Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఓ మనిషీి! మార్గం మరచిపోతున్నావు

 రుజుమార్గం చూపేది  దైవగ్రంథాలే అని పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ షైతాన్‌ వలలో పడి సురకితమైన దైవగ్రంథాలను మరచిపోయి మార్పులు చేర్పులకు గురయిన గ్రంథాలను ఆశ్రయించి రుజుమార్గానికి దూరమైపోతున్నాడు.  5. ఆదేశాలు, సంస్కారాలు ధర్మమని చెబుతూనే షైతాన్‌ వలలో పడి కుడి ఎడమల అపవాదాలకు లోనవుతున్నాడు. ఆ విధంగా షైతానుకు బానిసయైపోయి దేవుడు పంపించిన జీవిత విధానాన్ని పూర్తిగా మరచిపోయాడు.   6. దైవారాధనే ముక్తికి సోపానం అని అంటూ, షైతాన్‌ వలలో పడి దైవేతరులకు పూజలు, పురస్కారాలు అర్పితం చేస్తున్నాడు. ఇంకా బీదల హక్కులను (జకాత్‌) చెల్లించడం లేదు. నమాజ్‌ను కూడా పాటించడం లేదు.

రుజుమార్గం చూపేది దైవగ్రంథాలే అని పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ షైతాన్‌ వలలో పడి సురకితమైన దైవగ్రంథాలను మరచిపోయి మార్పులు చేర్పులకు గురయిన గ్రంథాలను ఆశ్రయించి రుజుమార్గానికి దూరమైపోతున్నాడు.
5. ఆదేశాలు, సంస్కారాలు ధర్మమని చెబుతూనే షైతాన్‌ వలలో పడి కుడి ఎడమల అపవాదాలకు లోనవుతున్నాడు. ఆ విధంగా షైతానుకు బానిసయైపోయి దేవుడు పంపించిన జీవిత విధానాన్ని పూర్తిగా మరచిపోయాడు.
6. దైవారాధనే ముక్తికి సోపానం అని అంటూ, షైతాన్‌ వలలో పడి దైవేతరులకు పూజలు, పురస్కారాలు అర్పితం చేస్తున్నాడు. ఇంకా బీదల హక్కులను (జకాత్‌) చెల్లించడం లేదు. నమాజ్‌ను కూడా పాటించడం లేదు.

 

విశ్వప్రభువైన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
విశ్వసించిన ప్రజలారా! షైతాను అడుగు జాడలలో నడవకండి. వాడిని ఎవరైనా అనుసరిస్తే వాడు అతనికి అశ్లీలతనే, చెడునే ఆజ్ఞాపిస్తాడు. (24:21)
షైతాన్‌ అడుగు జాడల్లో నడిస్తే వాడు మిమ్మల్ని మార్గం తప్పించి నరకం వైపునకు దారి చూపిస్తాడు జాగ్రత్త అని మనిషికి అల్లాహ్‌ా హెచ్చరిక చేస్తున్నాడు.
మానవునికి షైతాన్‌ ఎలాంటి సమయంలో, ఎలాంటి విషయాలలో చెడును ఆజ్ఞాపిస్తాడో కొన్నింటిని పరిశీలిద్దాం:
1. మనిషి విశ్వానికి దేవుడు ఒక్కడే అని అంటున్నాడు కాని షైతాన్‌ వలలో పడి బహుదైవారాధనకు పాల్పడుతున్నాడు.
2. భూలోకంలో శాంతికి నిలయాలు మస్జిద్‌లు అని అంటున్నాడు కాని షైతాన్‌ వలలో పడి మందిరాలను, దర్గాలను దర్శిస్తున్నాడు. ఇహలోకంలో ఉండే మస్జిద్‌లను మర్చిపోతున్నాడు.
3. దేవుని సందేశహరుల (ప్రవక్తలు)ను విశ్వసిస్తున్నాడు కూడా. కాని మానవుడు షైతాన్‌ వలలో పడి సాధువులను, సన్యాసులను ఆశ్రయిస్తున్నాడు. విశ్వప్రభువు పంపిన ప్రవక్తలను మరచిపోతున్నాడు.
4. రుజుమార్గం చూపేది దైవగ్రంథాలే అని పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ షైతాన్‌ వలలో పడి సురకితమైన దైవగ్రంథాలను మరచిపోయి మార్పులు చేర్పులకు గురయిన గ్రంథాలను ఆశ్రయించి రుజుమార్గానికి దూరమైపోతున్నాడు.
5. ఆదేశాలు, సంస్కారాలు ధర్మమని చెబుతూనే షైతాన్‌ వలలో పడి కుడి ఎడమల అపవాదాలకు లోనవుతున్నాడు. ఆ విధంగా షైతానుకు బానిసయైపోయి దేవుడు పంపించిన జీవిత విధానాన్ని పూర్తిగా మరచిపోయాడు.
6. దైవారాధనే ముక్తికి సోపానం అని అంటూ, షైతాన్‌ వలలో పడి దైవేతరులకు పూజలు, పురస్కారాలు అర్పితం చేస్తున్నాడు. ఇంకా బీదల హక్కులను (జకాత్‌) చెల్లించడం లేదు. నమాజ్‌ను కూడా పాటించడం లేదు.

7. పరాయి సొమ్ము పాము లాంటిది అని తెలిసి కూడా షైతాన్‌ వలలో పడి దొంగతనాలకు, దోపిడీలకు, వ్యభిచారానికి పాల్పడుతున్నాడు. ప్రళయ దినాన్ని (తీర్పుదినాన్ని) మరచిపోయాడు.

8. పుట్టిన మనిషి గిట్టక తప్పదు అని అంటాడు. కాని షైతాన్‌ వలలో పడి ఆలుబిడ్డలు ఆస్తిపాసులు తన సొంతం అని భ్రమ పడుతున్నాడు. మరణానంతర జీవితాన్ని మరచేపోయాడు.

9. స్వర్గం, నరకం ఉన్నాయి అని విశ్వసించినప్పటికీ షైతాన్‌ వలలో పడి అంతమైపోయే ఇహలోకాన్నే సర్వస్వంగా భావిస్తూ శాశ్వితమైన ే స్వర్గాన్ని మరచిపోయాడు.

10. సత్యమేవ జయతే అని పదేపదే చెపుతూ ఉంటాడు. షైతాన్‌ వలలో పడిపోయి అన్యాయానికి, అక్రమాలకు పాల్పడుతాడు. సత్యాన్ని ధర్మాన్ని మరచిపోయాడు. మనిషికి ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం లేకుండా పోతుందో అలాంటి సమయంలో షైతాన్‌ మనిషిని మార్గం తప్పించి వాడి మార్గంలోనే నరకం వైపునకు నడిపించుకుంటాడు. దేవుని మీద విశ్వాసం ఉన్న మనిషిని మార్గం తప్పించడం వాడి వల్ల కాదు.

Related Post