మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి… ?

Originally posted 2016-05-15 19:38:24.

ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము ఎవరైతే మనల్ని పుట్టించాడో, ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ప్రాపంచిక సరదాలకోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు.

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు.

స్వీయపరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువూ తీసుకోడు.

ఉదాహరణకు:- బట్టల షాపుకు, లేదా చెప్పుల షాపుకు వెళ్ళి,
చూడకుండా, పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా… ?????
ఖచ్చితంగా అలా చేయరు. ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది.

అందుకే ఒక ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు
కాని ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయపరిశీలన చేయకుండా మన పూర్వీకుల పై, పండితులపై, పాస్తర్లపై, మౌల్వీలపై, గుడ్డిగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నారు. అందువల్ల మనం నిజ దేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్య దైవాలను ఆరాధిస్తూ … ఇదే మన సంస్కృతి అన్న భ్రమ లో ఉన్నాము.

         ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము ఎవరైతే మనల్ని పుట్టించాడో, ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ప్రాపంచిక సరదాలకోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు. 

సోదరులార! అందుకే ఆ సృష్టికర్త గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ సృష్టికర్తను అన్వేషించడానికి సమయాన్ని కేటాయించాలి.

ఇక రండి సోదరులారా … నిష్కల్మష మైన హృదయం తో ధార్మిక గ్రంధాల ను పరిశిలిద్దాం …..

నిజ దైవం ఒక్కడే, ఆయనకు ప్రతి రుపాలు లేవు, ఆయనకు పేర్లు అనేకం :- 

హిందూ ధర్మ గ్రంధాలను, బైబిల్ ను, మరియు ఖుర్ఆన్ గ్రంధాలను నిష్కల్మశ హృదయం తో క్షుణ్ణంగా పరిశీలిస్తే

వాస్తవానికి సర్వమానవాలి దేవుడు ఒక్కడే అని, ఆ నిజ దేవుణ్ణి వేరు వేరు భాషలలో వేరు వేరు పేర్ల తో పిలుస్తారు అని ,

ఆ దైవాన్ని తెలుగు బాషలో దేవుడు అని, సంస్కృతం లో సర్వేశ్వరుడు అని, ఇంగ్లీష్ బాషలో గాడ్ అని, హిబ్రు బాషలో యహోవా అని, ఆయననే అరబ్బి భాషలో “అల్లాహ్” అనిపిలుస్తారు అని స్పష్టం గా అర్ధం అవుతుంది.

అంతే కాని హిందూ ధర్మ గ్రంధాలు వేరే దేవుడు గురించి , బైబిల్ వేరే దేవుడు గురించి , మరియు ఖుర్ఆన్ వేరే దేవుడు గురించి చెప్పడం లేదు,

నిష్కల్మశ హృదయం తో పరిశీలిస్తే వాస్తవానికి నిజ దైవం అద్వితీయుడు, ఒక్కడే అని, ఆయనకు ప్రతి రుపాలు లేవు , ఆ నిజ దేవుణ్ణి పోలిన ప్రతిమ ఏది లేదు అని ఆయన సర్వోన్నతుడు, జనన మరణాలు లేని వాడు, కంటికి కనిపించే వాడు కాదు, ఊహలకు అతీతుడు, అని గ్రంధాలన్నీ బోధిస్తున్నాయి,

గ్రందావగాహన లేక పోవడం వల్ల నిజదేవున్ని విడిచి కల్పిత దైవాలను ఆరాధిస్తున్నారు.

వాస్తవానికి సర్వమానవాలి దేవుడు ఒక్కడే గ్రంధాలన్నీ బోధిస్తున్నాయి, కాని ప్రజలు గ్రందావగాహన లేక పోవడం వల్ల , గ్రుడ్డిగా పండితుల పై, పాస్టర్ ల పై, ముల్లాల పై ఆధారపడడం వల్ల నిజదేవున్ని విడిచి కల్పిత దైవాలను అంటే ఈ భూమి పై పుట్టి మరణించిన మానవులను, జంతూవులను, చెట్లను, పుట్టలను, మహానుభావులను, అవతార పురుషులను దర్గాలను, దైవ ప్రవక్తలను, సృష్టి రాశులను, చేతులతో చెక్కిన విగ్రహాలను, ఫోటో లను, ఊహించి గీసిన చిత్ర పటాలను ఆరాధిస్తున్నారు.

Related Post