ఓ వైపు….శాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు విశ్వాంతరాలకు దూసుకెళుతుంటే, మరో వైపు… అందుకు భిన్నంగా మూఢ నమ్మకాల ప్రభావం అమాయక ప్రజల్ని అధః పాతాళానికి నెట్టుతున్నది. అంటరానితనంతోపాటు, ముందు మూడు తర్వాత నాలుగు, ఆ తర్వాత అయిదు అన్న వర్ణ వ్యవస్థ నేడు 2030 కులాలుగా, లక్షకు పైగా చిల్లర తెగలుగా జడలు విప్పి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. శ్రమ విభజన కోసం ఏర్పడిందనే వర్ణ వ్యస్థ కారణంగా నేడు 120 రూపాల్లో కుల వివక్ష దేశ వ్యాప్తంగా పాటించడం జరుగుతూ ఉంది. కులాలను బట్టి మనిషి సాంఘిక హోదాను గుర్తించే దయనీయ స్థితి దాపురించి ఉంది. దీనికి ఇస్లాం చూపే ప్రయత్యామ్నాయం ఏమిటో తెలుసుకుందాం!
చరిత్రలో ఏం జరిగింది?
వంశం, జాతి, భాష, వర్ణం అనేవి ఒక థలో మనిషికి మేలు చేసినవే అయి ఉండుగాక. కానీ మనిషిని మహా మనీషిగా మలిచే మార్గంలో అన్నింటి కన్నా పెద్ద అవరోధం మనుషుల మధ్య గల ఈ అసమానతే. ప్రపంచ జాతులు, ప్రపంచ మతాలు, ప్రపంచ భాషలు, ప్రపంచ దేశాలు ఇలా ఏదోక పేరుతో, ఏదోక స్థాయిలో మనిషీ-మనిషికి మధ్య ఈ అసమానతలకు ఊతమిచ్చినవే. అన్ని హంగులతో రంగు గుళికల్లా కనబడే ఈ వివకలు, అస్పృశ్యతలు, అంటరానితనాలు సదా మనిషికి కీడునే కలిగించాయి. ఘర్షణలకు, హింసకు కారణమయ్యాయి. కొన్ని సందర్భాలలోనైతే జాతి, కులం, వర్ణం, భాష, ప్రాంత వివక్షకు ప్రభు త్వాలు సయితం అండగా నిలవడం వల్ల సమస్య మరింత జఠిలంగా తయారయ్యేది. మానవ సమానత్వం గురించి మత పీష్వాలు చర్చించు కునే అనుమతి ఉండేది కాదు. అటువిం దుర్దయ, నిర్దయ స్థితిలో నిర్భయనిస్తూ తరుణోపాయంగా, ఆశాజ్యోతిగా ఆవిర్భవించింది ఇస్లాం.
సర్వ మానవాళికి ఇస్లాం పిలుపు:
అది ప్రజలను జాతి వైపునకో, భాష వైపునకో, వర్ణం, వర్గం, కులం వైపునకో ఆహ్వానించదు. వీటిలో ఏ ఒక్కటి మానవ జాతిని సమైక్య పర్చజాలదు అని సుదీర్ఘ మానవ చరిత్రే సాక్ష్యమిస్తుంది. కాబట్టి మానవ ఆంతర్యాల్లో ప్రకృతి సిద్ధంగా నిబిడీకృతమయి ఉన్న సహజ భావం- ‘నిజ ఆరాధ్యుడు ఒక్కడే’ అన్న అంశం వైపునకు ఆహ్వానిస్తుంది. పరమాణవుల లోకంలో చేయబడిన ‘అలస్తు ప్రమాణా’న్ని గుర్తు చేస్తుంది.ఓ దాన్నే సకల సమస్యలకు ఏకైక పరిష్కారంగా పేర్కొంటుంది. దాని పునాదిపైనే ఓ నవ సమాజాన్ని నిర్మించి మరి చూపింది.ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదారాఓతనికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కు ఆదరణీ యుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసివాడు, అప్రమత్తుడు”. (హుజురాత్: 13) ఈ చిరు వచనంలో విశ్వ జనులం దరినీ ఉద్దేశించి మూడు యదార్థాలను విశద పర్చడం జరిగింది.
1) మీరందరూ ఒకే పురుడు, ఒకే స్త్రీ ద్వారా ఉనికిలోకి వచ్చారు. ఆ విధంగా మీరంతా ఒకే కుటుంబ సభ్యులు. మీ అందరి మూలం ఒక స్త్రీ-హవ్వా, ఒక పురుడు-ఆదం(అ) మాత్రమే. మీ అందరి నిజ ఆరాధ్య దైవం కూడా ఒక్కడే. మీరందరూ ఒకే విధమయిన పదార్థంతో ప్టుారు. పుట్టుక రీత్యా ఎవరూ అధికులు, అల్పులు కారు. ప్రజలు వేర్వేరు ప్రాంతాలు, వేర్వే రంగులు, వేర్వేరు భాషలు కలిగిన వారయినా వారందరి మధ్య సమిష్టిగా ఉన్న విషయాలు నాలుగు. అ) వారందరి వంశావళి ఆది దంపతులయిన ఆదం మరియు హవ్వా (అ)లతో వెళ్ళి కలుస్తుంది. ఆ) వారందరి ఉనికికి మూల కారకుడు ఒక్కడే. ఇ) వారందరూ పుట్టిన పదార్థం ఒక్కటే. ఈ) వారందరి పుట్టుక ప్రక్రియ ఒక్కటే.
2) అల్లాహ్ వారిని వేర్వేరు వర్గాల్లో, వంశాల్లో పుట్టించాడు. పరస్పర అవగాహన కోసం. కేవలం తమ తల్లిదండ్రుల తరఫున మాత్రమే తమ వంశావళిని పేర్కొనాలి. తల్లిదండ్రులు కాని వారిని కన్నవారుగా పేర్కొనడంగానీ, వంశం కాని వంశాన్ని పేర్కొనడం గానీ సమంజసం కాదు. కేవలం గుర్తింపు కోసం మాత్రమే ఇలా చెయ్యడం జరిగింది తప్ప, సామాజిక వర్గం పేరు చెప్పుకొని బీరాలు పోయేందుకుగానీ, వంశం పేరు చెప్పుకుని ఆధిపత్యం చెలాయించేందుకుగానీ ఈ విభజన జరుగ లేదు. అంటే వంశ ప్రాతిపదికన, వర్గ ప్రాతిపదికన ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా భావించడాన్ని ఇస్లాం సుతరామూ సమ్మతించదు. ”ఓ ప్రజలారా! మీరందరి ప్రభువు ఒక్కడే, మీరందరి తండ్రి ఒక్కడే. మీరంతా ఆదం సంతానమే.మరి ఆదం (అ) మట్టితో పుట్టించ బడ్డాడు”. అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
3) మనిషీ-మనిషికి మధ్య ఒకరికి మరొకరిపై ఆధిక్యానికి కారణం ఏదయినా కాగలదంటే, అది కేవలం దైవభీతి మాత్రమే కాగలదు. అతని వ్యవహార శైలి కారణంగా ఏ వ్యక్తి అయినా సంస్కారిగా, కుసం స్కారిగా గుర్తించ బడతాడు. వ్యక్తి ఎవరయినా, ఏ సామాజిక వర్గానికి చెందినవాడయినా సరే అతనిలో గనక దైవభీతి మెండుగా ఉంటే అతనే గొప్పవాడు.
వర్ణ-వర్గ భేదాలు లేవు:
నల్లవాడని, తెల్లవాడని, ఆర్యుడని, ద్రావిడులని, ఆది ద్రావిడులని, అగ్ర వర్ణమని, అల్ప వర్ణమని, ఆ కులమని, ఈ కులమని-ఎన్నో విభజనలు నేటికీ భారత సమాజంలో వేళ్ళూనుకొని ఉన్నాయి. ప్రవక్త (స) వారు ఆవిర్భవించిన కాలంలో సయితం అరబ్బు సమాజం మూడు వర్గాల్లో విభజితమయి ఉండేది. 1) అరబ్ ఆరిబా, అరబ్ ముస్తఅరిబా, అరబ్ బాయిదా. 2) అజమీ – అరబ్బేతర సమాజానికి చెందిన వారు. 3) బానిసలు. వీరిలో అధమాతి అధమ స్థానం బానిసలది.
ఉపదేశాల ద్వారా, వేదికెక్కి హామీలు కురిపించడం ద్వారా ఈ అడ్డు గోడల్ని ఛేదించ లేరు, ఈ దూరాలను పూడ్డచ లేరని, ఈ చ్టాల ద్వారా ఈ అగాథాలను దాట లేరని, తరాతరాలుగా మానవుని నర నరాల్లో జీర్ణించుకు పోయిన, ఆంతర్యంలో తిష్ట వేసి కూర్చున్న ఈ వివక్షను రూపు మాపడానికి ఆచరణ కావాలని, ఆ ఆచరణకు దృఢమ యిన ప్రేరణ కావాలని మానవుని కర్త, స్వామి, నిజ ప్రభువు మానవ జన్మ రహస్యాన్ని తెలిపి ఈ చిక్కుముడి విడదీశాడు. అందులోని ఆదేశాన్ని అర్థం చేసుకున్న మహనీయులు ముహమ్మద్ (స) దాన్ని అమలు పరిచారు. వారు బానిసయిన ‘బిలాల్’ (ర)ను సర్దారును చేశారు. ఆయన ఓ నీగ్రో బానిస, ఏమంత అందమయిన అంగసౌష్ట వం గలవాడేమీ కాదు. గొప్ప ప్రతిభావంతుడు కూడా ఏమి కాదు. సమాజంలో ఎలాిం ప్రధాన్యత లేని ఓ అధమ స్థాయి బానిస. కానీ ఇస్లాం స్వీకరించి ముస్లిం సమాజంలో కలిసి పోయిన తర్వాత, సత్య ధర్మం కోసం సర్వస్వాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధమయిపోయి నప్పుడు సమాజంలో అగ్రపీఠం మీద ఆయన్ను కూర్చో బెట్టడం జరి గింది. ముఅజ్జిన్-ఎ-రసూల్‌గా ఆయన్ను ప్రతిష్టనివ్వడం జరిగింది. కాబా కప్పు పైకెక్కి అజాన్ ఇచ్చేంతి స్వేచ్చ ఆయనకు లభించింది. మహామహులయిన వ్యక్తులు ఆయనకు తమ కూతురినిచ్చి పెళ్లి చెయ్డానికి ముందుకొచ్చారు. స్వయంగా ఉమర్ (స) గారు ఆయన్ను ‘సయ్యిదీ’ నాయకమన్యా! అని సంబోధించేవారు. నేడు సయితం గల్లీలోని ఏ ముస్లిం బాలుణ్ణి అడిగినా బిలాల్ (ర) ఎవరో చెప్పేంతటి ఘనకీర్తి ఆయన సొంతం అయింది.
అసమానతలు తొలగిన శుభవేళ:
‘దాసి వర్గ’ పుత్రుడయిన జైద్‌కి, ‘స్వామి వర్గ’ పుత్రికయిన జైనబ్‌నిచ్చి పెళ్ళి చేశారు. ‘అధమ వర్ణ’ యువకుడయిన ‘ఉసామా’ను ‘అగ్రవర్ణ’ యోధులకు నాయకునిగా నియమించారు. తన సహచరులకు ఆయ నిచ్చి శిక్షణ ఎలాంటిదంటే, హజ్రత్ ఉమర్ (ర) గారు తరచూ చెబుతూ ఉండిన మాట – ‘ఒకవేళ హుజైఫా బానిస సాలిమ్ గనక బతికుంటే నేను నా తర్వాత ఆయన్నే ఖలీఫాగా ప్రకించే వాడిని’. ఖిలాఫత్ అనేది ఇస్లామీయ సమాజంలో మహా గొప్ప స్థానం. అటువిం హోదాను ఓ బానిసకు అప్పజెప్పడానికి అతని బానిసత్వం అడ్డు రాలేదు.
స్వయంగా హజ్రత్ ఉమర్ (ర) గారి వద్ద ఓ బానిస ఉండేవాడు. ఫలస్తీనాకు వెళ్ళే సమయంలో ఆయన వద్ద ఒకే సవారీ జంతువు ఉండేది. దానిపై కొంత దూరం బానిసను కూర్చోబెడితే, కొంత దూరం తాను ఎక్కి వెళ్ళేవారు. ప్రవక్త (స) వారు స్థాపించిన ఈ సామాజిక న్యాయానికి ముగ్దుడయిన ఓ కవి ఇలా అన్నాడు:
అతను నాటిన ఆ తోట యెట్టిదంటే; అందులో
చిన్న పెద్ద మొక్కలన్న వివక్ష ఉండేది కాదు.
ఇస్లామీయ ఆరాధనల్లో సామాజిక న్యాయం:
సామాజిక న్యాయానికి నిశ్శబ్ద సంకేతం నమాజు. ముస్లింలు రోజుకి అయిదు పూటల నమాజు చదువుతారు. అందులో అధిక, అధమ, ధనిక, పేద, రాజు, ప్రజ, బానిస, యజమాని, ఉద్యోగి, ఓనరు అన్న అసమానతలకు అస్సలు తావు లేదు. ”అందరూ దైవ దాసుల్లా పరస్ రం సోదరుల్లా మసలుకోండి” అన్న ప్రవక్త (స) మాట అక్షర రూపంలో మనకు దర్శనమిస్తుంది.
విశ్వ వ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ప్రతి యేటా పూర్తి రమజాను ఉపవా సాలు పాటిం చడం జరుగుతుంది. అవి, స్త్రీ, పురుషుడు, యజమాని, బానిస, శ్రీమంతుడు, నిరుపేద అన్న తేడా లేకుండా అందరి మీద సమానంగా విధి. అందరూ విధిగా రమజాను పూర్తి మాసపు ఉపవాసాల్ని ఎంతో నిష్ఠగా పాటిస్తారు.
జకాతు వ్యవస్థనే తీసుకోండి, అది సయితం ఆర్థిక న్యాయానికి గొప్ప ఆనవాలు. ”దాన్ని వారి ధనికుల నుండి తీసుకొని వారిలోని నిరుపేద లలో పంపిణి చెయ్యడం జరుగుతుంది” అన్న ప్రవక్త (స) వారి మాట చాలు జకాతు వ్యవస్థను అర్థం చేసుకోవడానికి.
ఇక హజ్జ్ మహారాధనను తీసకున్నట్లయితే, ఇదే సామాజిక న్యాయం అంతర్జాతీయ స్థాయిలో దర్శనమిచ్చి విశ్వ జనావళిని కనివిఫ్పు కలిగి స్తుంది. అప్పి వరకు వారి మధ్య ఉన్న చిన్నా చితకా వ్యత్యాసాల్ని సయితం హజ్జ్ పూర్తిగా రూపు మాపుతుంది. ఒకే స్థలంలో, ఒకే సమ యంలో, ఒకే స్థితిలో, ఒకే యూనుఫాంతో, ఒకే భాషలో, ఒకే ఒక్క దేవుని దర్బారులో నియమనిష్ఠలతో భక్తిప్రపత్తుల నివాళిని అర్పించు కుాంరు దాదాపు 150 దేశాలు చెందిన, దానికన్నా ఎక్కువ భాషలు మ్లాడే ప్రజలు. విస్మయం గొలిపే ఈ విశ్వ సమ్మేళనాన్ని చూసే ఒక మేధావి ఇలా అబీప్రాయ పడ్డాడు: ”ఇదే – జాతి, రంగు, భాష-విం సమస్యలన్నింకీ ఏకైక పరిష్కారం”.
నేడు మనం మనం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించినప్పికి, ఆర్థికంగా ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నప్పికీ, జాతి, కులం, భాష అన్న ఈ కృత్రిమ గీతల్ని సమూలంగా నిర్మూలించుకోలేక పోతున్నాము. ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదని కాదు, జరుగుతున్నాయి. అయినా ఆశించిన మార్పు అయితే ప్రజా జీవితాల్లో కానరావడం లేదు. కారణాలు ఏవయినా, కారకులు ఎవరయినా శాశ్వత పరిష్కారం మాత్రం ఇస్లాం సంపూర్ణ ధర్మమే.