Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఖుర్‌ఆన్‌ మహిళా సాధికారత

 

మానవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుం బం!ఈ కుటుంబ వ్యవస్థ, అందులోని సభ్యుల మానసిక స్థితి, వారి స్థానాలు సహజంగా నూ, ఆరోగ్యవంతంగానూ వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది. సమాజ నిర్వ హణకు, సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత అవసరమో… కుటుంబంలోనూ పని విభజన అంతే అవసరం. అప్పుడే ఇటు కుటు ంబం, అటు సమాజంలోని కార్యాలు సవ్యం గా, సహజంగా, సుందరంగా, సశాస్త్రీయం గా నెరవేరు తాయి. పని విభజన అనేది కేవ లం ఆర్థిక పరమైన పరిభాష కాదు. అది బాధ్యతాయుతమైన సంక్షేమకర పరిభాష కూడా. స్త్రీ,పురుషులిరువురూ వారి వారి శారీరక, మానసిక, ప్రాకృతిక మరియు సహ జసిద్ధమైన భిన్నత్వాల మూలంగా వారివారి కార్యక్షేత్రాలు విభిన్నంగా, ప్రత్యేకంగా వుండక తప్పదు. ప్రకృతిని, అందులోని జంతుజాలా లను, వాటి మధ్యనున్న వైవిధ్యాలను పరిశీ లిస్తే… ఈ విషయమే మనకు స్పష్టంగా అర్థ మవుతుంది.

తల్లి స్థానం

ఆరోగ్యకరమైన సమాజానికి-ఆరోగ్యకరమై న మానసిక, తాత్విక చింతనలు కలిగిన మనుషులు అవసరమవుతారు. ఇటువంటి మానవులు ఆకాశం నుండి ఊడిపడరు. నేల నుండి పుట్టుకు రారు. ఏఫ్యాక్టరీలోనూ తయా రు కారు. వారు తల్లి గర్భం నుండి జన్మి స్తారు. అమ్మ ఒడిని మొదటి బడిగా వారు జన్మతః పొందుతారు. మొట్టమొదటి ఉపాధ్యా యురాలిగా, శిక్షకురాలిగా వారు తమ తల్లిని సహజసిద్ధంగా పొందుతారు. ఉపాధ్యాయురాలి బాధ్యతను నిర్వర్తించడం- శిక్షకురాలి కర్తవ్యాన్ని నిర్వహించడం తల్లి యొక్క మొట్టమొదటి బాధ్యతగా ఉంటుంది. తన తల్లి ద్వారా శిక్షణ పొందడం బిడ్డ యొక్క జన్మ హక్కుగా కూడా వుంటుంది. ప్రకృతిలో సంఘ జీవనం గల జంతుజాలాన్ని గమనిస్తే ఈ సత్యమే ప్రస్ఫుటంగా మనకుగోచరిస్తుంది.

మహిళా స్థాయి

నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ సమానత్వం, సాధికారత పేరుతో స్త్రీ విముక్తి మహిళా వాదం తదితర ఇజాల పేర్లతోనూ మహిళను తన సహజ స్థానం నుండి దిగజార్చే ప్రయ త్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంటిని వదిలి బయటకు రాకుండా స్త్రీ విముక్తి లేక సాధికారత సాధ్యం కాదని నేటి మహిళా సంఘాల తమ ప్రచార హోరుల ద్వారా మహిళా సమాజాన్ని ఉత్తేజ పరుస్తు న్నాయి. ఈ ప్రచార ప్రభావంలో స్త్రీలు ఇరు క్కోవడం, పురుషులకు కూడా ప్రయోజనకారి గా వుండటంతో వీరు కూడా వంత పాడటం మొదలెట్టారు. ఇంటిలో పిల్లల పోషణ, శిక్షణ, గృహ నిర్వహణతోపాటు ఆమె డబ్బు సంపా దించే యంత్రంగా మార్చడం తనకు అన్ని విధాలా లాభదాయకమని పురుషుడు భావించి స్త్రీ తన సహజమైన స్థానాన్ని వీడిపోయేందుకు సహకరిస్తున్నాడు.నేటి కుటుంబ వ్యవస్థ బీటలువారడానికి ప్రధాన కారణం ఇదే.

స్త్రీకి సహజ ఆభరణాలయిన బిడియం, నాజూకుతనం, ఓర్పు, ప్రేమ, మాతృత్వపు మాధుర్యాలతోపాటు ప్రత్యేక శరీర ఆకృతి ఆమె సొంతం. సంతానానికి శిక్షణ, బాధ్యతల నిర్వహణ వంటి సహజ వరాల నుండి ఆమె ను దూరం చేసి మోయ లేని భారాన్ని ఆమెపై రుద్ది మగువను మానసిక వత్తిడికి, ఆందోళన కు గురి చేస్తున్నారు.

ఆకర్షణీయ వంచన

నేటి ఆధునిక సిద్ధాంతాలు స్త్రీని అత్యంత అశ్లీలంగా మార్చేస్తున్నాయి. ఉనికిలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీని ఫ్యాషన్‌ పెరేడ్‌ల కు, వ్యాపారప్రకటనలకు ఉపయోగపడే అంద మైన వస్తువుగా భావించింది. పెట్టుబడీదారి వ్యవస్థలో సర్వం వ్యాపారమయమే. ఇక్కడ స్త్రీ అంగాంగాలు వ్యాపార వస్తువులుగా వాడుతు ంటారు. ఒక గౌరవనీయమైన మహిళ తన శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకునేలా మానసిక తర్ఫీదు ఇక్కడ ఇస్తారు. ‘నా శరీరం నా ఇష్టం’ లైంగిక స్వేచ్ఛలాంటి భావనలను ఆమె మెదడులో గుదిగుచ్చడానికి స్త్రీవాద సంఘాల ద్వారా అంతర్జాతీయ స్థాయి నుండి ప్రాంతీయ స్థాయి వరకు చర్చిస్తారు. సైద్ధాంతి క వ్యాసాలు హృద్యంగా రాయబడతాయి. ఫలి తంగా స్త్రీ తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా మార్కెట్‌లో ప్రదర్శనా వస్తువుగా, విక్రయ వస్తువుగా, మార్చుకుంటోంది. ఇందుకుగాను వీరి విపరీత సాహిత్యం, అనైతిక రచనలు స్త్రీని నైతిక పతనానికై ప్రోత్సహించాయి. విచిత్రంగా ఈ రెండు వ్యవస్థలు కూడా స్వేచ్ఛ విముక్తి లాంటి అందమైన పద బంధాలు వాడటం ద్వారా స్త్రీని కుటుం బం నుండి బలవంతంగా బయటికి లాగే ప్రయత్నం చేశాయి. మల్టీ నేషనల్‌ కంపెనీలు, సినీ తారలు, క్రీడా కారులు, రాజకీయ బేహారులు అందరూ సహ కరిస్తారు. స్త్రీని నైతిక పతనం వైపునకు దిగ జార్చడానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు.

పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఉనికిలోకి వచ్చిన సోషలిస్టు వ్యవస్థ ”కొల్యం తొవ్‌” లాంటి మహిళా సాహితీకారులను సృష్టించింది. వీరి విపరీత సాహిత్యం, అనైతిక రచనలు స్త్రీని నైతిక పతనానికై ప్రోత్సహిం చాయి. విచిత్రంగా ఈ రెండు వ్యవస్థలు కూడా ”స్వేచ్ఛ”, విముక్తి లాంటి అందమైన పద బంధాలు వాడటం ద్వారా స్త్రీని కుటుం బం నుండి బలవంతంగా బయటికి లాగే ప్రయత్నం చేశాయి. సోషలిస్టు సిద్ధాంతకర్తలు ఏకంగా వ్యక్తిగత ఆస్తికి మూలం కుటుంబం కనుక కుటుంబాన్ని రద్దు చేయడం ద్వారా మాత్రమే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయొచ్చని సిద్ధాంతీకరించారు. అంటే.. కుటుంబం ధ్వం సం అయిన తర్వాత లైంగిక అవసరాలు కోరు కున్న వారితో కోరుకున్న విధంగా తీర్చు కోవచ్చు. వివాహ బంధమనేది గత కాలపు పనికిమాలిన బంధంగా, వెనుకబాటుతనానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. ”పిల్లల శిక్షణ” అనే అత్యంత కీలకమైన కర్తవ్యం నుండి తల్లి ని తొలగిస్తారు. దానికి బదులుగా ”టెక్నికల్‌ కేర్‌ టేకర్స్‌” ఉనికిలోకి వస్తారు. వారు పిల్లల పెంపకాన్ని అత్యంత సాంకేతికంగా చేస్తారు. ఉత్పత్తి సాధనాలు, సమాజ పరమైనట్లుగానే సమాజ ఉమ్మడి ఆస్తి అయిన ఈ పిల్లలు కూడా సమాజ పరం అవుతారు. మమకారం, వాత్సల్యం, మృదుత్వం, మానవత్వం భావోద్వే గాలు అన్ని కూడా వర్గ కసికి బలైపోతాయి. రాజ్యాంగపు దుడ్డుకర్రను కుటుంబ వ్యవస్థను రద్దుచేయడానికి ఉపయోగించిన తర్వాత సోష లిస్టు వ్యవస్థ దానిని దూరంగా విసిరివేస్తుంది.

భవిష్యత్తు భయానకం

ఈ అమానవీయ భౌతిక పరిస్థితుల నుండి ఉద్భవించే సమాజంలోని మానవులు వారి మానసిక స్థితి ఎలా రూపొందుతుంది? వావి వరుసలు కనుమరుగైన సమాజపు జుగుప్సా కర సంఘటనలు అమెరికా, యూరప్‌లతో పాటు అనేక దేశాలలో దర్శనమిస్తున్నాయి. ఆ ఆ సమాజాలలో అశాంతి, అసహనం రోజు రోజుకూ పెరుగుతోంది. హత్యలు, ఆత్మహత్య ల శాతం పెరుగుతోంది. తల్లి కుమారుల మధ్య, తండ్రి కుమార్తెల మధ్య,సొంత సోదర సోదరీమణుల మధ్య లైంగిక సంబంధాలు పెరిగి పోతున్నాయి. స్వలింగ సంపర్కాలు సైద్ధాంతిక రూపం దాలుస్తున్నాయి. వ్యభిచా రం గౌరవ వృత్తిగా మారిపోయింది. సహ జీవనం పేరుతో వివాహ బంధం ఎగతాళికి గురౌతోంది. సింగిల్‌ మ్యాన్‌, సింగిల్‌ ఉమెన్‌ సంస్కృతి ప్రబలి పోతోంది. మరోవైపు ప్రకృతి కి విరుద్ధంగా మనిషి తన జీవన శైలిని తీర్చి దిద్దుకున్న ఫలితంగా మానసిక రోగాలు రెం డింతలయ్యాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్లు 60 శాతం అభివృద్ధి చెందాయి. గర్భ సంచి క్యాన్సర్లు రెండింతలు నమోదౌతున్నాయి. అభంశుభం తెలియని పసిపిల్లలు కూడా ఎయిడ్స్‌ మహ మ్మారికి బలవుతున్నారు. ఈ భయానక పరిస్థి తికి మన భారత దేశం మరెంతో దూరంలో లేదు. సభ్యత, సంస్కృతులకు, నైతిక విలువల కు కాణాచి అయిన మన సుందర భారతావని రూపు రేఖలు అత్యంత వికృతంగా మారబోతు న్నాయి.దీనికి కారణం సృష్టికర్త అయిన దైవం మానవ సౌఖ్యం, సంక్షేమం కోసం ఏర్పరిచిన సహజ సిద్ధమైన సులభమైన హద్దులను మీరటమే.

దివ్యఖుర్‌ఆన్‌ దృష్టిలో మహిళా స్థాయి

స్త్రీ మహోన్నత బాధ్యత అయిన మాతృత్వం, పిల్లల శిక్షణ, కుటుంబ పరిరక్షణ, ఆమె నైజానికి సరిపోయేవి కనుక ఆ బాధ్యతలు మాత్రమే దైవగ్రంథం దివ్యఖుర్‌ఆన్‌ ఆమెకు అప్పగించింది. ఈ మహోన్నత కృషికిగాను ఆమెకు మగవానికంటే మూడు రెట్లు సేవలు పొందే గౌరవం ప్రసాదించింది. ఆమె పాదాల కింద ఏకంగా స్వర్గాన్ని ఉంచింది. ఇస్లాంలో సంపాదించడమైనా, ఖర్చు చేయడమైనా, దైవాదేశాలకు అనుగుణంగా వుండాలి. ఒక ముస్లిం పురుషుడు, స్త్రీపై ఆర్థిక ఆధిపత్యం వహించడం సాధ్యమే కాదు. స్త్రీకి ఆస్తిలో వారసత్వపు భాగం ఇవ్వబడింది. భర్త, తండ్రి, తల్లి, బిడ్డల సోదరుల ఆస్తులలో భాగ స్వామ్యం ఆమెకుంది. వ్యాపార లావాదేవీలు నిర్వహించే స్వేచ్ఛ హద్దులకు లోబడి ఇవ్వ బడింది. విద్యా, జ్ఞానాలను ఆర్జించడం ఆమె కు విధిగా చేయబడింది. ఇదంతా 1430 సంవత్సరాల క్రితమే అరబ్‌ ప్రాంతపు మహిళ పొందిన హక్కులని గుర్తించాలి. నేటి మహిళ కూడా ఇస్లాం ఛాయల్లో ఈ సాధికరతను సాధించుకోవచ్చు.

ఖుర్‌ఆన్‌ – మహిళ

1) ”ఆయన మిమ్మల్ని (స్త్రీ పురుషులను) ఒకే ప్రాణి నుండి పుట్టించాడు.” (ఖుర్‌ఆన్‌-4:1)
2) ”పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి.” (ఖుర్‌ఆన్‌-2:228)
3) ”తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది.” (ఖుర్‌ఆన్‌-4: 7)
4) ”మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.” (ఖుర్‌ఆన్‌-2: 178)
5) ”మీ స్త్రీలు మీకు దుస్తులు. మీరు వారికై దుస్తులు”.(ఖుర్‌ఆన్‌-2:187)
6) ”తల్లి బలహీనతపై బలహీనతను సహించి కడుపున మోసింది.. రెండేళ్ళు పాలు తాగించింది.” (ఖుర్‌ఆన్‌-31: 14)
7) ”విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరికొకరు సహచరు లు, వారు మేలు చెయ్యండని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు. నమాజ్‌ ను స్థాపిస్తారు. జకాత్‌ను ఇస్తారు అల్లాహ్‌ా పట్ల, ఆయన ప్రవక్తల పట్ల విధే యత పాటి స్తారు…. విశ్వాసులైన ఈ పురుషులకూ, స్త్రీలకు అల్లాహ్‌ వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారి కి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉం టారు. నిత్యమూ కళకళలాడే ఆ ఉద్యాన వనాలలో వారి కొరకు పరిశుద్ధమైన నివాసా లుంటాయి.” (ఖుర్‌ఆన్‌ 9:71,72)
8) ”ఎవరైనా సౌశీల్యవతులైన స్త్రీలపై నింద మోపి నలుగురు సాక్షులను తీసుకురాకపోతే వారిని ఎనభై కొరడా దెబ్బలతో కొట్టండి. వారి సాక్ష్యాన్ని ఇక ఎన్నడూ అంగీకరించ కండి”. (ఖుర్‌ఆన్‌ 24 : 4)

Related Post