Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌

 ”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్‌: 57)

”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్‌: 57)

”కరుణామయుడు. ఆయనే ఖుర్‌ఆన్‌ నేర్పాడు”. (అర్రహ్మాన్‌:1,2)

సూరతుర్రహ్మాన్‌లో అల్లాహ్‌ తన అనుగ్రహాలెన్నినో పేర్కొన్నాడు. వాటన్నింటిలో అగ్ర స్థానం ఖుర్‌ఆన్‌కు ఇచ్చి, దానికి మించిన మహదాను గ్రహం మరోకటి లేదు అని స్పష్ట పర్చాడు. అందుకే అన్నింకన్నా ముందు మనిషి ఖుర్‌ఆన్‌ను నేర్చుకోవాలన్నది పండితుల మాట. ఎందుకంటే అది నిలువెత్తు కారుణ్య గ్రంథం గనక. స్వచ్ఛమయిన అల్లాహ్‌ అచ్చ వాక్కు గనక. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపే వారికి అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”. (అన్నహ్ల్‌: 89)

రహ్మత్‌ అర్థాలు:

పూర్తి ఖుర్‌ఆన్‌లో – ‘రహ్మత్‌’ అన్న పదం 268 సార్లు ప్రస్తావించబడింది. ఖుర్‌ఆన్‌ ప్రారంభమే ‘బిస్మల్లాహిర్రహ్మానిహ్రీమ్‌’ – అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ా పేరుతో అన్న వాక్యంతో మొదలువు తుంది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్‌ అల్లాహ్‌ా గుణంగా పేర్కొన బడింది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్‌ స్వర్గం అన్న అర్థంలో వాడబడింది. ఖుర్‌ఆన్‌ లో రహ్మత్‌ దైవదౌత్య భావనలో పేర్నొకబడింది.రహ్మత్‌ వర్షం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్‌ దైవానుగ్రహం అన్న భావంలో వాడబడిమది. రహ్మత్‌ ఉపాధి అన్న అర్థంలో వాడ బడింది. రహ్మత్‌ సహాయం, విజయం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్‌ శీలం అన్న భావంలో ఉపయోగించ బడింది. రహ్మత్‌ పుణ్యం అన్న అర్థంలో తీసుకో బడింది. రహ్మత్‌ దుఆ స్వీకరణ అన్న భావంలో చెప్ప బడింది. ఇంతి కరుణామృతం నిండిన ఖుర్‌ఆన్‌ ఒక జాతికో, ప్రాంతానికో, భాషకో పరిమితం అయితే ఏంత అన్యాయం? కనుకనే అది సమసమ్త మానవుల పాలిట మార్గదర్శక గ్రంథం. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్‌: 57) అంతే కాదు ఖుర్‌ఆన్‌ అవతరణను కారుణ్య ప్రభువయినా అల్లాహ్‌ తన కారుణ్యంగా, ప్రత్యేక బహుమానంగా పేర్కొన్నాడు: ”ఓ ప్రవక్తా! వారికి చెప్పు: ‘అల్లాహ్‌ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడ బెట్టుకున్న దానికంటే ఇది ఎంతో మేలైనది”. (యూనుస్‌: 58)

ఖుర్‌ఆన్‌ సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి కానుకగా అవతరింపజేయ బడిన కారుణ్యం గనకనే ప్రతి ముస్లిం ఖుర్‌ఆన్‌ శ్వాశించేంతగా ప్రేమిస్తాడు. శ్వాసించడమా, ఖుర్‌పారాయణం చేయడమా? అన్న మీమాంస ఎదురయితే ఖుర్‌ఆన్‌ చదువుతూ శ్వాస వీడాలని కోరుకుాండు. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిం తొలి శ్వాస ఖుర్‌ఆన్‌ తుది శ్వాస ఖుర్‌ఆన్‌. జీవితన కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య కాలం. కానీ ఒక ముస్లింకు మాత్రం ఖుర్‌ఆన్‌ ఆదేశాల నీడలో జీవించిన కాలం.
ఖుర్‌ఆన్‌ వల్ల ప్రాప్తించే కరుణ అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) మాటల్లో:
”అల్లహ్‌ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలోంచి గోప్యంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు ఎన్నిటికీ నష్టం వాటిల్లని వర్తకాన్ని ఆశిస్తున్నారు”. (ఫాతిర్‌: 29)
”ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మౌనం పాటించండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (అరాఫ్‌: 204)

”మీరు ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూనే ఉండండి. అది తన్ను పారాయ ణం చేసే వారి పాలిట రేపు ప్రళయ దినాన సిఫాసు చేస్తుంది”. (ముస్లిం)
”ఎవరయితే ఖుర్‌ఆన్‌లోని ఒక అక్షరాన్ని పఠిస్తాడో దానికి బదులు అతనికి ఒక పుణ్యం. దాన్ని పదింతలు పెంచి ఇవ్వడం జరుగుతుమది. ‘అలిఫ్‌ లామ్‌ మీవ్‌’ ఒకే అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్‌ ఒక అక్షరం, లామ్‌ ఒక అక్షరం, మీమ్‌ ఒక అక్షరం”. (తిర్మిజీ)
ఓ సందర్భంలో ‘అల్లాహ్‌ాకు చెందినవారు ఎవరు?’ అని ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది.అందుకాయన: ”ఖుర్‌ఆన్‌ పారాయణకర్తలే అల్లాహ్‌కు చెందినవారు మరియు ఆయన ఆప్త మిత్రులూను” అన్నారు. (ముస్నద్‌ అహ్మద్‌)
”రేపు ప్రళయ దినాన ఖుర్‌ఆన్‌ కంఠస్థం చేసుకున్న వ్యక్తితో ఇలా అనబడుతుంది: ‘పఠించు, నువ్వు ప్రంచంలో ఎలా పారాయణం చేసే వాడవో అలానే చెయ్యి. నీ స్వర్గ చివరి అంతస్తు నీవు ఆగే ఆయతు దగ్గర ఉంటుంది”. (తిర్మిజీ)
”ఏ సమూహమయినా సరే అల్లాహ్‌ా గృహాల్లోని ఓ గృహం (మస్జిద్‌)లో సమావేశమయి ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ , నేర్పిస్తూ ఉంారో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని చుట్టు ముడతారు. అల్లాహ్‌ా వారిని గురించిన ప్రస్తాన తన సమీప దూతల దగ్గర తీసుకు వస్తాడు”. (ముస్లిం)
”ఎవరినయితే ఖుర్‌ఆన్‌ పారాయణం మరియు నా స్మరణ వారి వ్యక్తిగత అవ సరాల గురించి అడగటం నుండి నిమగ్నుల్ని చేస్తుందో నేను వారి అవసరాల ను అడిగే వారి అవసరాలకన్నా ఉత్తమ రీతిలో తీరుస్తాను”. (తిర్మిజీ)

”ఖుర్‌ఆన్‌ను కంఠస్థ చేసుకుని దాని ప్రకారం జీవించిన సజ్జన సంతానం మూలంగా వారి తల్లిదండ్రులను రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ా కీర్తి కిరీటం తొడిగించి సన్మానించడం జరిగురుంది. దాని కామతి సూర్య కాంతికన్నా ప్రకాశమానమయి ఉంటుంది. సజ్జన సంతాన అమ్మానాన్నలకు జరిగే సన్మానం ఈ స్థాయిలో ఉంటే, స్వయంగా దాని కంఠస్థం చేసుకుని అమలు పరచిన వ్యక్తి జరిగే సన్మానం ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో ఊహిం చండి’. (ముస్నద్‌ అహ్మద్‌)

ఖుర్‌ఆన్‌ గురించి ప్రముఖుల అభిప్రాయం:

”ఖుర్‌ఆన్‌ అది అల్లాహ్‌ వాక్కు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) పై అవతరించిన అంతిమ దైవ గ్రంథం. దాని పారాయణం పుణ్యప్రదం. అందులో ఒకే ఒక్క చిన్న పాటి సూరా లాంటిది ఎవరూ లిఖించి తీసుకు రాలేరు. అది భువనగగనాల్లో అల్లాహ్‌ను చేరుకునే వారధి. అది అల్లాహ్‌ మరియు ఆయన దాసుల మధ్య ఒప్పందం. అది శాశ్వత అల్లాహ్‌ శాసనం. అది సర్వకాల, సర్వావస్థలయందు పనికి వచ్చే ఆకాశ దస్తూరీ’ అన్నారు ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర).
హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”అల్లాహ్‌ తన్ను ప్రేమించాలని ఎవరయితే కోరుకుంటున్నారో వారు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఒకవేళ అతను ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తుంటే అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తను అభిమానించినట్లే. మరెవరయితే ఖుర్‌ఆన్‌ను అభిమాని స్తారో వారిని అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) ప్రేమిస్తారు”. (తబ్రానీ)

కొన్ని సూరాల ప్రాశస్త్యం:

”ఓ సహాబీ ప్రవక్త (స) వారితో ఇలా అన్నాడు: ‘నేను ఈ సూరాను – ఖుల్‌ హువల్లాహు అహద్‌ – ఇష్ట పడుతున్నాను’. అది విన్న ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా దాని పట్ల నీ ప్రేమ నిన్ను స్వర్గంలో ప్రవేశింప జేస్తుంది”. (తిర్మిజీ)
”ఎవరయితే సూరతుల్‌ కహఫ్‌ ప్రారంభంలోని పది ఆయతులను కంఠంస్థం చెసుకుాంరో (వేరోక ఉల్లేఖనంలో చివరి పది ఆయతులను అని ఉంది) వారు దజ్జాల్‌ మహా ఉపద్రవం నుండి కాపాడ బడతారు”. (ముస్లిం)

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం – ‘జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స) వారి సన్నిధిలో కూర్చుని ఉండగా తన పై భాగం నుండి ఓ శబ్దాన్ని విని తలను పైకెత్తి ఇలా అన్నారు: ”ఇది ఆకాశ తలుపుల్లోని ఓ తలుపు. ఈ రోజు అది తెరవబడింది, ఈ రోజు తప్ప మునుపెన్నడూ దాన్ని తెరవడం జరుగ లేదు. దాని గుండా ఓ దైవదూత దిగి వచ్చాడు. అది చూసి అయన మళ్ళీ ఇలా అన్నారు: ”ఈ దైవ దూత ఈ రోజు తప్ప మునుపెన్నడూ అవనిపై కాలు మోపలేదు”. అలా వచ్చిన ఆ దైవదూత సలామ్‌ చేసి ఇలా అన్నాడు: ‘ఓ దైవప్రవక్తా! నేను మిమ్మల్ని రెండు జ్యోతులకు సంబంధించిన శుభ వార్తను అందజేస్తున్నాను. వాటిని మీకు పూర్వం గతించిన ఏ ప్రవక్తకూ ప్రసాదించడం జరుగలేదు. ఒకి ఖుర్‌ఆన్‌ మున్నుడి – ఫాతిహా సూరహ్‌. ఒకి సూరతుల్‌ బఖరహ్‌ా చివరి ఆయతులు. వాిలో ఏ ఒక్క అక్షరాన్ని మీ పఠించినా అది మీకు ప్రసాదించ బడుతుంది”. (ముస్లిం)

గమనిక: నేడు ఇస్లాం సంబంధించిన ప్రతి దాన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో రుజు చేయాలనుకునే కొందరి స్వధర్మ అవగాహనా రాహిత్య వ్యాఖ్యానం ఖుర్‌ఆన్‌ను కూడా తాకుతూ ఉండటం మిక్కిలి విచారకరం! దాని వల్ల ఖుర్‌ఆన్‌కు ఎటువంటి హాని జరగక పోయినా, సామాన్య జనం మాత్రం మోసపోతున్నారు. అదే సూరతుల్‌ ఫాతిహాను వేదాలలో ఉన్నట్టుగా నమ్మ బలకడం. వారు అల్లాహ్‌కు భయ పడాలి. వారి ఈ వాదన నీతిని నిలబెడుతుందో, కూల దోస్తుందో ఆలోచించాలి. రేపు ప్రళయ దినాన ”ఏమిటి మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడ తున్నారా?” (తౌబహ్‌: 65) అని అల్లాహ్‌ నిలదీస్తే ఏమని సమాధానమిస్తారో? ఒక్కసారి యేచించాలి. ఇది ముమ్మటికి బసీరత్‌తో కూడిన ధర్మబోధ కాదు. ఇస్లాం సత్యతను, ఖుర్‌ఆన్‌ స్వఛ్చతను నిరూపించడానికి ఖుర్‌ఆన్‌ ఒక్కటే చాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఖుర్‌ఆన్‌ ఎవరి యెడల ఎలాంటి కరుణను కనబరుస్తుంది:
”ఓ ముహమ్మద్‌ (స)! మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరిమపజేసింది నువ్వు కష్టాల్లో పడటానికి కాదు”. (తాహా: 2)
లోతైన గొయ్యిలో పడి ఉన్న ఓ వ్యక్తి కొందరు కాపాడారు అంటే కారణం కరుణే. ఆ విషయానికొస్తే మనిషి పాలిట ఇహపరాల్లో ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. అది మనిషిని అంధ విశ్వాసాల భయంకర ఊబి నుండి కాపాడి సరైన మార్గం మీద నడిపించడమే కాకుండా, నడవడానికి కావాల్సినంత కాంతిని, దర్శకత్వాన్ని అందించి, ప్రభువు ప్రసన్నతను అనుగ్రహించి ఇహంలో విజేతగా, పరంలో సాఫల్యవంతునిగా చేసి నిలబెడు తుంది. ”అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి మరియు స్పష్టమయిన గ్రంథం వచ్చేసింది. దాని ద్వారా అల్లాహ్‌ తన ప్రసన్నతని అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అభీష్టం మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికి తీసి, కాంతి వైపునకు తీసుకు వస్తాడు. రుజుమార్గం వైపునకు వారికి దర్శకత్వం వహిస్తాడు”. (మాయిదహ్‌: 15,16)

హృదయ కారుణ్యం ఖుర్‌ఆన్‌:

”దాన్ని విన్నప్పుడు తమ ప్రభువుకు భయ పడే ప్రజల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇంకా వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం పట్ల మెత్త బడి పోతాయి ”. (అజ్జుమర్‌: 23)

కలకంఠి పాలిట కారుణ్యం ఖుర్‌ఆన్‌:

తరాల తరబడి స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగ్టి ఆమెకు న్యాయంం జరిగేలా చూడటం కరుణ అయితే స్త్రీ పాలిట ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. మానవ చరిత్రలో స్త్రీ పుట్టుకకు శుభవార్త పేర్కొన్న, దాన్నో శాసనంగా ఖరారు చేసిన ఏకైక గ్రంథం ఖుర్‌ ఆన్‌. ”వారిలో ఎవరికైనా కూతురు ప్టిందన్న శుభవార్తను వినిపిస్తే…”. (నహ్ల్‌: 58) స్త్రీల హక్కులకు సంబంధించి 176 ఆయతులతో కూడి ఓ పూర్తి అధ్యాయయమే ‘నిసా’- మహిళలు ఖుర్‌ఆన్‌లో ఉంది. ఇలా చెప్పు కుంటూ పోతే ఖుర్‌ఆన్‌ కరుణ నోచుకోని జీవి ఈ జగాన లేదు.

చివరి మాట:

తొలకరి జల్లుతో మృత భూమి ఎలా సజీవమవుతుందో, అందులోని వృక్షాలు ఎలా చిగురిస్తాయో అలాగే ఖుర్‌ఆన్‌ కారుణ్య జల్లుతోి మృత హృదయాలు జీవం పోసుకుాంయి. అది జాతి జడత్వాన్ని జాడించి, చేవ కోల్పోయిన సమాజంలో చైతన్యాన్ని నింపుతుంది. అదెలా అంటే రహ్మహ్‌ – కారుణ్యంతో పాటు ఖుర్‌ఆన్‌కు గల మరో పేరు రూహ్‌ – ఆత్మ.
నేడు ప్రపంచమంతా సమస్యల సుడిగుండంగా తయారయింది, మనిషి అలా తయారు చేసుకున్నాడు. ఈ వలయాన్ని ఛేదించి మానవ జాతులకు స్వేచ్ఛను, ముక్తిని ప్రసాదించే శక్తి గ్రంథ పరంగా ఒక్క ఖుర్‌ఆన్‌కు మాత్రమే ఉంది. నేడు ఖుర్‌ఆన్‌ను ఎంతగానో అభిమానించే ముస్లింలు, వ్యక్తులయినా, ప్రభుత్వాలయినా ఈ అనంత ‘కరుణా నిధి’ ద్వారా మానవాళికి కారుణ్యాన్ని పంచడంలో దాదాపు విఫలమయ్యారు అని చెప్పొచ్చు. నాటి ముస్లింలు ఖుర్‌ఆన్‌నే శ్వాసించి, ఖుర్‌ఆన్‌ నీడలోనే జీవించి ధన్యులయ్యారు. నేటి ముస్లింలు ఖుర్‌ఆన్‌ను విస్మరించి, మనోవాంఛలను అనుసరించి దీనుల య్యారు. ప్రపంచ వ్యాప్తంగా వినబడే నినాదాలుగానీ, కనబడే ఇజాలుగానీ మనిషి సమస్యను మరింత జఠిలం చేసినవే. మానవులకు ఎదురయిన ఉన్న సకల సమస్యలకు పరిష్కారంగా సర్వలోక ప్రభువయిన అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అవతరింప జేశాడు. ”అల్లాహ్‌ ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, భయ పెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికిగాను వారి వెంట (ప్రవక్తల వెంట) సత్యబద్ధమయిన గ్రంథాలను పంపాడు”. (అల్‌ బఖరహ్‌: 213) అలా అల్లాహ్‌ అవతరిమపజేసిన గ్రంథాలలో అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌. కాబట్టి ఖుర్‌ఆన్‌ను మానవాళి సమస్యలకు పరిష్కారం పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

Related Post