అద్భుతాల్లోకెల్లా అద్భుతం దివ్య ఖుర్‌ఆన్‌ మహత్యం

Originally posted 2014-06-28 15:31:06.

 అనన్య భౌతికానుగ్రహాలను మానవాళికి అందించిన ఆ పరమోన్నత ప్రభువు సర్వ విధాల మానవతపై దయదలచి సన్మార్గం చూపే, వారి ఆధ్యాత్మిక తృష్ణ తీర్చే, వారి ఆత్మలకు శక్తినిచ్చే ఏర్పాటు కూడా చేశాడు. అపురూప అనుగ్రహ ప్రదాత అయిన అల్లాహ్‌ా ప్రవక్తలనే శ్రేష్ఠ గణం ద్వారా సమస్త మానవాళికి మార్గదర్శక నియమావళిని ప్రసాదించాడు.

అనన్య భౌతికానుగ్రహాలను మానవాళికి అందించిన ఆ పరమోన్నత ప్రభువు సర్వ విధాల మానవతపై దయదలచి సన్మార్గం చూపే, వారి ఆధ్యాత్మిక తృష్ణ తీర్చే, వారి ఆత్మలకు శక్తినిచ్చే ఏర్పాటు కూడా చేశాడు. అపురూప అనుగ్రహ ప్రదాత అయిన అల్లాహ్‌ా ప్రవక్తలనే శ్రేష్ఠ గణం ద్వారా సమస్త మానవాళికి మార్గదర్శక నియమావళిని ప్రసాదించాడు.

 

మానవాళికి విశ్వ ప్రభువు చేసిన మేళ్ళు అగణ్యం. మనిషికి ఆయన ప్రసాదించిన వరానుగ్రహాలు అసంఖ్యాకం. సృష్టిరాసుల పట్ల ఆయనకు గల ప్రేమ అనంతం. ఆయన మనిషి జీవికకు అన్న పానీయాలను అనుగ్రహించడమేకాక, మనో భావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతల పురోభివృద్ధికి, క్రమవికాసానికి దోహదపడే సామగ్రిని అవనిలో పుష్కలంగా పొందుపరిచాడు.
అనన్య భౌతికానుగ్రహాలను మానవాళికి అందించిన ఆ పరమోన్నత ప్రభువు సర్వ విధాల మానవతపై దయదలచి సన్మార్గం చూపే, వారి ఆధ్యాత్మిక తృష్ణ తీర్చే, వారి ఆత్మలకు శక్తినిచ్చే ఏర్పాటు కూడా చేశాడు. అపురూప అనుగ్రహ ప్రదాత అయిన అల్లాహ్‌ా ప్రవక్తలనే శ్రేష్ఠ గణం ద్వారా సమస్త మానవాళికి మార్గదర్శక నియమావళిని ప్రసాదించాడు. దైవప్రవక్తలందరికీ ఆయా కాలాలను బట్టి, అవసరాలను బట్టి గ్రంథాలను, ప్రవర్తనా నియమావళులను పంపుతూ వచ్చాడు. ప్రజల జీవితాలను తీర్చి దిద్దేవారు. దైవభీతి, పరలోక భావనల ప్రాతిపదికగా మానవులందరినీ ఏకత్రాటిపై తీసుకువచ్చి వారిలో నైతిక విప్లవాన్ని నూరి పోసేవారు. శాంతి సాధనకు వారు సమిధులయ్యేలా వారిని సమాయత్త పర్చేవారు.

ఈ మార్గదర్శక గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం పవిత్ర ఖుర్‌ఆన్‌. ఖుర్‌ఆన్‌కు పూర్వం దైవ గ్రంథాలెన్నో అవతరించాయి. వాటి సంరక్షణా బాధ్యత అల్లాహ్‌ా ఆయా సముదాయాల వారికి అప్పగించాడు. కానీ ఆ గ్రంథావలంబీకులు వాటి పట్ల ప్రదిర్శించిన అలసత్వం కారణంగా, ఆ మతాధిపతులు స్వప్రయోజనాల కోసం వాటిలో మార్పుచేర్పులకు పాల్పడిన కారణంగా అవి తమ నిజ స్థితిని కోల్పోయాయి. దైవప్రోక్తంలో మానవ కల్పితాలు చోటు చేసుకున్న కారణంగా మానవాళి సహజంగానే వక్ర భాష్యాలకు పోయి శృతి మించి అపమార్గాన పడింది. మానవత అలా మార్గభ్రష్టత్వానికి లోనయిన ప్పుడల్లా మమతానురాగాలకు నిలయుడైన ఆ మాధవుడు మరో ప్రవక్తను, మరో జీవన విధానాన్ని పంపి, మరచిపోయిన పాఠాలను జ్ఞాపకం చేసే ఏర్పాటు చేసేవాడు.
ఈ మార్గదర్శక పరంపరలో కట్టకడపటి గ్రంథమే పవిత్ర ఖుర్‌ఆన్‌. కాలానుగుణంగా అవతరించిన ఆ గ్రంథాలు పరిమిత ప్రాంతా నికి, పరిమిత జీవన విధానానికి చెందినవి. కానీ ఖుర్‌ఆన్‌ గ్రంథం అన్ని విధాల పరిపూర్ణ మైనది. అది వచ్చిందే మానవాళిని కర్రి మబ్బుల నుండి వెలికి తీసి వెలుగు ముగ్గుల లో విహరింపజేసేందుకే. అఖండ జ్యోతీశ్వ రుడైన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
”మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలిక తీసి కాంతి వైపు తీసుకుపోవడానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను (వచనాలను) అవ తరింపజేసినవాడు అల్లాహ్‌ాయే. నిశ్చయంగా ఆయన మీ యెడల మృదుస్వభావి, దయాశీలి.” (హదీద్: 9)
పవిత్ర ఖుర్‌ఆన్‌ మానవాళి పాలిట ఓ మహా దానుగ్రహం. ప్రపంచంలోని మరే అను గ్రహం దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి. విశ్వాసుల మధుర ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజా ధిరాజు అయిన అల్లాహ్‌ా ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని నీపై అవ తరింపజే శాము. అందులో ప్రతీ విషయం విశదీక రించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”.(నహ్ల్:89)
పవిత్ర ఖుర్‌ఆన్‌ ఓ మహా సాగరం. ఈ గ్రంథాన్ని విజ్ఞులు, వివేచనాపరులు, పండి తులు శోధించినకొద్దీ వారి తృష్ణ పెరుగు తూనే ఉంటుంది.

దాని లోతుల్లోకి పోయిన కొద్దీ ముత్యాలు, పగడాలు, మణిమాణిక్యాలు దొరుకుతూనే ఉంటాయి. అదో అంతం కాని జ్ఞానఖని. విజ్ఞానగని. ఈ గ్రంథంలో అల్లాహ్‌ా పవిత్ర నామాలు, గుణగణాలతోపాటు, అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను విశ్వసించండి అన్న పిలుపు కూడా ఉంది.
”తన ప్రభువు తరపున అవతరింపజేయబ డిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారం తా అల్లాహ్‌ాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిం చారు.’మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి వివక్ష, భేదభావాన్ని పాటించము’ అనంటారు. అలాగే ”మేము విన్నాము విధే యులయ్యాము మా ప్రభూ! మేము నీ క్షమా భిక్షను అర్థిస్తున్నాము, కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” (అని దీనాతిదీనంగా వేడుకుంటారు.) (బఖరా:285)
విజ్ఞానం శృతి మించి వినాశనం సృష్టిస్తున్న నేటి తరుణంలో, మతం మతి తప్పి మారణ హోమం రగలిస్తున్న నేటి యుగంలో, అస్పృశ్యత, అంటరానితనం, నిమ్నోన్నతా భావం అపశృతులు పలికిస్తున్న నేటి ఆధుని కంలో, ఉన్మాదం, ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తున్న నేటి కలికాలంలో, మారణాస్త్ర నిర్మూ లనమే సమస్త మానవ వికాసమనీ, అఖిల మానవాభ్యుదయమే విశ్వాస దళ ధ్యేయమని వక్కాణిస్తుంది ఖుర్‌ఆన్‌.

ఈ కారణంగానే మేము ఇస్రాయీల్‌ సంతతి వారికి ఇలా ఉత్తర్వు జారీ చేశాము: ”ఎవరైనా ప్రతీకార హత్య (శిక్ష)గా లేక ధరణిపై కల్లో లం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషి నైనా చంపితే అతను యావత్తు మానవాళినీ చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళి ని కాపాడినట్లే”. (మాయిదా:32)
అందరినీ ప్రేమించడమే ఇస్లాం అభిమత మ్మని, అదే సుమా ఎప్పటికీ దైవసమ్మతం అని ఉద్ఘాటిస్తుంది. అందుకు భక్తి మార్గమే అన్ని విధాల శ్రేయస్కరమని నొక్కి చెబు తుంది. పుట్టుకరీత్యా ఎవరూ అల్పులు కారని, అందరూ దైవ దాసులేనని, దైవభీతి పరులే దైవానికి ప్రియులని హితవు పలుకుతుంది. ”మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురు షుడు, ఒకే స్త్రీ నుంచి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేం దుకు మిమ్మల్ని జాతులుగా, తెగలుగా చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్‌ దృష్టిలో ఎక్కువ గౌరవానికి అర్హుడు. నిశ్చ యంగా అల్లాహ్‌ సర్వ జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసినవాడు”. (అల్‌హుజురాత్: 13)
పవిత్ర ఖుర్‌ఆన్‌ ఒక అద్భుత కళాఖండం. అది తన పఠితులను ఉర్రూతలూగించడమే కాక, సృష్టి, సృష్టి రహస్యాల గురించి, తన ఆయతుల గురించి ఆలోచించమని పురిగొల్పు తుంది. వారిలో జిజ్ఞాసను పెంచుతుంది.
ఓ ప్రవక్తా! వారికి చెప్పు: ”ఆకాశాలలో, భూమిలో ఏ వస్తువులైతే ఉన్నాయో వాటిని కాస్త (నిశిత దృష్టితో) చూడండి”. (యూనుస్:101)
మరో చోట ఇలా ఉంది: ”ఏమిటి, వారు ఖుర్‌ ఆన్‌ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నా యా?”. (ముహమ్మద్:24)

Related Post