Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

మరణాంతర జీవితం వాస్తవికత

మీలో  సత్కర్మలు  చేసేవారెవరో, దుష్కర్మలు చేసేవారెవరో పరీక్షించి చూడాలని  మీకు జీవన్మరానలకు  ప్రసాదించాను.   దివ్య ఖుర్ఆన్(67:3) పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు.  నేను మిమ్మల్ని పరిక్షించడానికే  సృష్టించాను. మీరంతా  నా వైపే  మరలవలసి  వుంది.    దివ్య ఖుర్ఆన్ (21:35)

మీలో సత్కర్మలు చేసేవారెవరో, దుష్కర్మలు చేసేవారెవరో పరీక్షించి చూడాలని మీకు జీవన్మరానలకు ప్రసాదించాను. దివ్య ఖుర్ఆన్(67:3)
పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నేను మిమ్మల్ని పరిక్షించడానికే సృష్టించాను. మీరంతా నా వైపే మరలవలసి వుంది.
దివ్య ఖుర్ఆన్ (21:35)

ఐ ఎమ్ పి

సత్యాన్ని అన్వేషించేవారి మనస్సు లో చిక్కు ప్రశ్న ఏమిటంటే మనిషి మరణించి మట్టిలో కలసి పాయిన తర్వాత మరొక జీవితం ఉందా? ఇహలోకంలో చేసుకున్న కర్మలకు పరలోకంలో శిక్షలు ఉంటాయా?
సోదరులారా! ఒక్కసారి ఈ విషయాల పై పరిశీలన చేద్దాం రండి.

1) ప్రక్రుతి ధర్మం (Nature Law) ఏమిటంటే ఏ విత్తు నాటితే అదే మొక్క మొలవాలి. మంచి మొక్క నాటితే దానికి మంచి పంట పండాలి. అలాగే చెదు మొక్క నాటితే చెడు పంట పండాలి. కాని ప్రపంచంలో అలా జరగటం లేదు. ఉదాహరణకు ఈ ప్రపంచంలో అనేక నేరాలు చేసే వారు హాయిగా జీవితం గడుపుతున్నారు. అమాయకులు మంచివారు అనేక కష్టాలు కడగండ్లతో జీవిస్తున్నారు. ప్రక్రుతి ధర్మం ప్రకారం మంచి వారికీ మంచి జరగాలి. చెడ్డవారికి చెడు జరగాలి. కాని అలా జరగడంలేదు. అంటే ఇది ఇహలోకంలో జరగడం లేదు. కాబట్టి పరలోకంలో తప్పకుండా జరుగుతుందని విశ్వసించవచ్చు.

2) ఈ ప్రపంచంలో సరైన న్యాయం జరగడంలేదని వాస్తవం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని హత్య చేసిన వాడికి ఒక ఉరి శిక్ష లేదా ఒక జీవిత ఖైదు వేస్తే వంద మందిని చంపిన వాడికి వంద ఉరిశిక్షలు లేదా వంద జీవిత ఖైడులు విధించాలి. ఇదే ప్రకృతి ధర్మం. కాని ఇది ప్రపంచంలో సాధ్యం కాదు. దీనికోసం ఖచ్చితంగా పరలోకం ఉండి ఉండాలి.

3) ఈ ప్రపంచంలో అనేక మంది అమాయకులు హత్య చేయబడుతున్నారు. అనేక మంది అత్యాచారాలకు గురౌతున్నారు. వీరికి సరైన న్యాయం జరగకుండానే, చెడ్డవారికి శిక్ష పడకుండానే ఇహలోకం గడిచి పోతుంది. పరలోకం లేకపోతే మంచి, చెడులకు, ధర్మం, అధర్మాలకు అర్ధం లేదు.

మానవులకు చావు పుట్టుకలు ఏందుకు ఇవ్వబడ్డాయి?
దేవుడు మానవులను పరిక్షించడానికే సృష్టించాడు. ఆయన మానవులకు శాశ్వతమైన ప్రతిఫలం (స్వర్గం) ఇవ్వడానికి , తాత్కాలికమైన జీవితాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు.
ఉదా :- ఖుర్ఆన్ వాఖ్యాన్ని గమనించండి.
మీలో సత్కర్మలు చేసేవారెవరో, దుష్కర్మలు చేసేవారెవరో పరీక్షించి చూడాలని మీకు జీవన్మరానలకు ప్రసాదించాను. దివ్య ఖుర్ఆన్(67:3)
పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నేను మిమ్మల్ని పరిక్షించడానికే సృష్టించాను. మీరంతా నా వైపే మరలవలసి వుంది.
దివ్య ఖుర్ఆన్ (21:35)
ఫమయ్యమల్ మిస్ఖాల జర్రతిన్ ఖైరైయ్యర వమయ్యామల్ మిస్ఖాల జర్రతిన్ షర్రైయ్యర – మీలో ఇసుమంత తప్పు చేసినా దాని ప్రతిఫలం పొందుతారు. ఇసుమంత మంచి పని చేసినా దాని ప్రతిఫలం పొందుతారు. దివ్య ఖుర్ఆన్ (99:7)

మరణాంతర జీవితం గురించి ధార్మిక గ్రంధాలు ఏమి చెబుతున్నాయి
1) ఈ ప్రజలు ఇలా అంటారు. మేము మట్టిలో కలిసి పోయి నశించి పోయిన తరువాత మళ్లీ మేము సమాధులలో నుండి బ్రతికించి లేప బడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ నిజదేవుణ్ణి కలుసుకోవడాన్ని తిరస్కరిస్తున్నారు. వారితో ఇలా అను ” మీపై నియమించబడిన మృత్యు దూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటాడు. తరువాత మీరు మీ ప్రభువు వైపుకు మరలింపబడతారు. (ఖుర్ ఆన్ 32: 10-11)
2) ప్రళయం నాడు ఆయన మిమ్మల్ని తప్పకుండ సమావేశ పరుస్తాడు. ఇది అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేని యదార్ధం.
That we will gather you together for the Day of Judgment, there is no doubt whatever, it is they who have lost their own souls, that will not believe (ఖుర్ ఆన్ 6: 12)
3)For those who reject their Lord (and Cherisher) is the chastisement of Hell and evil is (such) destination.
తమ ప్రభువును తిరస్కరించినవారికి నరకయాతన తద్ద్యం. అది అత్యంత చెడ్డ గమ్య స్థలం! (ఖుర్ ఆన్ 67:6)

4)Those who disbelieve, among the people of the book and among the polytheists, will be in Hell-Fire, to dwell there in (for ever). They are the worst of creatures.
గ్రంధవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరి కంటే చెడ్డ వారు.
(ఖుర్ ఆన్ 98:6)
5) ఓ అర్జునా సమస్త ప్రాణి కోట్లు ప్రళయ కాలమున నా ప్రకృతిని జేరి అందు అణిగిఉందును. తిరిగి సృష్టి కాలమున దానిని నేను మరల సృజించుచున్నాను.

All the end of the millennium all material manifestations enter into my nature, and at the beginning of another millennium, by My potency, I create them again. (గీతా 9: 7)

6) దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదురు.

The time is coming when all the dead will hear his voice and come out of their graves : those who have done good will rise and live, and those who have done evil will rise and be condemned. (బైబిల్ యోహాను 5:28-29)

7) అవిశ్వాసులు నిత్య శిక్షకును నీటిమంతులు నిత్యజీవమునకు పోవుదురు. ( మత్తయి 25: 46)

These, then, will be sent off to eternal punishment, but the righteous will go to eternal life (మత్తయి 25:46)
పునరుద్ధానము లేక పునర్జన్మ ఉందా?
పునర్జన్మ (పునర్+ జన్మ) అనే పదానికి మరల పుట్టుక అనే కాని మరల మరల పుట్టుక అని మాత్రం కాదు. మనషికి ఒకేసారి పుట్టుక వుంది. ఆ తర్వాత మరణం ఉంది. ఆ తరువాత ప్రళయం రోజున మరణించి శిధిలమైన మానవుణ్ణి అల్లాహ్ తిరిగి పుట్టిస్తాడు( సమాధుల నుండి బ్రతికించి లేపుతాడు). ఆ తరువాత అతని దగ్గర తనజీవితంలో చేసిన కర్మల లేక్కతీసుకుంటాడు. (నిజంగా జన్మచక్రము అనేది వుంటే గ్రంధాలలో చెప్పబడిన శాశ్వతస్వర్గము, శాశ్వతనరకము, అనే పదాలకు అర్ధం లెధు.) ఆ తర్వాత అతని జీవితం లో చేసిన కర్మల లెక్క తీసుకుంటాడు. అతని కర్మల ప్రకారం అతనికి శాశ్వతస్వర్గము, లేదా శాశ్వత నరకాన్ని నిర్ణయిస్తాడు.

Note: డా।। సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ నెం 1 వ గ్రంధం (పేజి 113-116) ప్రకారం వేదాలలో పునర్జన్మ సిద్ధాంతం లేదు, లభించదు అని చెప్పారు. రచయిత సత్యార్ధ విద్యాలంకార్ పురంజన్మ గ్రంధం (పేజి నెం 104) లో వేదాలలో పునర్జన్మ అనేది లేదు. ఈ విషయం గురించి నేను పందెం కూడా వేయగలను అని చెప్పడం జరిగింది.
వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

పరలోకాన్ని వ్యతిరేకించే కొందరి నమ్మకాల్లో ఓ నమ్మకం “పునర్జన్మ” సిద్ధాంతం.ఈ విశ్వాసం లేక సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని,తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొక్కప్పుడు ఏదో ఒక జంతువుగానో,కీటకంగానో లేక చెట్టు చేమల రూపంలోనో జన్మించి మరల,మరల ఈ లోకంలోకే వస్తాడు అన్నది.ఈ సిద్ధాంతం ఓ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.గ్రీకు,రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు.ఈజిఫ్ట్ ప్రాచీన చరిత్రలోను ఈ విశ్వాసం కానవస్తుంది.వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోను ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది.మన భారతదేశంలోని హిందువుల్లోను,జైనుల్లోను,
బౌద్ధుల్లోను దీనికి మంచి ప్రాచుర్యం లభించింది.ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటినీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు.
పునర్జన్మ సిద్ధాంతం పరలోక సిద్ధాంతానికి వ్యతిరేకమే కాకుండా దీనివల్ల మతానికి,మత భావాలకు కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది.ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే నాగరికులు,విద్యావంతులు అనబడే వారి దృష్టిలో దీనికి ఎలాంటి విలువే ఉండదు.మతం ఓ శక్తిగా మారి అది పైకొచ్చే మార్గాలన్నీ మూసివేయబడతాయి.ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు సైతం దీన్ని తమ ఆచరణలో పెట్టకుండా దూరంగానే ఉంచుతున్నారు.దాన్ని తమ నిజజీవితంలో ఆచరించడం లేదు,ఆచరించనూలేరు.
పునర్జన్మ విశ్వాసంలో సాధారణ ప్రజలకు ఎంతో కొంత ఆసక్తి,ఆకర్షణ ఉండడానికి కారణం,కేవలం ఈ విశ్వాసం ద్వారా మనిషి సంబంధం తన జన్మభూమి నుండి తెగిపోకుండా ఉండడమే;అతడు మరణించినతరువాత కూడా ఏదో ఒక రూపంలో ఈ ప్రపంచంతో సంబధం కలిగి ఉంటాడన్న భావమే.ఈ ధరిత్రి ఎడల అతనికున్న అనురాగం,మమకారం,ప్రేమ అతణ్ణి జరుగబోయేదాని గురించి ఆలోచించే అవ్కాశమే ఇవ్వవు.అసలు జీవితం పరిమితమైన ఈ ప్రపంచం కంటే అనేక రెట్లు అధికమని తెలిస్తే ఎంత బాగుంటుంది!
పునర్జన్మ సిద్ధాంతం గురించి సహేతుకమైన,ఆచరణయోగ్యమైన దృష్టికోణాలతో సంగ్రంగా పరిశీలించే అవకాశం ఇక్కడ లేకపోయినా ఓ మౌలిక విషయం వైపు మాత్రం దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తాను.జంతు,వృక్షశాస్త్ర అధ్యయనం వల్ల మనకు తెలిసేదేమిటంటే,వృక్ష సంతతి మాట అటుంచి కేవలం జంతుజాలాలు ,మనిషి నడుమ ఉన్న వ్యత్యాసమే భర్తీ చేయ వీలులేనటువంటిదని,వృక్ష సంతతి మరియు జంతు సంతతిలో స్పృహ అనేదే లేదు అని తెలుస్తుంది.తన గురించి తాను అర్ధం చేసుకునే స్పృహ కేవలం మనిషిలోనే ఉంది.ఏ జంతువులోనో,ఏ చెట్టులోనో మనిషి ఆత్మ,తాను జంతువు రూపంలోనో,చెట్టుచేమల రూపంలోనో ఉన్నానని,తాను చేసిన దుష్కృత్యాలకు ఫలితం ఇలా ఈ రూపంలో లభిస్తుందని ఎలా తెలుసుకోగలరు?
మనిషి ఆత్మ,స్పృహరహితమైన జంతువు లేక వృక్షం ఆత్మగా మార్చబడి శిక్షించబడుతోంది అని ఏ ప్రబుద్దుడైనా అంటే,మనిషి ఆత్మ,జంతువు ఆత్మకు ఉన్న తేడా ప్రకారం,ఓ మనిషి ఆత్మ,జంతువు ఆత్మగా మార్చబడితే మోదట దానికి ఉన్న వ్యక్తిత్వంగాని,శక్తిగాని దానికి ఉండదు అని అతడు గ్రహించాలి.ఇలా జరిగినప్పుడు మరో ఆత్మ ఉనికిలోనికి వస్తుంది.ఆ వ్యక్తిత్వంగాని,ఆ ఆత్మగాని ఉండకపోతే శ్క్షించబడేదెవరు? చెట్లు,జంతువులు వగైరాలు పూర్వజన్మ దుష్కృతం వల్ల శిక్షల రూపంలో ఉనికిలోనికి వచ్చాయి అని మనం ఒప్పుకున్నా ఆ శిక్ష మానవాత్మలకు కాదు,శిక్షకు అర్హులు కానటువంటి ఇతర అమాయక ఆత్మలకు లభిస్తోంది.ఈ చెట్టుచేమలు,జంతుజాలం మనిషికి గొప్ప వరాలు.అవి పాపాల ఫలితంగానే ఉనికిలోనికి వచ్చాయి అని అనడం,వాటిపై అభాండాలు వేసి అత్యాచారం చేసినట్లే.పాప ఫలితంగా మనకు ఈ వరాలు లభిస్తాయి అని అనుకుంటే ఈ పాపం మానవత్వానికి మానవజాతికి ఎంతో అవ్సరం అని అనక తప్పదు.సరికదా మానవ మనుగడ,ప్రపంచ అందచందాలు ఈ పాపాల ఫలితంగానే సాగుతున్నాయని కూడా చెప్పవచ్చు.ఈ నేపధ్యంలో,మన హృదయాల్లో దైవం కోసం రవ్వంత కృతజ్ఞతాభావం కూడా పొడసూపదు.మనం ఈ ప్రపంచాన్ని,ఇక్కడి వరాలను వనరులను,వనరుల్ని మరో దృష్టితో చూడాల్సి వస్తుంది.పేదసాదల్ని,కష్టాల్లో కడగండ్లలో జీవితం నెట్టుకువచ్చేవారిని,పాపాత్ములని,వీళ్లు పాపాత్ములు కాకపోతే వీరికి ఈ స్ధితి దాపురించేదే కాదు అని అనుకోవలసివచ్చేది మనం.

పునర్జన్మ సిద్ధాంతం వేద బోధనలకు కూడా వ్యతిరేకమే.వేదాల్ని అధ్యయనం చేస్తే,ఆర్యులు పరలోకాన్ని నమ్మేవారని తెలుస్తోంది.వారి విశ్వాసం ప్రకారం మరణానంతరం మనిషికి మరో జీవితం లభిస్తుందని,అది మనిషి కర్మలకు అనుగుణంగా మేలైనదైనా,కీడైనదైనా అయివుండవచ్చు.

“మంత్రం” మరియు బ్రాహ్మణాల్లోను “పితృలోక” విశ్వాసం ఉంది.ఆ విశ్వాసంలో పునర్జన్మకు తావేలేదు.ఆ తరువాతి “సూత్ర”కాలంలో,పితృలోక విశ్వాసానికి తోడు పునర్జన్మ సిద్ధాంతం కూడా చోటుచేసుకుంది.ఆ తరువాత పురాణ కాలం నాటికి పితృలోక విశ్వాసంతో పాటు పునర్జన్మ విశ్వాసం చెరిసమంగా మనకు కానవస్తాయి.వేదాలు పునర్జన్మను నమ్మవు.ఇది యదార్ధం.ఎవరైతే వేదాల నుండి పునర్జన్మ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారో,వారు న్యాయంగా వ్యవహరించరు.కొందరైతే ఖుర్ ఆన్ నుండి కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని సాధించే ప్రయత్నం చేశారు.కాని వారి ఈ ప్రయత్నాలకు సత్యంతో ఎలాంటి సంబంధం లేదు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన గ్రంధం
“ఇండియన్ ఫిలాసఫీ”సంపుటం-1లోని 113-116 పేజీల్లో,
వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లభించదు అని రాశారు.ఇలాగే అనేక మంది హిందూ విద్వాన్సుల భావం కూడా అదే.
ప్రాచ్యమతాల ప్రఖ్యాత అధ్యయనకర్త “మూక్స్ ముల్లర్” వేదాలను అధ్యయనం చేసిన తరువాత,”వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం అనేదే లేదు అందు పరలోకవాదమే లభిన్స్తుంది” అని రాశాడు.
వేదాల్లో ఇలా ఉంది:
“వారు పరలోకాన్ని మరచి,బుద్ధీజ్ఞానాలను వదిలేసి మాచే నిర్ణయించబడ్డ హద్దులను దాటే ప్రయత్నం చేస్తున్నారు.” [ఋగ్వేదం-1:3-4]

“గుర్రానికి ప్రతిదినం గడ్డి ఎలా కేటాయించబడుతుందో ఓ అగ్నీ!ధనాన్ని [కూడగట్టి]భద్రపరిచే వారి నుండి అంతిమ దినం నాడు నేను లెఖ్ఖ గైకొంటాను” [యజుర్వేదం-50:11-75]

సత్యార్ధ విద్యాలంకార్ ఇలా రాశారు:
“వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు.ఈ విషయం గురించి నేను జూదం కూడా ఆడగలను [బెట్టుకాస్తాను]” పునర్జన్మ:పేజి.104

డా.పరాడా చౌహాన్ ఇలా రాశారు:
“వేదాల్లో పునర్జన్మ గురించి ఉంది.అయితే అందులో ఈ జన్మ తరువాత కేవలం ఒకే ఒక జన్మ గురించి రాసుంది.వేలాది జన్మ గురించి కాదు.” [పునర్జన్మ మరియు వేదాలు:పేజి.93]

వేదాల్లో ఇలా ఉంది:
“అగ్ని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సూర్యుణ్ణి పొందే ప్రయత్నం చేయండి.మాతరిశ్వుడు,భృగుడు అనేవాళ్లు మా ద్వారానే రెండు జన్మలను తెలుసుకొని నమ్మారు.” [ఋగ్వేదం:1-11-1]

మరణానంతర జీవితం గురించి ఖుర్ ఆన్ ఇచ్చిన ప్రస్ఫుటమైన విశ్వాసం ప్రకారం,పై వేదమంత్రాలు సత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.తత్సంబంధమైన ఊహాగానాలకు బదులు దైవవాణి ద్వారానే ఈ విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చు.దివ్యఖురాన్ తన అనేక ప్రత్యేకతలకు తోడు “అల్ ముహైమిన్” కూడా అంటే గతించిన సర్వసత్య బోధనలను తనలో నిక్షిప్తం చేసుకున్న గ్రంధం అని అర్ధం.ఎవరైతే ఖురాన్ ను అధ్యయనం చేస్తారో వారు సకల ఆకాశ గ్రంధాలను [దైవగ్రంధాలను],సర్వప్రవక్తల మౌలిక బోధనలను అధ్యయనం చేసినట్లే.మౌలికంగా,ఖురాన్ మరే క్రొత్త సిద్ధాంతంతోగాని,మరే ఇతర క్రొత్త సందేశంతోగాని అవతరించలేదు.ఈ గ్రంధం ఎప్పుడైతే పరలోకాన్ని ధృవపరుస్తోందో, మరణానంతర జీవితానికి సంబంధించిన మూలసిద్ధాంతం కూడా సకల సత్యధర్మాలకు అదే అయి ఉండింది అని అర్ధం చేసుకోవచ్చు.సత్యధర్మం ఎల్లప్పుడు పరలోక విశ్వాసాన్నే బోధించింది అని అనడానికి,గత గ్రంధాల్లో తత్సంబంధమైన ఆధారాలు,బోధనలు లభిస్తాయి.ఇతర నమ్మకాలు,సిద్ధాంతాలన్నీ కేవలం మనుషుల మనోమస్తిష్కాల నుండి వెలువడ్డవే.
That we will gather you together for the Day of Judgment, there is no doubt whatever, it is they who have lost their own souls, that will not believe
అల్లాహ్ ప్రళయ దినాన మిమ్మల్నందిరిని సమీకరిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదు. కాని తమను తాము నష్టం లో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
(ఖుర్ ఆన్ 6:12)

All the end of the millennium all material manifestations enter into my nature, and at the beginning of another millennium, by My potency, I create them again.
సమస్త ప్రాణి కోటి ప్రళయ కాలమున ప్రకృతిని జేరి అందు అణిగిఉండును. తిరిగి సృష్టి కాలమున వారిని మరల నేను సృజించుచున్నాను.
(భగవద్గీత 9:7)
The time is coming when all the dead will hear his voice and come out of their graves : those who have done good will rise and live, and those who have done evil will rise and be condemned.
దీనికి ఆశ్చర్యపడకుడి! ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాదులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధానమునకు, కీడు చేసినవారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చుదురు. (యోహాను 5:28, 29)

Note: The life of this world is mortal, All people after their death will be gathered together to answer for their deeds. This message has reached us through religious scriptures.What will be the result of worshipping others besides the creator?
ఈ ప్రాపంచిక జీవితం అశాస్వతమైనది. ప్రతి ఒక్కరు వారి వారి కర్మల గురించి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. ఈ సందేశం మన ధార్మిక గ్రంధాల ద్వారా మనకు తెలిసింది. అయితే మన సృష్టి కర్తకు సాటి కల్ల్పిస్తే కలిగే పర్యవసానం ఏమిటి?

ETERNAL PUNISHMENT IN HELL:శాశ్వత నరకం

For those who reject their Lord (and Cherisher) is the chastisement of Hell and evil is (such) destination.
ఆ ప్రభువును తిరస్కరించినవారికి నరకయాతన తధ్యం. అదేంత చెడ్డ గమ్య స్థలం!?
(ఖుర్ ఆన్ 67:6)
Those who disbelieve, among the people of the book and among the polytheists, will be in Hell-Fire, to dwell there in (for ever). They are the worst of creatures.
గ్రంధావహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరి కంటే చెడ్డవారు.
(ఖుర్ ఆన్ 98:6)
Plunge the wicked in the depth, cast them into darkness that has no support, so that not one of them may ever return.
దుష్కార్యాలకు పాల్పడేవారిని లోతైన గోతిలోకి అంధకారంలో పదవేయండి. అక్కడ నుండి వారు బయటకు రాలేని విధంగా, వారిలో ఏ ఒక్కడూ ఏనాటికి తిరిగి బయటకు రాడు.
(ఋగ్వేదం 7:104:3)

But cowards, traitors, perverts, meirders, the immortal, those who practice magic and all liars – the place for them is the lake burning with fire and sulphur, which is the second death.
పిరికి వారును, అవిశ్వాసులును,మాన్త్రికులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరునూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలుపొందుదురు
(ప్రకటనలు 21:8)
What will be the result of worshipping only the true creator?
నిజ సృష్టి కర్తను మాత్రమె ఆరాధిస్తే ఫలితం ఏమిటి?

దేవుణ్ణి విశ్వసించి సత్కార్యాలు చేసే వాడికి శాశ్వత స్వర్గం
ETERNAL HEAVEN:

Those who have faith and do righteous deeds, they are the best of creatures. Their reward is with Allah : Gardens & Eternity,
ఎవరైతే విశ్వసించి మంచి కార్యాలు చేస్తారో వారే సృష్టిలో ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర నుండి శాస్వతమైన ఉద్యానవనాలు ఉన్నాయి.
(ఖుర్ ఆన్ 98:7,8)
Place me is the deathless undecaying world where the light of heaven is set and everlasting custre shines
(ఋగ్వేదం 9:113:7)
Heaven is where no man grows old. No one there will ever tast death.
అవిశ్వాసులు నిత్య శిక్షకునూ, నీతి మంతులు నిత్య జీవమునకును పోవుదురు. (మత్తయి 25:46)

What will be the result of living life according to our own will?
మన ఇష్టం వచ్చి నట్లు జీవితం గడిపితే కలిగే పర్యవసానం ఏమిటి?

Ya shastra vidhi mustrujya
varthaate kaama kaaratah
na sa siddihi mahapokti
na sukham na param gatim.

न शास्त्र विधि मुस्रुज्य
वरताते काम कारतः
न स सिद्दिहि महापोक्ति
न सुखम न परम गतिम् (Bhagvad Geetha 16:23)

He who id cards the scriptures and acts according to his own will attains neither perfection, nor happiness, nor the supreme destination.
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి పెట్టి తన ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివారు పురుషార్దసిద్దిని గాని, సుఖమునుగాని, ఉత్తమ గతియగు మోక్షము గాని పొందనేరడు.

Tri-vedam navakasyuedam
dvaram nasanam atmanah
kamah drodhas tatha lobhas
tasmad etat trayam.
त्रि वेदम नवकासयुएदम
द्वारम नासनम् आत्मानः
कामः द्रोदास ताथा लोभास
तस्मद एतत त्रयम
కామము,క్రోధము,లోభము అను ఈ మూడునూ మూడు విధములగు నరక ద్వారములు. ఇవి జీవులకు నాశనము కలుగ జేయును, కాబట్టి ఈ మూడింటిని విడనాడ వలెను. (భగవద్ గీత 16:21)

నేడు నీకాజ్ఞాపించు సమస్త ఆజ్ఞలు కట్టడములు,నీవు అనుసరించని యెడల నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. (ద్వితియోపదేశ కాండము 28:15)

మా వాక్యాలను తిరస్కరించిన వారికోసం మేము నరకాగ్ని సిద్దం చేసే ఉంచాము. (ఖుర్ ఆన్ 4:57)

Related Post