ఇస్లాంలో మహిళల రక్షణ

”ఎవరైనా ఒకరు, లేదా ఇద్దరు, లేక ముగ్గురు కుమార్తెల్ని పోషించి, మంచి శిక్షణ ఇచ్చి, పెళ్ళిల్లు చేసి వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తే వారి కోసం స్వర్గం ఉంది”. (అబూ దావూద్‌)

”ఎవరైనా ఒకరు, లేదా ఇద్దరు, లేక ముగ్గురు కుమార్తెల్ని పోషించి, మంచి శిక్షణ ఇచ్చి, పెళ్ళిల్లు చేసి వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తే వారి కోసం స్వర్గం ఉంది”. (అబూ దావూద్‌)

ముందుగా మనం ఇస్లాంకు పూర్వం వివిధ దేశాలలో, మతాలలో మహిళ స్థానం ఏమిటో తెలుసుకుంటే ఆ తరువాత ఇస్లాం మహిళకు ఇచ్చిన గౌరవం బాగా అర్థం చేసుకోవచ్చు.

ఇస్లాంకు పూర్వం మహిళ

గ్రీకుల వద్ద:

స్త్రీ కొనబడేది మరియు అమ్మ బడేది. ఆమెకు ఎలాంటి హక్కూ లేకుండేది. ”స్త్రీజాతి ఉనికి ప్రపంచపు అధోగతి మరియు క్ష్షీణత్వానికి ఒక మూల కారణం, స్త్రీ ఒక విష మాలిన చెట్టు లాంటిది. చూపుకు ఎంతో అం దంగా ఉంటుంది, కాని పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి” అన్నాడు వారిలోని సుఖ్రాత్‌ అనే తత్వవేత్త.

రోమనుల వద్ద:

స్త్రీకి అసలు ఆత్మయే లేదు అనేవారు రోమన్లు, అంతేకాదు మహిళలను స్థంభాలకు బంధించి కాగిన నూనె వారి దేహాలపై పోసి బాధించేవారు. ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుర్రపు తోకతో కట్టి వారు చనిపోయేంత వరకూ గుర్రాన్ని పరిగెత్తించేవారు.

చైనీయుల వద్ద:

మన పొరుగు దేశస్థులైన చైనీయులు స్త్రీ జాతిని సంపాదన మరియు మంచితనాన్ని నసింపజేసే నీటిలా ఉదాహ రించేవారు. భర్త తన భార్యను అమ్ముకోవచ్చు అది అతని హక్కు అని భావించేవారు.

భారత సమాజం:

మరో అడుగు ముందుకేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగ మనం చేయించే వారు. భర్త శవంతో పాటు సజీవంగా ఉన్న భార్యను కూడా కాల్చేసే వారు.

యూదులు వద్ద:

స్త్రీ ఆదమ్‌ (అ)ను కవ్వించి నిషేధించబడిన చెట్టు పండు తినిపించి పురుషుని చేత పాపము చేయించందని చెప్పి మొత్తం స్త్రీ జాతినే శపించబడినదిగా భావించే వారు. స్త్రీ బహిష్టురాలైనపుడు తనుండే గృహము, తను ముట్టుకునే ప్రతి వస్తువు అప రిశుభ్రమౌతుందని భావిచేవారు.
క్రైస్తవుల వద్ద: స్త్రీని షైతాన్‌ యొక్క ద్వారము గా భావించే వారు. ”మీరు స్త్రీని చూసి మనిషి కాదు కదా క్రూర జంతువని కూడా అనుకో కండి. మీరు చూసేది షైతాన్‌ మరియు (ఆమె నోట) వినేది కేవలం పాము ఈలలు” అన్నాడు వారిలో బోనావెన్తూర్‌ అనే పండి తుడు.

పాశ్చాత్త సమాజం:

1586వ సంవత్సరాన ఫ్రాన్సులో ఒక సభ ఏర్పాటు చేసి స్త్రీ మనిషా కాదా అని చర్చించారు. 1567న స్కాట్‌ ల్యాండ్‌ పార్లమెంటులో ఏ చిన్న అధికారం కూడా స్త్రీకి ఇవ్వకూడదన్న ఆదేశం జారీ చేసారు. ఎనిమిదోవ హెన్రి (హెన్‌రీ-8) పరి పాలనలో బ్రిటీష్‌ పార్లమెంటు స్త్రీ అపరి శుభ్రత గలది కనుక బైబిల్‌ చదవకూడదు అని చట్టం జారీ చేసింది. 1805 వరకు బ్రిటీషు చట్టంలో భర్త తన భార్యను అమ్ముకో వచ్చు, ధర ఆరు పెస్తులు (సిక్స్‌ పెన్స్‌) అని ఉండింది.

అరబ్బు సమాజం:

ఇస్లాంకు పూర్వం అర బ్బులు ఇంట ఆడ బిడ్డ జన్మిస్తే అవమానంగా భావించి సజీవంగా దహనం చేసేవారు. 30 లేక 40మంది కలిసి ఒకే స్త్రీని భార్యగా ఉంచుకునేవారు. స్త్రీకి ఆస్తిలో వాటా ఇవ్వడ మనేది బహుదూరం, స్త్రీనే తండ్రి వదిలిన ఆస్తిగా భావించి కుమారుడు తన సవతి తల్లిని భార్యగా ఉంచుకునేవాడు. స్రీలను బజారులో ఇతర వస్తువులతో పాటు నిలబెట్టి అమ్మేవారు. పరుషులు స్త్రీని రేటు కట్టి కొని తెచ్చుకొని తోచినన్ని రోజులు వాడుకొని మోజు తీరాక మళ్ళీ తోచిన వ్యక్తికి తోచిన రేటుకి అమ్మేసేవారు. స్త్రీ జాతి ప్రపంచం నలమూలలా దిక్కు తోచని స్థితిలో మమ్మల్ని ఆదుకునే నాధుడే లేడా! సమాజంలో మనకంటూ హక్కులు, గౌరవాన్ని ప్రసాదించే నాధుడే లేడా! అని కన్నీరు కారుస్తుంటే…… అలాంటి స్థితిలో దైవప్రవక్త ముహమ్మద్‌(స) ఇస్లాం అజెండా తీసుకొని వచ్చారు. కనురురుగైపోతున్న స్త్రీ జాతి గౌరవాన్ని వారి విలువల్ని ఇస్లాం కాపాడింది. మహిళలకు కుమార్తెగా, చెల్లిగా, ఇల్లాలిగా, తల్లిగా మరెవ్వరూ ఇవ్వనంత గౌర వాన్నిచ్చింది ఇస్లాం. ఈ విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం రండి!

ఇస్లాంలో మహిళ – కుమార్తెగా:

ఆడబిడ్డ జన్మిస్తే అవమానంగా భావించకండి. ఆడబిడ్డ పుట్టితే సంతోషిం చండి, ఎందుకంటే ఓ మానవుడా నీవు స్వర్గం చేరుటకు ఒక అవకాశాన్ని నీ కోసం తీసుకొచ్చింది నీ ఈ ఆడబిడ్డ అంటుంది ఇస్లాం. దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరైనా ఒకరు, లేదా ఇద్దరు, లేక ముగ్గురు కుమార్తెల్ని పోషించి, మంచి శిక్షణ ఇచ్చి, పెళ్ళిల్లు చేసి వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తే వారి కోసం స్వర్గం ఉంది”. (అబూ దావూద్‌)
ఈ హదీసు ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే అల్లాహ్‌ా ఏ తండ్రికైనా ఒకరు, లేక ఇద్దరు, లేక ముగ్గురు కుమార్తెలు ఇస్తే అల్లాహ్‌ా ఇచ్చిన శుభవార్తతో సంతోషిం చండి అని, కుమార్తెలకు గౌరవ స్థానం ప్రసాదిం చింది ఇస్లాం.
భ్రూణ హత్యలు నిషేధం అంటుంది ఇస్లాం. తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడబిడ్డని తెలి యగానే కంగారు పడిపోయి వెంటనే అబా ర్షన్‌ చేయించేస్తారు చాలా మంది.ఇలా చేయ టం నిషేధం, ఘోరమైన పాపం, పెద్ద నేరం అంటుంది ఇస్లాంటఅల్లాహ్‌ా ఇలా సెలవి చ్చాడు: ”దారిద్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహా పాతకం”. (ఇస్రా : 31)
అంతే కాదు రేపు పరలోకంలో లెక్కింపు రోజున తల్లితండ్రుల ముందు సజీవంగా దహనం చేయబడిన ఆ బిడ్డను బ్రతికించి నీవు ఏ పాపము చేసిన కారణాన చంపబడితి వమ్మా అని ప్రశ్నించబడినపుడు ఆ బిడ్డ ఆ తల్లిదండ్రుల వైపు అమాయకంగా చూస్తుంటే మీ నోట ఏమి సమాధానం రాగలదు! ఆరోజు తప్పక వస్తుంది కావున పసిబిడ్డల విషయం లో జాగ్రత్త! అంటుంది ఇస్లాం.
కుమారుల లాగే ముమార్తెలను కూడా సమానంగా ప్రేమానురాగాలను పంచండి, కుమారులను ప్రేమతో చూసుకుంటూ కుమా ర్తెలను చిన్నచూపు చూడటం నిషేధం, ఇది అన్యాయం అంటుంది ఇస్లాం.

ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అనుచరుని వద్దకు అతని కుమారుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు, ఆ అనుచరుడు తన కుమారుడిని ఎత్తుకొని ముద్దుపెట్టుకొని ఒడిలో కూర్చో బెట్టుకున్నాడు. కొద్దిసేపు తరువాత అతని కుమార్తె కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కుమార్తెను అతను ముద్దుపెట్టు కోలేదు, ఒడిలో కూర్చోబెట్టుకోలేదు. ఇదంతా గమనిస్తున్న ప్రవక్త ముహమ్మద్‌ (స) వెంటనే అతని వద్దకు వెళ్ళి నీవు దౌర్జన్య పరుడవి, కుమారుని లాగే కుమార్తెను కూడా ప్రేమించి దగ్గరకు తీసుకుంటేనే సంతాన విషయంలో న్యాయం చేసిన వాడవుతావు, లేదంటే అన్యా యం చేసినవాడవుతావని వారించారు.మనకు ఈ సంఘటన ద్వారా కుమారులను ఓ చూపు తో,కుమార్తెలను మరో చూపుతో చూడవద్దని, ఇద్దరిని సమానంగా చూడాలని ఇస్లాం బోధి స్తుందని స్పష్టంగా అర్థమౌతుంది. దైవప్రవక్త ముహమ్మద్‌ (స) బోధించంటం, ఆదేశాలివ్వ టమే కాదు ఆచరించి కూడా చూపారు.

ప్రవక్త (స) వారి ప్రియ కుమార్తె ఫాతిమా (ర) రావటాన్ని దూరం నుంచే చూసి నా బిడ్డా! అంటూ లేచి వెళ్ళి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి పిలుచుకొని వచ్చేవారు. ప్రియ ప్రవక్త (స) (ఇద్దరు కుమారులకు) నలుగురు కుమార్తెలకు తండ్రి అన్న విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చెల్లెలుగా: స్త్రీ చెల్లెలు స్థానంలో ఉంటున్న ప్పుడు ఆవిడకు ఇస్లాం ఇచ్చే గౌరవం ఏమి టంటే, ఒకరికి, లేక ఇద్దరికి, లేక ముగ్గురు చెల్లెల్లకు అన్నయ్యగా ఉంటున్న ఓ వ్యక్తి చెల్లెల్ని చూచి కంగారు పడవద్దు, సంతో షించు ఎందుకంటే నీవు స్వర్గం చేరుటకు నీకోసం మంచి అవకాశం తీసుకొచ్చింది నీ చెల్లెలు, చెల్లిని భారంగా కాదు శుభవార్తగా భావించమం టుంది ఇస్లాం.
”ఎవరికైతే ముగ్గురు కుమార్తెలు, లేదా ఇద్దరు కుమార్తెలు, లేదా ఇద్దరు చెల్లెల్లు ఉండి వారి విషయంలో అల్లాహ్‌ాకు భయపడి, వారి పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా స్వర్గాని కి పోతారు”. (అబూదావూద్‌)

యువతిగా:

ఆడబిడ్డ పెరిగి యవ్వనథకు చేరినపుడు యువతి అని పిలువబడుతుంది. యువతిగా ఉంటున్న మహిళకు ఇస్లాం ఎలాంటి గౌరవాన్ని ఇచ్చిందంటే… యువతి వైపు కన్నెత్తి కూడా చూడవద్దని పురుషులకు ఆదేశిస్తుంది ఇస్లాం.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:’పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మాస్థానాలను కాపాడుకోవాలని ఓ ప్రవక్తా! విశ్వాసులకు చెప్పు’. (అన్నూర్‌: 30)

ఇల్లాలుగా:

వివాహం అయ్యాక మహిళ ఒక ఇల్లాలుగా మారుతుంది, ఒకరికి భార్య అవుతుంది. అలాంటి స్థితిలో ఉన్న మహిళకు ఇస్లాం ఇచ్చే గౌరవం ఏమిటంటే: ”ప్రపంచం మొత్తం కేవలం కొన్ని రోజుల జీవన సామాగ్రి, అందులో అన్నిటికంటే మేలైన సామాగ్రి సుగుణవతి అయిన స్త్రీ” అంటుంది ఇస్లాం.
ప్రజలు డబ్బు సంపాదనను విలువైనదిగా భావిస్తారు, బంగారం విలువైనదని భావిస్తారు, వజ్రాలు విలువై నవని భావిస్తారు. సుగుణవంతి అయిన స్త్రీ డబ్బు, సంపాదన, బంగారం, వజ్రాల కన్నా విలువైనదని అంటుంది ఇస్లాం.

ఇల్లాలు అంటే పని మనిషి కాదు, భార్య అంటే బానిసరాలు కాదు, భర్తకు అతని కుటుంబంలో ఎలాంటి గౌరవము, స్థానము ఉన్నదో అలాంటి గౌరవం, అలాంటి స్థానమే భార్యగా తెచ్చుకున్న ఆ మహిళకు కూడా ఇవ్వాలంటుంది ఇస్లాం. భార్యను హింసించే వ్యక్తి మంచి మనిషి కాడు, ”భార్యను బాగా చూసుకునే వాడే ఉత్తముడు” (ఇబ్నుహిబ్బాన్‌) అంటుంది ఇస్లాం.

తల్లిగా:

మహిళ తల్లిగా మారితే ఆ స్థానంలో ఉంటున్న మహిళకు ఇస్లాం ఇచ్చే గౌరవం ఏమిటంటే మానవుడా! నీవు స్వర్గానికి వెళ్ళా లనుకుంటున్నావా? అయితే వెళ్ళు స్వర్గం మరెక్కడో కాదు నీ తల్లి పాదాల చెంతనే ఉంది. ఆమెకు సేవ చేసి స్వర్గం చేరిపో అం టుంది ఇస్లాం.

ఒక అనుచరుడు ప్రవక్త ముహమ్మద్‌ (స) వద్దకు వచ్చి ఓ అల్లాహ్‌ా పంపిన ప్రవక్తా నేను జిహాద్‌లో పాల్లొనాలనుకుంటున్నాను. ఈ విషయంపై మీతో చర్చించటానికి వచ్చాను మీరేమంటారు? అని ప్రశ్నించాడు. నీ తల్లి బ్రతికి ఉందా? అని అడిగారు ప్రవక్త (స). అవును బ్రతికి ఉందని అతను బదులిచ్చాడు. ‘అయితే వెళ్ళు నీ తల్లికి సేవ చేయి స్వర్గం ఆమె పాదాల చెంత ఉందన్నారు’ ప్రవక్త (స).

స్వర్గం తల్లి పాదాల చెంత ఉందని తెలిపి మహిళకు గౌరవాన్ని ఉన్నత శిఖరానికి చేర్చిం ది ఇస్లాం. అంతే కాదు తల్లి బిడ్డను నవ మాసాలు మోసి ప్రసవ వేదన భరించి బిడ్డను జన్మనిస్తుంది. నిద్ర మరియు అనేక విషయా లను త్యాగం చేసి పాలు త్రాపి పోషిస్తుంది, కావున ఓ మానవుడా! నీవు ఏమి చేసినా ఆమె రుణం తీర్చుకోలేవు, కావున ఓ మానవుడా! ఆమెను ఉఫ్‌ అనే అధికారం కూడా నీకు లేదు అంటుంది ఇస్లాం.
జ ”నీ తల్లిదండ్రులలో ఒకరుగాని ఇద్దరు గాని వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే వారి ముందు విసుగ్గా”ఉహ్‌ా’ అని కూడా అనకు వారిని కుసురుకుంటూ మాట్లాడకు వారితో మర్యాదగా మాట్లాడు”. (ఇస్రా:23)
అయితే బాధాకరమైన విషయం ఎమిటంటే ”మహిళ స్వర్గంలో చేసిన పాపానికి ఈ ప్రపంచంలో శిక్షగా ప్రసవ వేదన అనుభవిస్తున్నదని అంటున్నారు క్రైస్తవ మహానుభావులు. మాతృత్యాన్ని ఎలా ఎగతాళి చేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. (ఆదికాండము-3:16)

హక్కులు:

ఇస్లాం మహిళకు కుమార్తెగా, చెల్లిగా, యువతిగా, ఇల్లాలు గా తల్లిగా గౌరవం ఇచ్చినట్లు మరే మతమూ ఇవ్వలేదు. ఇస్లాం మహిళకు గౌరవమే కాదు వారికి తగిన అన్ని రంగాల్లో శ్రేయస్కరమైన హక్కులు కూడా ప్రసాదించింది. వారసత్వంలో లభించే ఆస్తిలో మహి ళకు తల్లిగా వాటా, కుమార్తెగా వాటా,చెల్లిగా వాటా, భార్యగా వాటా కలిగించింది. కొన్ని పరిమితులతో మహిళకు సంపాదించే హక్కు కల్పించింది ఇస్లాం.
జీవిత భాగ్యస్వామిని ఎంచుకునే విషయంలో నచ్చని వ్యక్తి సంబంధా న్ని తిరస్కరించే హక్కు మహిళకు కల్పించింది ఇస్లాం. మహిళలపై దౌర్జన్యం చేస్తూ వేధిస్తూ వసూలు చేస్తున్న వరకట్నాన్ని నిషేధించింది ఇస్లాం.విద్యను అభ్యసించే హక్కు మహిళకు కలిగించింది ఇస్లాం. రాజకీయ హక్కులు, వాంగ్మూల హక్కులు, మొదలైన అనేక హక్కులు మహిళకు కల్పించింది ఇస్లాం.

ఇవి కాక మహిళ ధన, మాన, ప్రాణ శీల రక్షణ కొరకు అన్నిటికంటే ఉత్తమమైన నియమాలు ఇస్లాంలో మాత్రమే ఉన్నాయి. ఇస్లామీయ నియమపాలన జరుగుచున్న చోట మహిళకు ఉన్న గౌరవం, రక్షణ మరియు ఇస్లామీయ నియమాలకు విరుద్ధమైన నియమపాలన జరుగుతున్న చోట దిగజారిపోతున్న స్త్రీ జాతి విలువలే దీనికి నిలువెత్తు సాక్ష్యం.

మహిళా స్వేచ్ఛ:

ఈ మధ్య కొందరు మహిళల గౌరవం మంటగలప టానికి మహిళకు మళ్ళీ ఇస్లాంకు పూర్వం ఉన్న స్థితికి దిగ జార్చటా నికి ప్రయత్నిస్తూ ‘మహిళా స్వేచ్చ’ అంటూ వల విసురుతు న్నారు. అక్కడ మహిళ మానానికి, ప్రాణానికి, ఆరోగ్యానికి ప్రమాద ముంది. మహిళలు ప్రమాదాన్ని గ్రహించకుండా వారి వలలో చిక్కి తమ సహజ అభిరుచులకు వ్యతిరేకంగా,తమ మీద ఉంచబడిన పవిత్ర బాధ్యతలను వదలి ఆడతనాన్ని జబారులో వేలం వేయుటకు సిద్ధపడుచున్నారు.

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, హద్దులు మీరటాన్ని స్వేచ్ఛ అనరు. నియమాలు కలిగినప్పుడే స్వేచ్ఛ సంపూర్ణమౌతుంది.శ్రేయస్కరమైన నియమాలు కలిగిన అసలైన స్వేచ్ఛ మహిళకు ఇస్లాంలో మాత్రమే ఉంది. వేరేచోట ఎక్కడా లేదు.

Related Post