సామాజిక న్యాయం అంటే?

 

1. న్యాయం అనగా సవ్యమైన,సమంజసమైన ప్రవర్తన.
2. సవ్యంగా, అందరి హక్కులనూ ఇచ్చే గుణం.
3. అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ సమాన హక్కులనిచ్చే న్యాయ పాలన
(ఆక్స్‌ ఫోర్డ్‌ డిక్షనరీ, ఇండియన్‌ ఎడిషన్)

ఈ నిర్వచనం వెలుగులో సామాజిక న్యాయం అంటే సమాజంలో వ్యక్తులందరితో సమాన మైన ప్రవర్తన అందరి హక్కులను న్యాయ బద్ధంగా అందించటం.

సామాజిక న్యాయమే ఖుర్‌ఆన్‌ ధ్యేయం:
బానిస వ్యవస్థ, ఉక్కుపాదాల కింద నలిగిన మానవాళికి సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక న్యాయాన్ని అనంతకాలం వరకు అందించే ప్రాథమిక బోధనలు దైవం ఖుర్‌ఆన్‌లో అవతరింపజేశాడు.ఈ బోధనలను విస్మరిం చిన మానవాళి నష్టానికి గురవుతున్నది.
ఖుర్‌ఆన్‌ తన విప్లవాత్మక దృక్పథంతో అణ గారిన, బడుగు, బలహీనవర్గాల బ్రతుకుల్లో వెలుగు నింపుతోంది. మానవులంతా ఒక్కటే, ఒకే తల్లిదండ్రి సంతతి అని ప్రకటించిన ఏకైక గ్రంథం పవిత్ర ఖుర్‌ఆన్‌. సమస్త మానవాళి సమానమే అన్న ఖుర్‌ఆన్‌ స్ఫూర్తిని గ్రహించి మానవాళి మసలుకుంటే పుట్టుక ప్రకారం ఎవరూ పూజ్యులుకారు, ఎవరూ పాపులు కారు. ఆ కారణంగా జనించే జాతీ యాధిక్యత (రేసియల్‌ సుపీరియర్‌టీ)కూ తావుండదు. ప్రపంచ మానవాళి అంతా ఒకే కుటుంబంలా అలరారుతుంది.

సామాజిక న్యాయ లక్ష్యం వ్యక్తిత్వ వికాసం
మానవ సమాజం కోట్లాది వ్యక్తుల సమూహం. ఈ సమూహంలోని ప్రతిఒక్కరూ ఆత్మ,బుద్ధి, చైతన్యాలు కలవారే. అతను ఓ ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. వ్యక్తిత్వాభివృద్ధికి అవకాశాలు లభించాలి.
మానవ నిర్మిత చట్టాలే అసమానతలకు మూలం:

జాతీయ దురభిమానం (రేసియల్‌ సుపీరియారిటీ), అపరిమిత ధన కేంద్రీకరణ (అన్‌ లిమి టెడ్‌ వెల్త్‌ సెంట్రాలిజేషన్) పూర్తి స్థాయి ధన వికేంద్రీకరణ (ఎక్స్‌ట్రీమ్‌ డీసెంట్రేలిజేషన్‌) లాంటి సంకుచిత దృక్పథాలు మానవ నిర్మిత వ్యవస్థల వల్లే ఏర్పడ్డాయి. మానవుని స్వార్థ చింతనే పరమావధిగా ఏర్పడ్డ ఈ వ్యవస్థల విష ప్రభావాలకు మానవాళి గురైంది.

పెట్టుబడిదారీ విధానం (క్యాపటలిజమ్)
స్వార్థ పరత్వానికి మారు పేరు పెట్టుబడిదారీ విధానం. ధన కేంద్రీకరణ (వెల్త్‌ సెంట్రాలిజేషన్) ఈ వ్యవస్థ ముఖ్య లక్ష్యం. ఈ లక్ష్యం పరి పూర్తి చేసుకోవడానికై ఆవిర్భవించిన వ్యవస్థ వడ్డీ. ఈవడ్డీ వ్యవస్థ కారణంగా అధిక సంఖ్యాకుల ధనం కొద్దిమంది దగ్గరే కేంద్రీ కృతమవుతోంది. నేటికీ ప్రపంచంలో వడ్డీ వ్యవస్థ ఆధిపత్యం వహిస్తున్నందువల్ల ఆర్థిక అసమానతలు పెరిగి సామాజిక న్యాయం (సోషియల్‌ జస్టీస్‌) ‘అందని ద్రాక్షే’ అవుతుంది. నేడు ప్రపంచంలో 1% శాతం మాత్రమే కల ధనికులు ప్రపంచ సంపదలో 40 శాతం వాటాను కలిగివుంటే 50% మంది నిరుపేదలకు మొత్తం సంపద లో 1% మాత్రమే వాటా ఉంది.
సామ్యవాదం (సోషలిజమ్‌) – కృత్రిమ సమానత్వం:

దైవ నియమావళికి వ్యతిరేకంగా మనిషి సృష్టించిన మరో ఉపద్రవం ఈ సామ్యవాదం. ఇది కూడా సామాజిక న్యాయాన్ని సుసాధ్యం చేయలేకపోయింది. నెహ్రూ రష్యా పర్యటన తర్వాత మనదేశ అంతిమ లక్ష్యం సామ్య వాదం అని రాజ్యాంగంలో రాశారు. నిజానికి నెహ్రూ ఇప్పుడు బతికుంటే ఆ మాటను వెనక్కి తీసుకునేవారేమో! ఎందుకంటే సోషలి జమ్‌ చేసిన మానవ హననం భయానక మైంది. అది సృష్టించిన సమానత్వం అసహజ మైంది.

ఇది అందరి దగ్గరా ధనం లాక్కొని అందరికీ సమానంగా పంచే నయా దోపిడీ రాజ్యాన్ని (న్యో రోబర్టీ స్టేట్) స్థాపించింది. అందుకే ఈ వ్యవస్థ 1991లో అంతమయింది. ఈ ప్రపం చీకరణ (గ్లోబలిజేషన్) కాలంలో కూడా ఆదర్శ కమ్యూనిస్టు వ్యవస్థగా పేరొందిన క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో ‘మన దేశానికి ఇకపై కమ్యూనిస్టు వ్యవస్థ అవసరం లేదు. మనం సంస్కరణల వైపు మరలాలి.’ అని పేర్కొనడం ఈ వ్యవస్థకు భవితే లేదనడా నికి నిదర్శనం. మన దేశంలో బెంగాలులో 30 ఏళ్ళనుండీ అధికారంలో ఉన్న ఈ కమ్యూ నిస్టు సామాజిక న్యాయ ధ్వజవాహకుల పరి పాలనలో సామాజిక, ఆర్థిక పతనావస్థను మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూనే ఉన్నాం.
సామాజిక న్యాయం ఖుర్‌ఆన్‌ ద్వారానే సాధ్యం:

సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న మానవాళికి ఖుర్‌ఆన్‌ మార్గం చూపుతుంది. దేవుడొక్కడే, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. దేవుని భూమిపై దేవుని శాసనమే అమలు జరగాలి. మాన వుడు ఆ సర్వోన్నతుని శాసనాలను అమలు పరిచే ప్రతినిధి మాత్రమే. ఈ సిద్ధాంతం వెలు గులో ఖుర్‌ఆన్‌ చూపే ఆర్థిక వ్యవస్థ వ్యక్తిగత, సామూహిక జీవితాలకు సమ ప్రాధాన్యతని చ్చింది. ఖుర్‌ఆన్‌ బోధనలు ఈ భువిపై అమలు జరిగితే ఒక వ్యక్తి ధనవంతుడైన కార ణాన వేలాదిమంది నిరుపేదలు అవ్వాల్సిన అగత్యం రాదు. ఖుర్‌ఆన్‌ ప్రసాదిత సూత్రాలు నిరుపేదను కూడా ధనవంతునిగా మారు స్తాయి. సామాజిక న్యాయానికి ఖుర్‌ఆన్‌ ప్రతి పాదించే ఆరు సూత్రాలు:

1. అధర్మ సంపాదన నిషేధం:
ఒక వ్యక్తి సంపాదించే ధనం వల్ల వేరే వ్యక్తి లేదా సమూహాలకు నష్టం కలిగే ఏ విధానాన్నీ ఖుర్‌ఆన్‌ అంగీకరించదు. దొంగతనం, లం చం, జూదం, వంచన, లాటరీ, వడ్డీ లాంటి అన్ని అధర్మ అనైతిక మార్గాలను ఇస్లాం మూసేస్తుంది.”విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం – ఇవన్నీ అసహ్యకరమైన షైతాన్‌ పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్యం భాగ్యం కలిగే అవకాశం ఉంది.” (ఖుర్‌ఆన్‌ 5: 90)

2. పిసినారితనం నిషేధం:
పిసినారిగా ఉండే వ్యక్తి సమాజానికి వ్యతిరే కంగా తీవ్రమైన తప్పు చేస్తాడు.
”అల్లాహ్‌ా విరివిగా ప్రసాదించిన అనుగ్రహాల పట్ల పిసినారితనం చూపేవారు, ఈ పిసినారి తనం తమకు లాభదాయకమైందని భావించ రాదు. ఇది వారి కోసం ఎంతో నష్టకదాయక మైంది.” (ఖుర్‌ఆన్‌ 3: 180)

3. దైవమార్గంలో ఖరు పెట్టడం:

ధనాన్ని సంపాదించిన వ్యక్తి విలాసాల (లక్జరీస్‌) కొరకు ఖర్చుపెట్టే అనుమతిని ఖుర్‌ ఆన్‌ ఇవ్వదు. ఆ ధనాన్ని దైవమార్గంలో ఖర్చు పెట్ట మంటుంది. దైవమార్గం అంటే సామా జిక శ్రేయస్సుకు అని ఖుర్‌ఆన్‌ భావం. ఈ నేపథ్యంలోనే విస్తృత దానధర్మాలను ఖుర్‌ఆన్‌ ప్రోత్సహించింది. అంతేకాక వీటిని గ్రహీత హక్కుగా ప్రకటించింది. ”అల్లాహ్‌ా వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధి కం చేస్తాడు.” (ఖుర్‌ఆన్‌ 2:276)
”మీ జీవితావసరాలకు తీరగా మిగిలినది మీరు దానం చేయండి” (దైవమార్గంలో ఖర్చు పెట్టండి)
దానధర్మాలు చేయడంలో సంపద భ్రమణ (రోటేట్‌) చెందుతూ ప్రజలందరి వద్దకు చేరు తుంది. అందరి కొనుగోలు శక్తి పెరుగు తుంది. పరిశ్రమలు,పొలాలు అభివృద్ధి చెందు తాయి. వాణిజ్యం పురోగమిస్తుంది. రైతుల ఆత్మహత్యలుండవు. ప్రజలు సుఖసంతోషాల తో సుభిక్షంగా వర్థిల్లుతారు.

4. జకాత్‌ – ఓ సామాజిక భీమా (సోషియల్‌ ఇన్సూరెన్స్)
సామాజిక న్యాయ సాధనకు ధనభ్రమణం జరగడం అవసరం. ధన భ్రమణం (రోటేట్‌) చెందడానికి ఖుర్‌ఆన్‌ ఓ సామాజిక భీమా (సోషియల్‌ ఇన్సూరెన్స్‌)ని ప్రతిపాదించింది.
దాని పేరే జకాత్‌. ఈ విధానం ప్రకారం దేశ సంపదపై 21/2 శాతం, పొలాలపై 10%, లేక 15%, ఖనిజోత్పత్తులపై 20%, పశుసం పద, వెండి, బంగారు నిల్వలపై నిర్ణీత జకాత్‌ ప్రతి సంవత్సరం చెల్లించాల న్నది ఖుర్‌ఆన్‌ నిర్దేశన. జకాత్‌ చెల్లించనిదే ఏ వ్యక్తి ధనమూ పరిశుద్ధం కాదన్నది ఇస్లాం బోధన. సేకరిం చిన జకాత్‌ను సమాజంలో ఆర్థిక అసమాన తలను తగ్గించడానికి విని యోగించమం టుంది ఖుర్‌ఆన్‌.
అందుకే ఈ జకాత్‌ ధన్నాన్ని నిరుపేదలకు, ఖైదీల విడుదలకు, రుణగ్రస్తులకు, దైవధర్మ ఉన్నతికి, బాటసారు లకు ఇత్యాది సామాజిక అవసరాలకు వినియో గించాలన్నది ఖుర్‌ఆన్‌ బోధన.

5. వారసత్వం చట్టం:
ఈ చట్టం కూడా ధన కేంద్రీకరణను అరి కడుతుంది. ఈ చట్టం ప్రకారం కొద్దో గొప్పో ఆస్తి కల వ్యక్తి మరణిస్తే అతని ఆస్తిని దగ్గరి, దూరపు బంధుత్వాల్లో పంచి ధనం కేంద్రీకరిం చబడకుండా చేస్తుంది.

6. వృధా ఖర్చు నిషేధం:
”ఖర్చు చేస్తే దుబారా ఖర్చు చేయకుండా పిసి నారితనం చూపకుండా ఈ రెండు అతి వాదాల మధ్య మధ్యేమార్గాన్ని అవలంభిస్తారో వారే సజ్జనులైన అల్లాహ్‌ా దాసులు.” (ఖుర్‌ఆన్‌ 25:67)
”దుబారా ఖర్చు చేయకండి. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్‌ సోదరులు”. (ఖుర్‌ఆన్‌ 17:27)
ఖుర్‌ఆన్‌ ఒక పరిధిని నిర్ణయించి ఆ పరిధి లోపలే ఖర్చు చేయమంటుంది. అనగా సంపాదనాపరుడు తన సంపాదన ఆడంబరా లకు కాక బంధుమిత్రులు, పొరుగువారు, అతికష్టం మీద బ్రతుకు వెళ్ళదీస్తున్న వారికి ఖర్చుచేయమనడం సామాజిక న్యాయానికి నిదర్శనం.
”బంధువుకు అతని హక్కు ఇవ్వండి, లేమికి గురయిన వారికి, బాటసారికి వారి వారి హక్కులివ్వండి.” (ఖుర్‌ఆన్‌ 17:26)
అగత్యపరుడు ఆకలితో అలమటిస్తుంటే, సంపాదనాపరుడు విలాసాల్లో మునగడం ఖుర్‌ ఆన్‌ దృష్టిలో దుబారా. అందుకే సంపాదన, పంపిణీలలో అసమానతలు సృష్టించే సంగీ తం, మద్యం, జూదం, వ్యభిచారం లాంటి వాటిని నిషేధించింది. విలువైన దుస్తులు, వజ్ర వైఢూర్యాలు, వెండి, బంగారు ఆభరణాల పై పరిమితులు విధించింది.

ఖుర్‌ఆన్‌ పరిభాషలో – ధర్మం (దీన్)
ఖుర్‌ఆన్‌ ఓ సంపూర్ణ జీవన వ్యవస్థ ప్రతిపాదించే తత్వచింతన. అది మానవాళి సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాలను ధర్మం నుండి వేరుపరచదు. మానవాళి ఎదు ర్కొనే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపే దైవగ్రంథం దివ్యఖుర్‌ఆన్‌.

Related Post