Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

శతమానం భవతి!

వందేళ్ళ జీవించడం గొప్ప కాదు. మరణించాక కూడా వందల సంత్సరాల పాటు గుర్తు పెట్టుకో గలిగేంతటి  ఘన కార్యాలు చేసి మరణించడం గొప్ప. వ్యక్తి నుండి సంఘం వరకు, సమాజం నుండి దేశం వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు వర్తించే సూతం ఇది.

వందేళ్ళ జీవించడం గొప్ప కాదు. మరణించాక కూడా వందల సంత్సరాల పాటు గుర్తు పెట్టుకో గలిగేంతటి ఘన కార్యాలు చేసి మరణించడం గొప్ప. వ్యక్తి నుండి సంఘం వరకు, సమాజం నుండి దేశం వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు వర్తించే సూతం ఇది.

‘శతనిష్కో ధనాఢ్యశ్చ, శతగ్రామేణ భూపతి, శతాశ్వః క్షత్రియో  రాజ, శత శ్లోకేన పండిత’  అన్న మాట ఎలా ఉన్నా వంద అన్న సంఖ్యకు ఎనలేని ప్రాధాన్యతుంది. ఈ నేపథ్యంలోనే ‘నిండు నూరేళ్ళు బ్రతుకు – శతమానం భవతి’ అని దీవిస్తుాంరు పెద్దలు. క్రికెట్ మొదలు అన్ని రంగాల్లో సెంచరీకి ఉన్న  క్రేజ్ చెప్పనవసరం లేదు. ‘తరానికో వంద కవులు తయారవుతా రెప్పుడూ, వందలోనూ మందలోనూ మిగల గలిగేదొక్కడే’ అన్న ఆరుద్ర మాట ప్రకారం  వంద సంఖ్య విలువను పెంచినవారు కొందరయితే, వంద సంఖ్య పరువును మంట గలిపిన వారు  కొందరు. వందంటే సామాన్యంగా ఒక పూర్ణత్వానికి నికషగా భావించడం జరుగుతుంది. వందేళ్ళ జీవించడం గొప్ప కాదు. మరణించాక కూడా వందల సంత్సరాల పాటు గుర్తు పెట్టుకో గలిగేంతటి  ఘన కార్యాలు చేసి మరణించడం గొప్ప. వ్యక్తి నుండి సంఘం వరకు, సమాజం నుండి దేశం వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు వర్తించే సూతం ఇది.

  ధ్వనికంటే అయిడు  రెట్లు అధిక వేగంతో రోదసిలోకి దూసుకుపోయిన రాకెట్ తయారీతో గగనతలంలో మరో ఘన విజయన్ని సాధించిన మన భారత దేశం నిండు నూరేళ్ళ పగ్రతి పచ్చ తోరణాలతో, శాంతి సుస్థిరతలతో వర్థిల్లాలి. అందుగ్గాను వాతావరణ కాలుష్య నిర్మూలన ఎంత  అవసరమో దానికన్నా ఎక్కువ అవసరం ఉగ్ర వాద, అగ్రవాద కాలుష్య నిర్మూలన. నేడు పప్రపంచ వ్యాప్తంగా అత్యంత భయంకరమయిన సమస్య ఉగవ్రాదమే. ప్రపంచంలో ఎక్కడోక చోట, ఏదోక పైశాచిక చర్య కనబడుతూనే ఉంది. పప్రంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చి మన దేశంలో  ఉగవ్రాదానికి, అగవ్రాదానికి వత్తాసు పలికే వారికి చోటు లేదు.  ఈ విషపూరిత మనస్కుల్ని ముమ్మాటికి కూకటి  వేళ్ళతో పెకళించాల్సిన అవసరం ఉంది. ”ఎవరయితే దుర్మార్గుడి కి తోడ్పడానికి, బల పర్చడానికి అతను దుర్మార్గుడు అని తెలిసి కూడా అతనని పంచన చేరుతాడో అతను ధర్మం నుండి వెలికి పోయినట్లే” (బైహఖీ) అన్న మహనీయ ముహమ్మద్‌ (స) వారి మాట గమనార్హం!
 రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు, అనుభవజ్ఞులు, మేధావులు, మత పెద్దలు అందరూ కలిసి, అందరి కోసం-దేశ భధ్రత, దేశ సమగత్ర, దేశ శాంతి-సుస్థిరతల సంబంధించి గట్టి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. భవిష్యత్తులో నిన్న మొన్నటి  ఉగ్ర  చర్యల వంటివి  పునరావృత్త కాకుండా వివేచనతో వ్యవహరించాల్సి ఉంది. లక్షల మందికి విద్యాబుద్ధులు చెప్పే మదర్సాల మీద, మత  సంస్థల మీద అనుచిత వ్యాఖ్యలకు, కట్ ఆండ్ పేస్ట్  ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా దుష్కృతికి  తెర పడాలి. మైనార్టీల మధ్య ఏదొక సాకుతో చిచ్చుపెట్టి  పబ్బం గడుపుకోవాలనుకునే పాపిష్టి పొలిటీషియన్స్ శవ రాజకీయాలకు చర్మ గీతం పాడాలి.  తాము వందేళ్లు చల్లగా బ్రతకాలంటే దేశం చల్లగా ఉంటేనే అది సాధ్యం అన్న ఆత్మ సమీక్ష  అందరిలోనూ బయలు దేరాలి.  కాళ నాగు ఏ దేశంలో ఉన్నా, ఎవరిని కాటేసినా విషం ఎక్కే విధానం ఒకే రీతిన ఉంటుంది గనక తన, పర అన్న తరతమ భేదాలను ప్రక్కన బెట్టి ఇలాంటి  క్యాన్సర్‌ కారకాల్ని, కారకుల్ని ఓ పట్టు పట్టి  మట్టు పెట్టాల్సి  ఉంది.  అయితే ఒక ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద, అగ్రవాద దాడులకు ఒక విధంగా, మరో ప్రాంతంలో జరిగిన దాడులకు మరో విధంగా స్పందించడం అలవాటుగా మారితే ఉగ్రవాదాన్ని, అగ్రవాదాన్ని అంతం చెయ్యడం కష్ట సాధ్యమే!
 మనది ప్రజాస్వామ్య దేశం. సహనమూర్తులు, శాంతి కాముకులు భారతీయులు.125 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో అక్కడక్కడా అప్రజాస్వామ్య చర్యలు, క్రమ శిక్షణా రాహిత్య చేష్టలు, బాధ్యతా రాహిత్య వాఖ్యలు, అక్రమ  రాజకీయ వ్యవస్థలు, అసహన అవస్థలు ఉండొచ్చు గాక. ఎన్నున్నా అనుక్షణం దేశాభిమానం వెల్లివిరుస్తూ, దేశ ప్రగతిలో తాము పాలు పంచుకుంటామనే బృహత్తర ఆశ, ఆశయం కలిగి ఉన్నంత కాలం, మనం మన  దేశంలో ఉన్నా, పవ్రాస జీవితం గడుపుతున్నా దేశాభ్యుదయం, అభ్యున్నతి, సంక్షేమం, శాంతి సాధ్యమవుతుంది అనడంలో సందేహం లేదు. ‘దేశ సంక్షేమం కోసం మేము సమిధలవ్వడానికయినా  సిద్ధం’ అన్న ఆత్మసంకల్పం మనందరిలోనూ బల పడాలి. దేశమేదయినా సరే,  మనమెక్కడ ఉన్నా సరే ”ఎవరినయితే పజ్రలు తమ ధనప్రాణాలకు రక్షకునిగా భావిస్తారో అతనే విశ్వాసి” (తిర్మిజీ) అన్న పవ్రక్త (స) వారి మహితోక్తి స్ఫూర్తితో మానవత్వం కలిగి మనుగడ సాగించినట్లయితే  మన జీవితానికి సార్థకత చేకూరడంతోపాటు విశ్వమంతా వెలుగు పంచిన,ప్రేమామృతాలను పెంచిన, శాంతి సౌరభాలను వెదజల్లిన వారం కాగలం.
 వంద వసంతాలు కాదు, వేల వసంతాలు భారత దేశం శాంతి, పగ్రతితో వర్థిల్లాలని మనం చేసే పార్థ్రనల్లో, అన్నదాతలు, బీదా బిక్కీ, అర్థాంతరంగా ముగిసి పొతున్న ఆడ బతుకులను గుర్తు పెట్టుకోవాలి. పర సంస్కృతికి బానిసలయి స్వీయ-భారతీయ సంస్కృతిని గౌరవించ లేక పోతున్న పౌరుల్లో మార్పు తీసుకు వచ్చేందుకు కార్యపణ్రాళికను తయారు చెయ్యాల్సిన, కార్యరూపం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశాభిమానం గల పత్రి పౌరుడు తన వంతు కృషి ఆత్మ వంచన లేకుండా చేస్తారని భావిస్తూ, ఉగ్ర  రహిత దేశంగా భారత దేశం భాశిల్లుతుందన్న పగ్రాఢ నమ్మకంతో….జై హింద్‌!

Related Post