ప్రభాత గీతిక రమాజన్‌

నయానో, భయానో వద్దు. ఎవరేమనుకుంటారోనన్న భయం వద్దు. నలుగురు నన్ను మెచ్చుకోవాలన్న ఎదురు చూపు వద్దు అంటూ ఎవరికి వారుగా స్వయం ప్రేరణతో పని చేసుకునే విధంగా స్ఫూర్తిని, నిత్య చైతన్యాన్ని అది మనలో నింపుతుంది.

నయానో, భయానో వద్దు. ఎవరేమనుకుంటారోనన్న భయం వద్దు. నలుగురు నన్ను మెచ్చుకోవాలన్న ఎదురు చూపు వద్దు అంటూ ఎవరికి వారుగా స్వయం ప్రేరణతో పని చేసుకునే విధంగా స్ఫూర్తిని, నిత్య చైతన్యాన్ని అది మనలో నింపుతుంది.

ఇది రమజాను మాసం. వినయ, విధేయతల మాసం, దానధర్మాల మాసం. తరావీహ్‌ా జాగారాల మాసం, ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవాల్సి మాసం, ఖుర్‌ఆన్‌ స్వర్ణకార ధ్వనుల్ని సమస్త మానవాళికి చేరవేసి వారి భవిష్యుత్తుకి బంగారు బాట వేయవలసిన మాసం. సహనం, నిగ్రహం చూపవలసిన మాసం, అవసరార్థును, అగత్య పరులను, అభాగ్య జీవులను, అనాథలను, వితంతువులను, వికలాంగులను ఆదుకోవాల్సిన మాసం. ఇది శుభాల శ్రావణం. ఇది ప్రకాశతోరణం. ఇది కార్యువారుణి. ఇది అనుగ్రహ వర్షిణి. ఇది వరాల వాహిని. ఇది నిశాంత ప్రశాంతతలో ప్రభాత గీతిక. ఇది విశ్వాస జన సమాజానికి చైతన్య దీపిక.

రమజాన్‌-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భిన్న ఆలోచనా ధోరణులను, వ్యక్తిత్వాలను ఏకోన్ముఖం చేసి లక్ష్య సాధనా మార్గంలో నడిపిస్తుంది. వారందరిని ఏకతాటిపై తెచ్చి తౌహీద్‌ (ఏకేశ్వరో పాసన) ప్రాతి పదికన వారందరిని బలమయిన వ్యక్తులుగా,సత్య సమర యోధు లుగా, శాంతి దూతలుగా తీర్చిదిద్దుతుంది. మనిషి మతి పరిధిలో ఏర్పరచుకున్న రాతారీతులు, కులం, వర్గం, వర్ణం అన్న జాఢ్యాలకు లోను కాకుండా, వాటి విష కోరల్లో చిక్కుకొని ఇరుకైన మనసు గోడలు నిర్మించుకుని భావదారిద్య్రంతో, పదార్థ దాస్యంతో మరుగుజ్జులుగా మారకుండా, అందరిని ప్రేమించే, అందరిని గౌరవించే సాత్విక జీవులుగా, శాంతి కాముకులుగా అది మలుస్తుంది. మనల్ని మనం గౌరవించుకోకుండా, మనకంటూ ఒక బలమయిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోకుండా అందరూ మనల్ని గౌరవించాలని, మన వ్యక్తిత్వాన్ని గుర్తించాలనుకోవడం కన్నా మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని, మనిషికి కూడు, గూడు, గుడ్డ, గాలీ, నీరు, వేడిమి ఎంత అవసరమమో స్వీయ గౌరవం, స్వీయ వ్యక్తిత్వం అంతే అవసరం అని, శ్వాసించాలన్నంత బలమయిన కాంక్ష వలే మనం శ్రమించినప్పుడే అవి మనకు ప్రాప్తిస్తాయని హితవు పలుకుతోంది.

”మనుషులందరూ మంచి వారే. సాటి వారికి ఉన్నంతలో సహాయం చెయ్యాలన్న ఆలోచన ఉన్న వారు” అన్నట్టు – కొంతలో కొంత సహాయం చేయాలనుకున్న వారు మధ్యములయితే, తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ ఉన్న మొత్తాన్ని ఊరి మేలు కోసం వెచ్చించేవారు ఉత్తములయితే, అసలు సహాయం చేయాలన్న ఆలోచనే కలగని వారు అధములయితే, జనుల వద్ద ఉన్నదంతా ఊడబెరు క్కొని ఊళ్ళేలానుకునే వారు నీచులు అని మానవుల్ని వారి ప్రవర్తనను నాలుగు వర్గాలుగా విభజన రేఖను గీసి మరి విశదపరుస్తుంది.

నయానో, భయానో వద్దు. ఎవరేమనుకుంటారోనన్న భయం వద్దు. నలుగురు నన్ను మెచ్చుకోవాలన్న ఎదురు చూపు వద్దు అంటూ ఎవరికి వారుగా స్వయం ప్రేరణతో పని చేసుకునే విధంగా స్ఫూర్తిని, నిత్య చైతన్యాన్ని అది మనలో నింపుతుంది. మనల్ని మనమే నమ్ముకునేలా, మనల్ని మనమే గౌరవించు కునేలా, మనల్ని మనమే ప్రేమించుకునేలాలా, మనల్ని మనమే అభిమానించుకునేలాలా, మనల్ని మనమే సన్మానించుకునేలా, లోపాలు, దౌర్బల్యాలుంటే దిద్దుబాటుకి పూనుకొని రెట్టింపు వేగంతో దిగ్విజయంగా స్వర్గబాటలో సాగి పోయేలా అది మనల్ని మలుస్తుంది.

అది మనలో అల్లాహ్‌ ఆగ్రహం పట్ల భయాన్ని,ఆయన కరుణ యెడల ఆశను పెంచి ఐహిక స్వప్నాల్ని సాకారం చేసుకోవాలన్న శుభ సంకల్పానికి, పారలౌకిక మోక్షాన్ని పొందాలన్న వజ్ర సంకల్పానికి ప్రాణం పోసి, ప్రభువు ప్రసన్నతా మార్గంలో ప్రశాంత హృదయులయి సాగి పోయేలా మనల్ని తీర్చి దిద్దుతుంది. ప్రజలతోనే ఉంటూ, ప్రజలందరి మేలు కోరుతూ, ప్రజల్ని ప్రభువు బాటన నడిపించే సిసలయిన మార్గ దర్శకులుగా అది మనల్ని మారుస్తుంది. ‘వెలిగే దీపమే వేయి దీపాల్నయినా వెలిగించ గలదు’ అన్న హితోక్తితో మనం నిత్యం ప్రజ్వలిస్తూ ఉండేలా, ప్రజా సంక్షేమం కోసం, ప్రభువు ప్రసన్నత కోసం పరితపి స్తూ ఉండేలా, అందరి తలలో నాలుకయి ప్రకాశిస్తూ ఉండేలా, మనషులతో కాకుండా వారి మనసుల తో మంచిగా మసలుకునేలా అది మనల్ని సంస్కరిస్తుంది. ఇహపరాల్లో సఫలీకృతుగా నీరాజనాలం దుకోవాలనుకున్న వారు నిరతం తమ అర్హతల్ని పెంచుకోవాలని అది ప్రేరేపిస్తుంది. అరచేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కాదు స్వర్గమంటే, రాత్రికి రాత్రి ఎవరూ స్వర్గవాసిగా మారలేడు. ఈ ప్రయాణంలో ప్రయాస తప్పదు. పరీక్ష తప్పదు. అవాంతరాలు తప్పవు. అయినా పట్టు వీడని విక్రమార్కునిలా అహిర్నిశలు కఠోర పరిశ్రంకు పూనుకున్న వారికే అది వరిస్తుంది అని జాగురూక పరుస్తుంది.

ప్రతి యేటా జరిగే తంతులానే ఉపవాస దీక్ష, ఖుర్‌ఆన్‌ గ్రంథ సుశిక్ష, ఆరాధన సాధన, అభాగ్యుల ఆదరణ ఆనవాతీయ చేసి చేతులు దులుపుకుని తర్వాతి మాసాల్లో ధార్మిక దుర్భిక్ష గురయి దీవాలాకోరుగా ముగిలి పోతామో, సుస్థిరమయిన ఆలోచనలతొ, నిరుపమానమయిన సహనస్థయిర్యాలతో, దైవధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తమన్న వజ్ర సంకల్పంతో, నిగ్రహ సంయమనాలతో, సానుభూతి కటాక్షాలతో ఆత్మను వికాసమొందించి, నిండు వెలుగులో జీవిస్తూ సుభిక్ష స్థితిని సాకారం చేసుకుంటామో ఎవరికి వారు చేసుకోవాల్సిన ఆత్మ సమీక్ష!

 

 

Related Post