Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

జాతీయ వాదం వివాదం

‘ప్రతి భారతీయుని కళ్ళలోని కన్నీటిని తుడవడం, వారి జీవితాల్లో సంతోషం నింపడమే స్వాతంత్యం పధ్రాన లక్ష్యం’ అని శ్రీ గాంధి గారి మాట నేడు అనుసరణీయం. ‘జాతి ఔన్నత్యం’ పై దృష్టి కేందీక్రరించడం మాని పజ్రల సంక్షేమం పైన దృష్టిని కేందీక్రరించాల్సిన సమయం ఇది. పజ్రావాణిని అణచడం, చట్టాన్ని అలగా జనాల చేతిలో చుట్టంగా చెయ్యండం ఏ జాతికీ, మరే దేశానికి శుభ సూచకం కాదు. ‘జాతీయ వాదం’ ‘రాష్ట్రీయ వాదం’ పేరుతో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలపై ఆధార పడేలా చేయడం ఎంత మాతం హర్షణీయం కాదు. సహనం, సహిష్ణుత, సమరస భావం, సోదర భావానికి బదులుగా అణచివేతకు పాధ్రాన్యతనిచ్చే విస్తరణ కాంక్ష గల జాతీయ వాదాన్ని అమలు పర్చడం భవిష్యత్తులో ఎవరికీశ్రేయస్కరం కాదు. కాబట్టి విద్వేషం పాలించే దేశ, భాషలు మనకొద్దు. విధ్వసం నిర్మించే మత ధర్మాలు మనకొద్దు. నేటి దైన్యానికి ధైర్యం ఇచ్చే వజ్ర సంకల్పులమవ్వాలి జనం-గణం-మనం.

విద్వేషం పాలించే దేశ, భాషలు మనకొద్దు. విధ్వసం నిర్మించే మత ధర్మాలు మనకొద్దు. నేటి దైన్యానికి ధైర్యం ఇచ్చే వజ్ర సంకల్పులమవ్వాలి జనం-గణం-మనం.

అసలు ‘జాతీయ’, ‘జాతీయత’, ‘జాతి రాజ్యం’ అనే పద పూర్వపరాల్ని పరిశీలించినట్లయితే, వెస్ట్‌ ఫాలియన్‌ శాంతి ఒప్పందాల తర్వాత 17వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో మొదట ఈ పారభాషికాలు వాడుకలోకి వచ్చాయన్నది విశ్లేషకుల మాట. ‘జాతీయ వాదం’ విషయంలో ఒక్కో దేశానిది ఒక్కో రీతి, ఒక్కో నీతి అని చెప్పొచ్చు. కొన్ని దేశాలు ప్రగతిశీల, పజాస్వామిక జాతీయ వాదాన్ని పవ్రేశ పెడితే, కొన్ని దేశాలు అత్యంత ద్వేష పూరిత జాతియ వాదాన్ని వేదికి మీదకు తీసుకొచ్చాయి. ‘జాతి’ భావాన్ని బల పర్చేందుకు దానికి మహత్తును ఆపాదించే ప్రయత్నం చేశాయి. ‘జాతీయత’ అన్న పద ప్రయోగం మొదట 17వ శతాబ్దంలో అమల్లో వచ్చినా, ఈ భావన మాత్రం రోము, గ్రీకు నాగరికతలకన్నా చాలా ప్రాచీనమయినది. అంతిమ దైవగంథం ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది:

”నిజంగానే ఫిర్‌ఔన్‌ భూమిలో (ఈజిప్టు రాజ్యంలో) పెట్రేగి పోయాడు. అక్కడి పజ్రలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక ప్రత్యేక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసే వాడు. వారి మగ పిల్లలను చంపేసి, వారి ఆడ కూతుళ్ళను మాత్రం బ్రతకనిచ్చే వాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించిన వారి కోవకు చెందిన వాడు”. (అల్‌ ఖసస్‌: 04)

‘జాతి భావన’ ఒక దశలో ఎంతో అమాయకమయినదిగా కనిపిస్తుంది. ఒకే చోట నివసించే పజ్రలు ఉమ్మడి లక్ష్యాల కోసం ఏకమవ్వడానికి జాతిగా ఏర్పడతారు. ఈ భావన క్రమేపి వంశం, ప్రాంతం, భాష, జాతి, రాష్ట్రం అన్న అభిమాన దశలను దాటుకుంటూ దురభిమానానికి, దురహంకారానికి దారి తీస్తుంది. ఒక జాతి, ఒక దేశం మరో దేశాన్ని, జాతిశత్రువుగా భావించడం ప్రారంభిస్తుంది. తామే గొప్ప వారం అని, తమకు మించిన వారు లేరని, తాము తప్ప ఎవ్వరూ ఉండ కూడదని, ఉన్నా ద్వితీయ స్థాయి పౌరులుగా మాత్రమే ఉండాలన్న స్థాయికి చేరుకుంటుంది. అందరికి సొంతమయిన అందాల లోకాన్ని, కొందరికే పొందే అధికరాం ఉన్నట్లు వ్యవహరిస్తోంది. ఒక దశలో యూద, కైస్త్రవుల్లో వేళ్లూనుకొని ఉన్న ఈ దురహంకారాన్ని ఖండిస్తూ ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది:
‘మేము అల్లాహ్‌ పుత్రులం (దేవుని బిడ్డలం), ఆయనకు మిక్కిలి ప్రియ మయినవారం” అని యూదులు, కైస్త్రవులు (నసారా) అంటారు.(పవ్రక్తా!) వారిని ఇలా అడుగు: ”మరయితే మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? వాస్తవం ఏమిటంటే, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందిన వారే”. (అల్‌ మాయిదహ్‌: 18)

ఇక ‘జాతీయ వాదం’లో అవిభాజ్యంగా ఉండే లక్షణాలు ఆరు. 1) వంశం, వర్గం 2) ప్రాంతం. 3) వర్ణం 4) భాష. 5) ఆర్థిక ఉమ్మడి ప్రయోజనాలు. 6) ఒకే పాలనా వ్యవస్థ యొక్క భాగస్వామ్యం.

1) వంశం, వర్గం – ఈ దశకు మనిషి ఒక్క ఉదుటన చేరుకో లేడు . కొంత కాలం పడతుంది. అలా చాలా కాలం తర్వాత వచ్చిన వంశం, వర్గ భావన మనిషి కలుపుతుంది అని అనుకోవడం కన్నా అసలు మూలం ఆధారంగా ఏర్పడే సమైక్యతపటిష్టంగా ఉంటుంది అని గ్రహించాల్సిందిగా మహనీయ ముహమ్మద్‌ (స) బోధ పర్చారు:”ఓ పజ్రలారా! మీ అందరి పభ్రువు ఒక్కడే. మీ అందరి తండి ఒక్కడే. మీరంతా ఆదం(అ)కి చెందిన వారు. ఆయన మట్టితో సృజించ బడ్డాడు”. (ముస్లిం)

2) ప్రాంతం, 3) వర్ణం, 4) భాష – నా స్థలం, నా పొలం, నా హలం అన్న సంకుచిత భావనకు బానిసలయి మానవాళిని విడదీయడం మాని, గాలీ, నీరు వంటి హృదయ విశాలతను, సాత్వికతను ఏర్పచుకోవాలి. నేను భారతీయుడను ప్రపంచ ప్రజలంతా నా సోదరులు అన్న భావన పరిఢవిల్లాలి. రంగు అంటారా, అది శరీరానికే గానీ, ఆత్మకు కాదు. ఒకరి శరీరచ్ఛాయ అతని గొప్పతనానికి ఆనవాలు కాజాలదు. ఇక భాష, అది భావ వ్యక్తీకరణకు సాధనం మాతమ్రే. పై మూడు విషయాల గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”భూమ్యాకాశాల సృష్టిలో, మీ భాషల్లో, మీ రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. జ్ఞాన సంపన్నులక కోసం ఇందులో పలు సూచనలున్నాయి”. (అరూమ్ర్‌: 22)

మహనీయ ముహమ్మద్‌ (స) తన అంతిమ హజ్జ్‌ సందర్భంగా ఇలా అన్నారు: ”ఒక అరబ్బీకీ అరబ్బేతరునిపైగానీ, ఒక అరబ్బేరతునికి ఒక అరబ్బీపైగానీ ఎలాంటి ఆధిక్యతా లేదు. ఒక ఎర్రవానికి నల్లవాని పైగానీ, ఒక నల్లవానికి తెల్లవానిపైగానీ ఎలాంటి ఆధిక్యత లేదు; తఖ్యా – దైవభీతి తో తప్ప”. (ముస్నద్‌ అహ్మద్‌) అంటే పై వాటిని అల్లాహ్‌ పరస్పర పరిచయ సాధనాలుగా చేశాడే తప్ప, వాటి మూలంగా ఎవ్వరికి ఎలాంటి ఆధిక్యతా లేదు, రాదు.
5) ఆర్థిక ఉమ్మడి పయ్రోజనాలు. 6) ఒకే పాలనా వ్యవస్థ యొక్క భాగ స్వామ్యం.
పై రెండు కారణాల వల్ల ఒక జట్టుగా ఏర్పడి, తమ జట్టులో చేరని, తమ జట్టుకి చెందని వారి నోటి కాడి కూడు లాగేసుకొని, వారి నోట్లో మట్టి కొట్టాలని చూస్తారు. కానీ, చివరికి వారి నోటి కాడి కూడు కూడా లాగేసుకో బడుతుంది. గుప్పెడు మెతుకుల గుక్క పట్టి ఏడ్చే దుస్థితి దాపురిస్తుంది. చావులో విజయాన్ని వెతికే ఈ విరోధం ఇంకెంతో కాలం సాగదు. ఆయుధం ఏదయినా ప్రాణం పోయదు. వ్యర్థ విరోధాల వల్ల సాధించేదేమీ లేదు. మరు భూముల సేద్యం వల్ల ఏ శశ్యం పండదు.

అంతరాలు అంతమయి అంతా ఆనంద మయి, కలిసిమెలసి మనగలిగే కాలం రావాలన్నా. కరువయిన చెలిమి చినుకు వానయి కురవాలన్నా, ఎల్లలతో చీలిన పుడమి ఒళ్ళు విరుచుకొని లేవాలన్నా – భూమిపై జీవకళ పురుడు పోసుకోక ముందు నుంచి స్థిరంగా, దృఢంగా ఉంటూ, భూమం డలం మీద జీవకళ ఉన్నంత కాలం, తర్వాత కూడా స్థిరంగా, దృఢంగా ఉండే దైవ దత్తమయిన సంపూర్ణ జీవన సంవిధానమయిన ఇస్లాంను ఆశ్రయించడమే నేడు మానవాళి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు చక్కటి పరిష్కారం.

ఇస్లాం కేవలం సైద్ధాంతిక సూత్రాలకు పరిమితమయిన ధర్మం కాదు. అది ఓ ఆచరణాత్మకమయిన జీవన వ్యవస్థ. అది మానవ జాతి ఏ అవసరాన్ని ఉపేక్షించక పోవడమే కాక, దాన్ని సాధించే మార్గాన్ని సయితం విశదీకరిస్తుంది. నీగ్రో బానిస బిలాల్‌ (ర)ను నాయకుణ్ని చేసింది ఇస్లాం. ఈరాన్‌ దేశస్థుడయిన సల్మాన్‌ ఫారసీ (ర) తన కుటుంబీకుడు అని చెప్పింది మహనీయ ముహమ్మద్‌ (స). తను లేని సమయంలో అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమ్మె మక్తూమ్‌ (ర) – ఒక అంధుడిని 15 సార్లు ఇమామత్‌ బాధ్యతలు అప్పగించిన మహాత్ములు ముహమ్మద్‌(స).

ఒక్క మాటలో చెప్పాలంటే, సుస్థిరతను, నిత్య నూతనతను పుణికి పుచ్చుకున్న ఇస్లాం ధర్మం సంచలనాత్మకమయిన సత్య శక్తి. దాని గతం ఎంత వైభవోపేతమయిందో, దాని భవిష్యత్తు కూడా అంతే దేదీప్యమానంగా భాసిల్లుతుంది. ఇస్లాం, జీవితానికి సంబంధించిన సకల సద్గుణాలు, సమస్త సద్భావాలూ, ఆరోగ్యవంతమయిన విలువలు కల సంపూర్ణ ధర్మం. అది శాశ్వత ప్రాతిపదికపై అన్ని తరాలకు, సర్వ సమాజాలకు వర్తించే జీవన నియమావళి.

Related Post