సాగర విజ్ఞాన శాస్త్రం – ఖుర్‌ఆన్‌

Originally posted 2014-11-21 23:07:11.

రెండు సముద్రాల విషయంలో అయితే కలిపే అవరోధం, మరి ఇక్కడ కలిసిపోకుండా అవరోధం.ఎచురీస్‌ (నదీ, సముద్రాలు కలిసే ప్రదేశం)లలో మధురమైన నీరు మరియు ఉప్పు నీరు కలిసినప్పుడు, ఆ పరిస్థితి రెండు సముద్రాలు కలిసే చోట ఉన్న పరిస్థితికి కొంత భిన్నంగా ఉంటుందని ఆధునిక సైన్స్‌ కనుగొంది. ఈ ఎచురీలలో మంచి నీరు, ఉప్పునీటిని వేరుచేసేదేమిటో కనుగొన్నారు. అదే 'పైక్నోక్లైన్‌' జోన్‌. ఇది రెండు రకాల నీటిని వేరు చేస్తుంది. ఈ జోన్‌కి మరియు దీనిని ఆనుకుని ఉన్న నీటికి మధ్య సాంద్రతలో స్పష్టమైన వ్యత్యాసముంటుంది.

రెండు సముద్రాల విషయంలో అయితే కలిపే అవరోధం, మరి ఇక్కడ కలిసిపోకుండా అవరోధం.ఎచురీస్‌ (నదీ, సముద్రాలు కలిసే ప్రదేశం)లలో మధురమైన నీరు మరియు ఉప్పు నీరు కలిసినప్పుడు, ఆ పరిస్థితి రెండు సముద్రాలు కలిసే చోట ఉన్న పరిస్థితికి కొంత భిన్నంగా ఉంటుందని ఆధునిక సైన్స్‌ కనుగొంది. ఈ ఎచురీలలో మంచి నీరు, ఉప్పునీటిని వేరుచేసేదేమిటో కనుగొన్నారు. అదే ‘పైక్నోక్లైన్‌’ జోన్‌. ఇది రెండు రకాల నీటిని వేరు చేస్తుంది. ఈ జోన్‌కి మరియు దీనిని ఆనుకుని ఉన్న నీటికి మధ్య సాంద్రతలో స్పష్టమైన వ్యత్యాసముంటుంది.

 

 

తియ్యటి మరియు ఉప్పు నీళ్ళను వేరు చేసే అవరోధం

”రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డుగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు”. (దివ్యఖుర్‌ఆన్‌-55: 19,20)

అరబీ పదం ‘బర్‌జఖ్‌’ అంటే విభజన లేదా రెండింటిని వేరు చేసే ఓ హద్దు. అంటే ఓ ఫెన్సింగ్‌ లేదా కంచెలాగా భౌతికంగా విభజన కాదు. మరో అరబీ పదం ‘మరజ’కు భాషాపరమైన అర్థం ఏమిటంటే రెండూ కలవడం మరియు ఒకదానితో ఒకటి మిశ్రమం కావడం. ఈ రెండు రకాల నీటి గురించి వాడిన రెండు వ్యతిరేకమైన అర్థాలను, ఖుర్‌ఆన్‌ వాఖ్యాతలు మొదట్లో వివరించలేకపోయారు. అంటే అవి కలుస్తాయి మరియు మిశ్రమమవుతాయి (మిక్స్‌ అవుతాయి), మరలా అదే సమయంలో ఆ రెండింటి మధ్య అడ్డు ఉంది. ఎలా? ఆధునిక సైన్స్‌ కనుగొన్నదేమిటంటే రెండు సముద్రాలు కలిసిన ప్రదేశాలలో వాటి మధ్య తెర ఉందని. ఈ తెర ఆ రెండింటిని ఎలా విభజిస్తుందంటే తనకు ఇరువైపులా ఉన్న సముద్రాలలో, ప్రతీదానికి దానికంటూ ఒక స్వంత ఉష్ణోగ్రత, ఉప్పదనం మరియు సాంద్రత ఉంటాయి. అంటే వాటి గుణాలలో మాత్రం తేడా అలాగే ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే సముద్రాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు పై ఖుర్‌ఆన్‌ వాక్యాన్ని బాగా వివరించగలరు. కనిపించని ఓ ఏటవాలు నీటి తెర రెండు సముధ్రాల మధ్య ఉండి, దాని గుండా నీరు ఒకవైపు నుండి మరోవైపుకు వెళుతుంది. అంటే రెండూ కలిసిన తర్వాత మిక్స్‌ అవుతున్నాయి కాబట్టి వాడిన అరబీ పదం ‘మరజ’ సరిపోయింది. కాని ఒక సముద్రం నుండి నీరు, మరో సముద్రంలోనికి ప్రవేశించగానే, ఆ నీరు తనకు అంతకుముందున్న స్పష్టమైన గుణాలను కోల్పోయి, తను ఏ సముద్రపు నీటిలో ప్రవేశించిందో ఆ నీటియొక్క గుణాలను పొందుతుంది. ఈ విధంగా ఇక్కడ తెర ఒక సముద్రపు నీరు మరో సముద్రపు నీటిలోకి మారి అచ్చటి సమరూపాన్ని పొందేలా చేస్తుంది. ఇలా రెండూ కలిసి మిశ్రమం జరిగినా రెండు సముద్రాల గుణాలు మారకుండా తెరకు అటు, ఇటూ విభజించబడే ఉన్నాయి. కాబట్టి 55:19,20 వాక్యాలలో వాడిన ‘బర్‌జఖ్‌’ పదం కూడా కరెక్టుగా సరిపోయింది.
ఖుర్‌ఆన్‌లో చెప్పబడ్డ ఈ శాస్త్రీయ దృగ్విషయాన్ని డా: విలియమ్‌ హే కూడా ధృవీకరించడం జరిగింది. ఇతను సముథ్రాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్త మరియు అమెరికాలోని కోలరెడో యూనివర్సిటీలో జిలాజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌. ఈ దృగ్విషయాన్నే క్రింద వాక్యంలో కూడా ఖుర్‌ఆన్‌ చెబుతుంది.

”…రెండు రకాల జలధుల మధ్య అడ్డు తెరలను పెట్టినవాడు ఎవడు?…”(దివ్యఖుర్‌ఆన్‌-27: 61)
గిబ్రాల్‌టర్‌ వద్ద మెడిటెర్రేనియన్‌్‌ మరియు అట్లాంటిక్‌ మహా సముద్రం మధ్య ఉన్న తెరతో పాటుగా ఈ దృగ్విషయం చాలా చోట్ల సంభవించింది (పటంలో చూడండి).
కాని ఇదే తెర మంచి నీరు, ఉప్పు నీటి మధ్య ఉన్నప్పుడు ఈ తెరతో నిషేధంతో కూడిన విభజన విషయాన్ని ఖుర్‌ఆన్‌ చెబుతుంది.
”రెండు రకాల నీటిని కలిపి ఉంచినవాడు ఆయనే. ఒకటేమో రుచికరమైనది, మధురమైనదీను. రెండోది చేదైనది, ఉప్పైనదీను. ఈ రెండింటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలిసిపోకుండా ఆపి ఉంచే అవరోధం”. (దివ్యఖుర్‌ఆన్‌-25: 53)

రెండు సముద్రాల విషయంలో అయితే కలిపే అవరోధం, మరి ఇక్కడ కలిసిపోకుండా అవరోధం.ఎచురీస్‌ (నదీ, సముద్రాలు కలిసే ప్రదేశం)లలో మధురమైన నీరు మరియు ఉప్పు నీరు కలిసినప్పుడు, ఆ పరిస్థితి రెండు సముద్రాలు కలిసే చోట ఉన్న పరిస్థితికి కొంత భిన్నంగా ఉంటుందని ఆధునిక సైన్స్‌ కనుగొంది. ఈ ఎచురీలలో మంచి నీరు, ఉప్పునీటిని వేరుచేసేదేమిటో కనుగొన్నారు. అదే ‘పైక్నోక్లైన్‌’ జోన్‌. ఇది రెండు రకాల నీటిని వేరు చేస్తుంది. ఈ జోన్‌కి మరియు దీనిని ఆనుకుని ఉన్న నీటికి మధ్య సాంద్రతలో స్పష్టమైన వ్యత్యాసముంటుంది.
ఈజిప్టుతో సహా ఈ దృగ్విషయం చాలా చోట్ల సంభవించింది. ఈజిప్టులో నైలు నది ‘మెడిటెర్రేనియన్‌’ సముద్రంలో కలిసే చోట ఈ విషయాన్ని గమనించవచ్చు. మెడిటెర్రేనియన్‌ సముద్రం అంటే ఆఫ్రికా ఖండాన్ని యూరప్‌ ఖండం నుండి వేరు చేసే సముద్రం.
మహా సాగరాలలోతులలో చీకటి

ప్రొఫెసర్‌ దుర్గారావు ‘మెరైన్‌ జియాలజీ’ (సముద్రాలకీ, భూవిజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం) సబ్జక్టులో అనుభవజ్ఞుడు. ఇతను ‘జెద్దా’లోని కొంగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ యూనివర్సిటీలో ప్రోఫెసర్‌. ఈ క్రింది వాక్యంపై ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవలసిందిగా అడిగారు.
”లేదా (వారి కర్మలకు) ఒక లోతైన సముద్రంలోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు. దాని (ఆ చీకటి)పై ఒక అల వ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల, దానిపై మేఘం. చీకటిపై చీకటి. మనిషి తన చేతిని బయటకు సాచితే, దానిని కూడా చూడలేడు. ఎవరికి అల్లాహ్‌ా తన వెలుగును ప్రసాదించడో, అతనికి మరే వెలుగూ లేదు”. (దివ్యఖుర్‌ఆన్‌-24:40)

ఆధునిక పరికరాల సహాయంతో మహా సముద్రాలలోతులో ఉన్న చీకటిని ఇటీవల కాలంలో మాత్రమే దృవీకరించడం సాధ్యమైనదన్న విషయాన్ని ప్రొఫెసర్‌ దుర్గారావు చెప్పారు. ఎటువంటి సహాయం తీసుకోకుండా నీటిలో మునిగి, 20 నుండి 30 మీటర్ల లోతు దాటి, మానవుడు ఉండలేడు. మహా సాగరాలలో 200 మీటర్ల లోతులో మనిషి బ్రతకలేడు.పై ఖుర్‌ఆన్‌ వాక్యం అన్ని సముద్రాల కోసం కాదు. ఎందుకంటే అన్ని సముద్రాలు ఒకదానిపై మరొక పొరగా చీకటి ఉంటుందని వర్ణించలేము. ఇది ప్రత్యేకంగా మహా సాగారాల లోతులకు సంబంధించినది మాత్రమే. మహాసాగరం లోతులో ఇలా చికటి పొరల కారణం క్రింద చెప్పిన రెండు విషయాల వలన.

1) కాంతి కిరణం ఏడు రంగుల సమ్మేళనం. ఈ ఏడు రంగులు ఊదా (violet), ఇండిగో (indigo), నీలం (blue), పచ్చ (green), పసుపు (yellow), ఆరంజ్‌ (orange), మరియు ఎరుపు (red). వీటిని vibgyor అని కూడా అంటారు. ఈ కాంతి కిరణం నీటిని తాకగానే వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం అంటే కొంత కోణంలో కాంతి వంగి ప్రయాణిస్తుంది. పై పది లేదా 15 మీటర్ల లోతులో నీరు ఎరుపు కాంతిని పీల్చుకుంటుంది. కాబట్టి ఈతగాడికి 25 మీటర్ల క్రింద తన శరీరానికి గాయం అయితే, తన రక్తాన్ని తను చూసుకోలేడన్న మాట. ఎమదుకంటే ఎరుపు రంగు ఆ లోతుకు చేరదు. ఎరుపు రంగు వస్తువేది అక్కడ కన్పించదు. ఇదే విధంగా 30 నుండి 50 మీటర్ల లోతులో పచ్చ, చివరకు 200 మిటర్ల లోపు నీలం, 200 మీటర్ల తర్వాత ఊదా, ఇండిగో
రంగులు పీల్చబడతాయి. ఈ విధంగా వరుసగా ఒక్కొక్క రంగు కనిపించకపోవడం వలన, ఒక పొర తర్వాత మరొకటిగా, సాగరం చీకటి అయిపోతూ ఉంటుంది. అంటే కాంతి పొరలలో చీకటి ఏర్పడుతుంది. 1000 మీటర్ల లోతు దాటితే పూర్తిగా చీకటే.

2) సూర్య కిరణాలు మేఘాలచే పీల్చబడి, తరువాత కాంతి కిరణాలను చెల్లాచెదురుగా విసరడం వలన మేఘాల క్రింద చీకటి పొర ఏర్పడుతుంది. ఇది చీకటికి సంబంధిమచిన మొదటి పొర. సాగర ఉపరితలాన్ని కాంతి కిరణాలు తాకినప్పుడు, కెరటం యొక్క ఉపరితలంచే కాంతి పరావర్తనం చెందబడటం వలన కెరటం ఉపరితలం మెరుస్తూ కనిపిస్తుంది. కాబట్టి కెరటాలు కాంతిని పరావర్తనం చేస్తూ చీకటికి కారణమవుతున్నాయి. పరావర్తనం చెందని కాంతి మాత్రం సాగరం లోపలికి చొచ్చుకుపోతుంది. కాబట్టి సాగరం రెండు భాగాలు కలిగి ఉంటుంది. పై ఉపరితల భాగం సహజంగా వెలుగుతో, వెచ్చగా ఉంటుంది. లోతైన భాగం చీకటి లక్షణాన్ని కలిగి ఉంటుంది.

అంతే కాకుండా ఈ ఉపరితలం కెరటాల వలన లోతు భాగం నుండి వేరు చేయబడుతుంది. లోతులో ఉన్న నీటిని అంతర (లోపలి) కెరటాలు కప్పుతాయి. ఎందుకంటే లోతుగా ఉన్న నీటి యొక్క సాంద్రత, పైన ఉన్న నీటి సాంద్రతకంటే ఎక్కువ. చీకటి ఈ అంతర కెరటాల క్రింద నుండి ప్రారంభమవుతుంది. చేప సహితం బాగా లోతులో చూడలేదు. దానికున్న ఏకైక వెలుగుకు మూలం దాని దేహమే.
ఖుర్‌ఆన్‌ ఖచ్చితంగా చెబుతుంది. ”లోతైన సముద్రంలోని చీకటిపై ఒక అల వ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల”
మరొలా చెప్పాలంటే ఈ కెరటాలపైన చాలా రకాల కెరటాలున్నాయి. అంటే అవి సాగరం పైభాగాన కనిపిస్తాయి. ఖుర్‌ఆన్‌ వాక్యం ఇంకను ఇలా చెబుతుంది: ”దానిపై మోఘం. చీకటిపై చీకటి”.

ముందు వివరించినట్లు ఈ మేఘాలే ఒకదానిపై మరొకటిగా ఉండే తెరలు. వివిధ లోతులలో రంగులను పీల్చుకోవడం ద్వారా మరింత చీకటికి కారణమవుతున్నాయి.
”1400 సంవత్సరాల క్రితం ఓ సామాన్య వ్యక్తి ఈ దృగ్విషయాన్ని ఇంత స్పష్టంగా వివరించలేడు. కాబట్టి ఈ వివరాలు ఖచ్చితంగా ప్రకృతికి అతీతమైన మూలం నుండి వచ్చి ఉండాలి” అని చెబుతూ ప్రొఫెసర్‌ రావు ముగించారు.

Related Post