సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించండి!

Originally posted 2016-05-15 11:59:03.

ఆ ప్రకారం దేవుడు ఒక్కడే. సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. మానవుల మార్గదర్శకత్వానికి ఈ భూమ్మీద అవతరించిన దేవుని గ్రంధాలన్నీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లోనూ ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది.

ఆ ప్రకారం దేవుడు ఒక్కడే. సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. మానవుల మార్గదర్శకత్వానికి ఈ భూమ్మీద అవతరించిన దేవుని గ్రంధాలన్నీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లోనూ ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది.

పరిచయం:

“సృష్టిని” ఆరాధించాలా?

“సృష్టికర్త”ను (నిజ దేవుణ్ణి) ఆరాధించాలా?

….. ఇది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం. ఈ నిర్ణయం పైనే మానవుని తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. విశ్వాన్ని సృష్టించిన దేవుడు మానవులమైన మనందరికీ బుద్దినీ, ఆలోచనను, అవగాహన శక్తిని అనుగ్రహించాడు. కనుక “ఆరాధన” విషయంలో మానవులు చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. సాధారణంగా ఈ విషయానికి సంబంధించి ఎన్నో రకాల సాక్ష్యాధారాలు మన ముందుకు వస్తుంటాయి. అయితే వాటిని విశ్లేషించే క్రమంలో మనలోని భావోద్వేగాలు మన మీద అనుకూల లేక ప్రతికూల ప్రభావాలు చూపుతుంటాయి. ఇటువంటి భావోద్వేగాలకు అతీతంగా, నిస్పక్షపాతంగా సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి అత్యంత సవ్యమైన ఆరాధనా మార్గాన్ని ఎంపిక చేసుకోవటం మనిషి కర్తవ్యమ్. ఇక ఈ నిర్ణయానికి విరుద్ధమైన నిదర్శనాలు ముందుకు రానంతవరకూ అదే నిర్ణయంపై తిరుగులేని విశ్వాసాన్ని కనబరచటం ఆవశ్యం.

సృష్టి ప్రారంభం నుంచి నేటిదాకా ఈ యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు. ఇది నిజం. సృష్టి చరిత్రలో ఎన్నటికీ తిరుగులేని ఏకైక సత్యం. పాఠక మహాశయులకు ఈ సత్యాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించే ప్రయత్నమే ఈ చిరుపుస్తకం.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్పేరుతో

అందరికీ ఉపయోగకర సందేశం

మిత్రమా!

నువేప్పుడైన ఈ విషయాల గరించి, అసలు కాసేపైనా ఆలోచించావా? చూడు! భౌతికంగా ఈ ప్రపంచం శరవేగంగా ముందకు దూసుకు వెళుతుంది. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు మునుపెన్నడూ లేని విధంగా ఆధునీకరించ బడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో కంప్యుటరీకరించబడుతోంది. ఒకప్పుడు భూ ఉపరితలం మీద నిలుచొని నిశీధి వీధిలో గారాలు పోతున్న చందమామ వంక వింతగా చూశాడు మనిషి. మరి అదే మనిషి ఈ రోజు చంద్రమండలంపై నిశ్చింతగా అడుగు పెట్టగలుగుతున్నాడు. అవునంటీ! మానవుడు ప్రగతి చెందాడు. విపరీతమైన అభివృద్ధి గడిందాడు. కాని మీరు గమనించారో లేదో! అదే సమయంలో మానవుడు ఎంతగానో, మరెంతగానో, ఇంకేంతగానో నిస్సహాయునిగానూ మారిపోతున్నాడు. ఒక్కసారి మీ పరిసరాలను పరీక్షించి చూడండి! మనిషి సాటి మనిషికే బద్ధ శత్రువైపోయాడు. అమానుష చర్యలన్నిటికీ అతను అలవాటుపడ్డాడు. వెరసి అన్ని రకాల సామాజిక నేరాలకు, ఘోరాలకు బలవుతునాడు. చెడుల చెట్టుగా, పాపాల పుట్టగా పరిణమించాడు. ఫలితంగా సమాజంలో దుర్మార్గం విపరీతంగా వ్యాపిస్తూ పోతుంది చివరికి సద్గుణాలకు స్థానం లేని, నైతిక విలువలకు ప్రాముఖ్యత లేని తరుణం సంభవించింది.

ఒక్క క్షణం ఆగండి! మీ పరిసరాలను నిశితంగా పరిశీలించండి. మీ పర్యావరణాన్ని క్షుణ్ణంగా పరికించండి. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, ఆకాశం, గ్రహాలూ, చెట్లు, కొండలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఆ వ్యవస్థలో ఎటువంటి అపసవ్యత లేదు. ఎందుకో తెలుసా? అవి తమ సృష్టికర్త తమ కొరకు నిర్ణయించిన మార్గాన్ని అనుసరిస్తునాయి. నిజదేవుడు నిర్దేశించిన ప్రకృతి నియమాలకు విధేయత చూపుతున్నాయి. మరి వాస్తవానికి వాటిని సృష్టించినవాడూ, మనల్ని సృష్టించిన వాడూ ఒక్కడే. మన గుంతుల్ని తడిపే నీరు ఒక్కటే. మానవుఅలమైన మనదరి నరాల్లో ప్రవహించే రక్తం ఒక్కటే. క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఆకాసాలలో, భూగోళంలో ఉన్న జీవులన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే.

మనందరి సృష్టికర్త ఒకాడే అయినప్పుడు, ఆ సృష్టికర్తకు సంబంధించి ప్రజలలో వివిధ భావనలు ఎలా పుట్టుకొచ్చాయి? అసలు దేవుడు తన గురించి స్వయంగా, అత్యంత స్పష్టంగా నిర్వచించి చెప్పినప్పుడు మానవులు మిధ్యా దైవాలను ఆశ్రయించవలసిన ఏముంది? ఇలాంటివి ఆలోచనాపరులను అనుక్షణం తొలిచే ప్రశ్నలు. బుర్రకు కాస్తంత పని పడితే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటం ఏ మాత్రం కష్టం కాదు. మూడు ముక్కల్లో చెప్పాలంటే, మానవుడు దేవుని విషయంలో పూర్తిగా అజ్ఞానానికి లోనయి ఉన్నాడు. జగతిలో అడుగడుగునా అగుపించే వాస్తవాలను వెనక్కి నెట్టేసి కేవలం ఊహా లోకంలో విహరిస్తునాడు. తేటమైన నిజాలను వదిలేసి ఊహలను, అపోహలను అనుసరిస్తున్నాడు.

ఇంకో విషయం సుమండీ!

తల్లి కడుపును చించుకొని ఈ భూమ్మీదకు వచ్చే శిశువు మొట్టమొదటగా ఈ లోకంలో ఏం చేస్తుంది?

ఏడుస్తుందా…. ?
పాలుతాగుతుందా…. ?

లేదు. మొట్టమొదటగా అది ఈ భూమ్మీద పడగానే శ్వాస తీసుకుంటుంది. ఎయిడ్ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరూ జీవించలేరు. మరి ఈ శ్వాసించే శక్తి కూడా ఒక జీవికి ఎవరు ఇచ్చారండీ? సందేహం లేదు. సర్వశక్తి మంతుడైన సృష్టికర్తే. ఆయన ఈ విస్వాన్నంతటినీ ఉనికిలొకి తెచ్చిన నిరుపమాన శక్తిమంతుడు.

శిశువును పుట్టించేది, ఆ శిశువు శ్వాసించే శక్తియుక్తులను ప్రసాదించేది ఆయనే. ఆ చిన్నిశ్వాస లేకపోతె ఏ చినారీ ఈ లోకంలో బతికి బట్టకట్టలేదు. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ జరిగే క్రియల్లో అత్యంత ప్రధానమైనది ఈ శ్వాసక్రియ. అదే లేనప్పుడు జీవులు కాలగర్భంలో కలసిపోవటానికి కొన్ని క్షణాలు కూడా పట్టదు. గాలి పీల్చాలని మనం సంకల్పించుకోము. అందులో మన ప్రమేయం ఏమాత్రం ఉండదు. అయినా ప్రమేయరహితంగానే, అసంకల్పితంగానే మానవులమైన మనం అనుక్షణం గాలిని లోనికి పీలుస్తున్నాం. బయటికి విడుస్తున్నాం. ఆక్సిజన్ వాయువును లోనికి పీల్చుకుని, కార్బన్ డై ఆక్సైడ్ ను బయటికి విడిచే ఈ ప్రక్రియ మన ఇష్టా ఇష్టా లతో నిమిత్తం లేకుండానే జరిగిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ సృష్టికర్త ఆజ్ఞలకు అనుగుణంగా నడుస్తోంది. జీవన్మరణాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మనుషుల చేతుల్లో ఏమి లేదు. నక్షత్ర మండలాలు, యావత్తు విశ్వంలోని సమస్త విషయాలు ఆయన ఆజ్ఞలకు, అనుజ్ఞలకు లోబడి మసలుకుంటాయి.

సృష్టికర్త మనకు జీవితం ఇచ్చాడు! మన మనుగడకు అవసరమైన ప్రతి వస్తువునూ ప్రసాదించాడు. అందుకు మనం ఆయనకు కృతజ్ఞులుగా, ఆత్మార్పితులుగా మసలుకునే కనీస విధిని కూడా నిర్వర్తిన్చలేమా?

నిర్వర్తిన్చాగలం.

నిర్వర్తించగలగాలి.

తప్పకుండా చేయాలి.

అది మానవుని ప్రప్రధమ కర్తవ్యం. జీవితపు మొట్టమొదటి విధి.

మరి ఆయనకు కృతజ్ఞత చూపటమెలా ? అంటే ముందుగా మనం ఆయన శక్తిని అంగీకరించాలి. అనంతమైన ఆయన బలాదిక్యత ముందు వినమ్రంగా తలవంచాలి. తర్వాత ఆయన్ని సంపూర్ణమైన, సవ్యమైన భావనలతో గుర్తించాలి. అలా చేయాలంటే దైవత్వపు భావన మన కళ్ళముందు స్పష్టంగా ఉండాలి కదా! అందుకే వివిధ ధర్మాలలో, దైవిక గ్రంధాలలో ప్రస్తావించి ఉన్న “దైవ భావనలోని వాస్తవికతను” ముందుగా మనం అర్ధం చేసుకోవాలి.

ఆ భావన ప్రకారం దేవుడు ఒక్కడే. సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. మానవుల మార్గదర్శకత్వానికి ఈ భూమ్మీద అవతరించిన దేవుని గ్రంధాలన్నీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లోనూ ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది.

“ఏకం బ్రహ్మం, ద్వితీయ నస్తనెన్ ననస్తే కించన్”

అర్ధం …

“దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అసలు లేనే లేడు, కొంచెం కూడా లేడు.

ఇక ఈ క్రింద పేర్కొనబడిన వేదాలు, ఉపనిషత్తులు పై సూత్రానికి సజీవ సాక్ష్యాలు:

“ఏకం యెవద్వితీయం” (एकम यवद्वितीयम) ఛాందోగ్య ఉపనిషత్తు (6:2:1)

“ఆయన ఒక్కడే రెండవ వాడు లేడు”

“న చస్య కశ్చిత్ జనిత నచాదిపః” (न चास्य कश्चित् नचादिपः) శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6:9)

“ఆయన పై అధిపతులు, యజమానులు లేరు”

అని వుంది. అంటే సర్వశక్తి సంపన్నుడు అయిన దవానికి తల్లిగాని, తండ్రిగాని లేరు. ఆయనకంటే ఉన్నతుడెవరూ లేరు అని అర్ధం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోనే 4వ అధ్యాయము, 19వ మంత్రంలో ఇలా చెప్పబడింది.

“న తస్య ప్రతిమ ఆస్తి” (न तस्य प्रतिम अस्थि) శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:19)

“ఆయనకు ఎలాంటి ప్రతిమ, ప్రతిరూపము లేదు”

“న సందృశే తిష్ఠతి రూపమస్య ( न सन्द्रुसे तिष्ठति रूपमस्य శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:20)
న చక్షుసా పశ్చతికశ్చనైనమ్” न चक्षुपा पश्चाति कस्च नैनम)
“ఆయన రూపము ఎవరి కళ్ళలోనూ ఇమడదు, ఆయన్ని ఏ కళ్ళూ చూడలేవు”

బైబిల్ కూడా ఏక దైవారాధనా ప్రబోధనలకు అతీతం కాదు. కొత్త నిబంధనలో ఇలా ఉంది.

“మరియు భూమిపైన ఎవరికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడేమీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు.” (మత్తయి 23:9)

మరో చోట …

“కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు?”
(యెషయా 40:18)

నిజదేవుని రూపురేఖలను ఊహించటం మనిషితరం కాదని ఇంకో వాక్యం కుండబద్దలు చేసింది.

“మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు”
(యోహాను 5:37)

ఇక దేవుని అంతిమ దైవ గ్రంధమైన “దివ్యఖుర్’ఆన్” కూడా అత్యంత సులువైన మాటల్లో దేవుని భావనను ఈ విధంగా విశదీకరించింది.

قل هو الله أحد الله اصمد لم يلد ولم يولد

(ولم يكن له كفو أحد (سورة الإخلاص

“ప్రవక్తా! ఇలా అను “అల్లాహ్ యే ఏకైక దైవం. ఆయన నిరాపెక్షా పరుడ. ఆయనకు సంతానము లేదు. ఆయన ఒకరికి సంతానము కాదు. ఆయనకు పోల్చదగినది ఏది లేదు”.

పవిత్ర ఖుర్’ఆన్ లో దైవాన్ని గురించి ఇవ్వబడిన 4 వాక్యాల నిర్వచనమిది.ఈ నిర్వచనంలో ఇమడ దగిన శక్తి ఏదైనా ఉంటే ఆ శక్తినే మనం దైవంగా అంగీకరించవచ్చు.

ఈ విధంగా మనం ముందుగా దేవుడు ఒక్కడేనని ఆ ఒక్క దేవుడు తప్ప మరో దేవుడు లేడన్న నిజమైన అభిప్రాయానికి రావాలి. ఆ ఒక్క నిజదేవునికే మన అరాధనలను అంకితము చేసుకోవాలి. ఆయన తప్ప మరో వస్తువూ మన ఆరాధనకు అర్హమైనది కాదన్న సత్యాన్ని గ్రహించాలి. సృష్టికర్తను వదిలి ఇతరులను ఆరాధించే వ్యక్తి అంధకారంలో ఉన్నాడని, అతను అపమార్గంలో పయనిస్తునాడని మనం ఆప్రమత్తం కావాలి.

సృష్టిరాసులను పూజించేవారు మార్గభ్రష్టులని వేదాలు ఖరాఖండిగా చెప్పేసాయి. ఈ భూమ్మీద సృష్టికర్తను వదలి ప్రకృతి వస్తువులను పూజించే వారిని క్రింద పేర్కొనబడిన యజుర్వేద మంత్రం ఇలా హెచ్చరిస్తుంది.

యజుర్వేదం లోని అధ్యాయం 9వ మంత్రంలో …

“ఆంధః తమ ప్రవిశ్యంతి యే ఆసంభూతి ముపాసతే” अन्धः तम प्रविष्यन्ति ये असम्भूति मुपासते

‘ఆసంభూతి (గాలి, నీరు, నిప్పులాంటి సహజ అంశాన్ని) ఆరాధించే వ్యక్తులు చీకటిలోకి ప్రవేసిస్తునారు’ అంటే నరకంలోకి ప్రవేశిస్తారు అని అర్ధం. (యజుర్వేదం 40:9)

ఆ తర్వాత అదే అధ్యాయం లో

“తతో భూయ యివతే తమోయో ఊ సంభూత్యాగరతః” “ततो भूय इवते तमोयो ऊ सम्भू त्यागरतः”

సంభూతి అంటే ఆట వస్తువులు, బొమ్మలు, విగ్రహాలు. వీటిని ఎవరైతే ఆరాధిస్తారో వారు మరింత అంధకారంలోకి అంటే మరింత నరకంలోకి ప్రవేశిస్తారని అర్ధం.(యజుర్వేదం 40:9)

ఈ భూమ్మీద దేవుని తరపున చిట్టచివరిగా అవతరించిన దివ్యగ్రంధం “ఖుర్’ఆన్” కూడా ఈ విషయాన్నే స్పష్తీకరిస్తుంది. చూడండి.

“భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతాపంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి, దానికి తగ్గట్టుగా – దాని లెక్కను నిర్ధారించాడు.” (ఖుర్’ఆన్ 25:2)

ఖుర్’ఆన్ లోని మరో వచనం దేవుని భావనను గురించి ఇలా తెలుపుతుంది:

“వారు అల్లాహ్ ను వదిలి (బూటకపు) దేవుళ్ళను కల్పించుకునారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్ళు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించ బడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు” (ఖుర్’ఆన్ 25:3)

ఖుర్’ఆన్ లోని ఇంకో వచనం నిజదేవుని లక్షణాలను వివరించి, ఆయన ఒక్కడే ఆరాధనలకు ఏకైక అర్హుడని తేల్చి చెప్పింది.

“అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేదు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ, నిర్\ద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.” (ఖుర్’ఆన్ 2:255)

“అల్లాహ్ యే ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడూ, మరే సిఫారసు చేసే వాడూ లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటీ?” (ఖుర్’ఆన్ 32:4)

దీని గురించి ఆలోచించండి

మనకు ఆహారం ప్రసాదిస్తున్నది ఆయన.

ఆయనకు దాహం వేయదు. ఆకలి అసలే ఉండదు. ఆహారం తీసుకుంటేనే ఆయన మనుగడ సాగుతుందన్న విషయం కూడా ఏమీ లేదు. సాధారణంగా జనం దేవునికి నైవేద్యం సమపించుకుంటారు. నైవేద్యాన్ని విగ్రహాల ముందు ఉంచి దేవతలా ద్వారా అది స్వీకరించబడుతుందని, తమ కోరికలు నెరవేరతాయని వారు భావిస్తారు.

కాని వాస్తవం ఏమిటో తెలుసా? ఆ విగ్రహాలు తినలేవు. కనీసం వాసన కూడా చూడలేవు.

ధర్మ గ్రంధాలు మానవాళికి నిజమైన మార్గదర్శకాలు. అవి ఇలాంటి అజ్ఞాన పోకదలన్నింటినీ ఖండిస్తాయి. నిజమైన సృష్టికర్త, విశ్వ ప్రభువుకే ఆరాధనలను అంకితం చేసుకోమని మనిషికి ప్రబోదిస్తాయి. మానవమాత్రులు మాటలకు, భావాలకు, తత్వాలకు ప్రభావితులై అపమార్గాన పడవద్దనీ, అపనంమకాలతో, మూఢ వైఖరితో జీవించవద్దని హితువు పలుకుతాయి.

మనిషి సంమార్గంపై నడవాలి. అతను ఈ భూమ్మీద దేవుడు సూచించిన నిజమైన పద్ధతిలో జీవించాలి. అందుకే ఆకాశగ్రంధాలు అవతరించాయి. దేవుని తరపున అవతరించిన ప్రవక్తలు కూడా అదే మార్గంలో ఆకాశ గ్రంధాలలోని సందేశాన్ని ప్రచారం చేశారు. ప్రవక్తలు సామాన్య ప్రజలకు జీవిత నిజాలను, సృష్టి నిజాలను తెలియపరచడంలో ఈ గ్రంధాలు ఏంతో ఉపకరించాయి. ఆ ఆకాశగ్రందాల బోధనలకు అనుగుణంగా నడుచుకున్నవారే ఇహలోకంలోనూ విజయం సాధించ గలుగుతారు. ఇహపర లోకాలలో ముక్తికి ఏకైక మార్గం అదే.

మరి అలాంటప్పుడు ఆకాశ గ్రంధాలు చూపించిన మార్గంలో జీవితం గడపవలసిన అవసరం లేదంటారా?

దైనందిన జీవితంలో మనం ప్రతి విషయం గురించి ఏంతో ఆలోచిస్తాం. ఐహిక జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి పలుమార్లు పరిసీలించుకుంటాం. ఆ రంగానికి సంబంధించిన నిపుణుల దగ్గర సలహాలు కూడా తీసుకుంటాం. అందుకోసం అవసరమైన ప్రతి చోటకూ పరిగేట్టుతాం. ప్రాపంచిక విషయాల్లోనైతే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం.

కాని దురదృష్టం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవిత విషయాల్లో మనం నిర్లక్ష్యం పాటిస్తాం. అసలు వాటికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మరి నిజానికి ఆ జీవితం శాశ్వతమైనది. అన్ని దివ్యగ్రంధాలు ప్రస్తావించిన పరలోక జీవితం అదే!

సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఆలోచించటానికి బుద్ధిని ప్రసాదించాడు. ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే స్పృహను అనుగ్రహించాడు. ఆయన ఈ విస్వాన్నంతటినీ సృష్టించాడు. మానవులను పరీక్షించడానికి వారిని ఈ భూమ్మీద నివసింపజేసాడు.

ఏకైక ప్రభువు నిర్మించిన ఈ విశ్వంలో ఒకే రకమైన ప్రకృతి నియమాలు సర్వవ్యాపితమై ఉన్నాయి. ఒకసారి వాటిమీద యోచన చేయండి. తమను సృష్టించిన నాటి నుంచే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక్క క్షణమైనా ఆగకుండా తిరుగుతూ పోతున్నాయి. అవి తమ కక్ష్యల్ని ఏనాడు తప్పలేదు. తూర్పున ఉదయించి పడమటన అస్తమించడం సూర్యుని విధి. అది ఏనాడు తన విధిని అతిక్రమించలేదు. అలాగే అంతరిక్షంలోని గ్రహాలూ, నక్షత్రాలన్నీ కూడా సక్రమంగా నిర్మించబడ్డాయి. తమ ప్రభువు కొరకు నిర్ణయించిన ప్రకృతి చట్టాలను అవి నిక్కచ్చిగా అనుసరిస్తున్నాయి.

మిత్రమా!

మనిషి పుట్టుక గురించి (అంటే అతని పూత్తుక ఎలా జరిగింది? అతను ఎలా పెరిగి పెద్దవాడవుతున్నాడు? ఎలా చనిపోతున్నాడు? మొదలైన వాటి గురించి) కాస్త ఆలోచించు! సృష్టిలోని అతి ముఖ్య మూలకాలైన గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మొదలైన వాటి గురించి కూడా కాస్త ఆలోచించు! రెండు కోణాల్లో నువ్వు ఈ విషయాల గురించి ఆలోచన చేయాలి.

1. కాలం

100 సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆలోచించు. 1000 ఏండ్లు వెనక్కి వెళ్లి ప్రకృతిని పరిశీలించు. 1,00,000 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పరిసోధించు. సృష్టి ప్రారంభం నాటి పరిస్థితిని సమీక్షించు!

2. ప్రదేశం

ఇండియా, నేపాల్, అమెరికా, బ్రిటన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, జపాన్ మొదలగు ప్రదేశాలను పరిగణలోకి తీసుకుని మరీ ఆలోచించు.
పైన పేర్కొన్న కాలక్రమంలో మనిషి పుట్టుక చెప్పుకోదగ్గ రీతిలో ఎప్పుడైనా మార్పులకు లోనయిందా?
వివిధ ప్రదేశాలను బట్టి మానవుని పుట్టుకలో తేడాలు ఏమైనా కనబడుతున్నాయా?
దీనికి మీ సమాధానం ఏమిటి?

అవుననా?……. లేదనా?

నిశ్చయంగా “లేదు” అనే మీ సమాధానం కావాలి. ఎందుకంటే కాలాలకు, ప్రదేశాలకు అతీతంగా మనిషి పుట్టుక ప్రక్రియ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. మనిషి తన తల్లి కడుపు నుంచి బయటికి రాగానే తన అంతర్గత అవయవాలతో సహా మానవ దేహం పెరగనారంభిస్తుంది. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే,….

పైన పేర్కొనబడిన కాల వ్యవధుల్లో గాలి, నీరు, అగ్ని మొదలైన వాటి లక్షణాల్లో ఏమైనా తేడాలు కనపడుతున్నాయా?
పైన పేర్కొనబడిన వివిధ ప్రదేశాల్లో గాలి, నీరు, అగ్ని మొదలైన వాటి లక్షణాలు వివిధ కరాలుగా ఉంటున్నాయా?
దీనికి మీ సమాధానం ఏమిటి?

అవుననా? కాదనా?………… “కాదు” అనే కదా?!

కారణం ఏమిటంటే,

1. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి భ్రమణలు కాలక్రమంలో మార్పు చెందుతూ వస్తున్నట్లయితే మన తాతముత్తాతల నాటి సమయ గణనకు ఈ నాటి కాల గణనకు మధ్య విపరీతమైన వ్యత్యాసాలుండేవి. సెకన్ల, నిమిషాల, గంటల సంఖ్యలో ఆనాటికి – ఈనాటికి అస్సలు పోలికలుండేవి కావు. మన సెకన్ల సంఖ్యకు మన తాతల కాలం నాటి సెకన్ల సంఖ్యకు, మన నిమిషాల సంఖ్యకు మన తాతలనాటి నిమిషాల సంఖ్యకు, మన గంటల సంఖ్యకు మన తాతలనాటి గంటలకు మధ్య చాలా తేడాలుండేవి.

2. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి భ్రమణాలు ప్రదేశాలను బట్టి మారుతున్నట్లయితే మన దేశంలో నిమిషానికి 60 సేకన్లూ, గంటకు అరవై నిమిషాలూ ఉంటె దేశంలో ఉండేవి.

కాని కాలాలు, ప్రదేశాలకు అతీతంగా మనందరికీ ఈ సంఖ్యా ఒకేలా ఉంటుంది. కనుక దీని ద్వారా తెలిసిందేమిటంటే, వీటిని సృష్టించిన , ఏనాటికీ ఒక్కడే. ఆయనే నిజ దైవం. మన ఆరాధనలకు ఏకైక అర్హుడు. సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఉనికిలో అస్సలు మార్పు రాలేదు. ప్రకృతిపై యోచన చేసి, సత్యాన్ని గ్రహించాలని దాదాపు అన్ని గ్రంధాలలోనూ పరమ ప్రభువు స్వయంగా పదేపదే నొక్కి చెప్పాడు. ఖుర్’ఆన్ ఇలా సెలవిస్తుంది:

” ఒంటెలు ఎలా సృష్టించ బడ్డాయో వారు చూడటం లేదా? ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు లేదా? పర్వతాలు ఎలా పాతి పెట్టబడ్డాయో తెలకించడం లేదా? భూమి ఎలా (విశాలంగా) పరచబడి ఉన్నదో వారు వీక్షించటం లేదా? కనుక (ఓ ప్రవక్తా!) నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు. నీవు హితబోధ చేసే వాడివి మాత్రమే.” (ఖుర్’ఆన్ 88:17-21)

కాని దురదృష్టం ఏమిటంటే మానవులు అమాయకత్వానికీ, అజ్ఞానానికి గురయ్యారు. ఈ అజ్ఞానమే మనిషిని అపసవ్యమైన, అనుచితమైన వైఖరి వైపుకు లాక్కేళుతుంది.

నా ప్రియ స్నేహితులారా!

తోటి మానవుల సంక్షేమాన్ని కోరే ఓ శ్రేయోభిలాషిగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. దీని గురించి మీరు మరో మారు ఆలోచించని. మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ సత్యానికి దూరం కాకండి. ఆలోచించి సత్యాన్ని గ్రహించగల బుద్దీజ్ఞానాలను దేవుడు ఇచ్చాడు. ఈ దివ్య మార్గ దర్శకాలు అందజేస్తున్న గురించి యోచన చేయండి. వాటిని క్షుణ్ణంగా చదవండి. బాగా అధ్యయనం చేయండి. వాటి లోతుల్లోకి వెళ్లి పరిశీలించండి. సూక్షంగాఆలోచించండి . , అత్యంత సమంజసమైన ఒక ఆలోచన మన మేధో లోకంలో ప్రతిఫలించవచ్చు. సత్యానికి సంబంధించిన ఓ చిరుదివ్వె మన అంతర్యాలలో వెలగవచ్చు.

సత్యం విజయానికి నాంది సత్యం సుగుణమే అది!
అసత్యం అపజయానికి దారితీస్తుంది. ఎందుకంటే
అంతం అసత్యపు గుణం కనుక!
ఇప్పుడు మనం ఇంకో అడుగు ముందుకేసి ధార్మిక గ్రంధాల ప్రకారంగా దేవుని ఏకత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

హిందూ మతంలో దేవుని భావన

1. హిందూ ప్రజానీకంలో దేవుని భావన!

సాధారణంగా హిందూమతం అంటేనే బహుదైవత్వపు మతంగా భావించ బడుతుంది. చాలా మంది హిందువులు తాము అనేకమంది దేవుల్లపై విశ్వాసం కలిగివుండటం చేత ఈ విషయాన్ని నిస్సంకోచంగానే ఒప్పుకుంటారు. కొంతమంది హిందువులు ముగ్గురు దేవుళ్ళ భావనలో విశ్వాసం కలిగి ఉంటారు. కొందరు ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. ఇంకొంతమంది ముప్ఫై మూడు కోట్ల దేవతలపై విశ్వాసం. అయితే విద్యావంతులైన హిందువులు, తమ దివ్య గ్రంధాలను బాగా అధ్యయనం చేసిన హిందువులు మాత్రం కేవలం ఒకే ఒక్క దేవుణ్ణి మాత్రమే విశ్వసించాలని, ఆయన్నే ఆరాధించాలని బల్ల గుద్ది చెబుతారు.

దేవుణ్ణి అర్ధం చేసుకోవటంలో ముస్లింలకు – హిందువులకు మధ్య ఉన్న భేదాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. భగవంతుడు – సృష్టి, రెండూ వేరు వేరు కావని హిందువులు భావిస్తారు. వారి ప్రకారం సృష్టిలోని ప్రతి వస్తువు, అది సజీవమైనదైనా, నిర్జెవమైనదైనా సాక్షాత్తు అది భగవద్ స్వరూపమే! కనుకనే సగటు హిందువు ప్రతి వస్తువును దేవినిగా తలుస్తాడు. అతని దృష్టిలో చెట్లు, పుట్టలు, రాళ్ళు, రెప్పలు, చంద్రుడు, సూర్యుడు, కోతులు, పాములు అన్నీ భగవద్ స్వరూపాలు. చివరకు మనిషి కూడా దైవాంశమే!

ఇస్లాం బోధన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మనిషి తననూ, తన చుట్టుప్రక్కల ఉన్న వస్తువులను కేవలం ‘దేవుని సృష్టి’గా మాత్రమే చూడాలని ఇస్లాం ధర్మం చేబుతుంది. అవి భగవద్ స్వరూపాలు ససేమిరా కావంటుంది. అందుకుని ముస్లింలు సృష్టిలోని వసువులన్నింటినీ దేవుడు సృష్టించినవిగా మాత్రమే గుర్తిస్తారు. మరో మాటలో చెప్పాలంటే సృష్టి మొత్తం దేవునికి చెందినదని ముస్లింల నమ్మకం. చేట్లుపుట్టలు, రాళ్ళురప్పలు, సూర్యచంద్రులు, కోతులు, పాములు, మనుషులు అందరూ దేవునికి చెందిన వారు, దేవుని దాసులు.

2. హిందూ మాత గ్రందాల ప్రకారం దేవుని భావన!

హిందూ మత గ్రంధాలను పరిశీలిస్తే వాస్తవానికి హిందూ మతంలో దేవుని భావన ఏమిటో మనకు అర్ధం అవుతుంది.
భగవద్గీత

హిందూ మత గ్రంధాలన్నిటిలో కెల్లా ప్రఖ్యాతిగాంచినది భగవద్గీత.

“ఎవరి బుద్ధినయితే భౌతిక వాంఛలు ఆవహిస్తాయో వారు చిల్లర దేవుళ్ళకు ఆత్మా సమర్పణ చేసుకుంటారు. ఇంకా స్వయం కల్పిత ఆరాధనా విధానాల ద్వారా ప్రత్యేక నియమాలను, నిబంధనలను అనుసరిస్తారు.”(భగవద్గీత 7:20)

భౌతికవాదులైన ప్రజలు నిజదేవున్ని వదలి మిధ్యాదేవుళ్ళను పూజిస్తారని పై భగవద్గీత వాక్యం చెబుతుంది.

“కామము, క్రోధము, మూడును మూడు విధములగు నరక ద్వారములు. ఇవి జీవునకు నాశనము కలుగజేయును. కాబట్టి ఈ మూడింటిని విడనాడవలెను. ” (భగవద్గీత 16:21)

దేవుడు అవతరింపజేసినా గ్రంధాలను మనం చదవాలి. ఆ గ్రంధాలలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు అనుగుణంగా మనం జీవితం గడపాలి. మనొవాంఛలకు దాసులై జీవించకూడదు. గీతోపదేశం. క్రింద పేర్కొనబడిన భగవద్గీత వాక్యాలను గమనించండి.

“ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిన్చునో అట్టివాడు పురుషార్ధ సిద్ధిని గాని ఉత్తమ గతియగు మోక్షమును గాని పొందనేరడు.” (భగవద్గీత 16:23)

ఆ తర్వాతి వాక్యం ఇలా అంటుంది.

“ఏది చెయ్యవచ్చు? ఏది చేయకూడదు అన్న కార్యాకార్య విచక్షణలో శాస్త్రమే నీకు ప్రమాణం! శాస్త్ర ప్రమాణంగా చెప్పబడినది ఏదో విశదంగా తెలుసుకో! అలా,శాస్త్రోక్తమైన కర్మలనే కర్యాకర్యములు తెలిసి ఉత్తమగతిని పొందు ” (భగవద్గీత 16:24)

ఉపనిషత్తులు

హిందువులు ఉపనిషత్తులను తమ పవిత్ర గ్రంధాలుగా భావిస్తారు.

ఈ క్రింద పేర్కొనబడిన ఉపనిషత్ దైవత్వ భావనను విశదీకరిస్తున్నాయి.

“ఏకం యెవద్వితీయం” (एकम यवद्वितीयम) ఛాందోగ్య ఉపనిషత్తు (6:2:1)

“ఆయన ఒక్కడే రెండవ వాడు లేడు”

“న చస్య కశ్చిత్ జనిత నచాదిపః” (न चास्य कश्चित् नचादिपः) శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6:9)

“ఆయన పై అధిపతులు, యజమానులు లేరు”

అని వుంది. అంటే సర్వశక్తి సంపన్నుడు అయిన దవానికి తల్లిగాని, తండ్రిగాని లేరు. ఆయనకంటే ఉన్నతుడెవరూ లేరు అని అర్ధం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోనే 4వ అధ్యాయము, 19వ మంత్రంలో ఇలా చెప్పబడింది.

“న తస్య ప్రతిమ ఆస్తి” (न तस्य प्रतिम अस्थि) శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:19)

“ఆయనకు ఎలాంటి ప్రతిమ, ప్రతిరూపము లేదు”

“న సందృశే తిష్ఠతి రూపమస్య ( न सन्द्रुसे तिष्ठति रूपमस्य శ్వేతాశ్వతర ఉపనిషత్తు (4:20)
న చక్షుసా పశ్చతికశ్చనైనమ్” न चक्षुपा पश्चाति कस्च नैनम)

“ఆయన రూపము ఎవరి కళ్ళలోనూ ఇమడదు, ఆయన్ని ఏ కళ్ళూ చూడలేవు”

వేదాలు
హిందూ మత గ్రంధాలన్నిటిలోనూ వేదాలు అత్యంత పవిత్రమైనవిగా, పుణ్యప్రదమైనవిగా భావించబడతాయి. ప్రధానంగా నాలుగు వేదాలు ఉన్నాయి.

1. ఋగ్వేదం

ఋగ్వేదం వేదాలన్నిటిలో ప్రాచీనమైనది. హిందువుల చేత అత్యంత పవిత్రంగా భావించబడే మతగ్రంధాల్లో ఒకటి. ఋగ్వేదంలో ఇలా ఉంది.

వేదాల్లో కెలా ప్రచీనమైనదీ, పవిత్రమైనదీ అయిన రుగ్వేదంలో మొదటి పుస్తకం, 164వ సూక్తంలో 46వ మంత్రం ఇలా చెబుతుంది.

“ఏకం సద్ విప్రా బహుదా వదంతే” एकम सद विप्र बहुदा वदंते (ఋగ్వేదం 1:164:46)

“సత్యం ఒక్కటే; దైవం ఒక్కడే; ఋషులు ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తారు” (ఋగ్వేదం 1:164:46)

దైవం అంటే విష్ణు అని, ఆయన పాముతల పై శయనిస్తాడని, సముద్రంలో నిడురిస్తాదని, గాలిలో గరుడ పక్షి పై ప్రయానిస్తాడని ఆయనకు నాలుగు చేతులు, ఒక చేతిలో విష్ణుచక్రం, మరో చేతిలో సంఖం ఉంటాయని వర్ణిస్తే మాత్రం పోరాబాటవుతుంది.

ఎందుకంటే అలా వర్ణించడం వేదాలకు, ఉపనిషత్తులకు వ్యతిరేకం. వేదాలలో ఉపనిషత్తులలో ఆయనకు ప్రతిమ గాని, ప్రతిరూపం గాని లెవనీ ఉంది.

“ఆయన ఒక్కరినే స్తోత్రం చేయండి ఆయనే ఆరాధనలకు అర్హుడు” (ఋగ్వేదం 8:1:1)

“యఏక ఇత్తము ష్తుహి” य येक इत्तमु शतुही (ఋగ్వేదం 6:45:16)

“ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలి”

హిందూ మత బ్రహ్మ సూత్రం

“ఏకం బ్రహ్మం, ద్వితీయ నస్తనెన్ ననస్తే కించన్”

అర్ధం …

“దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అసలు లేనే లేడు, కొంచెం కూడా లేడు.

నిజదైవం తప్ప మరో దేవుడు లేదని పైన పేర్కొనబడిన ఋగ్వేద మంత్రాలు చాలా స్పష్టంగా ఘోషిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు. ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తే ఆ నిజదేవుడు. కనుక మనం నిజదైవం స్థానంలో వేరొకర్ని ఆరాధించే ముందు దీనిగురించి చిత్తశుద్ధితో యోచించాలి.

మన కర్మలు దేవుడు అవతరింపజేసినా గ్రందాల ప్రబోధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నప్పుడు మనం సన్మార్గంలో ఉన్నామని ఎలా చెప్పగలం? పరలోకంలో ముక్తి పొడగాలమని ఎలా ఆశించగలం? చెప్పండి. ఎటువంటి పక్షపాతానికి లోనుకాకుండా హిందూ ధర్మ గ్రంధాలను అధ్యయనం చేసినప్పుడు మాత్రమే హిందూ మతంలోని వాస్తవ దైవ భావనను మనం అర్ధం చేసుకోగలం.

యజుర్వేదం

సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మానవ శరీరాలతో అభివర్ణించతానని కూడా యజుర్వేడంలోని ఈ క్రింది సూక్తులు ఖండిస్తున్నాయి.

“న తస్య ప్రతిమ ఆస్థి”

“ఆయనకు పోలిక ఎవరూ లేరు” (యజుర్వేదం 32:3)

విష్ణువు అనేది ఋగ్వేదంలో దేవుని గురించి ప్రస్తావించబడిన మరో అందమైన గుణం. ఇది ఋగ్వేదం రెండవ పుస్తకంలో ఉంది. “విష్ణు”ను మన భాషలోనైతే “ప్రభువు” అని చెప్పుకోవచ్చు. దాన్నే అరబీ భాషలోకి అనువదిస్తే “రాబ్బ్” అవుంతుంది. ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి ‘రాబ్బ్’ అని పిలిచినా లేక “ప్రభువు” అని పిలిచినా, “విష్ణువు” అని పలికినా ఆయనకు అభ్యంతరం ఉండదు. కాని ‘విష్ణువు’ అనగానే సామాన్య ప్రజల ఊహల్లోకి ఒక ప్రత్యేకమైన ఆదారం వస్తునిడ్. ఆ ఆకారానికి నాలుగు చేతులుంటాయి. ఒక కుడి చేతిలో చక్రం ఉంటుంది. ఒక ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. ఆ ఆకారం ఒక పక్షి మీద స్వారీ చేస్తూ ఉంటుంది. విష్ణువు అని చెప్పి ఆ విధంగా ఊహించుకోవటానికి మాత్రం అస్సలు అనుమతి లేదు. అలా చేయటాన్ని నిజదైవం ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించడు. ఇంతకు ముందు చెప్పబడినట్లు ఇది శ్వేతాస్వతర ఉపనిషత్తు 4:19 వాక్యానికి విరుద్ధం.

“షుధామ పోష్విధం” —- “ఆయనకు శరీరము లేదు. ఆయన పరిశుద్ధుడు” (యజుర్వేదం 40:8)
యజుర్వేదం లోని అధ్యాయం 9వ మంత్రంలో …

“ఆంధః తమ ప్రవిశ్యంతి యే ఆసంభూతి ముపాసతే” अन्धः तम प्रविष्यन्ति ये असम्भूति मुपासते

‘ఆసంభూతి (గాలి, నీరు, నిప్పులాంటి సహజ అంశాన్ని) ఆరాధించే వ్యక్తులు చీకటిలోకి ప్రవేసిస్తునారు’ అంటే నరకంలోకి ప్రవేశిస్తారు అని అర్ధం. (యజుర్వేదం 40:9)

ఆ తర్వాత అదే అధ్యాయం లో

“తతో భూయ యివతే తమోయో ఊ సంభూత్యాగరతః” “ततो भूय इवते तमोयो ऊ सम्भू त्यागरतः”

సంభూతి అంటే ఆట వస్తువులు, బొమ్మలు, విగ్రహాలు. వీటిని ఎవరైతే ఆరాధిస్తారో వారు మరింత అంధకారంలోకి అంటే మరింత నరకంలోకి ప్రవేశిస్తారని అర్ధం.(యజుర్వేదం 40:9)

“అప్పుడు విరాట్ ను సృష్టించడం జరిగింది.” “ఆ తర్వాత భూమి సృష్టించబడింది”(యజుర్వేదం 31)

“ఆదిలో హిరణ్యగర్భ్య, అనగా ఏకైక సృష్టికర్త ఉన్నాడు. ఆయన సూర్యుణ్ణి, భూమిని పోషిస్తున్నాడు. శుభప్రదమైన ఆయన్ని మేము ప్రస్తుతిస్తున్నాము ” (యజుర్వేదం 13:4)

గాయత్రి మంత్రం వాస్తవికత

ఓం భూర్ భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయః

“ఓ దేవా! ఓ సచ్చిదానందా! ఓ నిత్యసుద్ధుడా! శుభప్రదమైనవాడా! జన్మమరణాది క్లేశరహితుడా! నిరాకారుడా! సర్వజ్ఞుడా! అన్నీ ఎరిగినవాడా! ప్రభువా! విశ్వపాలకుడా! ఓ సర్వాంతర్యామీ! ఓ కృపా సాగరా! నీవు విశ్వానికి జీవానివి. నీవు శుభప్రదమైన వాడివి. మా దుఃఖాలను, బాధలను చెరిపివేయడానికి నీ ఒక్క చూపు చాలు. నీవు విశ్వానికి ప్రభువువి. సర్వ సర్వసృష్టికర్తవి. నీ పవిత్ర ఆధిక్యతను గూర్చి నీకు యోగ్య మైన రీతిలో నిన్ను ప్రస్తుతించుదుమా?! నీవు మా బుద్ధికి సరైన మార్గం చూపేటందులకు. నీవు మా దేవుడివి. మా స్తోత్రానికి, మా పూజకు ఏకైక అర్హుడివి. నీకు సరిసమానమైనవాడు, నీకంటే ఉన్నతమైన వాడు మరేవడూ లేడు. నీవే మా సృష్టికర్తవు, పాలకుడవు, న్యాయ కారివి, నువ్వు మాత్రమే సంతోషాన్ని ప్రసాదించగలవు. (యజుర్వేదం 36:3)

ప్రియ మిత్రులారా!

పై వేద మంత్రంలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. దేవుడు ఒకే ఒక్కడు. ఆయనకు సరిసమానులు ఎవరో లేరు. మనం ఆయన్నోక్కణ్నే పూజించాలి, ఆరాధించాలి. ఇక్కడ గాయత్రి మంత్రం గురించి మరికొద్దిగా తెలుసుకుందాం. నిజానికి ఇదో వేద మంత్రం. అసలు “గాయత్రి” అనేది ఒక సంస్కృత పదం. ‘గాయ’మరియు ‘అత్రి’ అనే రెండు పదాలతో ఈ పదం సృజించబడింది.

గాయ : అంటే గొంతు నుండి వెలువడే స్వరం.

అత్రి : అంటే స్తుతి

ఆ విధంగా “గాయత్రి” అంటే మన స్వరంతో విశ్వ ప్రభువును స్తుతించటం అన్నమాట. ఈ మంత్రంలో దేవుడు సత్యాన్ని తేటతెల్లం చేస్తున్నాడు. తన ఉనికికి ఒక ప్రత్యెక రూపం అంటూ ఏమీ లేదని ఆయన స్వయంగా ఈ మంత్రంలో ప్రకటించాడు. కాని ప్రజలు ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా ప్రజలు చేస్తున్న మరో ఘోరం ఏమిటంటే, ‘గాయతి’ని వారు స్త్రీ రూపంగా భావించి ఆమెను ఆరాదిస్తునారు. కనుక “గాయత్రి” అనేది ఓ మిధ్యా దైవం. నిజదేవుని స్థానంలో ప్రజలు ఊహించుకుంటున్న ఓ కల్పితదైవం. మనుషులు చేస్తున్న ఈ అనాచారాన్ని సర్వశక్తి మంతుడైన దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు?!

“మహోన్నతుడైన పరిపాలకుని చేత ఈ విశ్వం సృజించబడింది, ఈ పూర్తి ప్రకృతి పరిధిలోని ప్రతి ప్రపంచం కూడాను ఆయన నిజదేవుడు. ఆయనకు భయపడండి. మానవులారా! ఏ సృష్టి ఉనికి సంపదను అన్యాయంగా దాచకండి. అన్యాయమైన ప్రతి విషయాన్నీ తిరస్కరించండి. స్వచ్చమైన ఆనందాన్ని అనుభవించండి. ” (యజుర్వేదం 40:1)

“ఓ మానవులారా! దేవుడు సృష్టికి పూర్వం కూడా ఉన్నాడు. సూర్యుడు మొదలగు తేజోవంతమైన లోకాల ప్రభువు, ఆధారభూతుడు ఆయన. సృష్టించబడిన దానికి, సృష్టించబోయేదానికి ఆయన యజమాని. అప్పుడూ ఉండేవాడు, ఇప్పుడు ఉండేవాడు. ఎప్పటికీ ఉంటాడు. పృథ్వి మొదలుకొని సూర్యలోకము వరకు ఆయన సమస్తాన్ని సృష్టించి వాటిని పోషిస్తున్నాడు. శాశ్వత శుభప్రదమైన అస్తిత్వం ఆయనది. మేము చేస్తున్నట్లు మీరందరూ కూడా ఆయన్నే ప్రస్తుతించాలి.” (యజుర్వేదం 13:4)

“ఆయన ఎన్నడూ ఏ సరీరంతోనూ అవతరించలేదు. ఆయన ఎన్నడూ జన్మించలేదు. ఆయన ఎన్నడూ విభజించబడడూ. వేర్వేరు కాడు. శరీరావయవాలు, నరాల వ్యవస్థకు అతీతుడాయన. ఆయన ఎన్నడూ ఏ తప్పూ చేయడు. ఆయనకు బాధ కలుగదు. దుఃఖం అంటదు. అజ్ఞానం లాంటి అవగుణాలు ఆయనివి కావు.” (యజుర్వేదం 30:8)

యజుర్వేదంలోని ఓ ప్రార్ధనా వాక్యం ఇలా ఉంటుంది.

“సుఖములు ఇచ్చేవాడవు, స్వప్రకాశవంతుడవు, సర్వజ్ఞుడవు అయిన ఓ ప్రభూ! నీవు మమ్మల్ని శ్రేష్ట మార్గములో నడిపించి మాకు సంపూర్ణ జ్ఞానమును ప్రసాదించు. కుటిల పాపాచరణ రూపమైన మార్గం నుంచి మమ్మల్ని దూరం చేయి.” (యజుర్వేదం 40:16)

ఖుర్’ఆన్ లోనూ సరిగ్గా ఇలాంటి ప్రార్దనే ఒకటుంది.

“మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి మార్గం, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు).” (ఖుర్’ఆన్ 1: 6-7)

సామవేదం:

“శరీరంలోని ప్రధాన శక్తులు మొత్తం శరీర వ్యవస్థను నియంత్రించినట్లు, దానిని పాలించినట్లు యావత్ విశ్వ వ్యవస్థను నియంత్రించే, దానిని పాలించే ఓ ప్రాణా! మేము నే సన్నిధిలో వంగుతున్నాము. (సామవేదం 7 : 3 : 8 : 1 6: 2 : 3 : 2)

అధర్వణ వేదం:

“దేవో మహా అసి” దేవుడు నిశ్చయంగా మహోన్నతుడు” (అధర్వణ వేదం 20:58:3)

“ఆయన ఇంద్రుడు (సర్వ శక్తి మంతుడు, సర్వాదిక్యుడు).” (అధర్వణ వేదం 11:2:1)

“దేవుడు కాలానికి అతీతుడు. వినాశనం లేనివాడు. సూర్యుడు, బూమి, ఇంకా ఇతర గ్రహాలన్నింటికీ పర్పోషకుడు.” (అధర్వణ వేదం 14:1:1)

భ్రమల చీకట్లను పారద్రోలే సుప్రభాతము!

“కౌసల్యా సుప్రజా రామా! కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా! రామా!

“పూర్వా సంధ్యా ప్రవర్తతే” సూర్యోదయానికి వేళ అవుతుంది.

“ఉత్తిష్తా! నరశార్దూలా” నరులలో పులివంటి వాడా! నిదుర లే!

“కర్తవ్యం దైవ మహ్నికం” ఆ దైవాన్ని ఆరాధించుట నీ ప్రధమ కర్తవ్యం.

ప్రియ మిత్రులారా!

పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాని మనలో చాలా మందికి ఆ వాక్యాల అర్ధం ఏమిటో తెలియదు. ఒకవేళ మనం పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలను ఒకసారి గనక క్షుణ్ణంగా చదివి అదం చేసుకుంటే, రాముడు కూడా మనలాంటి మానవ మాత్రుడేనని, తల్లి కౌసల్యకు పుట్టినటువంటి బిడ్డ అని, ఆయన స్వయంగా ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సర్వ సక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించేవారన్న సంగతి స్పష్టంగా మనకు బోధపడుతుంది.

మనం నిజంగా రాముడిని ప్రేమించే వరమైతే, ఆయన్ను అనుసరించాలని అభిలషిస్తున్నట్లయితే ముందుగ మనం ఆయన తన జీవితాంతం ఏ దేవున్నైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధించాలి.

క్రింద పెర్కొనబడుతున్న ఉపనిషత్ శ్లోకం దేవునికి తల్లిదండ్రులు లేరని స్పష్టం చేస్తోంది. కనుక రాముడు దేవుడు కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా ప్రతి రోజూ దైవిక విధులను ఆచరించి మనదరిని సృష్టించిన ఆ పరమ ప్రభువును ఆరాధిస్తూ ఉండేవారని తెలుస్తుంది.

“న చస్య కశ్చిత్ జనిత నచాదిపః” (न चास्य कश्चित् नचादिपः) శ్వేతాశ్వతర ఉపనిషత్తు (6:9)

“ఆయన పై అధిపతులు, యజమానులు లేరు”

సాయి బాబా ప్రవచనాలు

సాయి బాబా తన జీవితాంతం ఈ క్రింది ప్రవచనాలు తరచూ పలుకుతూ ఉండేవారు.

“సబ్ కా మాలిక్ ఏక హై” – “सब का मालिक एक है !” అందరి దేవుడు ఒక్కడే.

“అల్లాహ్ మాలిక్ హై” – “अल्लाह मालिक है!” అల్లాహ్ యే దేవుడు.

“అల్లాహ్ భలా కరేగా” – “अल्लाह भला करेगा!” అల్లాహ్ మాత్రమే మేలు చేస్తాడు.

మిత్రులారా!

సాయి బాబా ఒక ఫకీర్. ఓ నిజమైన ముస్లిం (విశ్వాసి). ఆయన ప్రతి రోజూ చేయవలసిన విధి నమాజులను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవారు. ఖుర్’ఆన్ చదివేవారు. ఉపవాసం పాటించేవారు. అవసరాల్లో ఉన్నవారికి సహాం చేసేవారు.

“ప్రతి రోజు ఉదయం సాయి బాబా చాలా పెందలకడనే నిద్ర లేస్తారు. అన్నింటి కంటే ముందు నమాజులు ఆచరిస్తారు.” (ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 139వ పేజి)

తానూ ఓ దైవదాసుడినేనని సాయి బాబా స్వయంగా చెప్పి ఉన్నారు.

“నేను దేవుని దాసుణ్ణి. దేవుడు ప్రభువు మరియు యజమాని” (ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి

బాబా ది మాస్టర్” 228వ పేజి)

దేవుని పేరు ప్రస్తుతించమని, ధర్మగ్రందాలను అధ్యయనం చేయమనీ సాయి బాబా ప్రజలను ఎల్లప్పుడూ బోధిస్తూ ఉండేవారు.

“పని చేయండి, దైవనామాన్ని స్మరించండి. ధర్మగ్రందాలు చదవండి. పరస్పరం విద్వేషాలు, జగడాలు మానుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడతారు.” (ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 232వ పేజి)

అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని సాయి బాబా చాలా స్పష్టంగా చెప్పారు.

“నిరు పేదలను కాపాడేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరో దేవుడు లేనే లేడు” (ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 235వ పేజి)

తాను అల్లాహ్ దాసున్ణని సాయి బాబా చెప్పుకునే వారు.

“నేను ఎవరికీ నౌకరును కాను. నేను కేవలం అల్లాహ్ దాసుణ్ణి” “అల్లాహ్ నామమే శాస్వతమైనది” (ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన “సాయి బాబా ది మాస్టర్” 236వ పేజి)

అయితే సాయి బాబా గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మనం అల్లాహ్ ను వదిలి పెట్టి సాయి బాబా ను ఎలా పూజించాగలం? మనం నిజంగా సాయి బాబాను ప్రేమిస్తున్నట్లయితే ముందు ఆయన బోధనలను ఆచరణలో పెట్టాలి. ఆయన జీవితం గడిపిన విధంగా మనమూ జీవితం గడపాలి. ఆయనే దేవుడైతే “సబ్ కా మాలిక్ ఏక్ హై ఎందుకు అంటారు? సబ్ క మాలిక్ మై హో అంటారు కదా? (అందరికీ దేవుణ్ణి నేనే అని) అంటారు కదా! కాని ఆయన జీవితంలో ఎన్నడు ఆ మాట చెప్పలేదు.

ప్రజలందరికీ ఇదే నా ఆహ్వానం

ప్రియమైన స్నేహితులారా!

ఖుర్’ఆన్ లోని అపురూపమైన ఓ వాక్యం ద్వారా నేను మిమ్మల్ని మరోసారి సత్యబద్ధమైన జీవన మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాను.

“విశ్వసించిన ఆ వ్యక్తే ఇలా అన్నాడు : ఓ నా జాతి ప్రజలారా! మీరు నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని మంచి మార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాను. ఓ నా జాతి వారలారా! ఈ ప్రాపంచిక జీవిత సౌఖ్యాలు తాత్కాలికమైనవి. పరలోకమే శాస్వతంగా ఉండే నిలయం. “ఎవడైనా పాపానికి పాల్పడితే దానికి సరిసమానమైన పాప ఫలమే అతనికి లభిస్తుంది. మరెవడయినా పుణ్య కార్యం చేస్తే అతడు పురుషుడైనా, స్త్రీ అయినా అతడు గనక విశ్వాసి అయివుంటే, అలాంటి వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారక్కడ లెక్కలేనంత ఉపాధిని పొందుతారు. ఓ నా జాతి జనులారా! నేను మిమ్మల్ని మోక్షం వైపునకు పిలుస్తుంటే, మీరు నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తారేమిటి? నేను అల్లాహ్ ను తిరస్కరించాలని, నేనేరుగని వాటిని ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాలని మీరు నన్ను ఆహ్వానిస్తుంటే, నేను మాత్రం మిమ్మల్ని అసాధారణ శక్తిశాలి, క్షమాశీలి వైపునకు ఆహ్వానిస్తున్నాను.

“మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారు ఇహలోకంలో గానీ, పరలోకంలోగానీ పిలువడానికి యోగ్యులు కారన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. మరి మనమంతా మరలి పోవలసింది అల్లాహ్ వద్దకే (అన్నది కూడా నిర్వివాదాంశమే). మరి బరితెగించి పోయేవారే నరక వాసులవుతారు. (అనేదే ముమ్మాటికి నిజం) “మున్ముందు మీరు నేను చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నేను మటుకు నా వ్యవహారాన్ని అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులన్దరినీ చూస్తూనే ఉన్నాడు” (ఖుర్’ఆన్ 40:38-43)

అత్యధిక హిందువులు చెప్పినట్లు హైందవం అనేది ఒక మతం కాదు. అదొక ధర్మం. అదొక సంస్కృతి. ఆ సంస్కృతిలో వేదాలు,ఉపనిషత్తులు, పురాణాలు, బ్రాహ్మణ గ్రంధాలు దివ్య గ్రంధాలుగా పెర్కొనబడతాయి. వాటిలోనూ వేదాలు అత్యంత పవిత్రమైనవి గానూ భావించ బడతాయి. అలాగే భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటివి మరికొన్ని కూడా హిందూ ధర్మ గ్రంధాలుగా ఉన్నాయి.

ఏదైనా మానవ సమాజం దేవుడు తనకు ప్రసాదించిన మార్గదర్శకత్వాన్ని ప్రక్కకు నెట్టేసి, మనోవాంఛలకు దాసొహమైపొయి, స్వీయ కోరికల వెంట పరిగెత్తి నప్పుడు ఇక ఆ సమాజానికి క్షీణదశ మొదలవుతుంది. క్రమంగా అది దైవత్వపు భావనలో భ్రష్టతకు దారి తీస్తుంది. హిందూ సమాజంలో అనేక దేవుళ్ళ పూజ ఇటువంటి భ్రష్టతకు నిలువెత్తు నిదర్శనం. నేడు హిందువులు అనుసరిస్తున్న విధానం స్వయాన వారి మత గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తుల ప్రబోధనలకు పూర్తిగా విరుద్ధం. వారి మత గ్రంధాలు కూడా వాస్తవానికి ఎవుని ఏకత్వ భావననే బోధించాయనడానికి వాటిలోని వాక్యాలే సజీవ సాక్ష్యాలు. ఇంకో విజ్ఞప్తి! నాడు హిందూ మతగ్రంధాలు ప్రబోధించిన వాస్తవ దైవ భావన మరేదో కాదండోయ్. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మానవాళికి అందించిన సందేశమే!

కనుక ఇకనైనా ఏకదైవారాధన వైపుకు, నిజదేవుని ఆరాధన వైపుకు మరలి రమ్మని తోటి సోదరులందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా మనకు మళ్ళీ గుర్తుచేసిన ఆ పాఠం వైపుకే నేను మిమ్మల్ని పిలుస్తున్నారు.

మరికొన్ని నిజాలను నిగ్గుతేల్చుదాం, రండి!

గాంధీ మహాత్ముడు తనదైన శైలిలో ఇలా రాశారు: “ఎవరో చెబుతుంటే విన్నాను, ఇస్లాం వ్యాప్తి దక్ష్నాఫ్రికాలోని యురోపియన్లను కలవర పెట్టిస్తోందని, అసలు ఇస్లాం ఎలాంటి ఉద్యమం అనుకుంటున్నారు? అది స్పెయిన్ ను నాగరికత గల దేశంగా మలచింది. అంధకారంలో చిక్కుకొని ఉన్న మొరాకోకు విజ్ఞానపు కరదీపికను అందించింది. ప్రపంచానికి సౌభాత్రుత్వపు సందేశాన్ని చాటిచెప్పింది. అలాంటి ఇస్లాం పేరు విని దక్షిణాఫ్రికన్లు తాము తెల్లదొరలతో సమానమే అని గొంతెత్తుతున్నందుకు కాబోలు. సోదర భావం అనేది పాపమా? వారు ఇస్లాం ను చూసి కలవర పడటానికి! ఒకవేళ జిజంగానే అది నల్లవాళ్ళ – తెల్లవాళ్ళ సమానత్వానికి సంబంధించినదయితే ఇక వారి భయం దేనిగురించో చెప్పనక్కర లేదు.

క్రైస్తవం, ఇస్లాం తర్వాత హిందూ మతం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద మతం. తన మతావలంబీకుల సంఖ్యా రీత్యా ఇది యావత్ ప్రపంచంలో తృతీయ స్థానంలో ఉంది. నేను నివసించే దేశంలోని అత్యధికులు ఆ మతావలంబీకులే ఉన్నారు. కాబట్టి ఈ విషయానికి నేను ఇంతటి ప్రాముఖ్యత ఇస్తున్నాను. అదీగాక హిందూ మతమే భారతీయతగా భావించుకుంటున్న రోజులివి. ఈ మతం ప్రపంచంలోని అతి ప్రాచీన మతం అని, దీని సంస్కృతి ప్రపంచంలో కెల్లా అతి ప్రాచీన సంస్కృతి అని స్వయాన ఈ మత అనుయాయుల్లోని మెజారిటి వర్గం అభిప్రాయపడుతుంది. పొతే భారత దేశంలో అతి పెద్ద మైనారిటీ వర్గం ముస్లిములదే. వారు దేశ జనాభాలో 12 నుంచి 15% మంది ఉన్నారు.
కాని ఇస్లాం వైఖరి ఇందుకు పూర్తిగా విభిన్నం. అది ఎన్నడూ తన పరిధిని కుంచింపచేసుకోలేదు. తానూ ఏదో ఒక ప్రాంతానికి లేక ప్రజలకు చెందినా సొత్తుగా ప్రకటించుకోలేదు. తొలినాటి నుంచే అది ఒక విశ్వవ్యాప్త సందేశాన్ని కలిగివుంది. మొదటి నుంచీ అది యావత్ మానవాళిని సంబోధిస్తూ వస్తుంది. మానవులందరినీ ఏక సమాజంగా పరిగణించింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా 1,2 బిలియన్ల కంటే ఎక్కువే. కాని ఇక్కడ విచిత్రం ఏమిటంటే ముస్లింలలో మెజారిటీ వర్గం అరబ్బేతరులదే. ఈ పరిస్థితి చెప్పకనే చెబుతుంది. ఇస్లాం యావత్ మానవాళికి దేవుని తరపు నుండి ఒక బహిరంగ ఆహ్వానం. ఇది వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక విషయం కాదు. సత్యాన్ని, న్యాయాన్ని పరిపాలించే ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తున్న ఓ క్రియాశీల ఉద్యమం . అది బోధిస్తున్నది అత్యంత స్వచ్చమైన సత్యం. “నిజదేవుడు తప్ప మీకు ఆరాధ్యుడు లేడు” అన్నది దీని ప్రాధమిక సూత్రం. ఇది ఇహలోకంలోను మరణానంతరం పరలోక శాశ్వత జీవితంలోనూ మన విజయానికి నాందీ వాచకం.

ఆలోచించవలసిన విషయం!

భూమ్యాకాశాల సృష్టికర్త అయిన ఏకైక దేవుడే ఈ లోకంలో మానవులను సృష్టించాడనీ, కనుక మానవులు ఆ ఏకైక దేవుణ్ణే ఆరాధించాలని ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఒకవేళ మానవులు ఆ నిజడైవాన్ని వదలి ఇతరత్రా వస్తువులను, ప్రాపంచిక శక్తులను పూజిస్తే పరలోకంలో అటువంటి వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయని కూడా మనం మాట్లాడు కున్నాం. ఒక్క దివ్య ఖుర్’ఆన్ మాత్రమే కాదు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు మత గ్రంధాలన్నీ ముక్త కంఠంతో దీని గురించి ఘోషిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక సందేహం మన మనసుల్ని పదే పదే ప్రశ్నిస్తుంది.

సృష్టికర్త అయిన నిజదేవుడు మానవులను పుట్టించి, వారికి ఎటువంటి మార్గదర్శకత్వం ఇవ్వకుండానే తనను పూజించని వారిని పరలోకంలో శిక్షించడం న్యాయమా?

కాదు, ముమ్మాటికి కాదు. ఒకరికి సరైన సమాచారం ఇవ్వకుండా వారి వాళ్ళ పొరబాటు జరిగినప్పుడు దాని మీద వారిని నిలదీయటం, వారి చర్యలను తప్పుబట్టటం, అందుకు వారిని శిక్షించటం న్యాయం కానేకాదు. మరి మానవులైన మనకే ఆ పని చాలా అన్యాయంగా తోస్తున్నప్పుడు, పరమ ప్రభువు చూస్తూ తన ప్రియదాసులపై అంత పెద్ద అన్యాయానికి ఒడిగడతాడా?

అసంభవం

వాస్తవం ఏమిటంటే, ఈ ప్రపంచం మొదలైన తొలినాటి నుంచే దేవుడు మానవుని మార్గదర్శకత్వం కోసం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు. మానవులను సన్మార్గంలో నడిపించడం కోసం, మానవులను నిజమైన ఏకదైవారాధకులుగా తీర్చిదిద్దటం కోసం తానూ చేయవలసిందంతా చేశాడు. ప్రతి యుగంలోనూ, ప్రతి సమాజంలోనూ తన తరపున వేలాది, లక్షలాది మంది ప్రవక్తలను, సందేశహరులను పంపించాడు. ఆయా సమాజాల్లో ఉత్తమోత్తమ నైతికత కలిగిన మనుషులకే అటువంటి ప్రవక్త పదవీ బాధ్యతలను అప్పగించటం జరిగింది. వారి భాషలు వేరై ఉండవచ్చు. వారి యుగాలు, వారి జీవిత కాలాలు వేరై ఉండవచ్చు. కాని వారందరి మూల సందేశం మాత్రం ఒక్కటే.

“ఓ నా జాతి ప్రజలారా! సృష్టికర్తనే ఆరాధించండి. ఆయన తప్ప మాకు మరొక ఆరాధ్య దేవుడు లేనేలేడు.”

ప్రపంచం మొదలైన తొలినాటి నుంచే సృష్టికర్త మానవులకు పరిపూర్ణమైన మార్గ దర్శకత్వాన్ని అందజేసాడని చెప్పటంలోని మరో కోణం ఏమిటంటే, ఆ దేవుడు తన ప్రవక్తలను, సందేశహరులను సామాన్య మానవుల దగ్గరికి ఒత్తి చేతులతో పంపలేదు. మానవ మార్గదర్శకత్వానికి అవసరమైన, మానవాళికి తాను ఇవ్వదలచుకున్న ఆదేశాలన్నితిని దేవుడు లిఖితపూర్వకంగానే ప్రవక్తలకు అందజేశాడు. మనిషి సన్మార్గంలో నడవటానికి అవసరమయ్యే ఒక్కో విషయం అందులో చాలా స్పష్టంగా ఉండేది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అవన్నీనిజ దేవుణ్ణి మాత్రమే ఆరాదిన్చామనే ప్రబోధనలు. ఆ లిఖిత పూర్వక పత్రాలు మరేవో కావు, ఈనాడు మన చుట్టూ ప్రచారంలో ఉన్న మాట గ్రంధాలే! అలాంటప్పుడు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన సువిశాల భారత దేశంలో ఒక్క ప్రవక్త కూడా రాలేదని, అసలు ఈ ప్రాంతంలో ఒక్క దైవగ్రంధం కూడా అవతరించాలేదని ఎవరైనా చెప్పగలరా? భారత దేశంలోని ప్రాచీన గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు పురాణాలు, గీత మొదలగు గ్రంధాలను భారతీయ సమాజం దైవిక గ్రంధాలుగా స్వీకరిస్తుంది. ఆ గ్రందాల పట్ల ప్రగాఢమైన భక్తీ ప్రవట్టులను చాటుకుంటుంది. అసలు మత గ్రంధాలు ఏవైనప్పటికీ వాటన్నిటి విషయంలో సూత్రప్రాయంగా మనం రెండు విషయాలు గుర్తుపిట్టుకోవాలి.

ఏ మత గ్రంధంలోని ప్రబోధనాలైనా ఆయా ప్రవక్త కాలానికి, ఆయా సమాజ యుగానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఆ ప్రవక్త తర్వాత మరో ప్రవక్త ఈ లోకంలో అవతరించినప్పుడు గత ప్రవక్త బోధనలను సృష్టికర్త రద్దు చేసేస్తాడు. ఒక ప్రవక్త అనంతరం మరో ప్రవక్త రావటమే అందుకు నిదర్శనం. అలాగే ఈ లోకంలో అవతరించిన చాలా మంది ప్రవక్తలు తమ తర్వాత రాబోయే ప్రవక్తల గురించి ముందుగానే శుభవార్త అందజేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఎన్నో నిదర్శనాలను మీరు మున్ముందు వాక్యాలలో తెలుసుకుంటారు.

ఖుర్’ఆన్ అందరి గ్రంధం
సృష్టికర్త అయిన దేవుడు మానవులకు ఋజుమార్గం చూపించడానికి పంపిన ప్రవక్తలలో చిట్టచివరి వారే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం). దివ్య ఖుర్’ఆన్ ఆ అంతిమ దైవప్రవక్తపై అవతరించిన దైవగ్రన్ధమే తప్ప మరొకటి కాదు. ఈ కోణం నుంచి చూసినప్పుడు అంతిమ దైవగ్రంధమైన ఖుర్’ఆన్ గత ప్రవక్తలను, గత కాలానికి చెందిన దైవగ్రందాలను ద్రువీకరిస్తుందే గాని ఒక్క మాటలో అసలు అవేవీ దైవగ్రందాలు కావని కొట్టిపారేయదు.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరి ప్రవక్త!

మానవులకు సన్మార్గం చూపించేందుకు దేవుని తరపు నుంచి ప్రభవించిన ప్రవక్తల చిట్టచివరి వారే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం). గత ప్రవక్తలకు సంబంధించిన ప్రాచీన ధర్మగ్రంధాల్లోను ఆయన రాక గురించి ముందుగానే శుభవార్త ఇవ్వబడింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించిన భవిష్యత్ ప్రకటనలు మనకు వైదిక సాహిత్యంలో అనేక చోట్ల కనపడతాయి.

గత ప్రవక్తలు ఒక ప్రత్యెక జాతికో, ప్రత్యెక కాలానికో పంపబడ్డారు. కానీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సకల మానవజాతికి ప్రవక్తగా పంపబడ్డారు.

“ఓ ప్రవక్తా! మేము నిన్ను సకల మానవ జాతికి ప్రవక్తగా చేసి పంపాము. దీనికి అల్లాహ్ సాక్ష్యం చాలు”. (ఖుర్’ఆన్ 4:79)

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్త కేవలం ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు. మనందరి కోసం దైవ సందేశాన్ని తెచ్చిన మనదరి అంతిమ దైవప్రవక్త. ఈయన రాకకు పూర్వమే వేద వేదాంగాలు ఆయన వస్తారని పేరుతొ సహా తెలియజేసాయి.

చిట్టచివరి దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)

మానవాళికి చిట్టచివరగా దైవ సందేశం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా అందింది. ఆ సందేశమే పవిత్ర ఖుర్’ఆన్ గ్రంధం. మానవులు పాటించాల్సిన నిబంధనలు, చేయదగిన, చెయదగని పనులు అన్నీ ఖుర్’ఆన్ లో విపులంగా చర్చించబడ్డాయి. అంటే సందేశాల విషయంలో ఖుర్’ఆన్లోని వివరాలు, వేదాల్లోని వివరాలతో సరిపోతున్నాయి. సాధారణ హిందూ సోదరులు నమ్మే ‘దైవం మనిషి అవతారం దాలుస్తాడు’ అనే విశ్వాసాలతో అవి ఏకీభవించవు. వేదాల్లో మాత్రం ఆ విషయం ఎక్కడా పేర్కొనబడలేదు.

మానవజాతికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం భూమ్మీదకు ఋషులను పంపాడని వేదాలు చెబుతున్నాయి. ఋషులేగాక దైవదూతల గురించి కూడా వేదాల్లో ప్రస్తావన ఉంది. చిట్టా చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి హిందూ ధర్మ గ్రంధాల్లో ఏం వ్రాయబడి ఉందొ చూద్దాం.

వేదాలు, పురాణాల భవిష్యత్ వాక్కు:

భవిష్య పురాణంలోని 3వ పర్వం, 3వ ఖండం, 3వ అధ్యాయంలో 10-27 శ్లోకాలు ఇలా చెబుతున్నాయి.

అరబ్బుల ప్రధాన భూభాగాన్ని మ్లేచ్చులు నాశనం చేశారు. అక్కడ ఆర్య ధర్మం ఇక లేదు. అక్కడ నేను గారంలో ఓడించిన ఒక శత్రువు ఉన్నాడు. ఇప్పుడు మరింత బలవంతుడైన శత్రువు మరో వ్యక్తిని పంపాడు. ఆ శత్రువును నాశనం చేసి, ప్రజలను ఋజుమార్గంలో నడపడానికి నేను ముహమ్మద్ అనే వ్యక్తిని పంపుతాను. ఓ భోజరాజా! నువ్వు ఆ పిశాచాల ప్రాంతానికి వెళ్ళనవసరం లేదు. నేను నా దయతో నిన్నిక్కడే పరిశుద్ధ పరుస్తాను. రాజు ముందు దైవదూతలాంటి తేజస్సుతో ఒక వ్యక్తి హాజరవుతాడు. “ఓ రాజా! నేను ఈస్వరుదైన పరమాత్మ పంపగా వచ్చాను. ఆర్యధర్మమే నిలబడుతుంది. నన్ను ఈశ్వర పరమాత్మ మాంసాహారుల ధర్మాన్ని అమలుచేయడానికి పంపాడు. నా అనుచరులు సున్తీ చేయించుకుంటారు. వారి తలపై పలక ఉండదు. వీరొక విప్లవం తెస్తారు. గడ్డం పెంచుతారు. ప్రార్ధన కోసం ఉచ్ఛ స్వరంలో ఆలపిస్తారు. ధర్మ సమ్మతమైన అన్ని ఆహారాలు తింటారు. కానీ వరాహమాంసం తినరు. వారు చెట్లు చేమల ద్వారా కాక, యుద్ధాల ద్వారా పవిత్రం కావించబడతారు. మామ్సాహారులైన వీరిని ముసల్మానులు అంటారు. (భవిష్య పురాణం (3:3:3:10-27)

ప్రజలను ఋజుమార్గం లో నడపటానికి వచ్చే ఆ ఋషి పేరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అని ఈ భవిష్యవాణిలో చెప్పబడింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజలను అజ్ఞానాంధకారంలో నుండి బయటకు తీసి తేజోవంతమైన ఋజుమార్గంలోకి నడిపించారన్న విషయం మనదరికీ తెలిసిందే. భవిష్య పురాణంలో చెప్పిన ఈ భవిష్య వచనం పూర్తిగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించీ, ఆయన అనుచరులు, విస్వాసపరులైన ముస్లింల గురించే వివరించింది. ఇంకా అనేక చోట్ల ఆయన గురించి భవిష్యద్వచనాలున్నాయి. కానీ అవన్నీ చర్చించడానికి మనకు ఇప్పుడు సమయం కూడా సరిపోదు. అందువల్ల భవిష్య పురాణంలో ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించ బడిందో చెప్పుకుందాం.

భవిష్య పురాణంలోని (3:3:3:5-8), 1:2:21-23)లోనూ, అధర్వ వేదంలోని (20:127:1-14)లోనూ ఆయన గురించి పేర్కొనబడింది. అధర్వ వేదంలోని ఈ మంత్రాలను కుంతాప సూక్తులు అంటారు. కుంతాప అంటే జీర్ణాశయంలో ఉన్న గ్రంధులు అని అర్ధం. అంటే లోపల నిక్షిప్తమై ఉన్న శ్లోకాల నిగూఢ అర్ధాలు. చాలాకాలం తర్వాత బోధపదేవి అని అర్ధం. ఇలాంటి మంత్రాలు 14 ఉన్నాయి. అన్నింటి గురించి ప్రస్తుత పరిమిత వ్యవధిలో తెలుసుకోలేం కాబట్టి నాల్గింటిని పరిసీలిదాం. మొదటి మంత్రం లో ఆయన గురించి.

“ఆయనే నరాశంసుడు, ఆయనే కౌరముడు, ఆయన 30,090 మంది శత్రువులను జయిస్తారు.”

రెండో మంత్రం లో ….

“ఆయన ఒంటెను అధిరోహించే ఋషి”

మూడవ మంత్రంలో …

“ఆయన మామెహే ఋషి”

నాల్గవ మంత్రంలో…

“ఆయనే నరాసంశుడు” (అధర్వ వేదం 20:127:1-14)

ఇందులో ‘నర’ అంటే ఒక మనిషి లేదా ఒక వ్యక్తి. ‘శంసుడు’ అన్నది ప్రశంస, అంటే పొగడ్త నుంచి వచ్చిన పదం. కలిపితే ‘నరాశంస’ అంటే ప్రశంసించబడే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పేరు అర్ధాన్ని తెలుగులోకి అనువదిస్తే అది కూడా ‘ప్రశంసించబడే’ వ్యక్తి అవుతుంది. అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనే అరబీ పదానికి సరైన అనువాదం నరాసంశుడే, అలాగే ఆయన పేరు ‘కోరామ’ అన్నారు. సంస్కృతంలో కోరామ అంటే శాంతిని కలిగించే రాజకుమారుడు అని అర్ధం. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) శాంతి తేవడమే కాక సుపరిపాలన కూడా అందించారు. ఈ పదానికి మరో అర్ధం ‘వలస వచ్చిన వాడు’ అని. ఆశక్తికరంగా … ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన స్వస్థలం మక్కా నుంచి మదీనాకు వలస వచ్చారు. మొదటి మంత్రంలో ‘ఆయన 60,090 మంది శత్రువుల్ని జయిస్తారు’ అని కూడా ఉంది. మక్కా నగరంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రు జనాభా దాదాపు 60,000.

ఇక రెండో మంత్రం … ‘ఆయన ఒంటె అధిరోహించే ఋషి’ అంటున్నది. భారతీయ ఋషులుగానీ, బ్రాహ్మణులుగానీ ఒంటెను వాహనంగా ఉపయోగించరు. ఎందుకంటే మనుస్మృతిలోని 11వ అధ్యాయం, 202వ శ్లోకంలో ‘బ్రాహ్మణుడు ఒంటేనుగానీ, గాడిదనుగానీ అధిరోహించకూడదు’ అనే నిషేధం ఉంది. అందువల్ల మూడో మంత్రం సూచిస్తున్న వ్యక్తి భారత ఋషి కాజాలడు. పైగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జీవతంలో ఎన్నోసార్లు ఒంటెను అధిరోహించారు. 3వ మంత్రం ఆయన్ను ‘మామేహే ఋషిగా’ సంబోధిస్తుంది. మామహ్ అనే పదం ‘మహా’ అనే పదానికి పర్యాయ పదం. అంటే మహాఋషి లేదా గొప్ప ఋషి అని.

నాలుగవ మంత్రం … ఆయన్ను ‘రేభ’ అంటోంది. ‘రేభ’ అంటే స్తోత్రించేవాడు అని. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు మరో పేరు అహ్మద్ కూడా ఉంది. అహ్మద్ అనే పదాన్ని తెలుగులోకి అనువదిస్తే ‘దైవాన్ని స్తోత్రించే వ్యక్తి’.

అహ్మద్ అన్న పదాన్ని సంస్కృతంలో రేభగా వాడి ఉండవచ్చు. అంటే అధర్వ వేదంలోని ఈ మంత్రాలు కుంతాప సూక్తాలు అన్నీ స్పష్టంగా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించే వర్ణిస్తున్నాయి. మరికొన్ని భవిష్య వచనాలు ఇక్కడ చూద్దాం.

అధర్వ వేదంలోని 20వ ఖండం, 21వ అధ్యాయంలోని 6వ మంత్రంలో ఇలా ఉంది.

“కరు’ పదివేల మంది శత్రువుల్ని యుద్ధం లేకుండానే ఓడిస్తాడు’ (ఆధర్వ వేదం 20:21:6)

ఖుర్’ఆన్ లో 33వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ‘కందఖ్’ యుద్ధంలో పోరు చేయనవసరం లేకుండానే కేవలం శత్రువులను నిలువరించడం ద్వారా విజయం సాధించిన వైనం గురించి ఇక్కడ చెప్పబడింది. అంతేగాక ‘కరు’ అనే సంస్కృత పదం ప్రశంసించే వాడు అనే అర్ధాన్ని ఇస్తుంది. అంటే అహ్మద్ అనే పేరుకు ఇదే అర్ధం కాబట్టి ఆయన గురించే చెప్పారని తెలుస్తుంది. ఈ ప్రశంసించే వ్యక్తి పది వేల మంది శత్రువుల్ని యుద్ధం లేకుండానే ఓడించాడని అందులో ఉందని మనం ముందే చెప్పుకున్నాం. ఖందఖ్ యుద్ధంలో శత్రువులు దాదాపు పది వేల మంది. ఆ యుద్ధం ఎలాంటి పోరాటం లేకుండానే ముగిసింది.

అధర్వ వేదం (20:21:7) లో ఇలా ఉంది.

“అబందు 60,090 మంది శత్రువుల్ని, 20 మంది శత్రు నాయకుల్ని యుద్ధంలో ఓడిస్తాడు” (అధర్వ వేదం 20:21:7)

‘అబంధు’ అనే సంస్కృత పదానికి అర్ధం ‘అనాధ’, దగ్గరి చుట్టాలు లేనివాడు అనే అర్ధాలున్నాయి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేన్నప్పుడే తల్లి, తండ్రీ ఇద్దరినీ కోల్పోయారన్న విషయం మనదరికి తెలిసిందే. ఈ ప్రవచనంలో చెప్పబడినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కాలో 20 తేగల నాయకులను ఓడించిన సంగతి మనకు తెలుసు. ఈ 20 మంది నాయకులకు చెందినా 60 వేల మంది అనుయాయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను వ్యతిరేకించారు. సరిగ్గా ఇలాంటి భవిష్య వచనమే ఋగ్వేదం (1:53:9)లో కూడా ఉంది.

‘సుష్రమ’ అనే ఉత్తరాచిత్ మంత్రం 91500) ప్రకారం అహ్మద్ కు శాశ్వత న్యాయం అందించినట్లు ఉంది. శాశ్వత న్యాయం అంటే పవిత్ర ఖుర్’ఆన్ ను, అంటే షరియత్ (ఇస్లాం ధర్మశాస్త్రం) లోకాంతం వరకు అమలయ్యేందుకు మార్గం సుగమం అయింది. ప్రవక్త (స) పేరుకు అర్ధం మాత్రమె కాక ఆ పేరు కూడా వేదాల్లో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ అహ్మద్ అనే పేరు కూడా ప్రస్తావించబడింది. అహ్మద్ అనే అరబిక్ పదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక దాన్ని ‘ఆహామతి’ అని పేర్కొనడం జరిగింది.

‘ఆహమతి’ అనే సంస్కృత పదానికి ‘నా తండ్రి’ అని అర్ధం. ‘ఆయన నాకు శాశ్వత ధర్మ శాస్త్రం ఇచ్చాడు’ అని భావం.
కానీ దాన్ని వేరే రకంగా చదివితే మరో అర్ధం వస్తుంది. అయితే ఆ అధ్యాయాల అసలు ప్రతి ప్రకారం అహ్మద్ అనే పేరు స్పష్టంగా కనిపిస్తుంది. అహ్మద్ అనే పదం ఇతర హిందూ గ్రంధాలైన సామవేదం (2:152) లోనూ, యజుర్వేదం (31:18)లోనూ, ఋగ్వేదం (8:6:10) లోనూ కూడా ప్రస్తావించబడింది.

అహ్మద్ అనే పేరుతో అధర్వ వేదం (8:5:16)లోనూ, (20:126:14)లోనూ భవిష్య వాణి ఉంది. ఆ పేరుతోనే కాకుండా ఆయన్ను ‘నరాశంసా’ అని ఎన్నో హిందూ గ్రంధాల్లో అనేక చోట్ల కనపడుతుంది. నరాశంస అంటే నర+శంస అంటే ప్రశంసించబడే వ్యక్తి అని ముందే చెప్పుకున్నాం.

అంటే చిట్టా చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పేరుకు ఉన్న అర్ధమే ప్రశంసించబడే వ్యక్తి అనే అర్ధమే ఈ వేదాల్లో కూడా ఉపయోగించ బడింది. అంతేకాకుండా ఋగ్వేదంలోని 1:13:3లోనూ, 1:18:9లోనూ 1:106:4లోనూ, 1:142:3;లోనూ, 2:3:2లోనూ, 5:5:2లోనూ, 7:2:2లోనూ, 10:64:3లోనూ, 10:182:2లోనూ, యజుర్వేదంలోని 21:21లోనూ, 21:55లోనూ, 20:37లోనూ, 20:57లోనూ, 28:2లోనూ, 28:19లోనూ, 28:42లోనూ ప్రస్తావించబడింది.

మరణానంతర జీవితం

ఈమాన్ లోని అయిదవ మూల స్థంభం ‘మరణానంతర జీవితం’. దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందో చూద్దాం. సామాన్యంగా హిందూ సోదరులు మానవుడికి జననం మరణం తర్వాత పునర్జన్మ, మళ్ళీ మరణం ఇలా కొనసాగుతుందని నమ్ముతారు. దీన్నే ‘సంసారం’గా పేర్కొంటారు. దీన్నే పునర్జన్మ సిద్ధాంతంగా, మనిషి మరణించిన తర్వాత ఆ ఆత్మలు పలు శరీరాలను ధరించడంగా పేర్కొంటారు. ఈ సంసార సిద్ధాంతం వాడుకలోకి ఎలా వచ్చిందంటే… పుట్టుకతోనే కొందరు ధనికులుగానూ,మరికొందరు బీదవారి గాను, కొందరు ఆరోగ్య వాతులు గాను, ఇంకొందరు రోగిస్టులుగానూ పుడతారు. సర్వజ్ఞాని అయిన దైవం ఇలా నిర్ణయించడం ఎలా న్యాయబద్ధమో నిరూపించలేక పోయారు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నమ్మారు.

పునర్జన్మ సిద్ధాంతం:

దేవుడికి అంటా సమానమే అయినా మనుషుల్ని కారణం లేకుండా అసమానతలతో పుట్టించడు. కాబట్టి ఈ జన్మలో లభించిన స్థితిగతులకు గతజన్మలో చేసిన కర్మలే కారణమని నమ్మారు. ఇదే విషయం భగవద్గీతలో కూడా స్పష్టంగా ఉంది.

“మనిషి తన దుస్తుల్ని మార్చి కొత్త వాటిని వేసుకున్నట్లే, ఆత్మా తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది.” (భగవద్గీత 2:22)

బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఇలాంటి వివరణ ఉంది.

‘గొంగళి పురుగు ఒక గడ్డి పోచ తినడం అయిపోగానే ఇంకో దాని మీదకు వెళ్ళినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరే కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది.’ (బృహదారణ్యక ఉపనిషత్తు 4:4:3)

వీటి మీద ఆధారపడి పండితులు జన్మ, పునర్జన్మల చక్రం అనే ససార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనికి అనుబంధంగా కర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. కర్మ అంటే చర్య లేదా పని. ఈ పని కేవలం శరీరానికే కాకుండా ఆత్మకు కూడా వర్తిస్తుంది. అంటే.. ఏ విత్తు నాటితే ఆ పంటే పండుతుంది, అన్న రీతిలో ‘ఎలాంటి కర్మ (మంచి లేదా చెడు) చేస్తే అలాంటి ఫలితాలే పొందుతారు’ అని చేబుతుంది. ధర్మబద్ధంగా సత్కర్మలు చేస్తే తదుపరి జన్మలో మంచి జీవితం లేదా మోక్షం లభిస్తుందని హిందూ సోదరులు నమ్ముతారు. దీన్నే ‘నిర్వాణం’ అంటారు. అంటే ఈ పునర్జన్మల చక్రం నుంచి తప్పించుకుని, శాశ్వత శాంతి సాధించే అవకాసం అని అర్ధం.

అలాగే ‘ఒక వ్యక్తి ఏదైనా వ్యాదితోగానీ, అంగవైకల్యంతోగానీ జనిమ్స్తే బహుశా ఆ వ్యక్తి (ఆత్మా) గత జన్మలో చేసిన పాప ఫలితమే ఈ జన్మలో ఈ శిక్షగా విధించబడుతుంది’ అని భావిస్తారు. దీన్ని బట్టి తేలేదేమిటంటే… సర్వజ్ఞాని అయిన దైవ నిర్ణయాలు అన్యాయంగా ఉండవు. కాబట్టి గత జన్మలోని కర్మలను బట్టే మనిషికి ఈ జన్మలో ఫలితాలు దక్కుతాయి. అయితే వేదాల్లో ఎక్కడా పలుసార్లు జన్మించడం, పలుసార్లు మరణించడం వంటి పునర్జన్మ ప్రస్తావించబడలేదు. ‘సంసార సిద్ధాంతం’ అనే భావన వేదాల్లో లేదు. అయితే పునర్జన్మ అనే విషయం మాత్రం వేదాల్లో మరో విధంగా ఉంది. పునర్జన్మ అంటే మళ్ళీ జన్మించడం లేదా తర్వాతి (మరణం తర్వాతి) జీవనం అని. దీన్ని సరిగ్గా అనువదిస్తే పలుసార్లు జన్మించడం, మరణించడం అనే అర్ధం రాదు. ఇది కేవలం ‘మరణం తర్వాతి జీవనం అనే అర్ధాన్ని ఇస్తుంది

అంటే వేదాల్లో సంసార సిద్ధాంతం గురించి ప్రస్తావించలేదు కానీ కేవలం ఈ పునర్జన్మ (మరణం తర్వాతి జీవనం) గురించి మాత్రం ప్రస్తావించబడింది. ఋగ్వేదం (10:16:4-5)లో ఉన్నది మరణం తర్వాతి జీవనం గురించి కానీ జనన మరణ చక్రం గురించి కాదు.

వేదాలు ‘స్వర్గం’ గురించి కూడా చెబుతాయి. అక్కడ క్షీర నదులు ఉంటాయనీ, అనేక రకాల ఫలాలు ఉంటాయనీ, స్వర్గమంతటా ప్రశాంతత నిండుకొని ఉంటుందని పేర్కొనబడినది. ఈ విషయం అధర్వ వేదంలోని 2వ 6వ అధ్యాయాల్లోనూ, ఋగ్వేదం (10:16:4)లో ఉంది.

ఋగ్వేదం ‘నరకం’ గురించి కూడా ప్రస్తావిస్తుంది. అక్కడ మహా అగ్ని కీలలపై పాప్పులను కాలుస్తారని వివరిస్తుంది. మనిషి మరణించిన తర్వాత స్వర్గం, లేదా నరకం లో అతనికి సత్ఫలితంగానీ, సిక్షగానీ లభిస్తే అతడు ఈ ప్రపంచంలోకి మళ్ళీ రావాల్సిన అవసరం ఏముంది? వేదాలు చెప్పిన ప్రకారం చూస్తె మరణం తర్వాత ఒకే జీవితం ఉంటుంది. మనం ఇక్కడ చేసిన కర్మలను బట్టి స్వర్గంగానీ, నరకంగానీ లభిస్తుందన్న మాట. అంతేగానీ మామూలుగా హిందూ సోదరులు భావించే జనన, మరణ చక్రం కాదు వేదాలు చెబుతున్నది. అయితే కొందరు వ్యక్తులు ధనవంతులుగా, బీదవారిగా; ఇంకొందరు ఆరోగ్యంగా, వ్యాదిగ్రస్తులుగా ఎందుకు పుడుతున్నారనే సందేహానికి జవాబుగా కొన్ని వివరాలు తెలుసుకోవాలి. అలః ఖుర్’ఆన్ లో ఇలా తెలియజేస్తున్నాడు.
كيف تكفرون بالله وكنتم أمواتا فاحياكم ثم يميتكم ثم يحييكم

(ثم إليه ترجعون (سورة البقرة

“మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరి ఎలా అవలబించ గలరు? వాస్తవానికి ఆయనే, నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని సజీవులుగా చేశాడు కదా! తరువాత మీకు మ్రుత్యువునిచ్చేది, తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలి వెళ్తారు.” (ఖుర్’ఆన్ 2:28)

ఈ ఆయతులో రెండు మరణాల, రెండు జీవితాల ప్రస్తావన ఉంది. మొదటి మరణం అంటే ఉనికి లేనిదని అర్ధం. మొదటి జీవితం అంటే తల్లి కడుపునుంచి వచ్చి మరణం సంభవించేదాక బ్రతికి ఉండటం అన్నమాట. తరువాత మృత్యువు వస్తుంది. తరువాత పరలోక జీవితం మొదలవుతుంది. ఈ జీవితాన్నే అవిశ్వాసులు, ప్రలయదిన తిరస్కారులు త్రోసిపుచ్చుతున్నారు. సమాధి జీవితం కూడా (దానికి తగినవిధంగా) ప్రాపంచిక జీవితంగానే పరిగణించ బడుతుందన్న కొంతమంది అభిప్రాయాన్ని అల్లామా షౌకానీ ఇక్కడ ప్రస్తావించారు (ఫత్ హుల్ ఖదీర్). యదార్ధానికి సమాధి జీవితం (బర్జఖ్ అవస్థ) కూడా పరలోక జీవితపు తోలి మజిలీయే. అందుచేత ఈ అవస్థను పరలోక జీవితంలో భాగంగా పరిగానించడమే సబబు.

ఇక స్వర్గం గురించి వర్ణించాలంటే… స్వర్గానికి అరబిక్ పదం ‘జన్నత్’ అంటే ‘ఉద్యానవనం’. ఖుర్’ఆన్ లో ఎ పదం అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ఇక్కడ కూడా పాల్ నదులు, తేనే నదులు, మధురమైన అన్ని రకాల ఫలాలూ, ప్రశాంతత ఉంటాయి.

ఖుర్’ఆన్ ‘జహన్నమ్’ అంటే నరకం గురించి కూడా ప్రస్తావించింది. వేదాల్లో నరక వర్ణన మాదిరిగానే ఇక్కడ అ కూడా అనేక శిక్షలు విధించబడతాయని సూరే బఖరా (2:24)లో ఉంది. నరకంలోని అగ్ని జ్వాలల తీవ్రత గురించి కూడా ఖుర్’ఆన్ ప్రస్తావించింది. అంటే ఖుర్’ఆన్ లోనూ, వేదాల్లోనూ స్వర్గ, నరకాల గురించిన భావనలు దాదాపుగా సరిపోతున్నాయి.

సాధారణ హిందూ సోదరులు, మరికొందరు పండితులు చెప్పే ‘సంసార’ సిద్ధాంతాన్ని మాత్రం ఇస్లామ్ అంగీకరించదు. ఈ లోకంలో కొందరు ధనవంతులుగా, కొందరు పేద వాళ్లుగానూ, కొందరు వ్యాధి పీడితులుగానూ, కొందరు ఆరోగ్యవంతులుగానూ ఎలా ఉంటారో వివరణ ఇవ్వడానికే వాళ్ళు ఆ భావన ప్రవేశపెట్టారు.

మొత్తానికి వివిధ హిందూ మత గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలించినట్లయితే హైందవ తత్వాల మెలికల్లో చిక్కుకుని మరుగున పడిపోయిన ఓ ప్రాచీన సత్యం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఆ సత్యమే ఇది.

“సృష్టిని కాదు, నిజదేవుడైన సృష్టికర్తను ఆరాధించండి”

ఇప్పటి వరకు విభిన్న ధర్మగ్రందాల్లోని వివిధ సాక్ష్యాధారాలతో నిరూపించబడిన పై సత్యాన్ని గనక మనం ఆచరణలోకి తీసుకువస్తే, దేవుని కరుణా కటాక్షాలతో మనలో ప్రతి ఒక్కరూ ముక్తిని, మొక్షాన్నీ సాధించగలుగుతాము.

Related Post