Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మన సమస్యలు తీరాలంటే…. 2

‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ను త్రికరణశుద్ధి తో విశ్వసించిన తర్వాత మనిషిలో బూటకపు కీర్తిప్రతిష్టల భేదభావాలు తలెత్తవు. ఒకే దేవుని దాసులం అన్న అత్యుత్తమ భావన, యజమాని- కార్మికులను, పాలితుల-పాలకులను, రాజు-పేద ను ఒకే వరుసలో నిష్ఠగా నిలబడేలా తీర్చిదిద్దు తుంది. మానవులందరినీ సోదరులుగా ఎంచే ఏ సిద్ధాంతమూ ఇస్లాంను మినహా లేదు. అందు వల్లనే ఇస్లాం వైపునకు దృష్టి మరలినప్పుడు మరో వైపు చూసే అవసరం ఏర్పడు.

‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ను త్రికరణశుద్ధి తో విశ్వసించిన తర్వాత మనిషిలో బూటకపు కీర్తిప్రతిష్టల భేదభావాలు తలెత్తవు. ఒకే దేవుని దాసులం అన్న అత్యుత్తమ భావన, యజమాని- కార్మికులను, పాలితుల-పాలకులను, రాజు-పేద ను ఒకే వరుసలో నిష్ఠగా నిలబడేలా తీర్చిదిద్దు తుంది. మానవులందరినీ సోదరులుగా ఎంచే ఏ సిద్ధాంతమూ ఇస్లాంను మినహా లేదు. అందు వల్లనే ఇస్లాం వైపునకు దృష్టి మరలినప్పుడు మరో వైపు చూసే అవసరం ఏర్పడు.

ఓ ప్రజలారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గల వాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్ర మత్తుడు. (దివ్యఖురాన్ – 49: 13)
ఈ వచనంలో దేవుడు మానవులంతా ఒక్కటే అనే సమగ్ర భావనను బోధిస్తున్నాడు.అయినా, వారిని పరస్పర ఘర్షణకు, పోరుకు పురికొలిపే విషయ మేమిటి? సమాధానమొక్కటే, దేవుడు మనిషికి బోధించిన విశాల దృక్పథాన్ని వదలి తన చుట్టు చిన్న చిన్న గీతలు గీసుకుని ఆ గీతల పరిధిలో ఉన్న వాళ్ళనే తన వాళ్ళుగా భావించసాగాడు. ఈ భావన ఒక్కోసారి వంశం వరకు, ఒక్కోమారు భాష వరకు, ఒక్కోసారి జాతి వరకు వెళ్ళేది. అంతకు మించిన విశాలత దానికి లేదు. ఆ విధంగా పరిమిత స్థాయిలో – వంశం, భాష, జాతి మనుషులను సమైక్య పరచినప్పటికీ మాన వుని అవసరాలు, ప్రయోజనాలు బహు దూరాల వరకు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచమే ఒక గదిగా మారిపోయిన నేటి తరుణంలో ఈ ఎల్లలు ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. మా జాతే గొప్ప జాతి అని ఒక జాతీయ నాయకుడు, అంత ర్జాతీయ స్థాయికి చెందిన వ్యక్తి చెబుతున్నాడంటే, ఇతరుల్ని అతను ఏ దృష్టితో చూస్తున్నాడో ఇట్టే అర్థమయిపోతుంది.
ఈ భావన కారణంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి జాతి భక్తిప్రపత్తుల, ప్రేమాభిమానాల పరిధి, మూర్తి వేర్వేరుగా ఉంటుంది. వారు తమ పరిధిని సమర్థించుకోవటానికి ఇతరుల్ని నిందిస్తారు, ఖండిస్తారు, కించ పరుస్తారు, అవసమైతే నిర్బం ధిస్తారు, బహిహ్కరిస్తారు, మరీ అవసరమను కుంటే తుదముట్టించేందుకు సయితం వెను కాడరు. ఆసియాకు చెందిన వాడు యూరప్‌ పట్ల వైషమ్యం ఏర్పరచుకుంటాడు. ఓ దేశంలో మరో దేశానికి స్థానం లేదు. ఒక ప్రాంతానికి మరో ప్రాంతం అంటే గిట్టదు.
వర్గం, వర్ణం, జాతి, ప్రాంతం, రంగు మొౖదల యిన ఈ వ్యత్యాసాలన్నింటికి పరిష్కారంగా విశ్వ మానవ సోదర భావం ముందుకొస్తుంది. అంటే జాతులన్నీ తమ సమిష్టి ప్రయోజనాల కొరకు పాక్షికాలను ప్రక్కన పెట్టి సమైక్యమయి పోవాలి. వాటి సాధనకు కృషి చేయాలి. తాము ప్రశాంతం గా జీవించాలి. ఇతరుల్ని ప్రశాంతంగా జీవించ నివ్వాలి. అయితే మనిషి ఏర్పరచుకున్న క్రియా జీవితం దీన్ని సమర్థించదు. మనిషి ప్రయోజనా లు అతని సిద్ధాంతాలకు లోబడి ఉంటాయి. మనిషి, యుద్ధం, సంధి, స్నేహం, శత్రుత్వం అన్నీ వ్యవహారాలు సిద్ధాంతాల ఆధారంగానే నెరుపు తాడు. సిద్ధాంతాల్లో వైవిధ్యం ఉంటే ప్రయోజ నాల్లో సమైక్యత సాధ్యం కాదు. కమ్యూనిజాన్ని నమ్మేవాడు పెట్టుబడి దారీతో సంధి ఒడంబడిక చేయడు. జాతి తత్వంలో నమ్మకమున్నవాడు విరోధ జాతి ప్రగతిని సహించడు. సుదీర్ఘ మానవ చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఈ భిన్నత్వం వల్ల మానవుల్లో సదా వివాదాలు, పోరాటాలే సాగాయి. అలాంటప్పుడు అదే వారి మధ్య ప్రేమానురాగాలకు మార్గం కావడం అసంభవం.
ఇక ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ అన్న భావన పై వచ నంలా మానవులంతా ఒక్కటే అని నిర్ణయిస్తుంది. అది మానవులందరికీ ఒకే ఆశయాన్నీ నిర్ధారిస్తుం ది. మానవులందరి కర్త, స్వామి, ఆరాధ్యుడు, పూజ్యనీయుడు ఒక్కడే అంటుంది. ఆయన భార తీయునికి వేరుగా, చైనీయునికి వేరుగా, రష్యన్‌కు వేరుగా, ఆమెరికన్లకు వేరుగా లక్ష్యాలు నిర్ణయించ లేదు అంటుంది. మానవుని సృష్టికర్త, భువిపై నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గాన్ని తన దాస్యం చేయమని కోరాడు. ఈ నిమిత్తమే ఆయన ప్రవ క్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజే శాడు. వారందరూ ప్రతిపాదించిన విషయం, మనమంతా ఒక్కటే అన్నది ఒకటయితే, ‘మనం దరి దైవం ఒక్కడే’ అన్నది మరోకటి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనల లోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి”.
(అర్రూమ్‌: 22)
”ఒక అరబ్బుకి అరబ్బేతరునిపైగానీ, ఒక నల్ల వాడికి తెల్లవాడిపైగానీ ఎటువంటి ఆధిక్యతా లేదు; దైవభీతితో తప్ప. మీరందరూ ఆదం సంతానమే. ఆదమ్‌ను దేవుడు మట్టితో పుట్టిం చాడు” అని దైవప్రవక్త (స) అంతిమ హజ్జ్‌ సందర్భంగా ప్రకటించారు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘కు ఇంతటి మహత్తర శక్తి ఉందా? అంటే దానికి ప్రబల నిదర్శనం నమాజే.
ఇకపోతే, ఈ సద్వచన భావమేమంటే, ‘అల్లాహ్ తప్ప వేరే ఏ ఇతర ఆరాధ్య దైవం లేదు’.కలిమా లో ఏముంది? కొన్ని అక్షరాలు మాత్రమే కదా! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ ఈ అక్షరాలను కలిపి ఉచ్చరిస్తే ఎమయినా మాయ జరుగుతుందా? మనిషి స్థితిగతులే మారిపోవడానికి? తాము చదివే మంత్రానికి భావమేమిటో తెలియకపో యినా, మంత్రం పఠించగానే కొండలు కంపిస్తా యనీ, భూమి బ్రద్ధలవుతుందనీ, సముద్రాలు ఉప్పొంగుతాయని కొందరయితే భావించగలరు. ఎందుకంటే, పవర్‌ అంతా అక్షరాల్లోనే ఉందని, అవి నోటి నుండి వెలువడగానే మాయా ద్వారా లు తెరుచుకుంటాయని వారి విశ్వాసం. కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడ అర్థానికి, అంతరాత్మ కు, ఆచరణకే ప్రాధాన్యత. చలి వేసిన వ్యక్తి ‘కంబళి, కంబళి’ ‘దూది పరుపు, దూది పరుపు’ అంటూ కూర్చుంటే ఎలాగయితే చలి బాధ తగ్గదో, సద్వచన విషయంలోనూ అంతే. మనిషి భావాలపై, ఆచరణలపై, తీర్పులపై ఈ సద్వచన ఆధిపత్యం చోటు చేసుకున్నప్పుడే లోక కళ్యాణం సాధ్యం. ఈ సద్వచనాన్ని మనస్ఫూర్తిగా నమ్నిన వ్యక్తి నోట సదా ఈ మాట ఉంటుంది:
”ఆయనే నన్ను సృష్టించినవాడు. మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు మరియు త్రాపిస్తున్నాడు. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. ఆయనే నన్ను చంపుతాడు. మళ్ళి తిరిగి బ్రతికిస్తాడు. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకు ఉంది”. (అష్‌ షుఅరా: 78-82)
ఈ భావన మానవుల మధ్య కుల, వర్ణ, వర్గ, భాష, జాతి దురభిమానాలను అంతమొంది స్తుంది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ను త్రికరణ శుద్ధి తో విశ్వసించిన తర్వాత మనిషిలో బూటకపు కీర్తిప్రతిష్టల భేదభావాలు తలెత్తవు. ఒకే దేవుని దాసులం అన్న అత్యుత్తమ భావన, యజమాని- కార్మికులను, పాలితుల-పాలకులను, రాజు-పేద ను ఒకే వరుసలో నిష్ఠగా నిలబడేలా తీర్చిదిద్దు తుంది. మానవులందరినీ సోదరులుగా ఎంచే ఏ సిద్ధాంతమూ ఇస్లాంను మినహా లేదు. అందు వల్లనే ఇస్లాం వైపునకు దృష్టి మరలినప్పుడు మరో వైపు చూసే అవసరం ఏర్పడు. (సశేషం)

Related Post