Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మన సమస్యలు తీరాలంటే…1

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అంతిమ దైవ ప్రవక్త ప్రభవించిన నాటికి లోకంలో అక్కడక్కడా సత్య కాంతి మిణుకుమిణుకుమని కానవచ్చినా అధికాంశం అంధకారమయం.  జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢ నమ్మకాల దొంతరలు, సామాజిక అవగాహనకు సూత్రం; ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధి కారం” అన్నది. సమాజం తరగతుల్లో విభా జితం: పాలకులు, స్వాములు, నాయకులు. కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు అధ మాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రాధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడా కడపటి స్థానం. ఆ చీకటి ఎడారి లో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతున్నాయి. ఆ పుష్పరాజం  నోట వెలవడిన సూత్రం: ”ఖూలూ లాఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్‌లిహూ” – మీరు అల్లాహ్  తప్ప ఆరాధ్యులు ఎవరు లేరు అన్న పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధితో స్వీకరించండి, ఇహపర సాఫ ల్యాలు మీ చిరునామ తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి. మీ సకల సమస్య లు తీరతాయి.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అంతిమ దైవ ప్రవక్త ప్రభవించిన నాటికి లోకంలో అక్కడక్కడా సత్య కాంతి మిణుకుమిణుకుమని కానవచ్చినా అధికాంశం అంధకారమయం. జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢ నమ్మకాల దొంతరలు, సామాజిక అవగాహనకు సూత్రం; ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధి కారం” అన్నది. సమాజం తరగతుల్లో విభా జితం: పాలకులు, స్వాములు, నాయకులు. కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు అధ మాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రాధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడా కడపటి స్థానం. ఆ చీకటి ఎడారి లో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతున్నాయి. ఆ పుష్పరాజం నోట వెలవడిన సూత్రం: ”ఖూలూ లాఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్‌లిహూ” – మీరు అల్లాహ్ తప్ప ఆరాధ్యులు ఎవరు లేరు అన్న పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధితో స్వీకరించండి, ఇహపర సాఫ ల్యాలు మీ చిరునామ తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి. మీ సకల సమస్య లు తీరతాయి.

 

మన -మానవ జీవితానికి సంబంధించిన సమస్యలు అనేకం. కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలిక సమస్యలతోపాటు విద్యా బుద్ధులు, సంఘం, సంస్కృతి, యుద్ధం, సంధి సమస్యలు; ధన, మాన. పాణ్ర రక్షణకు సంబంధించిన సమస్యలు…ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. మనిషికి ఎదురయి ఉన్న ఈ సమస్యల పరిధి ఒక్కోసారి వ్యక్తికి పరిమిత మయితే, ఒక్కోసారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి విస్తరించి ఉంటాయి. సమస్యలు అవి ఏ రంగంతో ముడి పడి ఉన్నా వాటిని మూడు శీర్షికల్లో విభజించవచ్చు. 1) సిద్ధాంతాలు. 2) సామాజిక సంబంధాలు. 3) చట్టం. మనం, మన నిజదైవాన్ని గహ్రించి, ఆయన ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటే ఈ మూడు శీర్షికల్లో విభజితమయి ఉన్న మానవ సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న పశ్న్రకు సమాధానమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం!

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అంతిమ దైవ ప్రవక్త ప్రభవించిన నాటికి లోకంలో అక్కడక్కడా సత్య కాంతి మిణుకుమిణుకుమని కానవచ్చినా అధికాంశం అంధకారమయం. జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢ నమ్మకాల దొంతరలు, సామాజిక అవగాహ నకు సూత్రం; ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధి కారం” అన్నది. సమాజం తరగతుల్లో విభా జితం: పాలకులు, స్వాములు, నాయకులు. కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు అధ మాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రాధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడా కడపటి స్థానం. ఆ చీకటి ఎడారి లో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతున్నాయి. ఆ పుష్పరాజం నోట వెలవడిన సూత్రం: ”ఖూలూ లాఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్‌లిహూ” – మీరు అల్లాహ్ తప్ప ఆరాధ్యులు ఎవరు లేరు అన్న పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధితో స్వీకరించండి, ఇహపర సాఫ ల్యాలు మీ చిరునామ తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి. మీ సకల సమస్య లు తీరతాయి. ఏ సద్వచన కారణంగా సకల సమస్యలు తీరతాయని ప్రవక్త (స) జమానతు ఇచ్చారో ఆ సద్వచనం గురించి సర్వేశ్వరు డయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో”.ఏమిటి, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ అని నోటితో ఉచ్చరించడం వల్ల, మనసుతో అంగీకరించడం వల్ల, అది విధించే పరిధులకు లోబడి జీవించడం వల్ల మానవ – మన సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న తదితర విష యాలను తెలుసుకుందాం!
1) సిద్ధాంతాలు: మనిషి పుట్టగానే ఒక ప్రత్యేక వాతావరణాన్ని గమనిస్తాడు. ఇక్కడ సూర్య చంద్రాదుల ఉదయం, అస్తమయం జరుతున్న ది. పగలు వస్తుంది, రేయి పోతుంది. నింగిలో ని తారకలు తళుక్కునమెరుస్తాయి, పుసుక్కున మాయమైపోతాయి. నేల సస్యశ్యామలంగా కళకళలాడుతుంది. ఎండి వెలవెలబోతుంది. నీరు యేరయి గలగల పారుతుంది, ఎండి పోతుంది కూడా. సృష్టిలో నిరంతరం జరిగే ఈ మార్పులు ఇట్టే దాటి పోవు.మనిషి దేహం పైనే కాకుండా ఆత్మపైనా, ఆలోచనపైన సయి తం ప్రభావం చూపుతాయి. ఉదయం ఉపాధి ఆధారమయితే, రాత్రి విశ్రాంతికి మూలం. మనిషి చుట్టూ జరిగే ఈ మార్పులు అతనికి సంతోషాన్ని, సుఖాన్నీ ఇస్తాయి. దుఃఖానికి, కష్టానికీ గురి చేస్తాయి. వీటి ద్వారా మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు, అనారోగ్యం పాలూ అవుతాడు. ఒక్కోసారి అతనికనిపిస్తుంది – తన ఆదేశం, అధికారం, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు – చివరికి తన దేహం మీద సయితం లేదు అని. ఈ భావన కలగగానే ప్రపంచంలో తనకి లాభనష్టాన్ని కలుగజేసే ప్రతి వస్తువు అతన్ని భయపెట్ట సాగింది. ఫలితంగా మనిషి అవనిని పూజించడం ప్రారంభిం చాడు, అందులో ఎనలేని నిధులూ నిక్షేపాలు ఉన్నాయని. ఆకాశాన్ని దేవతగా భావించాడు, అది వరాల జల్లు కురిపిస్తుందని. పర్వతాల ముందు తల వంచాడు, అవి తనకన్నా ఎంతో ఎత్తయిన వనీ. సముద్రాలంటే ఆపాద మస్తకం వణకిపోయాడు, దాని పొగరుమోతు (సునామీ లాంటి) కెరటాలు తనను నాశనం చెస్తాయోమోననీ. ఇలా అండం మొదలు బ్రంహ్మాండం వరకు – అన్నింటి ని పూజించడం, గులామ్‌గిరీ చేయనారంభించాడు. దేవుడున్నాడని నమ్ముతూనే పుణ్య పురుషుల ను, సంఘసంస్కర్తలను దైవానికి సాటి చేసి కొలవనారంభించాడు. మనిషిగా పుట్టించి సృష్టిరాసు ల్లోనే శ్రేష్ఠ స్థానాన్ని దేవుడు తనకిస్తే, తన అసమర్థతతో అధఃపాతాళానికి దిగజారాడు మనిషి. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా అభివర్ణిస్తుంది:”నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమయిన ఆకృతిలో సృజించాము. అటుపిమ్మట అతన్ని (అతని నిర్వాకాలకు బదులుగా) అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము”. (అత్తీన్‌: 4,5)

అతనిలో చోటు చేసుకున్న భయాలన్నీ అతను మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే ఒక్క సత్యంతో పటాపంచలు కాగలవు. కానీ, అతను ఆ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే, ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నది ఒకే ఒక్క సృష్టికర్త అని, విశ్వం మొత్తం ఆ నిజ స్వామికే తలొగ్గి మనుగడ కొనసాగిస్తుందని తెలుసుకునేవాడు. ఆ ఒక్క నిజ అధికారికి మాత్రమే భయ పడేవాడు. ఆ సత్య ప్రభువు పట్ల వాస్తవమయిన భక్తి అతన్ని సకల భయాల నుండి ముక్తి కలిగిం చేది. ఆ కృపాసాగరుని దాస్యం సకల దాస్య శృంఖలాలను త్రెంచేసేది. జ్ఞానోదయం కలిగిన అతను గొంతెత్తి ఇలా చాటేవాడు: నేను నింగిలో మెరిసే తారకల్ని చూశాను. అవి కొంత కాలం ఉంటాయి తర్వాత నిష్క్రమిస్తాయి. నేను పండు వెన్నెల్ని పంచే ప్రకాశమనయిన చంద్రుణ్ణి చూశాను. అదీ కనుమరుగవుతుంది. నేను బ్రహ్మాండంగా వెలిగిపోతున్న సూర్యున్ని చూశాను, అదీ ఓ సమయం తర్వాత అస్తమిస్తుంది. ఇలా ఒక సమయం నుండి మరో సమయం వరకూ వచ్చీపో యేవేవి దైవం కాలేవు, వాటిని నియామనుగుణంగా నడిపిస్తున్న ఆ సర్వశక్తిమంతుడే నా ఉపా సనారీతులన్నింటికీ అర్హుడు.
”నిశ్చయంగా నేను భూమి, ఆకాశాలను పుట్టించివాని వైపునకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పు కుంటున్నాను. నేను బహుదైవరాధకుల్లోని వాడను కాను”. (అన్‌ఆమ్‌: 79)
అంటే, మనిషిలోని మతపరమయిన, విశ్వాసపరమయిన భ్రమ, భ్రాంతులన్నింటినీ ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు – అన్న సద్వచనం తొలగించి, అత నికి క్రాంత దృష్టిని, శాంత స్వభావాన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మతపరమయిన సకల రుగ్మతలకు, దురాచారాలకు, నూతన పోకడలకు విరుగుడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘!
ఇదో మానవ జీవితానికి సంబంధించిన కోణమయితే, మరో కోణంలో మనిషి సృష్టిలో జరిగే ఈ మార్పుల గురించి తెలుసుకున్నాడు. ఏదో అదృశ్య శక్తి ఆదేశం మేరకు నిప్పు మండుతుందని, నీరు ప్రవహిస్తుందనీ, నేల ధాన్యం పండిస్తుందనీ,, సుభిక్షమయినా, దుర్భిక్షమయినా, కలిమి అయినా, లేమి అయినా, జననం అయినా, మరణం అయినా ప్రతిదీ ఆ అదృశ్య శక్తి ఆజ్ఞకే కట్టు బడి ఉన్నాయని గ్రహించాడు. మనిషిలో పరిశోధించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది, అతని అన్వేషణ మొదలయింది. ఆ శక్తి ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పరితపించాడు. ఆ శక్తిని తాను చూడలేడుగాని ఆ విశ్వకర్త శక్తి సంబంధించిన నిదర్శనాలు అడుగడుగునా దర్శ నమిస్తున్నాయి. మనిషి తనకున్న పరిమిత జ్ఞానంతోనే తర్కించడం మొదలెట్టాడు – నా కళ్లకు కనబడని, నా వీనులకు వినబడని, నా పంచేంద్రియాల పరిధిలోకి రాని ఒక వస్తువును నేనెందు కు నమ్మాలి. పురోగమానికి బదులు తిరోగమం చోటు చేసుకుంది. ఈ విశ్వంలో ఎవరి పరిపా లన సాగుతుందో తెలియనప్పుడు ఆ శక్తిని అంగీకరించి ప్రయోజనం ఏమిటి? అతను గ్రహిం చాడు; విశ్వంలో కొన్ని సాధనాలు కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి. నిప్పు కాల్చుతుంది. నీరు వల్ల మొక్కల్లో ప్రాణం వస్తుంది. విషం మనిషిని చంపుతుంది. అమృతం మనిషిని బ్రతికిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అతనో నిర్ణయానికి వచ్చాడు. తాను ఒక ప్రత్యేక వాతావరణంలో జీవిస్తున్నాడు. ఇక్కడ అతనికి ప్రతికూలంగా, అనుకూలంగా కొన్ని శక్తులు బలంగా పని చేస్తున్నాయి. అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ అనుకూల శక్తుల వల్ల ప్రయోజనం పొందడం ఎలా? ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవడం ఎలా? అన్నదే అతని ఆలోచన, అన్వేషణకు అంతిమ గమ్యంగా నిలిచింది. తాను జరిపిన పరిశోధనా మత్తులో అతను ఆ విశ్వకర్తనే నిందించాడు. ఆయనకే పోలికలు కల్పించే దుస్సాహసం చేశాడు. ఇదే విషయాన్ని సర్వేశ్వరుడయిన అల్లాహ్‌ ఇలా తెలియజేస్తున్నాడు: ”వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కానీ (మరోవైపు) తన పుట్టుకనే మరచి పోయాడు. ‘కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు (రా) బ్రతికిస్తాడు?’ అని (మాకే) సవాలు విసురుతున్నాడు. (ఇలా) చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (మలిసారి) కూడా బ్రతికిస్తాడు”. (యాసీన్‌: 78,79)

తన పుట్టుక ఎందు నిమిత్తం జరిగింది? తనెందుకు ఈ లోకంలో ఉన్నాడు? జీవిత గడువు ముగిశాక చచ్చి తాను ఎక్కడి వెళ తాడు? తాను చేసుకున్న పాపపుణ్యాల పర్య వసానం ఏమిటి? నిరాఘాటంగా, నిర్విఘ్నం గా, నిరంతరాయంగా ఓ కట్టుదిట్టమయిన నియమానికి లోబడి నడుస్తున్న ఈ విశ్వ వ్యవస్థ చివరికి ఏమవుతుంది? వీటి గురించి అతను అస్సలు ఆలోచించ లేదు. ఫలితం – నిజ దైవ జ్ఞానం లేని భక్తి మానవ సమాజం పాలిట ప్రమాదంగా మారినట్టే, వాస్తవదైవం పట్ల భక్తి లేని విజ్ఞానం వినాశకాలకు కారణ భూతమయింది. అదే అతను ఈ సృష్టికి కర్త ఉన్నాడు, అతను ఒక్కడే అన్న యదార్థా న్ని అంగీకరించి ఉంటే నేడు అతను వైజ్ఞాని కంగా గొప్ప విజయాల్ని సాధించి కూడా పరిష్కరించుకోలేకపోతున్న అనేకానేక సమ స్యలు ఇట్టే సులభంగా పరిష్కారం అయ్యేవి. అంటే దైవాన్ని విశ్వసించడంతోపాటు అనేక శక్తుల్లో విశ్వాసం గలవారు, విగ్రహారాధ కులు సృష్టి పూజారులు ‘లా ఇలాహ’అంటూ సృష్టికర్త వ్యవహారంలో సృష్టిరాసుల జోక్యాన్ని నిరాకరించాలి. ఈ సృష్టికి కర్త అనేవాడే లేడు, ఉన్నా ఆతన్ని నమ్మడం వల్ల ప్రయోజ నం లేదు అని అనుకునేవారు ‘ఇల్లల్లాహ్ ‘ ఒక్క అల్లాహ్ మాత్రమే ఈ సృష్టి మొత్తాన్ని నియమబద్ధంగా నడుపుతున్నాడన్న యదార్థా న్ని అంగీకరించాలి. ‘లా ఇలాహ’ అన్న అనంగీకారం, ‘ఇల్లల్లాహ్ ‘ అన్న అంగీకారం తో మానవాళి సైద్ధాంతిక పరమయిన, మత పరమయిన దొంతరలు, ద్వంద ప్రమా ణాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే నేప థ్యంలో దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) మాన వాళిని ‘ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూ’ అని ఘంటాపథంగా పిలుపుని చ్చారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకరండి ఓ ప్రజలారా! ఇహపరాల సాఫల్యం మీ సొంతమవుతుంది.

(మానవులందరిని దేవుడు ఒకే జాతిగా అభి వర్ణించినప్పుడు మనుషుల మధ్య ఈ భేదభా వాలు, వర్గాలు, వర్ణాలు, కులాలు, అంట రానితనాలు, అస్పృశ్యతలు ఎందుకున్నట్టు? ఈ సామాజిక అసమానతకు అసలు కారణం ఏమిటి? ఇవి ఇటువంటి ఇతర అనేక ప్రశ్న లకు జవాబు కావాలంటే కాస్త వేయిట్‌ చేయాల్సిందే!)

Related Post