Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మీ ప్రభువు వైపునకు మరలండి

ఆయనే వృద్ధ్యాప్యంలో దైవప్రవక్త ఇబ్రా హీం(అ)కు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌(అ)ల వంటి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించాడు. ఆయనే శీలవతి అయిన మర్యం(అ)కు యేసు వంటి పరిశుద్ధ బాలుడ్ని ఇచ్చి ఆ బాలుడ్ని జనుల కోసం ఒక సూచనగా చేసి, ఆ చంటి పిల్లవాడితో పలకరింప జేశాడు.

ఆయనే వృద్ధ్యాప్యంలో దైవప్రవక్త ఇబ్రా హీం(అ)కు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌(అ)ల వంటి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించాడు. ఆయనే శీలవతి అయిన మర్యం(అ)కు యేసు వంటి పరిశుద్ధ బాలుడ్ని ఇచ్చి ఆ బాలుడ్ని జనుల కోసం ఒక సూచనగా చేసి, ఆ చంటి పిల్లవాడితో పలకరింప జేశాడు.

భూమ్యాకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు, యావత్తు విశ్వానికి అధిపతి, అణువణువుపై పూర్తి అధికారం కలిగినవాడు మన ప్రభువు. సూర్యుడ్ని, చంద్రుడ్ని సృష్టించిన వాడు, ప్రతి రోజూ సూర్యుడ్ని తూర్పు నుండి ఉదయింపజేసే వాడు, పడమరన అస్తమింపజేసే వాడు, మన ప్రభువు. మన కోసం రాత్రిని విశ్రాంతి కొరకు, పగటిని ఉపాధి సాధనంగా చేసినవాడు మన ప్రభువు. సముద్రాలను సృష్టించినవాడు, నదులను ప్రవ హింపజేసినవాడు, మన కోసం సముద్రాలను అదుపులో ఉంచిన వాడు మన ప్రభువు.

ఆకాశం నుండి వర్షం కురిపించి, దాని ద్వారా మృత భూమికి జీవం పోసేవాడు, దాన్యం, కూరగాయలు, పండ్లు ఫలాలు, పచ్చిక మొలకెత్తించి మనకూ, మన పశు వులకూ జీవన సామాగ్రి ఏర్పాటు చేసే వాడు మన ప్రభువు. పైన రెక్కలు జూపుతూ, ముడుస్తూ ఎగిరే పక్షుల్ని పరికించి కాస్త చూడండి. వాటిని ఏ ఆధారం లేకుండా పట్టి ఉంచినవాడే మన ప్రభువు. ప్రాణుల్ని గమనించండి వాటిలో కొన్ని పొట్టతో ప్రాకుతాయి, కొన్ని రెండు కాళ్ళతో, మరి కొన్ని నాలుగు కాళ్ళ తో నడుస్తాయి. ఇలా తాను తలచిన విధం గా సృష్టించినవాడే మన ప్రభువు. రక రకాల పండ్ల రసాన్ని, పుష్ప మకరందాన్ని ఆస్వాదించి, కొండల్లో చెట్లల్లో, పందిళ్ళపై తేనె తెట్లు నిర్మించి నా దాసులకు స్వస్థత నిచ్చే పానకం అందించమని ఆదేశమిచ్చిన వాడు మన ప్రభువు.

పశువుల పొట్ట్టలోని పేడకు, రక్తానికి మధ్య నుండి త్రాగడానికి స్వచ్ఛమైన పాలు ప్రసాదించేవాడు మన ప్రభువు. నిస్సందే హంగా ఆయన ప్రతి పని చేయగల సమ ర్థుడు. సర్వశక్తిమంతుడు.

ఆయనే ఆది మానవుడైన ఆదం(అ)ను మట్టితో సృజించాడు. ఆ తరువాత ఆదం నుండి హవ్వాను పుట్టించాడు. తిరిగి వారి రువురి నుండి మానవ సంతతిని ఒక మిశ్రమ బందువుతో ప్రపంచంలో వ్యాపిం పజేశాడు. ఎంత గొప్ప నిర్మాత. ఎంత ప్రతిభాశాలి ఆయన! ఆయనే కొందరికి మగ సంతానం, కొందరికి ఆడసంతానం, మరి కొందరికి ఆడ, మగ సంతానం ప్రసా దిస్తున్నాడు. అలాగే కొందరిని సంతాన హీనులుగా చేశాడు. నిశ్చయంగా ఆయన సమస్త కార్యాలు చేయగల సమర్థుడు. గొప్ప జ్ఞాన సంపన్నుడు కూడాను.

ఆయనే మనకు చూడటానికి కళ్ళు, విన డానికి చెవులు, ఆలోచించడానికి హృద యాన్ని అనుగ్రహించాడు. ఎంత కరుణామ యుడు ఆయన. భూమ్యాకాశాల నిక్షేపాల కు చెందిన తాళపుచెవులు ఆయన చేతులో నే ఉన్నాయి. తాను కోరినట్లు కొందరికి పుష్కలంగా మరి కొందరికి స్వల్పంగా ఉపాధినిస్తున్నాడు. ఆయన సర్వం ఎరిగిన వాడు. ఎవరికి ఎంత ఇవ్వాలి? ఎప్పటి వరకు ఇవ్వాలి? అంతా తెలిసినవాడు ఆయన. ఆయనే విశ్వసామ్రాజ్యాధిపతి. తాను తలచుకున్న వారికి రాజ్యాన్ని ప్రసాది స్తాడు. తలచుకున్న వారి నుండి రాజ్యాన్ని ఊడ బెరుకుతాడు. అలాగే తాను కోరిన విధంగా కొందరికి గౌరవ ప్రతిష్టలు అను గ్రహిస్తాడు. మరికొందరిని పరాభవం పాల్జే స్తాడు. నిస్సందేహంగా ఆయన నిర్ణయాల కు తిరుగులేదు.

ఆయనే వృద్ధ్యాప్యంలో దైవప్రవక్త ఇబ్రా హీం(అ)కు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌(అ)ల వంటి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించాడు. ఆయనే శీలవతి అయిన మర్యం(అ)కు యేసు వంటి పరిశుద్ధ బాలుడ్ని ఇచ్చి ఆ బాలుడ్ని జనుల కోసం ఒక సూచనగా చేసి, ఆ చంటి పిల్లవాడితో పలకరింప జేశాడు.
ఆ ప్రభువు ఆజ్ఞతో యేసు(అ) మట్టితో పక్షి ఆకారం గల బొమ్మ చేసి అందులో గాలి ఊదితే అది సజీవ పక్షిగా మారేది. పుట్టు గుడ్డిని, కుష్టురోగిని తాకితే నయం అయ్యేది. ఆప్రభువు ఆజ్ఞతోనే మృతుల్ని కూడా బ్రతికించేవాడు.
ఆ ప్రభువే సత్య తిరస్కారులు యేసు(అ) ను చంపడానికి కుట్ర పన్నితే తాను మరో యుక్తి పన్ని యేసును దుర్మార్గుల బారి నుండి రక్షించి తన దగ్గరకు రప్పించుకు న్నాడు.
ఆ ప్రభువే అల్లాహ్‌ా. మహా శక్తిమంతుడు. సృష్టిప్రణాళికను రూపొందించి దాన్ని అమలు చేసేవాడు. సర్వాధికారి. సర్వోన్న తుడు. అద్భుత వివేకవంతుడు. రాజాధి రాజు. సంరక్షకుడు. పర్యవేక్షకుడు. శరణు నిచ్చేవాడు. శాంతిమ యుడు. అనంత కరుణామయుడు. అపార దయామయుడు.

గోచర అగోచర విషయాలన్నీ ఎరిగిన వాడు. హృదయాల్లో దాగిన రహస్యాలు సయితం తెలిసినవాడు. పరమ పవిత్రుడు. నిత్యజీవుడు. ఎన్నటికీ నిద్రించ నివాడు. కనీసం కునుకుపాట్లు పడనివాడు. ఎంతో ఉదార స్వభా వుడు. జరిగిన తప్పులపై కుమిలిపోతూ పశ్చాత్తాపంతో చేసిన వేడుకోలును స్వీకరించే వాడు. పాపాలు క్షమించేవాడు. తలబిరు సుతనంతో ప్రవర్తించే వారిని కఠినంగా శిక్ష ఇచ్చేవాడు. పరలోక విచారణ దినానికి అధిపతి. న్యాయాధిపతి. తీర్పు దినాన ఆయన సన్నిధిలో సిఫా రసు చేయగల ధైర్యం ఎవరికీ ఉండదు. ఆయన మహోన్నతుడు. అయితే తన దాసులకు చేరువలోనే ఉంటాడు. మొర పెట్టుకునే వారి మొరలను ఆలకించి, సమాధానమిస్తాడు. జనులు చేస్తున్న పనులన్నిటినీ గమనించేవాడు. మెల్లగా మాట్లాడినా బిగ్గరగా మాట్లాడినా, రాత్రివేళ చీకటిలో దాగినా పగటి వెల్తు రులో తిరుగుతున్నా అంతా తెలిసినవాడు. వినేవాడు. ఆయన శుభ దాయకుడు. పరమ పవిత్రుడు. ఆయన ఎవరి అవసరమూ అక్కరా లేని నిరపేక్షాపరుడు. ఆయనకు తల్లిదండ్రులూ లేరు. ఆయన ఎవరినీ తన కొడుకుగా చేసుకోలేదు. ఆయనకు సమాన మైన వారు ఎవరూ లేరు. ఆయన సామ్రాజ్యం, సార్వభౌమత్వాల లో ఆయనకు ఎవరూ సాటిలేరు. యావత్తు సృష్టిలో ఆయన్ను పోలినది ఏదీ లేదు. ఎవరి చూపులూ ఆయన్ను అందుకో లేవు. భూమ్యాకాశాల్లో ఉన్న అణువణువూ అల్లాహ్‌ా ఔన్నత్యం చాటు తూ, ఆయన పవిత్రతను ప్రశంసిస్తోంది. యావత్‌ నిశ్వసామ్రా జ్యం ఆయనదే. సకల స్తోత్రాలు,పొగడ్తలు ఆయనకే శోభిస్తాయి.

సకల లోకాలకు ఏకైక ప్రభువైన అల్లాహ్‌ను మొరపెట్టుకోవడమే ధర్మం. ఆయన్ను వదలి సృష్టితాలను మొరపెట్టుకోవడం మిథ్య. జనుల్లో కొందరు అల్లాహ్‌ాను వదలి ప్రతిమలను ప్రార్థిస్తున్నారు. చూడబోతే నడవటానికి వాటికి సహజమైన కాళ్ళు లేవు. పట్టు కోవడానికి చేతులు లేవు. చూడటానికి కళ్ళు లేవు. వినడానికి చెవులు లేవు. సర్వోన్నతుడైన అల్లాహ్‌ాను వదలి జనులు పూజి స్తున్న మిథ్యాదైవాలు అన్నీ కలసి కనీసం ఒక ఈగనైనా సృష్టించ లేవు. అంతేకాదు ఈగ వాటి దగ్గర్నుంచి ఏదైనా వస్తువుని గుంజు కుంటే ఆ వస్తువుని కూడా అవి విడిపించుకోలేవు. యదార్థమేమి టంటే సహాయం అర్థించేవాడు. సహాయం అర్థించబడేవారు. ఇద్దరూ బలహీనులే.

సూర్యుడు చంద్రుడు అల్లాహ్‌ ఏకత్వానికి, ఆయన శక్తి సామర్థ్యా లకు నిదర్శనాలు మాత్రమే. వాటిని సాష్టాంగ పడకూడదు. వాటిని సృష్టించిన అల్లాహ్‌ాకే సాష్టాంగ పడాలి. అల్లాహ్‌ాను వదలి ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించలేని, చంపే బ్రతికించే శక్తి లేని మిథ్యాదైవాలను ఆరాధించడం ఘోరమైన అపరాధం. క్షమించరాని నేరం. ఇది తెలిసి మసలుకున్నవారే ధన్యులు, ఇహ పరాల్లో సఫలీకృతులూను.

Related Post