సంస్కారం – సాత్వికం

Originally posted 2014-09-06 19:17:06.

 ఆయన (స) తీసుకొచ్చిన బోధనలు ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలా నికి మాత్రమే పరిమితం కావు. అది జాతి, వంశం, రంగు, భౌగో ళిక ఎల్లలు, దేశభాషల పేరుతో మానవులకు వర్గాలుగా, కులా లుగా విభజించలేదు. ఒకరితో మంచిగా, ఇంకొరితో చెడుగా ద్వంద్వనీతి అది ఎరుగదు

ఆయన (స) తీసుకొచ్చిన బోధనలు ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలా నికి మాత్రమే పరిమితం కావు. అది జాతి, వంశం, రంగు, భౌగో ళిక ఎల్లలు, దేశభాషల పేరుతో మానవులకు వర్గాలుగా, కులా లుగా విభజించలేదు. ఒకరితో మంచిగా, ఇంకొరితో చెడుగా ద్వంద్వనీతి అది ఎరుగదు

 

మానవ చరిత్రలో సదా అత్యధిక శాతం ప్రజలు మత ధర్మాన్ని నమ్మేవారుగా కనబడతారు. ఈ కారణంగానే ఖుర్‌ఆన్‌ మనిషిలోని మనసులోన గూడు కట్టుకుని ఉండే ఈ భావం గురించి ఇలా తెలియజేస్తుంది: ”అల్లాహ్‌ా మానవులను ఏ స్వభా వంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే (ఉండండి)”.(అర్రూమ్‌:30) అంటే – మనిషి సృజన దేవుని ఏకత్వ భావనపైనే జరిగింది. అతని అసలు నైజంలో కూడా దేవుని ఏకత్వం వేళ్ళూనుకుని ఉం టుంది. అన్ని మతధర్మాలు కూడా ఇతర విషయాల్లో విభేదించినా ఈ ఒక్క మౌలిక విషయంలో ఏకీభవించడం మనం చూస్తాము. ఈ మౌలిక సత్యాన్నే అవి అన్నింటికీ ఆధారభుతంగా పేర్కొనడం కూడా మనం గమనించగలము. కాకపోతే మనిషి పుట్టిన తర్వాత కాలానికనుగునంగా పరిస్థితుల, పరిసరాల ప్రభావానికి, ప్రలోభా నికి లోనవుతాడు. అతను కళ్ళు తెరిచిన సమాజం కుళ్ళు అతన్ని సహజ ధర్మం వైపునకు పోనివ్వదు. అరిషడ్వర్గాలకు బానిసలైన వారి చేతిలో పడి మార్గభ్రష్టతకు గురవుతాడు. ‘సత్యం ఒక్కోసారి కటువుగానే ఉంటుంది. యదార్థవాదం లోక విరోధం అవుతుంది’ అన్నట్టు అతడు అవిశ్వాస స్థితిలోనే ఉండిపోతుంటాడు. ఈ సంద ర్భంగా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మాట గమనించ దగ్గది: ”ప్రతి శిశువు తన సహజ ధర్మంపైనే పుడుతుంది. కాని దాని తల్లిదండ్రులు దాన్ని యూదునిగానో, క్రైస్తవుగానో, మజూసీ గానో మార్చి వేస్తారు”. (బుఖారీ)

అలా గాడి తప్పిన మనిషిలో అసహజ అలోచనలు, అసభ్య ప్రేలాపనలు చోటు చేసుకున్నాయి. తన అభిమతమే సరైనదిగా భావించి, ఇతరుల దృక్పథాన్ని దోషపూరితమయినదిగా తల పోస్తాడు. తన అభిమతానికనుగుణంగా తాను ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు, కనుగొన్న కొన్ని అధారాలను పదే పదే ఉదాహరి స్తూ అదే సర్వస్వం అనుకుంటాడు. అలా ప్రతి ముఠా వారు తామెన్నుకున్న పద్ధతే సత్యబద్ధమైనదనే అపోహకు లోనవుతారు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:
”వారు తమ ధర్మాన్ని ముక్కలు చెక్కలు చేసేశారు.వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబర పడిపోతోంది”. (అర్‌ రూమ్‌: 32)

అసలే మనుష్యులు దుర్బలులు
అందులో చచ్చేటన్ని చీలికలా?
అసలే ఈ లోకం ఇరుకు
అందులో ఇన్నిన్ని ఎల్లలా?

ఇస్లాం ఓ సార్వజనీన ధర్మం. అది సార్వకాలికం. ఆది మానవుడ యిన ప్రవక్త ఆదం (అ) మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వరకు ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ఏకైక జీవన సంవి ధానం. అది మనిషి తన, మాన, ధన, మనోభావాలను గౌరవి స్తోంది. అడుగడుగునా వాటిని కాపాడే కట్టుదిట్టమయిన చర్యలు చేపడుతోంది. గత ప్రవక్తల సంప్రదాయాన్ని, వారి జీవన సంవి ధానాన్ని, వారి ప్రబోధనల్ని ధృవీకరించే గ్రంథంగా, వాటి బోధనా సారాంశాన్ని సంరక్షించే గ్రంథంగా ఖుర్‌ఆన్‌ను పేర్కొనడం జరి గింది: ”మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవత రింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్య మని ధృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ా అవతరింపజేసిన ఈ గ్రంథాని కనుగుణంగానే తీర్పు చెయ్యి”. (అల్‌ మాయిదా: 48)

అంటే ఖుర్‌ఆన్‌ గత దైవ గ్రంథాల్ని, దైవప్రవక్తల్ని ధృవీకరించ డమే కాక వాటిని విశ్వసించమని, గౌరవించమని మానవాళికి పిలుపునిస్తోంది. అయితే గత సముదాయాలకు చెందిన యూద క్రైస్తవ ప్రజలు ప్రవక్తల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు. ప్రవక్త నూహ్‌ా, ప్రవక లూత్‌, ప్రవక్త యాకూబ్‌ కుమారుడయిన యహూదా, ప్రవక్త దావూద్‌, ప్రవక్త సులైమాన్‌, ప్రవక్త యూసుఫ్‌, ప్రవక్త ఉజైర్‌, ప్రవక్త ఇసా (అలైహిముస్సలాతు వస్సలామ్‌)పై లేనిపోని అభాండాలు మోపి వారి పరమ పవిత్ర జీవితాల్ని, వ్యక్తిత్వాల్ని అనుమానాస్పదంగా చిత్రీకరించి, అట్టి వ్యర్థ కథనాలను తాము పరిశుద్ధంగా భావించే గ్రంథాలలోనే చోటు కల్పించారు. అంతటితో సరిపెట్టుకోలేదు. 1980లో డెన్మార్క్‌లో ‘ఏసుక్రీస్తు లెంగిక జీవితం’ (ది సెక్స్‌ లైప్‌ ఆఫ్‌ జీసెస్‌ క్రైస్ట్‌) అను అసభ్య చిత్రాన్ని విడుదల చేశారు. 1988లోనయితే మరీ బరి తెగించి ‘క్రీస్తు అంతిమ శోధన’ (ది లాస్ట్‌ టెంపటేషన్‌ ఆప్‌ క్రైస్ట్‌) అను మరో చిత్రాన్ని విడుదల చేశారు. అది అశ్లీలత కు, అసభ్యతకు పరాకాష్ఠ. ఆ చిత్ర దర్శకుడు మార్టిన్‌ అపర కాథలిక్కట. తర్వాత ఏసును స్త్రీ రూపంలో శిలువపైబెట్టి, న్యూ యార్క్‌లోని అతి పెద్ద చర్చీ అయిన సెయింట్‌ జాన్స్‌లో ప్రధర్శన ఇవ్వబడింది! 1984లో నార్త్‌ కెరోనాలిలో మొట్టమొదటి నగ్న వ్యక్తుల సమావేశంలో ఏసు బొమ్మను కూడా నగ్నంగానే ఉంచి ఆరాధించారు. అలాగే 1998లో టెర్రాస్స్‌ మెక్నల్లీ వేయించిన కార్పస్‌ క్రిస్టి అను నాటకంలో ఏసు వంటి మహాత్ముణ్ని స్వలింగ సంపర్కునిగా చిత్రికరించడం జరిగింది. ఇటువంటి చిత్రాలను, భావాలను ముస్లిం దేశాలు మొత్తం బాన్‌ చేెశాయి. నేటికి అటువంటి సంఘటనల్ని అత్యంత వ్యధతో ప్రతిఘటిస్తూనే ఉన్నాయి.
దైవంచే ఎన్నుకోబడిన ప్రవక్తల విషయంలో నాడే కాదు నేడు సయితం కార్టూన్‌లు గీసి, చిత్రాలు తీసి వారు అవలంబిస్తున్న విధానం దారుణం. అయితే అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌ వారి నిందారోపణలన్నింటినీ త్రిప్పి కొట్టడమే కాక ప్రవక్తలందరినీ పరమ పవిత్రులుగా, పరమ ఆదర్శమూర్తులుగా, పాపరహితులు గా పేర్కొనింది. అన్‌అమ్‌ సూరా 83-88 వరకు ఉన్న వాక్యాల లో అనేక ప్రవక్తల ప్రస్తావనతో పాటు-”వారందరూ సద్వర్తుల కోవకు చెందినవారే” (అన్‌ఆమ్‌: 85) అని కితాబు ఇచ్చింది. అలాగే మత పీష్వాలనుగానీ, దైవంగా భావించే కొలిచే వ్యక్తుల నుగాని వారు ఏ మతానికి, వర్గానికి చెందిన వారైనా తూల నాడటం తగదని నొక్కి వక్కాణించింది. ”వారు అల్లాహ్‌ాను వదలి వేడు కునేవారిని మీరు దూషించకండి”(అల్‌ అన్‌ఆమ్‌: 108)

ఈ కారణంగానే ఒక ముస్లిం తాను మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని ఎంతగా అభిమానించేవాడయినప్పటికీ, ఇస్లాం ధర్మాన్ని ఎంత నిష్టగా పాటిస్తున్నప్పటికీ, ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని ఎంతగా గౌరవిస్తున్నప్పటికీ, తాను ధర్మ విషయంలో ఎంతో నిజా యితీపరుడయినప్పటికీ, ఒకవేళ తాను గత ప్రవక్తల్లోని ఏ ఒక్క ప్రవక్తను నిరాకరించినా, అగౌరపరచినా, అనుమానించినా, అవ మానించినా అతను ముస్లింగా కొనసాగ లేడు.

తర్వాత ఇస్లాం తన్ను అనుసరించే వారినుద్దేశ్యించి చేసిన ముఖ్యోపదేశం ఏమిటంటే, వారు దైవ అంతిమ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వారి రాక పూర్వం వచ్చిన ప్రవక్తల పేర్లు తీసుకున్న ప్పుడు గౌరవప్రదంగా (అలైహిస్సలామ్‌) పలకాలని, వారి గురించి మాట్లాడే విషయంలో కడు అప్రమత్తంగా వ్యవహరించాలని, వారి విషయంలో అల్లాహ్‌ాకు భయపడాలని నొక్కి వక్కాణించింది. ఖుర్‌ఆన్‌ చేప్పేదేది ఏమిటంటే, ”మేము నీకు (ఓ ప్రవక్తా!) సత్యాన్ని ఇచ్చి శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. హెచ్చరించేవాడు రాని సమాజమంటూ ఏది లేదు”. (ఫాతిర్‌: 24) ”మేము ఏ ప్రవక్తను పంపినా, అతడు విష యాన్ని స్పష్టంగా విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడేవానిగా చేెసి పంపాము”. (ఇబ్రాహీమ్‌: 4)
ఇస్లాం మనిషికి మాట్లాడే స్వేచ్చనిస్తుంది. కానీ దానికంటూ కొన్ని మర్యాదలను, హద్దులను కేటాయిస్తుంది, మనిషి తన మత ధర్మాన్ని అనుసరిస్తూ ఇతర సిద్ధాంతాలను, విధానాలను సహేతు కంగా విమర్శంచడం, చర్చకు అవకాశమ ఇవ్వడం మంచి విషయమే. కానీ పర దూషణ, పరనింద, పరిహాసాన్ని ఏ మతమూ అంగీకరించదు. ఏ సమాజమూ హర్షించదు.

ఏ మత అవలంబీకులయినా వారి దృష్టిలో పవిత్రమయిన పీష్వా లను తూలనాడటం సహించరు. కొన్ని కోట్ల మంది ప్రజల మనో భావాల్ని గాయపర్చే చర్యను ఏ చట్టమూ సహించదు. ఒక దేశానికి సంబంధించిన జెండాను లేదా దేశ చిహ్నాన్ని కించపరిస్తే అట్టివారిని శిక్షించేందుకు మాత్రం కఠిన చర్యలు గైగొనడం జరు గుతుంది. మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారికి మరణ దండన విధించే ప్రభుత్వాలూ ఉన్నాయి. మరలాంటప్పుడు వందల కోట్ల మంది ప్రజలు అభిమానించే, ఆదర్శంగా భావించే వ్యక్తి చెడుగా చిత్రీకరించడం నేరం కాదా? ఈ కారణంగానే ఇస్లాం ప్రవక్తలను కించపరిచే వారికి మరణ దండన శిక్ష అంటుంది. వాస్తవం ఏమిటంటే, మరణ దండనకన్నా ఇంకా కఠిన శిక్ష ఏదయినా ఉంటే అదీ అమలు పర్చాల్సి ఉంటుంది.

ధనం దొంగలించినవాడు హీనుడట
అభిమానధనం కొల్లగొట్టినవాడు ధీరుడట
పశువును హింసించినవాడు దండనార్హుడట
ప్రవక్తను పరహసించినవాడు హాయిగా ఉండాలట

ప్రంపంచంలో అనేక మతాలు, సిద్ధాంతాలు వచ్చాయి, కనుమరు గై పోయాయి. కానీ పద్నాలుగు శతాబ్దాలు గడుస్తున్నా, మస్జిదు ల కూల్చివేత, తలాఖ్‌, పరదా, బహు భార్యాత్వం వంటి అంశాల ను మాటిమాటికీ తిరగదోడుతూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మారణహోమాలు సాగిస్తున్నా, ఇస్లాం మాత్రం ప్రభంజనంలా విస్తరిస్తూనే ఉంది. ఇంకా ప్రళయం వరకూ కొనసాగుతూనే ఉం టుంది. కారణం మహా ప్రవక్త (స) వారు తీసుకొచ్చిన విప్లవం ప్రలోభాలది కాదు. ఒకర్ని చంపి ఇంకొర్ని బ్రతికించేది కాదు. ఇది హృదయాంతరాలను ప్రకాశమానం చేెసే కాంతి పుంజం.
అది చూపే జీవన విధానంలో పాలకులకు, పౌరులకు, పురు షులకు, స్త్రీలకు, ధనికులకు, బడుగు బలహీన వర్గాలకు కావా ల్సిన దిశానిర్దేశం ఉంది. పశుపక్ష్యాదులపై సయితం అది చూపే కారుణ్యం అద్వితీయం.

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి వ్యక్తిత్వం పూర్తి ప్రపంచానికి మార్గదర్శకత్వం అని అంటున్నామంటే, ఇది కేవలం మతపరమైన వెర్రో, భ్రమో కాదు. విశ్వాసపరమయిన ఆనంద డోలికల్లో ఓల లాడుతూ చెప్పిన మాట అంతకన్నా కాదు. అదో అక్షర సత్యం. చారిత్రకంగా నిరూపితమయిన వాస్తవం! సమస్త మత మేధావుల నోట వెలువడిన సాక్ష్యం!! కారణం ఆయన (స) తీసుకొచ్చిన బోధనలు ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలా నికి మాత్రమే పరిమితం కావు. అది జాతి, వంశం, రంగు, భౌగో ళిక ఎల్లలు, దేశభాషల పేరుతో మానవులకు వర్గాలుగా, కులా లుగా విభజించలేదు. ఒకరితో మంచిగా, ఇంకొరితో చెడుగా ద్వంద్వనీతి అది ఎరుగదు. అలాగే ఆయన ప్రబోధించిన జీవన విధానంలో మానవ జాతికి సంబంధించిన సకల సమస్యలకు పరిష్కారం ఉంది. మనిషికి ఎదురయ్యే పరిస్థితులు – సంతోషం, విచారం, గెలుపు, ఓటమి, సౌభాగ్యం, దౌర్భాగ్యం – అన్నింటిలో అతనికి మార్గదర్శకత్వం వహిస్తుంది. అతను న్యాయవాది అయినా, న్యాయం కోరేవాడయినా, గురువయినా, శిష్యుడయినా, తండ్రయినా, కొడుకయినా, సైనాధికారి అయినా, సైనికుడయినా, సామాజికి జీవితమయినా, ఆర్థిక వ్యవస్థయినా, దేశ అంతరంగిక వ్యవహారమయినా, అంతర్జాతీయ సంబంధాలయినా, శాంతి ఒప్పందాలయినా, రణరంగ నీతి అయినా ప్రతి చోట మహాప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవితం కాగడలా మార్గం చూపుతుంది. వీటన్నింటికితోడు ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త (స) వారి ప్రవచ నాలు మానవాళి వరకు సురక్షితంగా చేరడం మరో విశేషం. ఈ విశిష్ఠతల కారణంగానే ముస్లిం – అతను ఎన్ని ఒడిదుడుకులకు, అగ్ని పరీక్షలకు గురయినా ఎప్పుడు కూడా విశ్వాసపరంగా న్యూనతకు లోనవ్వడు. తను పేదవాడయినా, ధనికుడయినా, పండితుడయినా, పామరుడయినా, ఇతర వర్గాల తరఫు నుంచి దోపిడీ దౌర్జన్యాలకు గురయినా, ఆరు నూరయినా, నూరు ఆరయినా తను మాత్రం సత్య మార్గాన్ని వదలడు. తన – తన, మాన, ధనాలను పణంగా పెట్టడానికి సిద్ధమయిపోతాడేగానీ, ప్రవక్త (స) వారిపై అపవాదును అతను భరించడు. ఒక్క ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపైనేకాదు దైవప్రవక్తల్లోని ఏ ప్రవక్త పట్ల అమర్యాదగా వ్యవహరించడాన్ని అతను సుతరామూ ఇష్టపడడు.

తీసుకో మా మేని కండలను; వేసుకో నీ ఇంటి కుక్కలకు. 
తలపుంటే మా నెత్తురు చేదుకొని; తడుపుకో నీ తోట మొక్కలకు.
కసితీరా మా ఆత్మ నొక్కేసి; కాల్చేయి నిప్పుని రాజేసి. 
ప్రవక్త పట్ల అసలైన మా ప్రేమ ఏనాడు తొణకదు, బెణకదు.

అతని నోట సదా ఈ మాట ఉంటుంది: ”మేము అల్లాహ్‌ాను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దాని (ఖుర్‌ఆన్‌)నీ, ఇబ్రాహీమ్‌, ఇస్మాయీల్‌, ఇస్హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతితిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధే యులము”. (అల్‌ బఖరా: 136)

Related Post