరి గా ఆయనలానే కనబడే అనేక మంది అనుయాయులు కలిగివున్న ప్రవక్త మరొ కరు ఎవరూ ప్రపంచంలో లేరు.
4) ఆయన పాపరహితుడు, దైవదూతలా కనిపించేవారు.
5) భారతదేశానికి చెందిన రాజు ఆయన
పట్ల అపార గౌరవాదరాలు చూపుతాడు.
6) శత్రువుల నుంచి ప్రవక్త(స)కు భద్రత కల్పించడం జరుగుతుంది.
7) ఆయన రాక్షసులను సంహరిస్తాడు. విగ్రహారాధనను నిర్మూలిస్తాడు. అన్ని
విధాల చెడులను తొలగిస్తాడు.
8) మహర్షి తనను తాను ఆయన పాదాల వద్ద సమర్పించుకుంటాడు.
9) ఆయన అపార శక్తిశాలి అయినా దైవానికి ప్రతిబింబంలా ఉంటాడు.
10) ఆయ మానవాళికి గర్వకారకుడుగా పరిగణించబడతాడు. (ప్రచాతిస్‌నాథ్‌)
(భవిష్యపురాణం,పర్వం:3, ఖండం:3, అధ్యాయం:3, శ్లోకం: 5-8)

సంస్కృత శ్లోకం-2
ఇదం జనా ఉపశ్రుత నరాశం సస్తవిష్యతే షష్టిం సహస్రానవతిం చ కౌరుమ్‌ ఆ రుశ మేషు దజ్మహే
ఉష్ట్రాయస్య ప్రవాహిణో వధూమన్తో ద్విర్దశ
వర్షమా రథస్యని జిహీడతే దిన ఈష మాణా ఉప స్పృశ
ఏష ఇషాయ మా మహే శతం నిష్కాన్‌ థ స్రజ
త్రీణి శతాస్య ర్వతాం సహస్రా థ గోనామ్‌
అనువాదం:
(అధర్వణవేదం, కాండం -20, శ్లోకం-127, మంత్రం: 1-3)
పాకిస్తాన్‌కు చెందిన ‘భవాని వక్బ’ ప్రచు రించిన ”ది ఫస్ట్‌ అండ్‌ ఫైనల్‌ రిలిజి యన్‌”లో ఈ సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. భవిష్యపురాణంలో చాలామందికి తెలి యని శ్లోకాలు కొన్ని ఉన్నాయి.
లింగచ్ఛేది శిఖాహీన శ్మశ్రుధారిన దూషక ఉచ్ఛలాపీ సర్వభక్షీ భవిష్యతి జనోమమ… ……..ముసలైనైన సంస్కార…..(భవిష్య పురాణం, భాగం-3, శ్లోకం-25-27, సూత్రం -3) అనువాదం: ”వారు ‘ఖాత్నా’ (సున్నత్‌) చేయించుకొంటారు. శిరోముండనం చేయి స్తారు. గడ్డాలు ఉంటాయి. మాంసాహా రులు. వారు ఆరాధనకు పిలిచే పిలుపు బిగ్గరగా ఉంటుంది. భవిష్యత్తులో వారు ‘ముసలై’ అని పిలువబడతారు.”
రుగ్వేదంలో ముహమ్మద్‌(స) ప్రస్తావన ”మహామహె”అని వచ్చింది.
(మంత్రం-5 సూక్తం-28)
రుగ్వేదం హిందువుల అతి ప్రాచీన గ్రంథం. కాబట్టి, దైవప్రవక్త హిందూ గ్రంథాల్లో ప్రస్తావించబడిన ప్రవక్త(స). అంతే కాదు, దేవుని ఏకత్వం తర్వాత ప్రస్తావన ఉన్న ఒకే ఒక ప్రవక్త (స) ఆయన.
ఉపనిషత్తుల సందేశం ‘పరబ్రహ్మం’ అంటే దివ్య ఖుర్‌ఆన్‌లోని అల్లాహ్‌ా తప్ప మరేమీ కాదు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ వాస్తవాలు లోతుగా అధ్యయనం చేయమని, దేవుని ఏకత్వాన్ని గ్రహించ మని కోరుతున్నాను.

-భవదీయుడు అబ్దుల్లా అడియార్‌

Related Post