స్త్రీ విముక్తికి త్రి సూత్రాలు

Originally posted 2014-06-09 23:33:26.

స్త్రీమూర్తి-వివాహిత అయినా అవివాహిత అయినా ఆమెకు సమాజంలో రక్షణ కరువైపో యింది. కాలేజిలో ఉన్మాది వేధిస్తున్నాడని చదువు మానేసి ఇంట్లో ఉంటున్న అమ్మాయి కీ భద్రత అంతంత మాత్రమే. భర్త పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఇల్లాలి శీలానికీ రక్షణ పూజ్యమే. చివరికి రక్షణాలయాలలో కూడా భద్రత లేని దుస్థితి. ‘ఆధునికం’ అని మనం గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నాము కానీ, నిజంగా మనం నేటికీ ఆటవికంలోనే జీవిస్తు న్నాము.

స్త్రీమూర్తి-వివాహిత అయినా అవివాహిత అయినా ఆమెకు సమాజంలో రక్షణ కరువైపో యింది. కాలేజిలో ఉన్మాది వేధిస్తున్నాడని చదువు మానేసి ఇంట్లో ఉంటున్న అమ్మాయి కీ భద్రత అంతంత మాత్రమే. భర్త పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఇల్లాలి శీలానికీ రక్షణ పూజ్యమే. చివరికి రక్షణాలయాలలో కూడా భద్రత లేని దుస్థితి. ‘ఆధునికం’ అని మనం గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నాము కానీ, నిజంగా మనం నేటికీ ఆటవికంలోనే జీవిస్తు న్నాము.

(కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, అశయాలు, ఆకాంక్షలతోపాటు మరెన్నో అనుమానాలు, ప్రశ్నలను వెంటబెట్టుకొచ్చింది. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారీ జీవితంలో అంతా నవ్యంగా కాకపోయినా సవ్యంగా జరగాలను కుంటాము. కానీ అలా జరగడం లేదు. అందుకు  దేశరాజధానిలో జరి గిన ‘నిర్భయ’ ఉదంతమే సాక్ష్యం!  నిన్న వరంగల్‌లో స్వప్నిక, మొన్న విజ యవాడలో ఆయిషా మీరా, ఆపై శ్రీలక్ష్షీ, నిన్న హైదరాబాదులో అరుణ …ఇలా మహిళా భద్రత దిగజారుతున్న పరిస్థితులకు ఇవన్నీ రుజువులే! అంతేనా, మణిపూర్‌లో ఉద్యోగిని, అసోమ్‌లో విద్యార్థిని, కర్నాటకలో గృహిణి, తమిళనాడులో బాలిక…దేశమంతా కామాంధుల కరాళ నృత్యానికి బలవుతోంది మహిళ. ఈ కామ కాటుకు తరతమ భేదాలు, తన, పర ఙభేదాలు లేవు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసిన మగువ మాన, ప్రాణాలకు రక్షణ కరువైన తరుణం ఇది! తరుణీమణుల ఆత్మ స్థయిర్య సాధనకు అగ్ని పరీక్షా  సమయమిది!! ఈ నేపథ్యంలో నెలవంక ఎక్జ్‌క్యూటివ్‌ ఎడిటర్‌ మౌలానా అబ్దుల్‌ ఖాదిర్‌ ఉమ్రీ గారు అందించిన వ్యాసమే ఇది.   – ఎడిటర్‌)

నేడు ఒక వైపున ఆడపడచులు చదువులో నూ కొలువులోనూ ముందుకు దూసుకొని పోతూ ‘హమ్‌ కిసీసె కమ్‌ నహీ’ మేమూ అనుకున్నది సాధించగలం అంటూ ‘విజయ భేరి’ని మ్రోగిస్తున్నారు. ఇది ఎంతైనా హర్షించ దగ్గ విషయమే. ఇది ఒక కోణం. ఎంత చదు వుకున్నా, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, సమర్థు రాలిగా నిరూపించుకున్నా, స్వయంకృషితో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నా అనుదినం ఉన్మాదుల అఘాయిత్యాలకు బల వుతున్నారు అబలలు. ఇది మరో కోణం.నారీ మణులు నవ యుగానికి నాంది వాచకాలవ్వా లంటూ నినదించే నాయకమన్యులు సయితం స్త్రీ అణచివేతపై శీతకన్ను వేశారు.ఆ మాట కొస్తే ‘స్త్రీలను గౌరవిద్దాం, వారికి కేటాయించి న సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అన్న మాట ను గౌరవ భావంతో చూసే పౌరుల సంఖ్య ఎంత?

స్త్రీమూర్తి-వివాహిత అయినా అవివాహిత అయినా ఆమెకు సమాజంలో రక్షణ కరువైపో యింది. కాలేజిలో ఉన్మాది వేధిస్తున్నాడని చదువు మానేసి ఇంట్లో ఉంటున్న అమ్మాయి కీ భద్రత అంతంత మాత్రమే. భర్త పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఇల్లాలి శీలానికీ రక్షణ పూజ్యమే. చివరికి రక్షణాలయాలలో కూడా భద్రత లేని దుస్థితి. ‘ఆధునికం’ అని మనం గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నాము కానీ, నిజంగా మనం నేటికీ ఆటవికంలోనే జీవిస్తు న్నాము.

‘అబలలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపండి’ అంటూ నినాదాలు అయితే వినబడు తున్నాయి. ఎవరు ఆపాలి? ఎలా ఆపాలి? చర్చించవలసిన అవసరం లేదా? సామాజిక స్పృహ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత దేశ పౌరలుగా మనది కాదా? అన్యా యాన్ని ఎదుర్కోవడానికి, అత్యాచారాన్ని నియ ంత్రించడానికి కావాల్సింది మానవీయ విలు వల పట్ల గౌరవం. పరిస్థితుల, పరిసర ప్రభా వాల పట్ల, సంఘ తీరుతెన్నుల పట్ల సరైన దృక్పథం, సమాజాన్ని సంస్కరించాలన్న దృఢ సంకల్పం, ప్రశ్నించే తత్వం, సాధించగలమనే ఆత్మ విశ్వాసం. ఈ భావాలన్నీ దాదాపు అంద రిలోనూ ఉంటాయి. అయితే, కొన్ని అడు గంటి పోయాయి. ఇంకొన్ని జీవం కోల్పో యాయి. మరికొన్ని నిర్లిప్తతలో పడి కొట్ట్టుకు పోతున్నాయి. ఒక దేశ సత్పౌరులుగా మనం చేయాల్సిందిల్లా వాటిని కూడగట్టుకోవడం, తిరిగి రెట్టింపు శక్తితో పోరాడటం.  అబలల రక్షణ కోసం ఇస్లాం ప్రతిపాదించే  కొన్ని సూత్రాల్ని ఇక్కడ పొందు పరుస్తు న్నాము.

మొదట సూత్రం: వయసుకు వచ్చిన పిల్లల్ని వివాహం చేసెయ్యాలి.  మానవ నైజంలో లైంగిక కోర్కెల్ని ఉంచాడు విధాత. ఆ కోర్కెల్ని అదుపులో ఉంచడానికి, ధర్మసమ్మతంగా కోర్కెల తృప్తి కోసం వివాహ వ్యవస్థను నియమించాడు ”మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో; మీ స్త్రీ పురుష బానిసలలో ఎవరు గుణవం తులో, వారి వివాహాలు చేసి వేయండి. వారు గనక పేదవారయితే అల్లాహ్‌ా తన అనుగ్ర హంతో వారిని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్‌ా అంతులేని వనరులు కలవాడు. సర్వమూ తెలసినవాడు”. (అన్నూర్‌:32)

వివాహం లేకుండా ఎవరూ ఉండ కూడదని, వివాహ విషయంలో పేదరికం అడ్డు రాకూడ దని తెలియజేస్తూ తమ సంరక్షణలో ఉన్న వారి వివాహాలు చేయడంలో కుటుంబ పెద్దల జాప్యం కూడదని త్వర పడాలని అల్లాహ్‌ా తాకీదు చేస్తున్నాడు.  ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, యువత ఆర్థికంగా బలపడిన తరువాతే వారి వివాహాలు చేయాలన్న ఆలోచన తప్పు కాదు. కాని ‘సంపాదన లేదు’ కదా అంటూ వివా హాల విషయంలో జాప్యం చేయడం వల్ల వారు అడ్డ దారులు త్రొక్కే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి వివాహాలను సులభతరం చెయ్యాలి. విలాసవంతమైన జీవితాన్ని కాంక్షి ంచకుండా, వరకట్నాన్ని రూపుమాపి లైంగిక విశృంభలత్వాన్ని అరికట్టడానికి కుటుంబ సం రక్షకులు పెద్దలు అన్నివిధాలా కృషి చేయాలి.

రెండవ సూత్రం: అశ్లీలతను  అంతమొం దించాలి.  సమాజంలో అందరూ ఒకేలా ఆలోచించరు. పుట్టి పెరిగిన వాతావరణమే కాదు, అంగాంగ ప్రదర్శనే ధ్యేయంగా ఉండే సినిమాలు, నీలి చిత్రాలు, అశ్లీల వ్యాపార ప్రకటనలు, పాశ్చా త్య దుష్కృతి అనుకరణలు, వీపరీత పోకడలు ..విచ్చలవిడితనాలు…క్లబ్బులు..ప్లబ్బులు… తెలిసీ తెలియని వయసు యువతను పెడ త్రోవ పట్టిస్తున్నాయి. ప్రమాదపుటంచుల వైపు తీసుకెళుతున్నాయి. వీటన్నింటినీ నియంత్రిం చాల్సిన ప్రభుత్వం నీళ్ల్లు నములుతోంది. కారుణ్య ప్రభువు అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు ”విశ్వాసుల వర్గంలో అశ్లీలత   వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ,పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు”. (24:19)

‘నిర్భయ’ను రాజధానిలో నరులు నడిచి వెళుతున్న నడిరొడ్డు మీద వివస్త్రను చేసి నర రూప రాక్షసులు నిర్దయగా విసిరేస్తే ‘మగువ కు మానమే ప్రాణం’ అని తెలిసిన మనషుల కు వస్త్రం కప్పాలన్న కనీస మానవత్వం కరు వవ్వడం చూసి భూమి విలపించింది. ఆకా శం ప్రకోపించి, ప్రకంపించింది.కానీ పాషాణ హృదయం చలించలేదు. మరోసారి ‘మృగాల కన్నా హీనం మానవ సంస్కృతి’ అని నిరూ పించుకుంది. మన ప్రక్కనే ఒకరు వేధించబ డుతున్నా ‘మనకెందుక’ని స్పందన చచ్చిన శవంలా ఉండి పోవడం సబబేనా? నేడు ఒక రికి, రేపలా మన ఆత్మీయులకే, మనకే జర గొచ్చు. ఒక కాకికి ఏదయినా జరిగితే కాకు లు సమూహాల్లా కూడతాయి. ఒక కోతి చని పోతే సకల మర్కటాలూ ఏకమవుతాయి. జంతువులకున్న కనీస సలక్షణాలు కూడా మనకు లేకుండా పోతున్నాయో దీన్నేమనాలి?

నగరంలో మురికి మాలిన్యాలు పెరగడం వల్ల అంటువ్యాధి మహమ్మారిలా వ్యాపిస్తే, గాలిలోని వైరస్‌ ఆ ఇంటివారికి  మాత్రమే సోకదు; అదే నగరంలో ఆరోగ్య సూత్రాలను స్వయంగా పాటిస్తూ ప్రతి రోజూ స్నానం చేస్తూ తన ఇంటిని ఇంటివారిని పరి శుభ్రం గా ఉంచుకునే వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తాయి. మృత్యువాతన కూడా పడవచ్చు. ఈ నేపథ్యంలో విశ్వప్రభువు అల్లాహ్‌ా చేసిన హెచ్చరిక మనందరికి కనువిప్పు కావాలి:

”ఆ ఉపద్రవానికి భయ పడండి. అది కేవలం మీలో దుర్మార్గులయిన వారిపైన మటుకే ప్రత్యేకంగా దాపురించదు”. (సద్వర్తనులు సయితం దాని వాతన పడతారు. వారి గౌరవ మర్యాదలకు సయితం విఘాతం కలుగు తుంది.) (8:25) పోతే,

పిల్లల మనస్తత్వం రూపు దాల్చడంలో కన్న వారి పాత్ర చాల కీలకం అన్నది తెలిసిందే. పిల్లలపై బయటి పరిస్థితుల, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం అధికంగానే ఉంటుంది. కాబట్టి ఇంట్ల్లో అమ్మానాన్నలు పిల్లల ప్రవర్తన ను ఓ కంట కనిపెట్టాలి.మంచీచెడులను వారి కర్థమయ్యేలా ఓపిగ్గా వివరించాలి. ముఖ్యంగా చెప్పడం వరకే పరిమితం అవ్వక చేతలకు సయితం పని కల్పించాలి.మాఅబ్బాయి చాలా మంచివాడు, మా అమ్మాయి చాలా ఉత్తము రాలు అంటూ సంబరపడిపోతే సరిపోదు.    ఇది పాత కాలపు మాటగా అన్పించవచ్చు. కానీ, ఇదే వాస్తవం. ఎవరయినాసరే, కుటుం బంగానీ, సమాజంగాని వారికిచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు. స్వేచ్ఛ పేరుతో ‘మేమెలాంటి దుస్తులైనా తొడుక్కుంటాము. ముందు మీ మగ చూపుల్ని మార్చుకోండి’ అన్న బరి తెగించిన మాటలు అసలే కూడదు. లాంగ్‌ డ్రైవ్‌కి, డేటింగ్‌కి వెళ్ళడం మిక్కిలి ప్రమాదకరం. ఆటోల్లో సయితం ఒంటరి  ప్రయాణం మంచిది కాదు. ఆధునిక వస్త్రధా రణ పేరుతో బిగుతైన దుస్తులు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. జాగ్రత్త పడటం చాదస్తం కాదు. అప్రమత్తత అని గ్రహి చాలి.

మూడవ సూత్రం: మంచిని ఆదేశించాలి. చెడును నిరోధించాలి. ”మీలో మంచి వైపుకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించే వారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు.” అని విశ్వకర్త ఉపదేశిస్తు న్నాడు కాబట్టి, మనలో ఒక వర్గం ఉండాలి. అది వివేచన, విజ్ఞతల ఉత్తమ ఉపదేశం ద్వారా యువత శీలనిర్మాణం కోసం అలుపెర గని కృషి చేస్తూ ఉండాలి.

మానవతా ప్రేమికులు,మానవతా సానుభూతి పరులు జాతి స్త్రీలను కామాంధుల పంజా నుండి విమోచనం కలిగించి, వారు ఆనందం గా సురక్షితంగా, గౌరవంగా జీవించడానికి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పనంత వరకు సంతృప్తి చెందరు. విషపూరితమైన అవయవాన్ని తొలగించి ఒక ప్రాణాన్ని కాపా డినట్లు కామాంధులను, కల్లోల జనకుల్ని అంతమొందించి ‘స్త్రీ’కి రక్షణ కల్పించడానికి మానవతా ప్రేమికులు ముందుకు రావాలి. ఈ విషయంలో జాప్యం వహించేవారిని అల్లాహ్‌ా ఇలా నిలదీస్తున్నాడు: ”మీకేమయింది? ‘మా ప్రభూ! దుర్మార్గుల ఈ పురము నుండి మాకు  విముక్తి నొసగు. మా కొరకు నీవద్ద నుండి ఒక సహాయకుణ్ణి నియ మించు, మాకు (అండగా) నీవద్ద నుంచి ఒక సహాయకుణ్ణి పంపించు’ అని వేడుకుంటున్న బలహీన పురుషులు, స్త్రీలు, పసివాళ్ళ విమో చనకై మీరు అల్లాహ్‌ా మార్గంలో ఎందుకు పోరాడటం లేదు?!” (అన్‌నిసా: 75)

Related Post