Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఉభయ కుశలోపరి

భారత సమాజంలోని మతాలన్నింని, సంపద్రాయాలన్నింని గుర్తించాలి. పక్రృతిసిద్ధ ద్వందాలు కలిస్తేనే సృష్టి పరిపూర్ణమవుతుంది. మానావ సమాజంలోనీ ఈ ద్వందాలు కలిస్తే భారత దేశం నింఢు శోభను సంతరించుకుంటుంది. కాబట్టి మానవ సమాజానికి హాని కానంత వరకూ ఎవరి మతాన్ని వారిని అనుసరించనిద్దాం! అలా కాదని విడిపోతే చెడిపోతాం. చెడిపోతే పడిపోతాం!

భారత సమాజంలోని మతాలన్నింని, సంపద్రాయాలన్నింని గుర్తించాలి. పక్రృతిసిద్ధ ద్వందాలు కలిస్తేనే సృష్టి పరిపూర్ణమవుతుంది. మానావ సమాజంలోనీ ఈ ద్వందాలు కలిస్తే భారత దేశం నింఢు శోభను సంతరించుకుంటుంది. కాబట్టి మానవ సమాజానికి హాని కానంత వరకూ ఎవరి మతాన్ని వారిని అనుసరించనిద్దాం! అలా కాదని విడిపోతే చెడిపోతాం. చెడిపోతే పడిపోతాం!

‘ఉభయ కుశలోపరి’ ఇచ్చట మేము క్షేమం…అచ్చట మీ యోగ క్షేమాలను నిరంతరం కోరుకుంటున్నాం. ఇది అమృతోపమానమయిన యోగక్షేమాల సమాచార వివరణ, ఆత్మీయపూర్వ స్మరణ! పత్రి పలుకులోనూ ‘భద్ర’ అనే భావం ఉండాలని, పత్రి మాట మంగళప్రదం అవ్వాలని, క్షేమం,శ్రేయం అందరికీ వరించేలా కోరుకోవాలని పెద్దలు చెప్పిన మాట నేటి తరానికి బంగారు మూట. దైవానుగ్రహం వల్ల మనకు వరించిన అదృష్టం మనం భారతీయులం అవ్వడం. ఆ అదృష్టం చేజారిపోకుండా భద్రంగా, స్థిరంగా నిలుపుకోవడంలోనే మనందరి శ్రేయో శుభాలు, అభ్యుదయం, పగ్రతి వికాసాలు దాగున్నాయి. తన వల్ల ఎదుటి వ్యక్తి ఎటువంటి హాని కలుగదు అని తెలియజేసే సంకేత పదమే ఇస్లాం నేర్పే అభివాదం – అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు – మీపై శాంతి కురియుగాక! దేవుని కరుణ, శుభాలతో మీరు సదా వర్థిల్లుగాక!

కడివెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు మనషుల మధ్య, మనసుల మధ్య వారధిగా నిలవాల్సిన మతం, కొందరి ఛాందసం కారణంగా వారిధిగా, పెద్ద ప్రమాదకారిగా మారడం సగటు భారతీయునికి ఆందో ళన కలిగించే అంశం. మతం మనిషికి ఎంత వరకు మేలు చేస్తుంది అన్న మీమాంసను ప్రక్కనబెడితే మతమే ఛాందసవాదుల దుర్వినియోగంతో విపరిణామానికి గురవుతోంది. నేడు మత ఛాందసం, మత మౌఢ్యం, మతోన్మాదం, మత దుర్వినియోగం దేశ అభ్యుదయానికి తూట్లు పొడుస్తోంది. మతం బోధించే మేలిమి గుణ రసాస్వాదనకు బదులు విషస్వాదన చేస్తున్నాడు మనిషి. హితాన్ని కోరేది మతమయితే, హఠం చేసేది, అన్య మతస్థులకు ఖతమ్‌ చేయాలనుకునేది మతం ఎలా అవుతుంది? అది ముమ్మాటికి ఉన్మాదమే, ఉగవ్రాదమే. ఒకే మతాన్ని అవలంబించి తీరాలని దైవమే బలవంతం చెయ్యనప్పుడు ఒకరి మతాన్ని, అభిమతాన్ని ఖండించేందుకు మనం ఎవరం? ”నీ పభ్రువే గనక తలచుకొని ఉంటే మనుషులందరినీ ఒకే సమూ హంగా చేసి ఉండేవాడు. కాని వారు మాతం విభేదించుకునే వారుగానే ఉంటారు”. (హూద్‌: 118) ”నీ పభ్రువు తలచుకుని ఉంటే భూమండలంలో ఉన్నవారందరూ విశ్వసించి ఉండేవారు. ఇది ఆయన నియతి అయినప్పుడు – ఏమి జనలందరూ విశ్వసించి తీరాల్సిందేనని నువ్వు వారిపై బలవంతం చేస్తావా?”. (యూనుస్‌: 99.100) ఆ విషయానికొస్తే – ”ధర్మం విషయంలో (ఎవరిపై) ఎలాంటి బలాత్కారం, బలవంతం లేదు”. (అల్‌ బఖరహ్‌: 256)

ప్రక్కవాడి ఆస్తిని ప్రక్కవాడినే అనుభవించనిస్తున్నాం, పొరుగువాని ఇంటిలో పొరుగు వాడినే ఉండనిస్తున్నాం. దుఃఖంలో సుఖాన్నీ, వికారంలో అందాన్నీ, నలుపులో తెలుపునీ, చీకటిలో వెలుగునూ, వెలుగులో రంగులనూ గుర్తించినట్లే భారత సమాజంలోని మతాలన్నింని, సంపద్రాయాలన్నింని గుర్తించాలి. పక్రృతిసిద్ధ ద్వందాలు కలిస్తేనే సృష్టి పరిపూర్ణమవుతుంది. మానావ సమాజంలోనీ ఈ ద్వందాలు కలిస్తే భారత దేశం నింఢు శోభను సంతరించుకుంటుంది. కాబట్టి మానవ సమాజానికి హాని కానంత వరకూ ఎవరి మతాన్ని వారిని అనుసరించనిద్దాం! అలా కాదని విడిపోతే చెడిపోతాం. చెడిపోతే పడిపోతాం!

”ఒక జాతిని, దేశాన్ని చీల్చాలంటే అందుకు మతాన్ని మించిన ఆయుధం లేదు” అన్నాడు బెర్నాడ్షా . ”మత మౌఢ్యం భీతావహానికి కొలువు” అన్నారు వెనకటికి మన పెద్దలు. పప్రంచంలో మానవుల మధ్య ఎప్పుడు, ఎక్కడ కలతలు, కలహాలు చెలరేగినా, వైమనస్యాలు, వైషమ్యాలు, వైరాలు, దూరాలు పెరిగినా దానికి కారణం సదా ఒక్కటే – దుర్మార్గం, దురభిమానం, దురంహాకారం, భాషా వైషమ్యం, దేశం, ప్రాంతం, వంశం, వర్ణాల దురభిమానం, సంకుచిత జాత్యాహంకారం. మానవులంతా ఎన్ని శాఖోపశాఖలుగా విస్తరించినా అందరూ ఒకే వృక్ష కొమ్మలు రెమ్మలు. అందరూ ఒకే స్తీప్రురుష జంట ద్వారా ఉనికిలోకి వచ్చినవారే. ఒకే మూలం నుండి విస్తరించిన మానవాళి పక్రృతి సిద్ధంగా అనేక రంగుల్లో, తెగల్లో, జాతుల్లో విడిపోయింది. ఈ సహజ పరిణామాలు మనుషుల్లో నిమ్నోన్నత భావనలకు, హెచ్చుతగ్గులకు, ఎంత మాతం పమ్రాణాలు కావు. నిజానికి మానవుల మధ్య వ్యత్యాసం చూపగల పమ్రాణం, గీటురాయి ఏదయినా ఉందంటే అది కేవలం నైతికమైనది మాత్రమే. నైతికంగా ఉన్నతంగా ఉన్నవాడే మనుషుల్లో ఉత్తముడు. అతను నల్లవాడయినా, తెల్లవాడయినా, అరబ్బయినా, అమెరికనయినా, ఆర్యుడయినా, అనార్యుడయినా, పండితుడయినా, పామరుడయినా, నాస్తికుడయినా, ఆస్తికుడయినా, స్త్త్రీ అయినా, పురుషుడయినా సరే. ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:

”మానవులారా! మేము మిమ్మల్ని ఒక స్తీప్రురుషుల జంట ద్వారా పుట్టించాము. తరువాత మిమ్మల్ని జాతులుగా, వంశాలుగా చేశాము; మీరు ఒకరినొకరు గుర్తు పట్టగలగాలని. వాస్తవానికి అల్లాహ్‌ దృష్టిలోనయితే మీలో అందరికన్నా అధికంగా చెడులకు దూరంగా ఉండేవాడే, దైవభీతిపరుడే ఆదరణీయుడు”. (దివ్య ఖుర్‌ఆన్‌-49: 13)

ఒకరి గురించి మాట్లాడి బంధాలు తెంచుకోవాల్సిన సందర్భం కాదిది; అందరితో మాట్లాడి సామరస్యాన్ని, సుహృద్భావాన్ని పెంచుకోవాల్సిన, పేమ్రానురాగాలను పంచుకోవాల్సిన, ఆదరాభిమానాలను కురిపించుకోవాల్సిన సమయమిది. స్వసంస్కృతీ నిష్ఠులైనా, స్వదేశానురాగులైనా – అన్య సంస్కృతు పట్ల, అన్య దేశాల, మతాల పట్ల గౌరవాలు పుష్కలంగా పద్రర్శించే సామరస్య ధోరణి నేటి ఆవశ్యకత. ఎవరి మతంలో వారిని మనుగడ సాగనిద్ధాం. ఇతర మతావలంబీకుల హక్కుల్ని, నమ్మకాలను కాల రాసి, స్వీయ మతానికి మచ్చ తీసుకురాకుండా మన మతానికి వన్నె తెచ్చి, మన దేశ గౌరవాన్ని, విశిష్ఠతను కాపాడుకుందాం! అప్పుడు అందరూ కనే ‘ఉభయ కుశలోపరి’ అనే పసిడి కల పుష్పిస్తుంది, మధుర ఫలాను అందిస్తుంది. అందు కోసం మనక్కావాల్సింది సహనం. హననం ఎంత మాతం కాదు. నేటి మన ఆవశ్యకత అందమయిన నినాదాలు కాదు, ఆచరణకు నోచుకునే విధానాలు!

Related Post