
అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం (అవకాశం) లభిస్తుంది.
భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని
ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్కా తీసుకుంటాడో.
ఆయననే అరబ్బి భాషలో “అల్లాహ్” అని పిలుస్తారు
అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం.
కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం’
దివ్య ఖుర్ఆన్ (30:40) వాక్యం ప్రకారం
అల్లాహ్‌యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్‌కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించినవారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటికల్పించే భాగ స్వాములకంటే ఆయన మహోన్నతుడు ఖుర్ఆన్ (30:40)
అల్లాహ్ (సృష్టికర్త) యొక్క లక్షణాలు ఏమిటి ….. ?
1: (దివ్య ఖుర్ ఆన్ 112:1) ఆయన ఒక్కడే (అద్వితీయుడు)
2: (దివ్య ఖుర్ ఆన్ 112:3; 28:88) ఆయనకు ఆది, అంతం, పుట్టుక, మరణము, లేదు.
3: (దివ్య ఖుర్ ఆన్ 6:103) ఆయన అగోచరుడు (కంటికి కనిపించడు).
4: (దివ్య ఖుర్ ఆన్ 6:101; 112:3) ఆయనకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉండరు.
5: (దివ్య ఖుర్ ఆన్ 112:4) ఆయనకు సరిసమానులు, సాటి, మేటి ఎవ్వరూ లేరు.
6: (దివ్య ఖుర్ ఆన్ 42:11) ఆయనకు ఎటువంటి ప్రతిమ లేదు ఆయనను పోలినది ఈ సృష్టిలో ఏదీలేదు.
ఉదా :- విగ్రహము, చిత్ర పటము
7: ( దివ్యఖుర్ఆన్ 2:255; 112:2) ఆయనకు ఆకలిదప్పులు, నిద్ర అలసట లాంటి బలహీనతలు ఉండవు
ఆయన దేనిపైన ఆధారపడేవాడు కాదు
8: (దివ్యఖుర్ఆన్2:117) ఆయన ఏదైనా చేయాలనుకుంటే కేవలం అయపో అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే అది అయిపోతుంది.
9: (దివ్యఖుర్ఆన్ 97:4) ఆయన భూమిపైన (మానవరూపంలో) అవతరించడు.
దైవదూతలను సందేశ నిమిత్తం అవతరింపచేస్తాడు
10: (దివ్యఖుర్ఆన్ 20:5) ఆయన సప్తాకాశాలకు పైన సృష్టి సామ్రాజ్యపీటము (అర్ష్) ను అధిష్టించి ఉంటాడు.
గమనిక:- అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం (అవకాశం) లభిస్తుంది.
విశ్వప్రభువుకు శోభాయమనమైన పేరు అల్లాహ్
దేవుడికి ఎన్నోపేర్లున్నా అల్లాహ్ అనే పదానికి చాలా ప్రత్యేకత ఉంది .
ఉదా :
1) దేవుడు (God ), అనే పదాలకు దేవుళ్ళు ,God’s అనే బహువచన పదాలు ఉన్నాయి. కానీ , అల్లాహ్ అనేది ఏకవచన పదము. దీనికి బహువచనము లేదు.
2) దేవుడు, God అనేటువంటి పదాలు పురుషలింగానికి కానీ సంభందించినది కాదు.
3) దేవుడు, God అనేటువంటి పదాలు ఈ రోజు విగ్రహాలకు, చిత్రపటాలకు, మనష్యులకు, జంతువులకు, చెట్లకు, పుట్టలకు కూడా ఉపయోగిస్తున్నారు. కానీ అల్లాహ్ అనేటువంటి పదాన్ని కేవలం అగోచరుడైనటువంటి ఆ నిజదేవుడుకి మాత్రమే ఉపయోగిస్తారు.
(మనష్యుల, జంతువులవంటి సృష్టిరాశుల ప్రతిమలకు ఉపయోగించరు).