Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

దౌర్జన్యం ఎవరి విషయంలో జరుగుతుంది

దౌర్జన్యం ఎవరి విషయంలో జరుగుతుంది

పిసినారితనం నుండి దూరంగా ఉండండి. ఈ అవలక్షణం మీకు పూర్వం ప్రజలన్ని నాశనం చేసింది. అది వారిని దౌర్జన్యం చెయ్యమని ఉసిగొలిపింది వారు దౌర్జన్యం చేశారు. అది వారిని బంధుత్వ సంబంధాలను త్రెంచమని పురిగొలిపింది వారు సంబంధ బాంధవ్యాలను త్రెంచారు. అది వారిని అశ్లీలానికి, అనైతి కానికి పాల్పడమని ప్రోత్సహించింది వారు అశ్లీలానికి, అనైతికానికి కొమ్ము కాసారు.

1) అల్లాహ్‌ విషయంలో జరిగే దౌర్జన్యం: అల్లాహ్‌తోపాటు అన్యులను సాటి సమానులుగా చేసి నిలబెట్టినప్పుడు ఈ దౌర్జన్యం చోటు చేెసుకుంటుంది. ఇది సరిదిద్ద బడాలంటే, నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ గురించిన సంపూర్ణ స్థాయి సమాచారాన్ని సేకరించడమే కాక మనసా, వాఛా,కర్మణా -త్రికరణ శుద్ధితో బేషరతుగా స్వీకరించాలి కూడా. అనుమానానికి, శంక కు తావియ్యకూడదు.

2) మనిషి ఆత్మ విషయంలో జరిగే దౌర్జన్యం: తన మనో వాంఛలను మేధకు అప్పగించక గాలికి వదిలేయడం. ఉదాహరణకు – సిగ్రేట్, సారాయి త్రాగొద్దని మేధ పదే పదే హెచ్చరిస్తున్నా త్రాగడం. ఇది నరక బాట అని తెలుస్తున్నా సంఘానికి, సంసారానికి భయ పడి అదే బాటన కొనసాగడం.

3) కుటుంబ పెద్దల విషయంలో జరిగే దౌర్జన్యం: వారు చేెసి వెళ్ళిన మంచి హితవుల్ని పెడచెవిన పెట్టడం, వారికిచ్చిన మాటను నిలబెట్టుకో లేక పోవడం, వారి తదనంతరం వారి బంధువులతో సంబందాలు త్రెంచు కోవడం, వారి కోసం దుఆ చెయ్యక పోవడం.

4) సజీవంగా ఉన్న తన తోటి ప్రాణుల విషయంలో జరిగే దౌర్జన్యం: ఒకరి హక్కుల్ని చెల్లించడంలో జాప్యం చెయ్యడం, దైనందిన వ్యవహా రాల్లో న్యాయానికి కట్టుబడ లేక పోవడం. ఇచ్చిన మాటను తప్పడం. అప్పగించిన ఏదేని వస్తువును స్వాహా చెయ్యడం. జంతువుల యెడల అనుచితంగా వ్యవహరించడం వగైరా.

5) సామాన్య ప్రజల వియంలో జరిగే దౌర్జన్యం: దుర్మార్గుడయిన రాజు గానీ, నియంత పరిపాలకుడుగానీ సింహాసనాధీశుడయి ప్రజలపై జరిపే దౌర్జన్యకాండ. ప్రజలకు చెందాల్సిన హక్కుల్ని వారికివ్వకుండా, వారికి అందాల్సిన సహాయ నిధుల్ని అందకుండా చెయ్యడం, వారికి దక్కాల్సిన రిజర్వెషన్‌లను దక్కకుండా చెయ్యడం మొదలయినవి.

దౌర్జన్యాన్ని, దౌర్జన్యపరుల్ని అల్లాహ్‌ సుతరాము ప్రేమించడు అన్న విషయం పై కొన్ని ఖుర్‌ఆన్‌ ఆయతుల ద్వారా తెలుసుకున్నాము. ఇక ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు దౌర్జన్యం గురించి ఏమన్నారో తెలుసు కుందాం !

”దౌర్జన్యం చెయ్యడం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిశ్చయంగా నేటి దౌర్జన్యం రేపి ప్రళయ భయంకర చీకట్లుగా మారుతుంది”. (బుఖారీ)

హజ్రత్‌ మఆజ్‌ బిన్‌ జబల్‌(ర)గారిని యమన్‌ దేశానికి సాగనంపుతూ ఆయన చేసిన హితవు – ”ఓ మఆజ్‌! బాధితుని అభిశాపం నుండి దూరంగా ఉండు. అతని దుఆకు మరియు అల్లాహ్‌కు మధ్య ఏ అడ్డు తెర ఉండదన్న విషయాన్ని విస్మరించకు!”. (బుఖారీ)

”తస్మాత్‌ జాగ్రత్త! పిసినారితనం నుండి దూరంగా ఉండండి. ఈ అవలక్షణం మీకు పూర్వం ప్రజలన్ని నాశనం చేసింది. అది వారిని దౌర్జన్యం చెయ్యమని ఉసిగొలిపింది వారు దౌర్జన్యం చేశారు. అది వారిని బంధుత్వ సంబంధాలను త్రెంచమని పురిగొలిపింది వారు సంబంధ బాంధవ్యాలను త్రెంచారు. అది వారిని అశ్లీలానికి, అనైతి కానికి పాల్పడమని ప్రోత్సహించింది వారు అశ్లీలానికి, అనైతికానికి కొమ్ము కాసారు. ముఖ్యంగా దౌర్జన్యం నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. నిశ్చయంగా అది రేపి ప్రళయ భీకర చీకట్ల రూపంలో వస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు అశ్లీల చేష్టల నుండి కాపాడుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ అశ్లీలానికి పాల్పడేవారిని, అశ్లీలాన్ని వ్యాపింపజేసేవారిని ఎన్నికీ ప్రేమించడు”. (అబూ దావూద్‌)

హదీసె ఖుద్సీలో స్వయంగా అల్లాహ్‌ చెబుతున్న మాట – ”ఓ నా దాసులారా! నేను నా మీద దౌర్జన్యాన్ని నిషేధించుకున్నాను. మీ మధ్యన కూడా దాన్ని నిషేధంగా ఖరారు చేశాను. కాబట్టి ఒండొకరిపై దౌర్జన్యానికి ఒడి గట్టకండి”. (ముస్లిం)

గుండెలోని ప్రాణం గొంతు దాటక ముందే: ”మీ సోదరునికి చెందిన మీరు స్వాహా చేసిన ఏదేని వస్తువు మీ దగ్గర ఉన్నట్లయితే లేదా పరువు ప్రతిష్టకు సంబంధించిన ఏదయినా అపనింద మీరు వారిపై మోపి ఉంటే, నేడే ఈనాడే వెళ్ళి వారి హక్కును వారికి అప్పగించి, వారికి క్షమాపణలు చెప్పుకొని స్వేచ్ఛ పొందండి. ఎందుకంటే రేపు ప్రళయ దినాన దీనార్‌గానీ, దిర్హమ్‌గానీ ఏది పనికి రాదు. సదరు వ్యక్తి వద్ద పుణ్యాలుంటే తాను చేెసిన దౌర్జన్యానికి సమానంగా వాి నుండి తీసుకోవడం జరిగుతుంది. ఒకవేళ పుణ్యాలు లేకపోతే, బాధితుల పాపాలను తీసి అతనిపై మోపడం జరుగుతుంది” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (బుఖారీ)

దౌర్జన్య పరునికి శిక్ష పడుతుంది. కానీ; ”నిశ్చయంగా అల్లాహ్‌ దౌర్జన్యపరునికి గడువు ఇస్తూ పోతాడు. ఒక్క సారిగా పట్టుకున్నప్పుడు అతను తప్పించుకోలేడు”. (బుఖారీ)

”ముగ్గురి దుఆ తప్పక స్వీకరించ బడుతుంది. న్యాయశీలి అయిన నాయకుడు, ఉపవాసి ఉపవాసం విరిమించేంత వరకూ మరియు బాధితుని దుఆ. అల్లాహ్‌ అతని దుఆను మేఘాల తెర లేకుండా పైకి ఎత్తుకుాండు. దాని కోసం ఆకాశ తలుపులు తెరుచుకో బడతాయి. అల్లాహ్‌ా ఇలా అంాడు: ”నా గౌరవోన్నతుల సాక్షిగా! నిశ్చయంగా నేను నీకు సహాయ పడతాను, కాస్త తర్వాత (ఆలస్యంగా)నయినా సరే”. (తిర్మిజీ)

దౌర్జన్య దుష్ఫలితాలు:

అ) అది అల్లాహ్‌ ఆగ్రహానికి గురి చేసి ఆయన అనుగ్రానికి దూరం చేస్తుంది.

ఆ) బాధితుని శాపం బాధ పెట్టేవాడికి తప్పక తగులుతుంది.

ఇ) అది దేశ, సమాజ, కుటుంబ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది.

ఈ) ప్రజలు దౌర్జన్యపరుణ్ణి అసహ్యించుకుాంరు. సృష్టిలోని అణువ ణువు అతన్ని శపిస్తుంది. వారు చస్తే, భువన గగనాలేమీ బాధ పడవు.

ఉ) దౌర్జన్య గుణం వల్ల గుండె బండ బారుతుంది. బుద్ధి మందగిస్తుంది.

ఊ) దౌర్జన్యపరుని రేపు ప్రళయ దినాన ప్రవక్త (స) వారి సిఫారసు లభించదు.

ఒక్క మాటలో చెప్పాలంటే, సకల మేళ్ళకు మూలాంకురం జ్ఞానం, న్యాయం. సకల చెడులకు బీజం అజ్ఞానం, దౌర్జన్యం. న్యాయ పరి ణామం సుభిక్షం, భద్రం అయితే, దౌర్జన్య పరిణామం దుర్భిక్షం, పరమ దరిద్రం. ఈ రోజు ప్రజలపై దౌర్జన్యం చేసేవారి మెడలు వంచే ఓ దినం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ప్రజలు వారిని తమ కాళ్ళ క్రింద వేసి నలిపేస్తారు. క్రింది లోకాల్లో కుదరకపోతే, పై లోకాల్లో! ఇది నిజం!! కఠోర సత్యం!!!

Related Post