పరలోక జీవితం ఉందని మీరెలా నిరూపించగలరు ?

Originally posted 2016-05-15 11:04:46.

ప్రతి ఒక్క మానవుడు న్యాయాన్నే కోరుకుంటాడు. ఒకవేళ అతడు ఇతరుల కొరకు న్యాయాన్ని అభిలషింకపోయినా, స్వయంగా తన కోసం మాత్రం తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటాడు. కొందరు ప్రజలు అధికారం మరియు అంతస్తు మత్తులో పడి, ఇతరులకు బాధ మరియు కష్టం కలిగిస్తారు. కానీ, ఒకవేళ వారికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోరు.

1. పరలోక జీవితాన్ని నమ్మడమనేది ఒక అంధవిశ్వాసమా ? ఒక మూఢనమ్మకమా ?
శాస్త్రీయమైన మరియు హేతుబద్ధమైన తార్కిక ఆధునిక భావాలు కలిగిన ఏ నాగరికుడైనా పరలోక జీవిత విశ్వాసం గురించి సూచించే ఏ వచనైనా ఎలా నమ్మగలరని అనేకమంది ప్రజలు ఆశ్చర్య పడుతున్నారు. తమ అంధ విశ్వాసాల, మూఢనమ్మకాలపై ఆధారపడి వారు పరలోక జీవితాన్ని విశ్వసిస్తున్నారని కొందరు ప్రజలు భావిస్తున్నారు. అయితే పరలోక జీవితాన్ని ఎందుకు విశ్వసించాలనేది లాజికల్ గా కూడా ఋజువు అయింది.
2. పరలోక జీవితాన్ని విశ్వసించడమనేది ఒక హేతుబద్ధమైన విశ్వాసం
దివ్యఖుర్ఆన్ లో వైజ్ఞానిక విషయాలను సూచించే వచనాలు వెయ్యి కంటే ఎక్కువ ఉన్నాయి.( “ఖుర్ఆన్ మరియు సైన్సు” అనే పుస్తకాన్ని చదవండి). 14 శతాబ్దాలకు పూర్వమే ఖుర్ఆన్ లో పేర్కొనబడిన అనేక వైజ్ఞానిక విషయాలను కేవలం కొన్ని శతాబ్దాల క్రితమే శాస్త్రజ్ఞులు కనిపెట్టగలిగారు మరియు ధృవీకరించగలిగారు. కానీ, నేటికీ ఖుర్ఆన్ లోని ప్రతి వచనాన్ని నిరూపించగలిగే మరియు ధృవీకరించగలిగేటంత ఆధునిక స్థాయికి సైన్సు చేరుకోలేక పోయింది.
ఉదాహరణకు ఖుర్ఆన్ లో పేర్కొనబడిన వాటిలో దాదాపు 80% విషయాలు నూటికి నూరు శాతం వాస్తవమైన విషయాలేనని సైన్సు ధృవీకరించిందని భావిద్దాం. మిగిలిన 20% గురించి, సైన్సు ఎలాంటి ప్రకటన చేయలేక పోయింది. ఎందుకంటే వాటి సత్యాసత్యాలు ధృవీకరించగలిగేటంత ఆధునిక స్థాయికి అదింకా చేరుకోలేదు. నిజానికి ఈనాడు మనకున్న పరిమిత జ్ఞానంతో, ఈ 20% వచనాలలో ఒక్క శాతం వచనాలను కూడా అవి తప్పని లేదా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పలేము. కాబట్టి ఖుర్ఆన్ యొక్క 80% వచనాలు నూటికి నూరు శాతం కరక్టు అయి, మిగిలిన 20% వచనాలు తిరస్కరించబడక పోయినపుడు, ఆ 20% వచనాలు కూడా కరక్టే అవ్వచ్చని లాజిక్ అంటే హేతువు చెబుతున్నది. పరలోక జీవిత ఉనికి గురించి తెలుపబడిన వచనాలు ఈ 20% సందిగ్ద వచనాల భాగంలో ఉన్నాయి. అవి కూడా నిజమే కావచ్చని లాజిక్ కూడా చెబుతున్నది.
3. పరలోక భావన లేకుండా శాంతి మరియు మానవ నైతిక విలువల భావనకు అర్థం పర్థం లేదు.
దొంగతనం ఒక మంచి పనా లేక చెడు పనా ? ఒక మామూలు వ్యక్తి అదొక చెడు పని అంటాడు. పరలోక జీవితాన్ని నమ్మని ఎవరైనా వ్యక్తి ఒక బలవంతుడైన మరియు ప్రబలుడైన నేరస్థుడిని దొంగతనమనేది ఒక చెడుపని అని ఎలా ఒప్పించగలడు?
ఒకవేళ నేను ఈ ప్రపంచంలో ఒక బలమైన మరియు ప్రబలమైన నేరస్థుడిని. అదే సమయంలో నేను మంచి తెలివితేటలు గలవాడిని మరియు లాజికల్ మనిషిని. దొందతనం ఒక మంచి పని అని నేనంటాను. ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడపడంలో అది నాకు సహాయపడుతున్నది. అలా దొంగతనం నా కొరకు మంచి పనే.
ఒకవేళ ఎవరైనా దొంగతనం నా కొరకు ఎందుకు చెడు పనో తెలిపే ఒక్క లాజికల్ వాదననైనా నా ముందు పెట్టగలిగితే నేను వెంటనే దానిని వదిలి వేస్తాను. అపుడు ప్రజలు సాధారణంగా ఈ క్రింది వాదనలను అతడి ముందు పెడతారు:
a. దొంగతనానికి గురైన వ్యక్తి కష్టాలు ఎదుర్కొంటాడు
దోచుకోబడిన వ్యక్తి కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని కొందరు అంటారు. దానికి నేను తప్పకుండా అంగీకరిస్తున్నాను. కానీ, నా కొరకైతే అది లాభదాయకమే కదా! ఒకవేళ నేను వెయ్యి రూపాయలు దోచుకోగలిగితే, ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కమ్మని భోజనం తినగలను.
b. నిన్నే ఎవరైనా దోచుకోవచ్చు.
ఏదో ఒకరోజు నన్నే ఎవరైనా దోచుకోవచ్చని కొందరు ప్రజలు అంటారు. నన్నెవరూ దోచుకోలేరు, ఎందుకంటే నేను చాలా బలమైన రౌడీని మరియు నా వద్ద వందల కొద్దీ బాడీగార్డులు ఉన్నారు. నేను ఎవరిని తలిస్తే వారిని దోచుకోగలను కానీ, నన్నెవరూ దోచుకోలేరు. దోచుకోవడమనేది ఎవరైనా సామాన్య వ్యక్తి కొరకు రిస్క్ తో కూడిన వృత్తి కావచ్చేమో గానీ నాలాంటి ఆరితేరిన బలమైన వ్యక్తి కొరకు ఎంత మాత్రమూ కాదు.
c. పోలీసులు నిన్ను అరెష్టు చేయవచ్చు
ఒకవేళ నీవు ప్రజలను దోచుకుంటే పోలీసులు నిన్ను అరెష్టు చేస్తారని కొందరు అంటారు. కానీ వారో విషయం తెలుసుకోవాలి. పోలీసులు నన్ను అరెష్టు చేయలేరు ఎందుకంటే కొందరు పోలీసులు నా జీతం పై బ్రతుకుతున్నారు. కొందరు మంత్రులకూ నా జీతం అందుతుంది. ఒకవేళ ఎవరైనా సామాన్య వ్యక్తి దోపిడీ చేస్తే, అతడు అరెష్టు చేయబడతాడని, అది అతడి కొరకు కష్టాలకు గురిచేస్తుందని, అతని కొరకు చెడు అవుతుందనే మాటకు నేను అంగీకరిస్తున్నాను. కానీ నేను అసాధారణమైన శక్తిమంతుడిని మరియు నా పేరు వింటేనే ప్రజలు వణికే ప్రబలమైన దాదాను కదా!
దోపిడి నా కోసం ఎందుకు చెడుపనో తెలిపే కనీసం ఒక్క లాజికల్ కారణం నాకు చూపండి, నేను దొంగతనాన్ని వదిలివేస్తాను.
d. సులభంగా సంపాదించిన ధనం
దోపిడి ద్వారా సంపాదించిన ధనం సులభంగా సంపాదించే ధనమని, అది కష్టపడి సంపాదించే ధనం కాదని కొందరు అంటారు. నేను వారితో పూర్తిగా అంగీకరిస్తాను, అది తేలిగ్గా సంపాదించే ధనమే. అందుకనే నేను దొంగతనాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ ఎవరైనా వ్యక్తి వద్ద సులభంగా సంపాదించే మరియు కష్టపడి సంపాదించే అవకాశాలు రెండూ ఉంటే, ఎవరైనా వివేకవంతుడైన వ్యక్తి సులభంగా సంపాదించే అవకాశం ఉన్న మార్గాన్నే ఎంచుకుంటాడు కదా!
e. అది మానవత్వానికి వ్యతిరేకం
దోపిడీ, దొంగతనాలు మానవత్వానికి విరుద్ధమని, ఒక వ్యక్తి తోటి వ్యక్తి మంచిచెడల గురించి పట్టించుకోవాలని కొందరు అంటారు. నేను వారి మాటలను ఖండిస్తూ, ‘మానవత్వం’ అనే ఈ చట్టాన్ని ఎవరు వ్రాసారు మరియు నేను ఎందుకు దానిని అనుసరించాలి? అని ప్రశ్నిస్తున్నాను.
ఈ మానవత్వ చట్టం భావావేశం కలిగిన మరియు అభిమానం కలిగిన వ్యక్తుల కొరకు మంచిదేమో గానీ నేను ఒక లాజికల్ వ్యక్తిని మరియు ఇతరుల బాగోగుల పట్టించుకోవడంలో నాకు ఎలాంటి ప్రయోజనం కనబడటం లేదు.
f. అదొక స్వార్థపూరితమైన చర్య
దోపిడీ, దొంగతనం అనేది పరుల క్షేమము గురించి పట్టించుకోని ఒక స్వార్థపూరిత చర్య అని కొందరు అంటారు. నిజమే, దొందతనమనేది ఒక స్వార్థపూరిత చర్యే. అయితే, నేనెందుకు స్వార్థపరుడిని కాకూడదు? నా జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో అది నాకు సహాయపడుతుంది.

1. దోపిడీ, దొంగతనమనేది ఒక చెడు పని అనడానికి ఎలాంటి లాజికల్ కారణమూ దొరకదు, దొంగతనం చెడు అనడానికి సైద్ధాంతిక ఆధారం లేదు:

దోపిడీని చెడు కార్యంగా నిరూపించటానికి మీరిచ్చే దృష్టాంతాలు, తర్కం అన్ని నిష్ప్రయోజనమైనవి. ఇలాంటి తర్కంతో, మీరు మామూలు దొంగల్ని, చిన్నపాటి దోపిడిదార్లను ఒప్పించగలిగితే ఒప్పించగలరేమో, బెదరించగలరేమో కాని, నాలాంటి ఘరానా, శక్తిసామర్ధాలు, పలుకుబడి గల వ్యక్తిని కట్టడి చేయలేరు. మీరిచ్చే దృష్టాంతాలు, ఏవి కూడా తీర్కికంగా, హేతువాదం ముందు నిలబడజాలవు. ఈ ప్రపంచం అపరాధులతొ నిండి ఉందనే విషయం కూడా ఆశ్చర్యకరమేమి కాదు.
మోసం, వంచన, అత్యాచారం లాంటి వ్యవహారాలు కూడా ఇలాంటివి. శక్తిశాలి మరియు ప్రభావవంతుడైన ఏ అపరాధిని ఏ తార్కిక ప్రమాణం ద్వారా కూడా ఇవి చెడు విషయాలైనట్లు మీరు సంతృప్తిపరచలేరు, ఏ హేతువాదం ద్వారా కూడా మీరతన్ని ఒప్పించలేరు.

2. ఒక బలవంతుడైన మరియు ప్రబలమైన నేరస్థుడిని అతడు చేసేది చెడు పని అని ఒక ముస్లిం మాత్రమే ఒప్పించగలడు

ఇప్పుడు నాణానికి మరోవైపు దృష్టిసారించుదాం. ఇపుడు మీరు పోలీసులకు మరియు మంత్రులకు జీతాలు అందజేస్తున్న ఈ ప్రపంచంలోని ఒక అత్యంత బలవంతుడైన మరియు ప్రబలమైన నేరస్థుడని భావించుదాం. మిమ్మల్ని రక్షించడానికి బారులు తీరిన బాడీగార్డులు ఉన్నారు. దొంగతనం, దోపిడీ, మానభంగం, మోసం, దగా మొదలైనవి చెడు పనులని మిమ్మల్ని ఒప్పించే ఒక ముస్లింను నేను.
ఒకవేళ నేను కూడా దోపిడీ, దొంగతనాలనేవి చెడు పనులని నిరూపించడానికి లాజికల్ గా ప్రయత్నిస్తే, ఇంతకు ముందు వలే వ్యర్థమై పోతుంది.
నేరస్థుడు లాజికల్ వ్యక్తి అంటే హేతువాది అని మరియు ఆతడు ఒక అత్యంత బలమైన మరియు ప్రబలమైన గజదొంగ అయినప్పుడే అతడి వాదలన్నీ కరక్టు అవుతాయని నేను అంగీకరిస్తున్నాను.
3. ప్రతి మనిషి న్యాయాన్ని కోరుకుంటాడు
ప్రతి ఒక్క మానవుడు న్యాయాన్నే కోరుకుంటాడు. ఒకవేళ అతడు ఇతరుల కొరకు న్యాయాన్ని అభిలషింకపోయినా, స్వయంగా తన కోసం మాత్రం తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటాడు. కొందరు ప్రజలు అధికారం మరియు అంతస్తు మత్తులో పడి, ఇతరులకు బాధ మరియు కష్టం కలిగిస్తారు. కానీ, ఒకవేళ వారికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోరు. ఇతరుల బాధలను, కష్టాలను వారు పట్టించుకోక పోవడానికి ఒక కారణం ఏమిటంటే, వారు అధికారాన్ని మరియు పరపతి ఇచ్చే అంతస్తులను ఆరాధిస్తున్నారు. ఆ అధికారం మరియు అంతస్తుల అహంకారం ఇతరులకు అన్యాయం చేసేందుకు వారిని అనుమతించడమే కాకుండా దానికి వ్యతిరేక దిశలో అలాంటి అన్యాయమే ఇతరులు తమకు చేయకుండా నిరోధిస్తుంది.

4. దేవుడు అందరినీ మించిన బలవంతుడు, అందరి కంటే అత్యంత శక్తిమంతుడు మరియు న్యాయవంతుడు
నేనొక ముస్లింగా, అపరాధి అయిన ఒక వ్యక్తిని దేవుని అస్తిత్వం గురించి ఒప్పించగలను.
ప్రపంచంలోని ఎంతటి శక్తిశాలి, ప్రభావవంతుడు, పలుకుబడి కలిగిన అపరాధి అయినా, దైవం అతనికన్నా అత్యదిక శక్తిమంతుడు, ప్రభావవంతుడే కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసేవాడే కూడాను. దివ్య ఖుర్ఆన్ ఇలా వచ్చింది.:
అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.
(అన్-నిసా : 176)

5. దేవుడు నన్నెందుకు శిక్షించాడు?
బుద్ధిజ్ఞ్యానులు, శాస్త్ర విజ్ఞ్యానంపై విశ్వాసమున్న ఒక దోషి, ఖుర్ఆన్ లో వైజ్ఞానిక వాస్తవికతల్ని చూసి దేవుని ఉనికి వాస్తవమని అన్గాకరిస్తాడు. అలా దైవ ఉనికిని విశ్వసించిన అపరాధి, అంత శక్తిశాలి, బలాడ్యుడు అయిన దైవం, నేను నేరాలు చేస్తూ పోయిన కూడా, న్యాయశీలి అయినప్పటికీ ఆయిన నన్నెందుకు శిక్షించటం లేదు? అని తర్కించే అవకాశముంది. ప్రశ్నించే అవకాశముంది.

6. అన్యాయంగా ప్రవర్తిన్చేవారిని శిక్షించాల్సిందే:
అన్యాయానికి గురైన ప్రతి వ్యక్తీ ఆర్థిక మరియు సామాజిక స్థాయిల ప్రమేయం లేకుండా, తనకు అన్యాయం చేసినవాడు తప్పకుండా శిక్షించబడాలని కోరుకుంటాడు. దొంగలకు మరియు రేపిష్టులకు గుణపాఠం నేర్పబడటాన్ని ప్రతి సామాన్య వ్యక్తీ ఇష్టపడతాడు. అనేక మంది నేరస్థులు శిక్షించబడినా, ఇంకా అనేక మంది నేరస్థులు పట్టుబడకుండా స్వతంత్రులుగా తిరుగుతూ, భోగభాగ్యాలతో కూడిన విలాసజీవితాన్ని గడపుతున్నారు. ఒకవేళ ఎవరైనా శక్తిమంతుడు మరియు ప్రబలుడైన వ్యక్తికి అతని కంటే బలమైన మరియు ప్రబలమైన వ్యక్తి అన్యాయం చేస్తే, ఆ శక్తిమంతుడు కూడా ఆ అన్యాయం చేసిన బలవంతుడికి కఠినశిక్ష పడాలనే కోరుకుంటాడు.
7. పరలోక జీవితం కోసం ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష
పరలోక జీవితం కోసం ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష. ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:
[ఖుర్ఆన్ 67:2] “చావు బ్రతుకులను సృష్టించినఆయనే మీలో ఎవరుఉత్తములో పరీక్షిస్తాడు;ఆయనే అత్యంత శక్తిమంతుడు,
క్షమించేవాడూను”
8. తీర్పుదినాన పరిపూర్ణ న్యాయం చేయబడుతుంది :
ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:
[ఖుర్ఆన్ 3:185] “ప్రతి ఆత్మా చావు రుచి చూడవలసిందే:కేవలం తీర్పుదినానమాత్రమే మీకు పూర్తిప్రతిఫలం ప్రసాదించబడుతుంది.
నరకాగ్ని నుండికాపాడబడి స్వర్గంలోప్రవేశ పెట్టబడినవాడు మాత్రమేసాఫల్యవంతుడు:

ఈ ఇహలోక జీవితపు ఆకర్షణలు కేవలం మిథ్యా మరియు వంచనమాత్రమే.”
తీర్పుదినాన అంతిమ న్యాయం చేయబడుతుంది. ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత, తీర్పుదినాన అతడు ఇతర మానవులతో పాటు మరలా తిరిగి లేపబడతాడు. ఎవరైనా వ్యక్తి అతడి నేరాల శిక్షలో కొంత భాగాన్ని ఈ ప్రపంచంలోనే అనుభవించే అవకాశం ఉంది. అయితే పరలోకంలోనే అసలు అంతిమ ప్రతిఫలం ప్రసాదించబడుతుంది మరియు అంతిమ శిక్ష విధించబడుతుంది. సర్వోన్నతుడైన అల్లాహ్ ఒక దొంగను లేదా ఒక రేపిష్టును ఈలోకంలో శిక్షించడు. కానీ తప్పకుండా అంతిమ తీర్పుదినాన ఆ నేరస్థుడు జవాబు ఇవ్వవలసి ఉంటుంది మరియు పరలోకంలో అతడు చేసిన నేరానికి కఠినంగా శిక్షించబడతాడు. దాని నుండి ఏ నేరస్థుడూ తప్పించుకోలేడు.
9. హిట్లర్ కు మానవ చట్టం ఏ శిక్ష విధించగలదు ?
ఆరు మిలియన్ల యూదులను హిట్లర్ తన భయంకరమైన పరిపాలనలో గ్యాస్ ఛేంబర్లలో భస్మం చేసి వేసినాడు. ఒకవేళ అతడిని ఎవరైనా పోలీసు అరెష్టు చేసినా, న్యాయం చేయడానికి మానవులచే తయారు చేయబడిన చట్టం హిట్లర్ కు ఏ శిక్ష విధించ గలదు ? అతడిని కూడా గ్యాస్ ఛెంబరుకు పంపించడం కంటే మించి ఇంకేమైనా కఠినశిక్ష విధించగలరా ? కానీ అది ఒక యూదుడిని హత్య చేసిన దానికి మాత్రమే సరిపోయే శిక్ష. మరి, మిగిలిన ఐదు మిలియన్ల, తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల, తొమ్మిది వందల తొంభై మంది యూదుల హత్యకు బదులుగా అతడి వేయబడవలసిన శిక్ష మాటేమిటి?
10. ఆరు మిలియన్ల కంటే ఎక్కువ సార్లు హిట్లర్ ను అల్లాహ్ నరకాగ్నిలో కాల్చుతాడు
ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
[ఖుర్ఆన్ 4:56] “ఎవరైతే మా చిహ్నాలను తిరస్కరించారో,
త్వరలోనే మేము వారిని నరకాగ్నిలో పడవేస్తాము;
వారి చర్మాలు కాలిపోగానే
మేము క్రొత్త చర్మాలు తొడిగిస్తాము – మాటిమాటికీ కాలడానికి,
అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడూను”

ఒకవేళ అల్లాహ్ తలిస్తే, పరలోకంలో హిట్లర్ ను ఆరు మిలియన్ల సార్లు నరకాగ్నిలో కాల్చి అతడి నేరానికి సరైన శిక్ష విధిస్తాడు.
11. పరలోక జీవిత భావన లేకుండా మానవ నైతిక విలువల లేదా మంచిచెడుల భావన లేదు
ఎవరినైనా పరలోక జీవితం గురించి ఒప్పించకుండా అతడిలో మానవ నైతిక విలువల మరియు మంచి చెడుల భావనలు కలుగజేయడం అసాధ్యం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో బలవంతుడు మరియు ప్రబలుడై ఉండి ఇతరులకు అన్యాయం చేస్తున్న వ్యక్తిని పరలోక భావన లేకుండా అతడు చేస్తున్న నేరం గురించి ఒప్పించడం మరీ కష్టం.

ఎంతటి అపరాదినైన ఒక ముస్లిం మొప్పించగలడు:
ఇకిప్పుడు, ఈ విషయానికి సంబంధించి ఇంకొక దృష్టికోణంతో చర్చిద్దాం. ఉదాహరణకు మీరు ప్రపంచంలోనే అత్యంత శక్తిశాలి మరియు పలుకుబడిగల అపరాదులనుకోండి. మీ రక్షణకు మామూలు కానిష్టేబుల్ మొదలుకొని మంత్రులు వరకున్నారు. మీ రక్షణ కోసం, మీ మీద ఈగవాలకుండా అహర్నిశలు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండటానికి ఒక సైన్యానికి సైన్యమే ఉంది. నేనొక ముస్లింను. దొంగతనం, దోపిడీ, మోసం, వంచన, అత్యాచారం మొదలైనవన్నీ చెడు కార్యాలని మీతో అఒంగికరిపజెయ ప్రయత్నిస్తున్నాననుకోండి.
పై విషయాల్ని చేదుగా నిరూపించటానికి నేను కూడా చూపితే, అపరాధి కూడా పై రకంగానే వాటిని ఖండిస్తూ పోతాడు.

Related Post